Snap Values
పారదర్శకత నివేదిక గురించి
జనవరి 1, 2025 - జూన్ 30, 2025

మా పారదర్శకత నివేదికలో, మా ప్లాట్‌ఫారమ్ అంతటా మా భద్రతా ప్రయత్నాలకు సంబంధించిన డేటాను వెల్లడి చేస్తాము. ఇక్కడ మేము మా భద్రతా సూత్రాలు, విధానాలు, అభ్యాసాలపై అదనపు సందర్భం, అంతర్దృష్టిని అందిస్తాము, అలాగే వివిధ భద్రత, గోప్యతా వనరులకు లింక్‌లు అందిస్తాము.

Snap యొక్క పారదర్శకత రిపోర్టింగ్ చరిత్ర

2015 నుండి, మేము Snapచాటర్ల ఖాతా సమాచారం మరియు ఇతర చట్టపరమైన నోటిఫికేషన్‌ల కోసం ప్రభుత్వ అభ్యర్థనల వాల్యూమ్ మరియు స్వభావంపై ముఖ్యమైన అంతర్దృష్టిని అందించే పారదర్శకత నివేదికలను రూపొందించాము.

నవంబర్ 2015 నుండి, ఖాతా సమాచారాన్ని కోరుతూ మేము న్యాయ ప్రక్రియ అందుకున్నప్పుడల్లా Snapచాటర్ల సమాచారం ఇవ్వడం మా విధానంగా ఉంది, అయితే మేము చట్టబద్ధంగా అలా చేయడం నిషేధించబడిన లేదా అసాధారణమైన పరిస్థితులు (పిల్లల లైంగిక దోపిడీ మరియు దురుపయోగం లేదా మరణం లేదా తీవ్ర శారీరక గాయం వంటి ఆసన్నక ముప్పు) ఉన్నట్లు మేము నమ్మినప్పుడు మేము మినహాయింపులు చేస్తాము.

2020లో, మా సేవా నిబంధనలు లేదా సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు Snapchatలో నివేదించబడిన ఖాతాల వాల్యూమ్ మరియు స్వభావంపై అంతర్దృష్టులను అందించడానికి మేము మా పారదర్శకత నివేదికను మెరుగుపరచాము. మేము డౌన్‌లోడ్ చేయగల CSVలో అన్ని దేశాలకు అందుబాటులో ఉన్న దేశ-స్థాయి బ్రేక్‌డౌన్‌లను కూడా చేర్చాము. 2021లో, మేము తప్పుడు సమాచారం, ట్రేడ్‌ మార్క్ నోటీసులు మరియు ఉల్లంఘన వీక్షణ రేటు గురించి డేటాను చేర్చడానికి మా పారదర్శకతా రిపోర్టింగ్ పరిధిని విస్తరించాము. 2022లో, మేము మాదకద్రవ్యాలు, ఆయుధాలు మరియు ఆత్మహత్య మరియు స్వీయ-హానికి సంబంధించి మా మోడరేషన్ చర్యల గురించి అదనపు గ్రాహ్యతను అందించాము.

2023లో, వర్తించే చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలపై దృష్టి సారించే అదనపు పారదర్శకతా నివేదికలను ప్రచురించడం ప్రారంభించాము. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా మరియు యూరోపియన్ యూనియన్ కొరకు అంకితమైన మా పేజీలు మా ప్రపంచ పారదర్శకత నివేదికలో మేము అందించే సమాచారాన్ని ప్రోత్సహించాయి.

2024లో, మేము మా చురుకైన భద్రతా ప్రయత్నాలకు సంబంధించి అదనపు డేటా మరియు గ్రాహ్యతను చేర్చడానికి మా ప్రపంచ పారదర్శకత నివేదికను అప్‌డేట్ చేశాము.

ప్రపంచ చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా మా పారదర్శకతా రిపోర్టింగ్ పద్ధతులను మరింత మెరుగుపరచడానికి మేము నిరంతరం పాటుపడతాము. 

