Privacy, Safety, and Policy Hub
పాలసీ సెంటర్

సిఫార్సు అర్హత కోసం కంటెంట్ మార్గదర్శకాలు

Snapchat పైన నిలకడగా అధిక-నాణ్యత కంటెంట్‌ను ప్రచురించడంకోసం మేము సృష్టికర్తలను ఆర్థికంగా ప్రోత్సహించదలచుకున్నాము. కంటెంట్ మానిటైజేషన్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏమిటంటే:

  • మీ కంటెంట్‌ను చూడటం అనేది సమయం చక్కగా-వెచ్చించబడినట్లుగా Snapచాటర్లు భావించడం, మరియు

  • ప్రకటనదారులు మీ కంటెంట్‌తో తమ బ్రాండ్లను అనుబంధం చేయడానికి ఆసక్తిగా భావించడం.


మానిటైజేషన్ కోసం అర్హత పొందడానికి గాను, కంటెంట్ ఈ పేజీ పైన ఉన్న పాలసీలకు కట్టుబడి ఉండాలి, అదే విధంగా మా ఈ క్రింది వాటికి సైతమూ:



చిట్కా: మీ కంటెంట్ మీ అనుచరుల కంటే ఎక్కువ విస్తృతమైన ఆడియెన్స్ న చేరుకోవడానికి గాను అది సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్కి కట్టుబడి ఉండాలి. 


ఈ పేజీ పైన గల మానిటైజేషన్ పాలసీలు వాణిజ్య కంటెంట్ పాలసీ నుండి భిన్నంగా ఉంటాయి, ఇది కంటెంట్-లోపున ప్రకటనకు వర్తిస్తుంది, అంటే, స్పాన్సర్ కంటెంట్ కి వర్తిస్తుంది.

నేను మానిటైజేషన్ కొరకు ఎలా అర్హత పొందగలను?

వ్యక్తిగత సృష్టికర్తలు ఇక్కడ మరింత సమాచారాన్ని పొందవచ్చు:

Snapchat పై డబ్బును ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోండి 


విశ్వసనీయమైన వార్తా ఔట్‌లెట్లు లేదా ఇతర మీడియా కంపెనీలు వంటి సంస్థలు ఇక్కడ సమాచారమును కనుగొనవచ్చు:

Snapchat షోలు | కంటెంట్ భాగస్వాములు

ఈ కంటెంట్ మానిటైజేషన్ పాలసీలు ఎలా వర్తింపు చేయబడతాయి?

Snap యొక్క కంటెంట్ బృందం, ఖాతాలను (సృష్టికర్తలు లేదా భాగస్వాములు) సంపూర్ణంగా మదింపు చేస్తుంది. మానిటైజేషన్ అర్హత యొక్క ప్రమాణాలను నెరవేర్చడానికి విఫలమయ్యే కంటెంట్ ను ప్రచురించే తీరును గుర్తించడానికి గాను, మేము మానవ మరియు అల్గారిథం మోడరేషన్ యొక్క మిశ్రమాన్ని ఉపయోగిస్తాము. మేము వాడుకదారులు, బ్రాండ్లు మరియు ఇతర వాటాదారుల నుండి ఫీడ్ బాక్ ని కూడా వింటాము. ఒకవేళ మీ అకౌంట్ ఈ పాలసీలకు కట్టుబడి ఉండటంలో విఫలమైతే, అప్పుడు మీరు చెల్లింపు కోసం అర్హులు కాకపోవచ్చు.  మేము నిర్దిష్ట కంటెంట్ తో పాటు కనిపించే ప్రకటనలను కూడా తొలగించవచ్చు మరియు మానిటైజేషన్ కార్యక్రమంలో మీరు పాల్గొనడాన్ని నిలిపివేయడం లేదా శాశ్వతంగా ఉపసంహరించుకోవడం జరగవచ్చు. 


తదుపరి అమలు చేయబడే వివరాలనుసృష్టికర్త స్టోరీస్ నిబంధనల లో చూడవచ్చు మరియు

స్పాట్‌లైట్ నిబంధనలు, ఇవి అర్హత గల అకౌంట్‌లకు అందుబాటులో ఉంటాయి.

మానిటైజేషన్ పాలసీలు

మేము స్థిరమైన, అధిక-నాణ్యత గల కంటెంట్ సృష్టిని ప్రోత్సహించాలనుకుంటున్నాము. మీరు సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్చదవడానికి కొంత సమయం తీసుకోవడం ద్వారా కంటెంట్ నాణ్యత కోసం మా ప్రాతిపదికలను అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రధానంగా లేదా తరచుగా "సిఫార్సు కోసం అర్హత లేని" కంటెంట్‌ ని ప్రచురిస్తూ ఉన్నట్లయితే, Snapchat పై కంటెంట్ మానిటైజేషన్ కోసం మీరు దాదాపుగా మంచి అభ్యర్థిగా ఉండకపోయే అవకాశం ఉంది.


సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్ని సుస్థిరంగా నిలకడగా అనుసరించడంతో పాటు, మానిటైజ్ చేయబడిన అకౌంట్ లు వాస్తవికతను మరియు ప్రామాణికతను ప్రదర్శించాలి.

