కమ్యూనిటీ మార్గదర్శకాలు

Snapలో, వ్యక్తులు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి మేము వారిని సాధికారపరుస్తాము. మానవ హక్కులను గౌరవించే మా కట్టుబాటుతో అనుసంధానంగా, Snapచాటర్లు సురక్షితంగా ఉండేందుకు సహాయపడుతూ, స్వయంవ్యక్తీకరణను ప్రోత్సహించేందుకు మేము ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను రూపొందించాము. ఈ మార్గదర్శకాలు స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని మేము కోరుకుంటాము. మా సేవా నిబంధనలులో పేర్కొన్నట్లుగా, ఈ మార్గదర్శకాలు Snapతో Snapchatter యొక్క ఒప్పందంలో భాగంగా ఉంటాయి. మీరు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే, మేము మీ అకౌంట్ పై చర్య తీసుకోవచ్చు. దయచేసి మా సేవా నిబంధనలను చూడండి మరియు మా కమ్యూనిటీలో చేరేలా చూసుకోవడానికి మీరు తగిన వయస్సు గలవారని నిర్ధారించుకోవడానికి మీ స్థానిక చట్టాలను పరిశీలించండి.
తీవ్రమైన హాని గురించి గమనిక
మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే మొత్తం కంటెంట్ లేదా ప్రవర్తనను మేము నిషేధిస్తున్నప్పటికీ, Snapచాటర్ల కి తీవ్ర హాని కలిగించే ప్రమాదాన్ని కలిగించే ఉల్లంఘనల గురించి మేము ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నాము. తీవ్రమైన హానులలో బాలల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగం, తీవ్రవాదం, హింసాత్మక అతి తీవ్రత, అలాగే ఇతర అక్రమ కంటెంట్ మరియు ప్రవర్తనల రూపాలు ఉన్నాయి. Snapchat పై తీవ్రమైన హానిలో నిమగ్నమైన అకౌంట్లను మేము గుర్తించినప్పుడు, ఆ అకౌంట్లను నిష్క్రియం చేస్తాము. Snapchat పై ఈ కంటెంట్ కనిపించే సమయాన్ని మేము ఎలా తగ్గిస్తామో, దానిని ఎదుర్కొనేందుకు మేము ఎలా చర్యలు తీసుకుంటామో గురించి మార్గదర్శనం తీవ్రమైన హాని వివరణ మరియు ఈ మార్గదర్శకాల వ్యాప్తంగా లింక్ చేయబడిన సంబంధిత వివరణలలో చూడవచ్చు.
వినియోగదారులందరికీ మరియు అన్ని కంటెంట్‍లకు వర్తించే కమ్యూనిటీ మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలు మొత్తం కంటెంట్ మరియు Snapchatters అందరికీ వర్తిస్తాయి. ఇందులో యూజర్‌నేమ్స్ మరియు డిస్‌ప్లే పేర్లు, Bitmojis, టెక్స్ట్, చిత్రాలు, వీడియోలు, జెనరేటివ్ AI, లింకులు లేదా అటాచ్‌మెంట్స్, ఎమోజీలు, స్టికర్లు, లెన్స్‌లు మరియు ఇతర సృజనాత్మక టూల్స్ మరియు Snapchat పై ప్రవర్తన అన్నీ చేరి ఉంటాయి.
Snap మా సేవల ద్వారా జెనరేటివ్ AI పీచర్లను అందిస్తుంది. మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా జెనరేటివ్ AI కంటెంట్‌ను ఉంచడానికి సహాయపడేలా రూపొందించబడిన రక్షణలను మేము అమలు చేస్తాము. Snapchatters AIని బాధ్యతాయుతంగా వాడాలని కూడా మేము ఆశిస్తాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి లేదా మా AI ఉత్పత్తులను దురుపయోగం చేయడానికి AIని వాడే అకౌంట్లపై సముచిత అమలు చర్యలు తీసుకునే హక్కును మేము కలిగి ఉన్నాము. ఇందులో అకౌంట్ రద్దు చేయడం ఇమిడి ఉండవచ్చు.
