అవలోకనము
చట్టవిరుద్ధమైన మరియు నియంత్రిత కార్యకలాపాలపై మా నిషేధం, Snapchat వ్యాప్తంగా భద్రత పట్ల మా అకుంఠిత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నియమాలను భుజానికెత్తుకోవడం అక్రమమైన ప్రయోజనాల కోసం మా ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేయకుండా చూసుకోవడానికి మాత్రమే కాకుండా, తీవ్రమైన హాని యొక్క ముప్పుల నుండి Snap చాటర్లని రక్షించడానికి కూడా సహాయపడుతుంది. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళడానికై సహాయపడటానికి గాను, మేము మా కమ్యూనిటీకి విద్యాపరమైన వనరులను అందించడానికి మరియు సాధారణంగా ప్రజా భద్రతను ప్రోత్సహించడానికై భద్రతా వాటాదారులు, స్వచ్ఛంద సంస్థలు, మరియు చట్ట అమలు సంస్థలతో విస్తృతంగా భాగస్వామ్యం వహిస్తాము.
Snapchatని ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపానికి ఉపయోగించవద్దు. దీనిలో, అక్రమ లేదా నియంత్రిత మత్తుమందులు, దిగుమతి నిషేధించబడిన వస్తువులు (పిల్లల లైంగిక వేధింపు లేదా దోపిడీ చిత్రాలు), ఆయుధాలు, లేదా నకిలీ వస్తువులు లేదా పత్రాల కొనుగోలు, అమ్మకం, మార్పిడి చేయడం, లేదా అమ్మకాలను సానుకూలపరచడం వంటి నేరపూరిత చర్యను ప్రోత్సహించడం, సానుకూలపరచడం, లేదా అందులో పాల్గొనడం వంటివి ఉంటాయి. ఇందులో మానవ అక్రమ రవాణా, లేదా లైంగిక అక్రమ రవాణాతో సహా ఏదైనా రూపములో దోపిడీని ప్రోత్సహించడం లేదా సానుకూలంగా వ్యవహరించడం కూడా ఉంటుంది.
జూదము, పొగాకు ఉత్పత్తులు మరియు మద్యం యొక్క అనధీకృత ప్రోత్సాహంతో సహా నియంత్రిత వస్తువులు లేదా పరిశ్రమల చట్టవిరుద్ధమైన ప్రచారాన్ని మేము నిషేధిస్తాము.