Privacy, Safety, and Policy Hub

Snapchat మోడరేషన్, అమలు కావడం మరియు అప్పీళ్ళు

కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి

అప్‌డేట్ చేయబడింది: ఫిబ్రవరి 2025

Snapchat అంతటా, మా కమ్యూనిటీ గోప్యత ప్రయోజనాలను గౌరవిస్తూనే మేము భద్రతను ముందుకు తీసుకువెళ్ళడానికి కట్టుబడి ఉన్నాము. సంభావ్య హానులను ఎదుర్కోవడానికి మేము సమతుల్యమైన, ముప్పు-ఆధారిత విధానాన్ని తీసుకుంటాము - పారదర్శక కంటెంట్ మోడరేషన్ అభ్యాసాలు, స్థిరమైన మరియు సమానత్వ అమలు, మరియు మా విధానాలను సమంజసంగా పాటించడానికై మమ్మల్ని మేము జవాబుదారీగా ఉంచుకోవడానికి స్పష్టమైన కమ్యూనికేషన్ సమ్మేళనంతో.


కంటెంట్ మోడరేషన్


మేము భద్రతను మనసులో ఉంచుకొని Snapchat ను రూపొందించాము, మరియు సంభావ్య హానికారక కంటెంట్ యొక్క వ్యాప్తిని నివారించడానికి సహాయపడటంలో ఈ డిజైన్ కీలకం. ఉదాహరణకు, Snapchat ఓపెన్ న్యూస్ ఫీడ్‌ను అందించదు, అక్కడ సంభావ్య హానికరమైన లేదా ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేయడానికి సృష్టికర్తలకు అవకాశం ఉంటుంది, మరి స్నేహితుల జాబితాలు ప్రైవేట్‌గా ఉంటాయి.

ఈ డిజైన్ రక్షణలకు అదనంగా, మా పబ్లిక్ కంటెంట్ స్థలాల్ని (స్పాట్‌లైట్, పబ్లిక్ స్టోరీస్ మరియు మ్యాప్స్ వంటివి) మోడరేట్ చేయడానికి మేము ఆటోమేటెడ్ సాధనాలు మరియు మానవ సమీక్ష సమ్మేళనాన్ని ఉపయోగిస్తాము. ప్రజా స్థలాలపై సిఫార్సు చేయబడిన కంటెంట్ కూడా ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది మరియు విధిగా అదనపు మార్గదర్శకాలనుపాటించాలి. స్పాట్‌లైట్ పైన, ఉదాహరణకు, విస్తృతమైన Snapchat కమ్యూనిటీతో షేర్ చేయడానికి సృష్టికర్తలు సృజనాత్మక మరియు వినోదభరితమైన వీడియోలను సమర్పించవచ్చు, ఏదైనా పంపిణీ పొందడానికి ముందు కృత్రిమ మేధస్సు మరియు ఇతర టెక్నాలజీచే కంటెంట్ అంతా మొదట స్వయంచాలకంగా సమీక్షించబడుతుంది. ఒకసారి కంటెంట్ ఎక్కువ వీక్షకతను పొందినదంటే, అప్పుడది పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కు పంపిణీ కోసం సిఫార్సు చేయబడే అవకాశం ఇవ్వబడటానికి ముందు మానవ మోడరేటర్లచే సమీక్షించబడుతుంది. స్పాట్‌లైట్ పై కంటెంట్ మోడరేట్ చేయడానికి ఈ దశలవారీ విధానం, సంభావ్య హానికరమైన కంటెంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మరియు ప్రతి ఒక్కరికీ సరదా మరియు సానుకూల అనుభవాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