అదనపు భద్రత మరియు గోప్యతా వనరులు

భద్రత మరియు గోప్యత, మా విధానాలు మరియు సంబంధిత టూల్స్ పట్ల మా వైఖరికి సంబంధించి Snapచాటర్లు మరియు బయటి హక్కుదారులకు సహాయకరమైన వనరులను అందించడానికి Snap కట్టుబడి ఉంది. ఈ వనరులు మా గోప్యత, భద్రత మరియు పాలసీ హబ్‌లో అందుబాటులో ఉన్నాయి. మేము ఈ దిగువన వీటిలో కొన్నింటిని మరియు అదనపు వనరులను హైలైట్ చేస్తున్నాము.

భద్రతా కేంద్రం

Snap అనేది 13+ వినియోగదారుల కోసం ఒక ప్లాట్‌ఫారమ్ అయినందున, ప్లాట్‌ఫారమ్‌ను ఎలా సురక్షితంగా ఉంచాలనే దాని గురించి వినియోగదారులందరికీ తెలియజేసి మరియు నిమగ్నం చేయడం తప్పదని మేము నమ్ముతున్నాము. మా ఫ్యామిలీ సేఫ్టీ హబ్ మరియు ఫ్యామిలీ సెంటర్ , తల్లిదండ్రుల కొరకు Snap యొక్క యాప్ టూల్స్ వంటి అసంఖ్యాక వనరులతో, వినియోగదారులు మరియు వారి కుటుంబాలతో కమ్యూనికేట్ చేయడానికి మరియు Snapchat పై సురక్షితంగా ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి అవసరమైన టూల్స్ అందించాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము.

కమ్యూనిటీ మార్గదర్శకాలు

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు మా భద్రతా సూత్రాల పునాదిని ఏర్పరుస్తాయి మరియు Snapchat యొక్క బాధ్యతాయుతమైన ఉపయోగం గురించి వినియోగదారులకు తెలియజేయడానికి ఉద్దేశించబడ్డాయి. మేము మా మార్గదర్శకాలను Snapchat సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు చురుగ్గా పని చేసే మార్గంగా మాత్రమే విశ్లేషిస్తాము.

ఒక భద్రతా ఆందోళనను నివేదించడం

Snapchatను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి భద్రతా బృందాలు మరియు అధునాతన కృత్రిమ మేధస్సు 24/7 పనిచేస్తుండగా, మేము ఆందోళనలను నివేదించడానికి మా వినియోగదారులపై కూడా ఆధారపడతాము. అలా చేయడానికై, మా విధానాలను ఉల్లంఘించే కంటెంట్ మరియు వ్యక్తుల్ని నివేదించడానికి మేము యాప్‌ మరియు ఆన్‌లైన్‌ రెండింటిలోనూ టూల్స్ అందిస్తాము.

Here For You

Snap వద్ద మా వినియోగదారుల యొక్క శ్రేయస్సు మరియు భద్రత మాకు అత్యంత ప్రధానమైనవి. మా వినియోగదారుల కొరకు నిమగ్నాత్మకమైన మరియు హై టచ్ వనరులను అందించడానికై, మేము హియర్ ఫర్ యు, అటువంటి ఇన్-యాప్ టూల్స్ ని అభివృద్ధి చేశాము, ఇది మానసిక ఆరోగ్యం లేదా భావోద్వేగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న Snapచాటర్లకు ముందస్తుగా క్రియాశీల ఇన్-యాప్ మద్దతుని అందిస్తుంది.

గోప్యతా కేంద్రం

Snapలో, మేము మీ గోప్యతకు ప్రాధాన్యతనిస్తాం. మీరు Snapchat లేదా మా ఉత్పత్తుల్లో దేనినైనా ఉపయోగించిన ప్రతిసారీ మీ నమ్మకాన్ని సంపాదించడానికి మేము ప్రయత్నిస్తాము-అందుకే మేము మీ సమాచారాన్ని ఇతర సాంకేతిక సంస్థల కంటే భిన్నంగా పరిగణిస్తాము. మా ఉత్పత్తులు నిరంతరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ సైతమూ, మా గోప్యతా సూత్రాలు మరియు వినియోగదారు గోప్యత పట్ల ధృఢమైన నిబద్ధతలో మార్పు లేకుండా ఉటుంది.