అదనపు పాలసీలు వర్తించవచ్చు
మా కమ్యూనిటీ మార్గదర్శకాలతో పాటు, విస్తృత శ్రేణి ప్రేక్షకులను చేరుకోవాలనుకునే లేదా తమ కంటెంట్ ద్వారా ఆదాయం ఆర్జించాలనుకునే వినియోగదారుల కోసం మా వద్ద అదనపు పాలిసీలు కూడా ఉన్నాయి. సృష్టికర్త యొక్క స్నేహితులు లేదా అనుచరులకు అతీతంగా, అల్గారిథమిక్ సిఫార్సుకు అర్హత పొందడానికి గాను, కంటెంట్ సిఫార్సు అర్హత కోసం మా మార్గదర్శకాల తో సమ్మతి వహించాలి. ప్రకటనదారులు మా అడ్వర్టైజింగ్ విధానాలు తో సమ్మతి వహించాలి, ఇవి తమ ఉత్పత్తులు, సేవలు మరియు కంటెంట్ గురించి నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. ప్రాయోజిత కంటెంట్, లేదా ఉత్పత్తులు లేదా సేవల సేంద్రీయ ప్రోత్సాహం మా వాణిజ్య కంటెంట్ పాలసీ కి కట్టుబడి ఉండాలి. కొన్ని నియంత్రిత వస్తువులు మరియు కార్యక్రమాలు ఆమోదిత ప్రకటన లేదా ప్రాయోజిత కంటెంట్ చానెల్స్ ద్వారా అర్హత కలిగిన అకౌంట్లచే మాత్రమే ప్రోత్సహించబడవచ్చునని దయచేసి గమనించండి. మానిటైజేషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడే సృష్టికర్తలు మా మానిటైజేషన్ పాలసీ ని అనుసరించాలి. మీడియా భాగస్వాములు మా కంటెంట్ భాగస్వామి నిబంధనలు తో సమ్మతి వహించాలి, ఇందుకు తమ కంటెంట్ ఖచ్చితమైనదిగా మరియు సముచితమైన చోట వాస్తవ- తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. డెవలపర్లు డెవలపర్ నిబంధనలు కు కూడా లోబడి ఉంటారు.
Snapchatపై నిషేధించే కంటెంట్ కొరకు నిర్ధిష్ట నిబంధనలను మేము ఇక్కడ మరియు మా సేవా నిబంధనల్లోవివరించాం. ఈ నియమాలు స్థిరంగా వర్తింపజేయబడేలా మేము కృషి చేస్తాము. వాటిని వర్తింపజేసుకునేటప్పుడు, మేము కంటెంట్ వార్తా విలువ, వాస్తవికత మరియు రాజకీయ, సామాజిక లేదా విద్యా విలువతో సంబంధం కలిగి ఉన్నదా అనే దానితో సహా కంటెంట్ స్వభావాన్ని లెక్కలోకి తీసుకుంటాము. మేము కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తాము మరియు మా పాలసీలను ఎలా అమలు చేస్తామనే దానిపై అదనపు సందర్భం మా మోడరేషన్ వివరణదారులో ఉంది. దిగువన ప్రతి విభాగంలోనూ మా కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి మరింత వివరణాత్మక సమాచారానికి కూడా మేము లింక్‌లను అందిస్తాము.
ప్రతి ఒక్కరికీ Snapchat సురక్షితమైన మరియు సానుకూల అనుభవాన్ని ఇచ్చేదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా నియమాల స్ఫూర్తిని ఏ కంటెంట్ లేదా ప్రవర్తన ఉల్లంఘిస్తుందో మా స్వంత విచక్షణను బట్టి నిర్ణయించడానికి మాకు హక్కు ఉంటుంది. మా ప్లాట్‌ఫారమ్ నుండి ఏ కంటెంట్ నైనా సమీక్షించే, సవరించే లేదా తొలగించే హక్కు మాకు ఉన్నా, మేము దాన్నంతటినీ ముందస్తుగా సమీక్షించము. ఇతర వాడుకదారులు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను పాటిస్తారని గానీ లేదా మా ప్లాట్‌ఫామ్ ఉల్లంఘన కంటెంట్ లేకుండా ఉంటుందని గానీ మేము హామీ ఇవ్వలేము. మా బృందాలు సమీక్షించి, తగిన చర్య తీసుకునేలా, ఉల్లంఘించబడవచ్చు అనే ఏదైనా కంటెంట్‌ను నివేదించమని మేము Snapchattersను బలంగా ప్రోత్సహిస్తున్నాము.