మానిటైజ్ చేయదగినవి:


మీరు గానీ లేదా మీ సంస్థ గానీ సృష్టించిన అసలైన, నిమగ్నాత్మక కంటెంట్‌ను మీరు ప్రచురించాలి. ఒకవేళ మీరు మరొకరిది ఎవరిదైనా కంటెంట్‌ను పోస్ట్ చేస్తుంటే, మీరు అట్టి కంటెంట్ కు విలువైన, పరివర్తన కలిగించే విధంగా జోడించాలి:

  • ఒక వీడియోకి ప్రతిస్పందించడం (ఉదాహరణకు, ఒక స్పోర్ట్స్ రీప్లే కి మీ స్వంత వ్యాఖ్యానాన్ని జోడించడం)

  • సమీక్షల సందర్భంలో క్లిప్‌లను ఉపయోగించడం (ఉదాహరణకు, సంబంధిత కచేరీలను ప్లే చేస్తున్నప్పుడు ఒక మూవీ గురించి మాట్లాడటం)

  • ఒక సృజనాత్మక పద్ధతిలో ఫుటేజ్ ని దిద్దుబాటు చేయడం (ఉదాహరణకు, జోడించబడిన సందర్భం, వ్యాఖ్యానం మరియు / లేదా సృజనాత్మక మూలకాలతో కౌంట్‌డౌన్ జాబితా లోనికి సమకూర్చబడిన పది ఉత్తమ వివాహ కేక్ ల యొక్క సంకలనం)

  • సోషల్ మీడియా నుండి 1) ఒరిజినల్ సృష్టికర్తకు సరిగ్గా దోహదపరచబడినది, మరియు 2) వార్తాసముచితమైన ప్రస్తుత సంఘటనలు, పోకడలు లేదా బహిరంగ వెల్లడింపు పట్ల దాని ఔచిత్యం గురించి అసలు వ్యాఖ్యానంతో ప్రదర్శించబడిన కంటెంట్, రెండింటినీ కలిగి ఉన్న క్లిప్‌లను చూపిస్తూ ఉండటం


Snapచాటర్లు మరియు ప్రకటనదారులతో నమ్మకాన్ని పెంపొందించే అధీకృతమైన కంటెంట్‌ను మీరు ప్రచురించడం. మీరు తప్పుదారి పట్టించవద్దు. మీ టైల్స్ లేదా పరిచయాలు మీ మిగిలిన కంటెంట్ లోపున చూసేవారికి రివార్డ్ చేయబడే ఆకాంక్షలను ఏర్పరచాలి. 

మానిటైజ్ చేయదగనివి:


మీరు ప్రధానంగా లేదా తరచుగా మీరు సృష్టించని అవాస్తవిక కంటెంట్‌ను ప్రచురించడం మరియు మీరు అర్ధవంతమైన రీతిలో దానిని పరివర్తన చేయకపోవడం, ఈ క్రింది వంటివి:

  • టీవీ షోలు, సినిమాలు, మ్యూజిక్ వీడియోలు నుండి మార్పుచేయని క్లిప్‌లు లేదా సంకలనాలు

  • ఇతర వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను తిరిగి అప్‌లోడ్ చేయడం

 

మీరు మీ స్వంత కంటెంటును తిరిగి పోస్టు చేయడం, లేదా నకిలీ కంటెంటు వంటి పునరావృత కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ ఉండటం, లేదా వీక్షకులకు వినోదం ఇవ్వడం లేదా తెలియజేయడం కంటే వీక్షణలను పెంచడం కోసం మాత్రమే రూపొందించబడిన ఇటువంటివి పోస్ట్ చేయడం:

  • అదే టైల్ ఇమేజ్ ని పదే పదే మళ్ళీ-ఉపయోగించడం

  • కనీసంగా వేరుపరచగల Snaps, తలాడించే మరియు వ్రాతపూర్వక కొటేషన్ల వైపు చూపిస్తూ ఉండేవి పోస్ట్ చేయడం.


మీరు తరచుగా ప్రజలను తప్పుదారి పట్టించే అనధీకృత కంటెంట్‌ను ప్రచురించడం (విషయం రాజకీయాలు, ఆరోగ్యం లేదా విషాదకరమైన సంఘటనల వలె "తీవ్రమైనది" కానప్పటికీ). ఎంగేజ్మెంట్ బెయిట్ యొక్క ఉద్దేశ్యం తప్పుదారి పట్టించడం, ఎందుకంటే అది ఎప్పుడూ చెల్లించబడని ఒక ఆకాంక్షను ఏర్పరుస్తుంది కాబట్టి, ఈ క్రింది విధంగా:

  • అసంబద్ధమైన ఒక టైల్ ఇమేజ్ (ఉదాహరణకు, స్టోరీ లోని మిగిలిన భాగంలో ప్రస్తావించని ఒక ప్రముఖవ్యక్తి చిత్రం)

  • సంభ్రమాన్ని కలిగించే ఒక టైల్ (ఉదాహరణకు, చూడగానే, జననేంద్రియాలకు పోలిన చిత్రాలు)

  • గుర్తించబడని ఒక పుకారు (ఉదాహరణకు, ఒక నటుడు రాబోయే చిత్రాలలో ఒక నిర్దిష్ట పాత్ర పోషిస్తున్నట్లుగా నిరాధారమైన ఊహాగానం)

  • ప్రస్తుత సంఘటనలుగా ప్రదర్శించబడే దీర్ఘకాల పాత సంఘటనలు (ఉదాహరణకు, ఒక ప్రముఖవ్యక్తి సంవత్సరాల క్రిందటి అరెస్టును సంచలనాత్మక వార్తగా చూపించడం)

  • మోసపూరితంగా తారుమారు చేయబడిన మీడియా (ఉదాహరణకు, ఒక విప్లవాత్మక పరివర్తన అని చూపించడానికి ఒకరి శరీరం లేదా ముఖం యొక్క చిత్రాన్ని దిద్దుబాటు చేయడం, లేదా ఒక పామును ఒక బస్సు లాగా పెద్దదిగా కనిపించేలా ఎడిటింగ్ చేయడం, మొదలైనవి)