డిజిటల్ శ్రేయస్సు సూచిక

వార్షిక డిజిటల్ శ్రేయస్సు సూచిక (DWBI) ద్వారా జనరేషన్ Z యొక్క డిజిటల్ శ్రేయస్సును విశ్లేషించి మరియు పెంపొందించడానికై మా నిబద్ధతలో మేము స్థిరంగా నిలిచి ఉన్నాము. 2022లో మొదలైన ఈ సమగ్ర అధ్యయనం ఆన్‌లైన్ శ్రేయస్సును అంచనా వేయడానికి ఆరు దేశాలు—ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, UK మరియు US—లోని టీనేజర్లు, యువజనులు ఇంకా వారి తల్లిదండ్రులను సర్వే చేస్తోంది. DWBI అనేది ఐదు కేటగరీలు అయిన: సానుకూల భావోద్వేగం, నిమగ్నత, సంబంధబాంధవ్యాలు, ప్రతికూల భావోద్వేగం మరియు సాధనలలో 20 మనోభావాల ప్రకటనలను కలిగి ఉంది మరియు PERNA నమూనాను వాడుతుంది. ఈ పరిశోధనను నిరంతరంగా నిర్వహించడం ద్వారా, యువతలో ఆన్ లైన్ అనుభవాల గురించి విలువైన గ్రాహ్యతలను అందించడంతోపాటు, సురక్షిత మరియు మరింత సహాయక డిజిటల్ వాతావరణాన్ని ప్రోత్సహించే టూల్స్ మరియు వనరుల అభివృద్ధిని తెలియజేయడమే Snap లక్ష్యంగా చేసుకుంది.

ఫైనాన్షియల్ సెక్స్‌టార్షన్

ముందస్తు గుర్తింపు వ్యవస్థలు, NCMEC యొక్క "టేక్ ఇట్ డౌన్" చొరవ, మెరుగైన యాప్ రిపోర్టింగ్ టూల్స్ మరియు విద్యా వనరుల ద్వారా ఫైనాన్షియల్ సెక్స్‌టార్షన్‌ ను చురుగ్గా ఎదుర్కోవాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము. నేరపూరిత ఖాతాలు వేగంగా తొలగించబడి మరియు అవసరమైనప్పుడు అధికారులకు నివేదించబడతాయి.

తల్లిదండ్రుల మార్గదర్శిని

ఈ గైడ్, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు Snapchat ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకొనేందుకు సహాయపడటంతోపాటు, టీనేజర్లకు మేము అందించే కీలక రక్షణలు, తల్లిదండ్రుల నియంత్రణలను ఎలా ఉపయోగించాలో వివరించడంతోపాటు, సాధారణ ప్రశ్నలకు సమాధానాలిస్తుంది.

చట్టమును అమలు చేయు మార్గదర్శి

ఈ గైడ్ Snap నుండి Snapchat ఖాతా రికార్డులను (అంటే, Snapchat వినియోగదారు డేటా) కోరుతున్న చట్ట అమలు అధికారులకు సమాచారాన్ని అందిస్తుంది.

భద్రత మరియు ప్రభావం బ్లాగ్

ఏప్రిల్ 2021 లో ప్రారంభించబడిన మా బ్లాగ్, మా Snapchat కమ్యూనిటీ యొక్క భద్రత, గోప్యత మరియు శ్రేయస్సు కోసం మేము ఎలా పని చేస్తామనే దానిపై ఆసక్తి ఉన్న అనేక మంది హక్కుదారులు మరియు న్యాయవాదులకు సహాయక వనరుగా సేవ చేసే లక్ష్యంతో ఉంది.