కమ్యూనిటీ మార్గదర్శకాలు
Snapchat యొక్క ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఉత్పత్తులు అన్ని కంటెంట్ మరియు ప్రవర్తనకు వర్తిస్తుంది మరియు క్రింది అంశాలను కవర్ చేస్తుంది:
లైంగిక కంటెంట్
బాలల లైంగిక దోపిడీ లేదా దురుపయోగపు చిత్రాలను పంచుకోవడం, లైంగిక ఉద్దేశ్యాల కోసం గ్రూమింగ్, లైంగిక దోపిడీ (సెక్స్‌టార్షన్), లేదా లైంగిక దురుపయోగం లేదా దోపిడీ ఉద్దేశ్యంతో మైనర్‌ను ఒప్పించే, మోసపూరిత లేదా బలవంతపు ప్రయత్నాలతో సహా మైనర్‌పై లైంగిక దోపిడీ లేదా దురుపయోగపు ఏదైనా కార్యకలాపాన్ని మేము నిషేధిస్తాము. మేము లైంగిక దోపిడీని (సెక్స్‌టార్షన్), లేదా బాలల లైంగికీకరణను కూడా నిషేధిస్తాము. అటువంటి బాలల లైంగిక దోపిడీ ప్రవర్తనలో నిమగ్నం కావడానికి చేసే ప్రయత్నాలతో సహా బాలల లైంగిక దోపిడీ గుర్తించబడిన అన్ని సందర్భాలను మేము అధికారులకు రిపోర్టు చేస్తాము.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఇమిడి ఉన్న నగ్నత్వ లేదా లైంగిక బహిర్గతమైన కంటెంట్‌ను ఎప్పటికీ పోస్ట్ చేయవద్దు, సేవ్ చేయవద్దు లేదా పంపించవద్దు, ఫార్వార్డ్ చేయవద్దు లేదా అడగవద్దు (ఇందులో అటువంటి మీ స్వంత చిత్రాలను పంపించడం లేదా సేవ్ చేయడం వంటివి కూడా ఉంటాయి).
కోరని లైంగిక చిత్రావళి (సైబర్‌ఫ్లాషింగ్ వంటిది) తో సహా అశ్లీలత లేదా లైంగికపరమైన పరస్పర చర్యలకు సంబంధించిన అదేవిధంగా వాణిజ్య కార్యకలాపాల కంటెంటును (ఆన్‍లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) ప్రోత్సహించే, పంపిణీ చేసే లేదా పంచుకునే చర్యలను మేము నిషేధిస్తాము.
వ్యక్తి సమ్మతి లేకుండా పోస్ట్ చేయబడి ఉంటే తప్ప, లైంగికేతర సందర్భాల్లో తల్లి పాలివ్వడం మరియు నగ్నత్వపు ఇతర వర్ణనలు సాధారణంగా అనుమతించబడతాయి.
భయపెట్టడం, హింస మరియు హాని
హింసాత్మక లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడం లేదా నిమగ్నం కావడం నిషేధించబడింది. ఒక వ్యక్తి, వ్యక్తుల సమూహం లేదా మరొకరి ఆస్తికి హాని కలిగించడానికై ఎప్పుడు కూడా భయపెట్టవద్దు లేదా బెదిరించవద్దు.
జంతువుల దురుపయోగంతో సహా అనవసరమైన లేదా గ్రాఫిక్ హింసను చిత్రీకరించే కంటెంట్ అనుమతించబడదు.
వార్తల కవరేజ్ సందర్భం మినహా మనుషులు లేదా జంతువులకు తీవ్రమైన గాయం (నిజమైనది లేదా వాస్తవికమైన) గ్రాఫిక్ వర్ణనలు అనుమతించబడవు (ఉదాహరణకు, యుద్ధ మండలాల నుండి నివేదించడం— మరియు అటువంటి ఉదంతాల్లో కూడా, మేము అస్పష్టతను లేదా అస్పష్టమైన గ్రాఫిక్ హానిని ప్రోత్సహిస్తాము).
స్వీయ-గాయం, ఆత్మహత్య, తినే రుగ్మతలు లేదా ఇతర తీవ్రమైన స్వీయ-హాని రూపాలను ప్రోత్సహించడంతో సహా స్వీయ-హానిని పెద్దదిగా చేసి చూపడం, ప్రోత్సహించడం లేదా సహకరించడాన్ని మేము అనుమతించము.
ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, మరియు హింసాత్మక తీవ్రవాదం
ఉగ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాదులు లేదా ద్వేషపూరిత సమూహాలకు తోడ్పడేందుకు మా ప్లాట్‌ఫామ్ వాడకాన్ని మేము నిషేధిస్తాము. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం లేదా ద్వేషాన్ని మద్దతు ఇచ్చే, కీర్తించే, ప్రశంసించే లేదా సమర్థించే కంటెంట్‌ను కూడా మేము నిషేధిస్తాము.
దురుపయోగపరచే, కించపరచే, పరువు పోయే, వివక్ష లేదా హింసను ప్రోత్సహించే, లేదా జాతి, రంగు, కులం, , జాతీయ మూలం, మతం, లైంగిక ధోరణి, లింగం, లింగ గుర్తింపు లేదా పునఃనియామకం, వైకల్యం, మాజీ సైనికుల స్థితి, వలస స్థితి, వయస్సు, బరువు లేదా గర్భధారణ స్థితి ఆధారంగా ద్వేషాన్ని రేకెత్తించే ద్వేషపూరిత ప్రసంగం లేదా కంటెంట్ నిషేధించబడింది.
వేధింపు మరియు బుల్లియింగ్
మేము బెదిరింపు మరియు వేధింపును నిషేధిస్తాము. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే, మీరు మరో Snapchat అకౌంట్ నుంచి వారిని సంప్రదించలేకపోవచ్చు.
ఒక సాధారణ వ్యక్తి భావోద్వేగ బాధను అనుభవించడానికి కారణమైన ఏదైనా అవాంఛిత ప్రవర్తన, అపహాస్యం చేయడం, పుకార్లు వ్యాప్తి చేయడం, మరొక వ్యక్తి పట్ల హాని కోరుకోవడం, అవమానకర చిత్రాలను పంచుకోవడం (తారుమారు లేదా AI- సృష్టి చిత్రాలతో సహా), లేదా పదేపదే అవాంఛిత సంప్రదింపుతో సహా ఏదైనా అవాంఛిత ప్రవర్తనను మేము వేధింపుగా పరిగణిస్తాము.
వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (PII) లేదా స్క్రీన్‌షాట్‌లు లేదా ఏకాంత సంభాషణల రికార్డింగ్‌తో సహా మరొక వ్యక్తి యొక్క ఏకాంత కంటెంట్, చిత్రాలు లేదా సమాచారాన్ని సమ్మతి లేకుండా పంచుకోవడాన్ని కూడా మేము నిషేధిస్తాము.
వేధింపు ఉద్దేశ్యంతో (అంటే “డాక్సింగ్”) మరొక వ్యక్తి ప్రైవేట్ లేదా గుర్తించదగిన సమాచారాన్ని పంచుకోవడాన్ని కూడా మేము నిషేధిస్తాము.
చట్టవిరుద్ధ లేదా నియంత్రిత కార్యకలాపాలు
అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నం కావడానికి Snapchat ను ఉపయోగించడమనేది అకౌంట్ రద్దుకు దారితీయవచ్చు, మరియు అది నేరం కావచ్చు! అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నతకు, ప్రోత్సాహానికి లేదా ఖ్యాతికి Snapchatను వాడవద్దు.
మానవ అక్రమ రవాణా లేదా మానవ అక్రమ తరలింపు సానుకూలతను లేదా పాల్గొనడాన్ని, అలాగే ముఠాల ప్రోత్సాహం, వ్యవస్థీకృత నేరాలు లేదా నేరపూరిత కార్యకలాపాల కోసం నియామకాలను మేము నిషేధిస్తాము.
అక్రమ మాదకద్రవ్యాలను కీర్తించడం, అమ్మకం లేదా పంపిణీని మేము నిషేధిస్తాము (సాధారణంగా ఓపియాయిడ్స్, బార్బిటురేట్స్ మరియు యాంఫేటమిన్స్ వంటి దుర్వినియోగం చేయబడే ప్రిస్క్రిప్షన్ ఔషధాలతో సహా).
నియంత్రిత మాదకద్రవ్యాలు (ప్రిస్క్రిప్షన్ మాదకద్రవ్యాలతో సహా) మరియు పదార్ధాల అమ్మకం లేదా పంపిణీని మేము నిషేధిస్తాము.
