Privacy, Safety, and Policy Hub
కమ్యూనిటీ మార్గదర్శకాలు

వేధింపు మరియు బెదిరింపు

కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణాత్మక శ్రేణి

నవీకరించబడింది: జనవరి 2023

అవలోకనము

బెదిరింపులు మరియు వేధింపుకు Snapchat లో చోటు లేదు. ఈ రకమైన హానులు అనేక రూపాలలో చోటు చేసుకోవచ్చు, కాబట్టి మేము ఈ ముప్పులను క్రియాశీలకమైన మరియు బహుముఖ రీతిలో ప్రస్తావించడానికి గాను వాడుకదారులతో ఉత్పత్తి భద్రతలు మరియు వనరులతో మా విధాన చేరువను సమ్మిళితం చేశాము.

ఒక ప్రాథమిక రేఖగా, కించపరిచే, పరువుకు భంగం కలిగించే లేదా వివక్ష వహించే కంటెంట్ నుండి మా విధానాలు మా కమ్యూనిటీ సభ్యులు అందరికీ రక్షణ కల్పిస్తాయి. వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని లేదా Snapలను వారికి తెలియకుండా లేదా సమ్మతి లేకుండా పంచుకోవడం కూడా నిషేధించబడింది.

ఈ విధానాలను సుస్థిరంగా అమలు చేయడంతోపాటు అదనంగా, ఈ నియమాలు ఉల్లంఘించగల హానికరమైన ప్రవర్తనను పరిమితం చేయడానికి సహాయపడేందుకై మేము మా ఉత్పత్తి నమూనాను ఉపయోగిస్తాము. ఇందులో, పరస్పరం ఒక సందేశాన్ని పంపించడానికి ముందు ఒక కనెక్షన్ అంగీకరించడానికి స్నేహితులిరువురికీ అవసరమయ్యే డిఫాల్ట్ సెట్టింగ్‍లు మరియు ప్రైవేట్ Snapలు, సందేశాలు, మరియు ప్రొఫైల్స్ యొక్క స్క్రీన్‌షాట్లు తీసుకునేటప్పుడు యూజర్లకు నోటీసు అందించడంవంటివి ఉంటాయి.

మా హియర్ ఫర్ యు ఫీచర్‌ల ద్వారా, బెదిరింపు మరియు వేధింపును గుర్తించి మరియు పరిష్కరించడంలో సహాయపడేందుకు గాను వాడుకదారులు ఇన్-యాప్ వనరులు మరియు సమాచారానికి యాక్సెస్ కలిగి ఉండేలా చూసుకోవడంలో మేము సహాయపడతాము. Snapchat పై ఏదైనా ప్రవర్తనా ఉల్లంఘనను సులభంగా నివేదించేందుకు తగిన సాధనాలను కూడా మేము అందిస్తాము.

  • మేము అన్నిరకాలైన బెదిరింపులను లేదా వేధింపులను నిషేధిస్తాము. ఈ నిషేధం ఇతర వాడుకదారులకు లైంగిక బహిర్గతమైన లేదా నగ్న చిత్రాలను పంపడంతో సహా వేధింపు యొక్క అన్ని రూపాలకూ పొడిగించబడుతుంది. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే, మీరు మరో అకౌంట్ నుంచి వారిని సంప్రదించలేకపోవచ్చు.

  • మరో వ్యక్తి ప్రైవేట్ సమాచారం లేదా ప్రైవేట్ స్థలాల్లో ఉండే వ్యక్తుల Snapలు — బాత్‌రూమ్, బెడ్‌రూమ్, లాకర్ రూమ్ లేదా మెడికల్ ఫెసిలిటీ వంటివి — వారికి తెలియకుండా మరియు సమ్మతి లేకుండా పంచుకోవడం అనుమతించబడదు.

  • మీ Snapలో ఎవరైనా ఉండి, దాన్ని తీసివేయమని అడిగితే, దయచేసి తీసేయండి! ఇతరుల గోప్యతా హక్కులను గౌరవించండి.

మీరు ఏమి ఆశించవచ్చు

మా వేధింపు మరియు బెదిరింపు విధానాల యొక్క ఉల్లంఘనలు, ఒక సాధారణ వ్యక్తి భావోద్వేగ ఇబ్బందులను అనుభవించడానికి కారణం కాగల ఏదైనా అవాంఛిత ప్రవర్తనను కలిగి ఉంటాయి. దీనిలో, ఇతర యూజర్లను దూషించడం, బెదిరించడం లేదా అవమానించడం వంటి మాటల దురుపయోగం మరియు లక్ష్యం చేసుకున్న వారికి ఇబ్బంది కలిగించే లేదా అవమానించే ఏదైనా ప్రవర్తన వంటివి ఉంటాయి.

