కమ్యూనిటీ మార్గదర్శకాలు

ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, మరియు హింసాత్మక తీవ్రవాదం

కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి

అప్‌డేట్ చేయబడినది: జనవరి 2024

అవలోకనము

ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే ద్వేషపూరిత కంటెంట్ మరియు కార్యకలాపాలకు Snapchat పై ఎటువంటి చోటు లేదు. మా విధానాలు, Snapచాటర్‍ల భద్రతకు మద్దతు ఇచ్చే మరియు ప్రాధాన్యతను కల్పించే ఒక వాతావరణాన్ని సృష్టించడానికి, ఇంకా హింస మరియు వివక్ష నుండి కమ్యూనిటీలను రక్షించేందుకు పనిచేస్తాయి.

ద్వేషపూరిత ప్రసంగం లేదా ద్వేషపూరిత చిహ్నాల వాడకంతో సహా ద్వేషపూరిత ప్రవర్తనలో పాల్గొనడం ఎప్పటికీ ఆమోదించబడదు. అదేవిధంగా ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాద చర్యల కోసం మద్దతునిచ్చే లేదా మద్దతునిచ్చే కార్యకలాపాలు నిషేధించబడ్డాయి మరియు తప్పనిసరి అయితే చట్టాన్ని అమలు చేసే అధికారులకు తెలియజేయవచ్చు.

ఈ విధానాలు బాధ్యతాయుతంగా అమలు చేయబడేలా చూసుకునేందుకు సహాయపడటానికి, మా జట్లు పౌర హక్కుల సంస్థలు, మానవ హక్కుల నిపుణులు, చట్టమును అమలుచేయు ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు మరియు భద్రతా న్యాయసలహాదారుల నైపుణ్యం మరియు పనితనాన్ని సంప్రదిస్తారు. మా ఉత్పత్తులు మరియు విధానాలు Snap చాటర్లని సురక్షితంగా ఉంచడానికి పనిచేసేలా చూసుకోవడానికి మేము నిరంతరం నేర్చుకుంటున్నాము, మరియు అవసరమైన చోట క్రమబద్ధం చేసుకుంటాము. మాకు సహాయపడేందుకు, ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదంపై మా విధానాలను ఉల్లంఘించగల ఏదైనా ద్వేషపూరిత కంటెంట్ లేదా చర్యను సకాలములో నివేదించేలా మేము యూజర్లను ప్రోత్సహిస్తాము.

  • ఉగ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాదులు మరియు ద్వేషపూరిత సమూహాలు మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం నుండి నిషేధించబడ్డాయి. హింసాత్మక ఉగ్రవాదం లేదా తీవ్రవాదాన్ని సమర్థించే లేదా అభివృద్ధి చేసే కంటెంట్‌ని మేము ఏమాత్రం సహించం.

  • జాతి, రంగు, కులం, జాతీయత, జాతిమూలం, మతం, లైంగికత్వం, లింగ గుర్తింపు, వైకల్యత, లేదా వెటరన్ స్టేటస్, వలస స్థితి, సామాజిక ఆర్ధిక స్థితి, వయస్సు, బరువు లేదా గర్భధారణ స్థితి ఆధారంగా హోదా తగ్గించడం, అపఖ్యాతి పాలు చేయడం, లేదా వివక్షను లేదా హింసను ప్రోత్సహించే ద్వేష ప్రసంగం లేదా కంటెంట్‌ నిషేధించబడుతుంది.

మీరు ఏమి ఆశించవచ్చు

మా ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు Snap చాటర్లు సురక్షితంగా మరియు గౌరవించబడినట్లుగా భావించాలి. ద్వేషపూరిత కంటెంట్‌ పైన మా విధానాలు ద్వేషపూరిత ప్రసంగాన్ని నిషేధిస్తాయి, ఇందులో, ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని వారి జాతి, వర్ణం, కులం, జాతీయత, జాతీయ పుట్టుక, మతం, లైంగిక ధోరణి, లింగము, లింగ గుర్తింపు, వైకల్యం, ప్రముఖుల స్థితి, వలస స్థితి, సామాజిక-ఆర్థిక స్థితి, వయస్సు, బరువు, లేదా గర్భధారణ స్థితి ప్రాతిపదికన కించపరచే లేదా వివిక్షను ప్రోత్సహించే ఏదైనా కంటెంట్‌ను చేరి ఉంటుంది. ఈ నియమాలు వీటిని నిషేధిస్తాయి, ఉదాహరణకు, జాతి, జాతి సంబంధం, స్త్రీద్వేషపూరిత భావన, లేదా స్వలింగసంపర్క దూషణల వాడకం; రక్షిత సమూహానికి వ్యతిరేకంగా వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసే తిట్లు, పిలుపులు లేదా మీమ్స్; మరియు ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తెచ్చే లేదా లైంగికతను తప్పుగా అర్ధం చేసుకునే రూపములో ఏదైనా దురుపయోగం. ద్వేషపూరిత ప్రసంగం అనేది నేరస్థుల విలువను గుర్తించడం లేదా పొగడడం––లేదా బాధితులను కించపరచడం––నుండి మానవ దురాగతాల (నరమేధం, అపరాధ వివక్ష లేదా బానిసత్వం వంటివి) వరకు కూడా పొడిగించబడుతుంది. నిషేధించబడిన ఇతర ద్వేషపూరిత కంటెంట్‍లో, ద్వేషపూరిత చిహ్నాల వాడకం, అంటే ఇతరుల పట్ల ద్వేషం లేదా వివక్షను తెలియజేసే ఏదైనా చిత్రాలు ఉంటాయని అర్థం.

ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదంపై మా నిషేధాలు, తదుపరి సిద్ధాంతపరమైన లక్ష్యాలను చేరుకోవడానికై ముందుకు వెళ్ళేందుకు, ఉగ్రవాదం లేదా ఇతర హింసాత్మక, నేరస్వభావ చర్యలకు పాల్పడే వ్యక్తులు లేదా సమూహాలను ప్రోత్సహించే కంటెంట్‌ అంతటికీ పొడిగించబడ్డాయి. ఈ నియమాలు విదేశీ ఉగ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద ద్వేషపూరిత సమూహాలను ప్రోత్సహించే లేదా మద్దతు ఇచ్చే ఏదైనా కంటెంట్‍ను కూడా నిషేధిస్తాయి––ప్రతిష్టాత్మక, తృతీయ-పక్ష నిపుణులచే నియమించబడినట్లుగా––అదేవిధంగా అటువంటి సంస్థలు లేదా హింసాత్మక తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన నియామకాలను కూడా నిషేధిస్తాయి.

మేము ఈ విధానాలను ఎలా అమలు చేస్తాము

మా ఇన్-యాప్ రిపోర్టింగ్ సాధనం, ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే ద్వేషపూరిత కంటెంట్ లేదా కార్యకలాపాలను వినియోగదారులు నేరుగా నివేదించడానికి అనుమతిస్తుంది. స్పాట్‌లైట్ మరియు కనుగొనండి వంటి మా అధిక-చేరువ ఉపరితలాలపై, ఈ నియమాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను అదుపు చేయడానికి మేము ఒక ముందస్తు క్రియాశీల విధానాన్ని తీసుకుంటాము. అయినప్పటికీ మేము ఈ ఉపరితలాలపై మీరు ఎదుర్కొనే ఏదైనా హానికరమైన కంటెంట్‌ను నివేదించడానికి వాడుకదారులను ప్రోత్సహిస్తాము––ఈ చోటులను సురక్షితంగా ఉంచడానికి మేము చేసే ప్రక్రియలలో ఏవైనా అడ్డంకుల పట్ల మమ్మల్ని అప్రమత్తం చేయడానికి ఇది సహాయపడుతుంది.

ద్వేషపూరిత కంటెంట్‌ నివేదించబడినప్పుడు, మా జట్లు ఏదైనా ఉల్లంఘించే కంటెంట్‌ని తొలగిస్తాయి మరియు పునరావృత లేదా విపరీతమైన ఉల్లంఘనలలో పాల్గొనే వాడుకదారుల అకౌంట్ ప్రాప్యత లాక్ చేయబడే విధంగా చూసుకుంటాయి. ఒక అదనపు చర్యగా, తమకు అసురక్షితంగా లేదా అసౌకర్యంగా అనిపించే ఎవరైనా వినియోగదారులను బ్లాక్ చేయడానికి మేము Snap చాటర్ లను ప్రోత్సహిస్తాము.

ఉగ్రవాద కార్యకలాపాలు లేదా హింసాత్మక తీవ్రవాదంలో నిమగ్నమైన వినియోగదారులు అకౌంట్ అధికారాలను కోల్పోతారు. దానికి అదనంగా, ఈ విధానాల ఉల్లంఘనలకు సంబంధించిన కొంత సమాచారము చట్టమును అమలు చేసేవారికి పంపించబడవచ్చు. చట్ట అమలు ఏజెన్సీలతో Snapchat ఎలా బాధ్యతాయుతంగా నిమగ్నమవుతుందో మరింత సమాచారం కోసం, Snap యొక్క గోప్యత మరియు భద్రతా హబ్ను సందర్శించండి.

సారాంశం

Snapchat పై మేము ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, లేదా హింసాత్మక తీవ్రవాదాన్ని సహించము. మా విధానాలు మరియు మా ఉత్పత్తి రూపకల్పన రెండింటి ద్వారా, Snapచాటర్‍ల భద్రతకు మద్దతు ఇచ్చే మరియు ప్రాధాన్యమిచ్చే ఒక వాతావరణాన్ని నిర్వహించడానికి మేము శ్రద్ధగా పనిచేస్తాము.

మా విధానాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను నివేదించడం ద్వారా వాడుకదారులు మా కమ్యూనిటీని రక్షించడానికి మాకు సహాయపడవచ్చు. మేము మా భద్రతా ఉద్దేశ్యాలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్ళేలా చూసుకోవడానికి గాను భద్రతా కమ్యూనిటీ వ్యాప్తంగా వైవిధ్యమైన నాయకులతో కలిసి పనిచేయడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. మా భద్రతా ప్రయత్నాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి మా భద్రతా కేంద్రమును సందర్శించండి.