మేము ఆయుధాల అమ్మకం లేదా ప్రచారం (బాణసంచా లేదా పేలుడు పదార్థాలతో సహా), అలాగే నిర్లక్ష్యపు లేదా బాధ్యతారాహిత్య ఆయుధాల వాడకపు చిత్రీకరణను నిషేధిస్తాము.
తరచుగా నియంత్రించబడే నిర్దిష్ట వస్తువులు లేదా కార్యకలాపాల ప్రచారాన్ని మేము నిషేధిస్తాము. ఇందులో పొగాకు, మద్యం, వేప్ ఉత్పత్తులు వంటి నియంత్రిత వస్తువుల అమ్మకం లేదా ప్రచార ప్రయత్నం చేరి ఉంటాయి. ఆర్ధిక ఋణాలు లేదా ఇతర ఆర్ధిక ఉత్పత్తులు లేదా సేవలను అందించడం లేదా జూదం సేవలను ప్రోత్సహించడం (బెట్టింగ్ వెబ్‌సైట్‌లు, జూదం యాప్స్, టిప్ లేదా ప్రిడిక్షన్ సర్వీస్‌లు లేదా రిఫరల్ కోడ్‌లతో సహా) వంటి నియంత్రిత సేవలు మరియు కార్యకలాపాల అమ్మకం, సానుకూలత లేదా ప్రచారాన్ని కూడా మేము నిషేధిస్తాము.
హానికరమైన తప్పుడు లేదా మోసపూరిత అభ్యాసాలు
విషాదకరమైన సంఘటనల యొక్క ఉనికిని తిరస్కరించడం, నిరాధారమైన వైద్య క్లెయిములు, పౌర ప్రక్రియల యొక్క సమగ్రతను తక్కువగా అంచనా వేయడం, లేదా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రయోజనాల కోసం కంటెంటును తారుమారు చేయడం వంటి (జెనరేటివ్ AI ద్వారా లేదా మోసపూరిత సవరణ ద్వారా అయినా) హాని కలిగించే లేదా మోసపూరితమైన తప్పుడు సమాచార వ్యాప్తిని మేము నిషేధిస్తాము.
మీరు కాని మరొకరు మీరుగా (లేదా మరోదానిగా) చూపించుకోవడం, లేదా మీ గురించి మీరు ఎవరో ప్రజలకు తప్పుగా తెలియచేయడాన్ని మేము నిషేధిస్తాము. ఇందులో హానికరమైన, వ్యంగ్యేతర ఉద్దేశ్యాల కోసం ఫ్రెండ్స్, ప్రముఖులు, ప్రజా నాయకులు, బ్రాండ్లు లేదా ఇతర వ్యక్తులు లేదా సంస్థలలా నటించడం ఉంటుంది.
అనుచరుల కొరకు చెల్లింపు ప్రోత్సాహాలు లేదా ఇతర అనుచర-ఎదుగుదల పథకాలు, స్పామ్ అనువర్తనాల ప్రోత్సాహం, లేదా బహుళస్థాయి మార్కెటింగ్ లేదా పిరమిడ్ పథకాల ప్రోత్సాహముతో సహా మేము స్పామ్ అంతటినీ నిషేధిస్తాము.
వెల్లడి చేయబడని చెల్లింపు లేదా ప్రాయోజిత కంటెంట్, మోసపూరిత వస్తువులు లేదా సేవల ప్రోత్సాహం లేదా ధనవంతులు కావడానికి త్వరిత పథకాలు లేదా Snapchat లేదా Snap Inc.ని అనుకరించడంతో సహా మోసం మరియు ఇతర మోసపూరిత పద్ధతులను మేము నిషేధిస్తాము.
సమాచారం మరియు Q&A

నేను దేనినైనా ఏవిధంగా నివేదించవచ్చు?
మా ఇన్-యాప్ రిపోర్టింగ్ ఫీచర్లను ఉపయోగించి లేదా ఈ ఫారమ్ ను నింపి మీరు మా భద్రతా బృందాలకు నివేదికను ఇవ్వవచ్చు, మీకు Snapchat అకౌంట్ ఉన్నా లేకున్నా ఆందోళనను నివేదించడానికి మీకు వీలవుతుంది. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలను నిర్ణయించడానికి మేము ఈ నివేదికలను సమీక్షిస్తాము. మా భద్రతా బృందాలు సంభావ్య భద్రతా సమస్యలను నివేదించడానికి వేగవంతమైన మరియు ఉత్తమమైన మార్గం Snapchat యాప్‌లో ఇన్-యాప్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారానే.