ఈ నియమాలు లైంగిక వేధింపు యొక్క అన్ని రూపాలను కూడా నిషేధిస్తాయి. ఇందులో అవాంఛితంగా ముందుకెళ్ళడం, గ్రాఫిక్ మరియు కోరని కంటెంట్‌ను పంచుకోవడం, లేదా ఇతర వాడుకదారులకు అశ్లీల అభ్యర్థనలు లేదా ఆహ్వానాలను పంపించడం వంటివి ఉండవచ్చు. అనుమతి లేకుండా తీసుకున్న లేదా పంచుకోబడిన లైంగిక ఫోటోలు లేదా వీడియోలతో సహా సమ్మతిలేని సన్నిహిత చిత్రాలు (NCII)–– పంచుకోవడం అదే విధంగా “ప్రతీకార శృంగారం” లేదా వ్యక్తుల సన్నిహిత చిత్రాలు లేదా వీడియోలను పంచుకోవాలని, బహిర్గతపరచాలని లేదా వెల్లడిచేయాలని బెదిరించే ప్రవర్తన పట్ల మేము ఏ మాత్రమూ సహనం కలిగి ఉండము.

ఈ నియమాలు, యూజర్లు పరస్పర వ్యక్తిగత గోప్యతను గౌరవించుకోవాలని కూడా ఆశిస్తాయి. ఈ విధానల ఉల్లంఘనలను నివారించేందుకు సహాయపడేందుకు, ఇతరుల అనుమతిలేకుండా యూజర్లు వారి ఫోటోలు లేదా వీడియో తీసుకోరాదు మరియు వేరే వ్యక్తులకు సంబంధించిన వారి గోప్యమైన సమాచారం అంటే వారి ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ మొదలైన వాటిని ఇతరులతో పంచుకోవడాన్ని ఖచ్చితంగా నివారించాలి. ఎవరైనా వారి చిత్రాన్ని లేదా వారికి సంబంధించిన సమాచారాన్ని తొలగించమని మిమ్మల్ని అడిగినట్లయితే, దయచేసి చేయండి!

వాడుకదారులు ఈ నియమాల ఉల్లంఘనలను అనుభవించినప్పుడు లేదా గమనించినప్పుడు నివేదించాల్సిందిగా మేము ప్రోత్సహిస్తాము. మా మోడరేషన్ జట్లు Snapchat ఉపయోగించడం ప్రతి వినియోగదారుడికీ సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా అనిపించేలా చూసుకోవాలనే లక్ష్యం కలిగివున్నారు, మరియు చెడు ప్రవర్తనను నివేదించడం ద్వారా ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో వినియోగదారులు మాకు సహాయపడవచ్చు.

తీసుకొని వెళ్ళండి

Snapచాటర్లు తమకు తాము వ్యక్తీకరించడానికి వీలయ్యే ఒక సురక్షితమైన కమ్యూనిటీని పెంపొందించడం మా లక్ష్యం, మరియు మేము ఏ రకమైన వేధింపు మరియు బెదిరింపును భరించము. బెదిరింపు మరియు వేధింపు అనేక రూపాల్లో ఉంటాయి, మరియు మా ప్లాట్‌ఫామ్ ఉపయోగించేటప్పుడు మా యూజర్లకు ఎలా అనిపిస్తున్నదో అనేదాని గురించి చిత్తశుద్ధితో ఉండటం మా విధానం. 

దయచేసి వ్యక్తుల హుందాతనం మరియు గోప్యతను పరిగణించండి–– వారు అసౌకర్యం వ్యక్తం చేస్తే, వారి హద్దులను గౌరవించండి; తమ గురించిన కంటెంట్‌ను తొలగించమని వారు మిమ్మల్ని అడిగితే, దయచేసి అలా చేయండి; మరియు సాధారణంగా అనుమతి లేకుండా వ్యక్తుల చిత్రాలు లేదా వారి గురించి సమాచారం పంచుకోవడం నుండి దూరంగా ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు అసౌకర్యంగా ఉన్నదని భావిస్తే, మాకు ఒక నివేదికను పంపి ఎదుటి యూజర్ ని బ్లాక్ చేయడానికి వెనుకాడకండి–– ఈ ఫీచర్లు మీ భద్రత కోసమే అందించబడినాయి. 

హానికరమైన కంటెంట్ లేదా ప్రవర్తనను పరిష్కరించడానికై మా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి గాను మా విధానాల పనితీరును నిరంతరం క్రమబద్ధం చేసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. వినియోగదారు నివేదికలు మా విధానాన్ని తెలియజేయడానికి సహాయపడుతుండగా, ఈ లక్ష్యాలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్ళేలా చూసుకోవడానికై భద్రతా కమ్యూనిటీ వ్యాప్తంగా వైవిధ్యమైన నాయకులతో కలిసి పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా భద్రతా ప్రయత్నాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి values.snap.com/news.