అదేవిధంగానే, పబ్లిషర్ స్టోరీస్ లేదా షో లు వంటి మీడియా కంపెనీలచే ఉత్పన్నం చేయబడిన ఎడిటోరియల్ కంటెంట్, భద్రత మరియు సమగ్రత కోసం ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది. అదనంగా, సంభావ్య హానికరమైన కంటెంటును గుర్తించడానికి గాను మేము స్టోరీస్ వంటి - ఇతర పబ్లిక్ లేదా అధిక దృశ్యత గల స్థలాలపై ముందస్తుగా హానిని-కనిపెట్టే టెక్నాలజీని వాడతాము, మరియు శోధన ఫలితాలలో అట్టి కంటెంట్‌ (ఉదా.అక్రమ మందులు లేదా ఇతర చట్టవిరుద్ధ వస్తువుల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాతాలు) కనిపించకుండా నివారించడానికై మేము కీలక పదం వడబోతను ఉపయోగిస్తాము.

మా ఉత్పాదనా స్థలాలన్నింటి వ్యాప్తంగా, మా విధానాల సంభావ్య ఉల్లంఘనల కోసం ఖాతాలు మరియు కంటెంట్‌ను వాడుకదారులు నివేదించవచ్చు. రిపోర్టును మదింపు చేయడానికి శిక్షణ పొందిన మా భద్రతా బృందాలకు నేరుగా ఒక రహస్య రిపోర్టును సమర్పించడానికి మేము Snapchatters కు సులభతరం చేస్తాము; మా విధానాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాము; మరియు ఫలితాలను రిపోర్టు చేసిన పక్షానికి తెలియజేస్తాము – ముఖ్యంగా కొన్ని గంటల లోపుననే. హానికరమైన కంటెంట్ లేదా ప్రవర్తనను నివేదించడం గురించి మరింత సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్ పైన ఈ వనరును సందర్శించండి. ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించి మరియు తొలగించడానికి మరియు Snapchat పై భద్రత మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాల గురించి కూడా మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు. మీరు సమర్పించిన ఒక నివేదిక యొక్క ఫలితం గురించి మీకు ప్రశ్న లేదా సమస్య ఉంటే, మీరు మా మద్దతు సైట్ ద్వారా ఫాలో-అప్ చేయవచ్చు.

మీరు ఒక నివేదికను సమర్పించేటప్పుడు, అది మీ అత్యుత్తమ పరిజ్ఞానం మేరకు సంపూర్ణమైనది మరియు ఖచ్చితమైనదని మీరు ధృవీకరిస్తున్నారు. దయచేసి నకిలీ లేదా ఇతరత్రా "స్పామీ" నివేదికలను పదే పదే పంపించడంతో సహా Snap యొక్క రిపోర్టింగ్ వ్యవస్థలను దురుపయోగం చేయవద్దు. మీరు ఈ ప్రవర్తనలో నిమగ్నమైతే, మీ అభ్యర్థనల సమీక్షకు అప్రాధాన్యత ఇవ్వడానికి మాకు హక్కు ఉంటుంది. మీరు ఇతరుల కంటెంట్ లేదా అకౌంట్లపై నిరాధారమైన నివేదికలను తరచుగా సమర్పిస్తే, మేము మీకు ఒక హెచ్చరిక పంపిన తర్వాత, ఒక సంవత్సరం పాటు మీ నివేదికల సమీక్షను నిలిపివేయవచ్చు మరియు తీవ్రమైన పరిస్థితులలో, మీ అకౌంట్ ను నిష్క్రియం చేయవచ్చు.


Snap వద్ద విధానాల అమలు

మా విధానాల స్థిరమైన మరియు సమంజసమైన అమలును ప్రోత్సహించడం Snap వద్ద మాకు ముఖ్యం. మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల పట్ల సముచితమైన జరిమానాలను నిర్ణయించడానికి మేము సందర్భం, హాని యొక్క తీవ్రత మరియు అకౌంట్ యొక్క చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాము.