నిర్దిష్ట అధికార పరిధుల నివాసితులు (ఉదాహరణకు, E.U లేదా U.K) కూడా చట్టవిరుద్ధమని తాము విశ్వసించే కంటెంట్‌ను నివేదించడానికి అదనపు ఎంపికలను కలిగి ఉండవచ్చు. మీరు మా సపోర్ట్ సైట్‌లో మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.
ఒకవేళ నేను కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే ఏం జరుగుతుంది?
మీరు ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే, మేము ఆక్షేపణీయ కంటెంట్‌ను తొలగించవచ్చు, మీ అకౌంట్ లేదా కంటెంట్ యొక్క దృశ్యతను రద్దు లేదా పరిమితం చేయవచ్చు, Snapchat పై నిర్దిష్ట ఫీచర్లకు మీ ప్రాప్యతను పరిమితం చేయవచ్చు, చట్ట అమలు సంస్థకు తెలియజేయవచ్చు, మరియు/లేదా మిమ్మల్ని మరొక అకౌంట్ సృష్టించకుండా లేదా వాడకుండా అడ్డుకోవడానికి సాంకేతిక చర్యలు తీసుకోవచ్చు. కార్యకలాపం మానవ జీవితానికి ముప్పు కలిగిస్తుందని మేము విశ్వసించినప్పుడు, సంభావ్యతగా సంబంధిత కంటెంట్ మరియు ఇతర అకౌంట్ డేటాతో సహా చట్ట అమలు సంస్థకు సమాచారాన్ని సూచించడం మా విధానంగా ఉంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మీ అకౌంట్ నిష్క్రియం చేయబడితే, మా అనుమతి లేకుండా మళ్లీ Snapchatను వాడటానికి మీరు అనుమతించబడరు. మా మోడరేషన్ వివరణదారు లో మరింత తెలుసుకోండి.
ఆఫ్-ప్లాట్‍ఫార్మ్ ప్రవర్తను మీరు పరిగణిస్తారా?
మా స్వంత విచక్షణ ప్రకారం Snapchat లోన లేదా బయట ఇతరుల పట్ల ప్రమాదాన్ని కలిగిస్తారని మేము నమ్మడానికి కారణం ఉన్న వినియోగదారులకు అకౌంట్ ప్రాప్యతను తొలగించడానికి లేదా పరిమితం చేయడానికి Snap హక్కును కలిగి ఉంటుంది. ఉదాహరణలలో దోషులుగా నిరూపితమైన లైంగిక నేరస్థులు, ఉగ్రవాద సంస్థల నాయకులు, హింసను ప్రేరేపించే లేదా ఇతరులకు తీవ్రమైన హాని కలిగించే వ్యక్తులు లేదా మానవ జీవితానికి ముప్పుగా ఉన్నట్లుగా మేము నమ్మే ప్రవర్తన చేరి ఉంటాయి. అటువంటి ప్రవర్తనను మదింపు చేయడంలో, అకౌంట్ ప్రాప్యతను తొలగించాలా లేదా నిర్బంధించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవడంలో మేము విషయ పరిజ్ఞాన నిపుణులు లేదా చట్ట అమలు యంత్రాంగం వంటి ఇతర వనరుల నుండి మార్గదర్శనాన్ని పరిగణించవచ్చు.
నేను మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను?
Snapchatలో భద్రత గురించి మరింత సమాచారం కొరకు దయచేసి మా భద్రతా కేంద్రంను సందర్శించండి. అక్కడ, మీ గోప్యతా సెట్టింగులను అప్‌డేట్ చేయడం, మీరు మీ కంటెంట్‌ని ఎవరు చూడవచ్చు, మరియు ఇతర యూజర్‌లను బ్లాక్ చేయడం వంటి చర్యలను చేపట్టడంతో సహా, మీ Snapchat అనుభవాన్ని నిర్వహించడంపై మీరు వివరణాత్మక సూచనలను చూడవచ్చు.
శృంగారపరమైన కంటెంట్