తీవ్రమైన హానుల లో నిమగ్నమై ఉన్నాయని మేము నిర్ధారించే అకౌంట్లను మేము సత్వరమే నిష్క్రియం చేస్తాము. తీవ్రమైన హానుల ఉదాహరణలలో పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగం, అక్రమ మాదకద్రవ్యాల పంపిణీ యొక్క ప్రయత్నం, మరియు హింసాత్మక తీవ్రవాద లేదా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం చేరి ఉన్నాయి.


ప్రాథమికంగా మా కమ్యూనిటీ మార్గదర్శకాలను తక్కువ తీవ్రమైన హానుల కోసమైనా ఉల్లంఘించడానికి సృష్టించబడిన లేదా ఉపయోగించిన అకౌంట్లను కూడా మేము నిష్క్రియం చేస్తాము. ఉదాహరణకు, ఉల్లంఘించే కంటెంట్‌ను పోస్ట్ చేసే మరియు ఉల్లంఘించే యూజర్ నేమ్ లేదా డిస్‌ప్లే పేరు గల అకౌంట్ సత్వరమే నిష్క్రియం చేయబడవచ్చు.

మా కమ్యూనిటీ మార్గదర్శకాల యొక్క ఇతర ఉల్లంఘనల కోసం, Snap సాధారణంగా ఒక మూడు-భాగాల అమలు ప్రక్రియను పాటిస్తుంది:

  • దశ ఒకటి: ఉల్లంఘించే కంటెంట్ తొలగించబడుట.

  • దశ రెండు: మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగానూ, వారి కంటెంటు తొలగించబడినట్లుగానూ మరియు ఆ పునరావృత ఉల్లంఘనల వల్ల వారి అకౌంట్ నిష్క్రియం కావడంతో సహా అదనపు చట్ట అమలు చర్యలు తీసుకోబడేలా చేస్తుందనీ సూచిస్తూ జారీ చేయబడే ఒక నోటిఫికేషన్ ని Snapchatter అందుకుంటారు.

  • దశ మూడు: మా బృందం Snapchatter యొక్క అకౌంట్ పైన ఒక కొట్టివేతను రికార్డ్ చేస్తుంది.

ఒక కొట్టివేత ఒక నిర్దిష్ట Snapchatterచే ఉల్లంఘనల యొక్క రికార్డును ఏర్పరుస్తుంది. కొట్టివేతలతో పాటు Snapchatterకు ఒక నోటీసు కూడా ఉంటుంది. ఒక Snapchatter నిర్వచించబడిన ఒక సమయ వ్యవధిలో చాలా ఎక్కువ కొట్టివేతలను కూడగట్టుకుంటే, వారి అకౌంట్ నిష్క్రియం చేయబడుతుంది. ఈ స్ట్రైక్ సిస్టమ్ మేము కమ్యూనిటీ మార్గదర్శకాలను సుస్థిరంగా వర్తింపజేసేలా చూసుకోవడానికి, మరియు వాడుకదారులకు ఒక హెచ్చరిక మరియు అవగాహన అందించేలా సహాయపడుతుంది.


నోటీసు మరియు అప్పీళ్ళ ప్రక్రియలు

Snapchatterలు తమపై ఎందుకు చట్ట అమలు చర్యలు తీసుకున్నారనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి మరియు అప్పీల్ చేయడానికి ఒక అవకాశం కల్పించడానికి, మేము Snapchatterల హక్కులను పరిరక్షిస్తూనే మా కమ్యూనిటీ యొక్క ప్రయోజనాలను రక్షించే లక్ష్యంతో నోటీసు మరియు అప్పీల్స్ ప్రక్రియలను ఏర్పాటు చేశాము.

ఒక అకౌంట్ పై జరిమానాలను అమలు చేయాలా అని మేము మదింపు చేయునప్పుడు మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలుమరియు సేవా నిబంధనలు ను వర్తింపజేస్తాము, మరియు ప్రసారం చేయబడిన లేదా సిఫార్సు చేయబడిన కంటెంట్‌ను మోడరేట్ చేయడానికి కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు సేవా నిబంధనలు,సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్ మరియు కంటెంట్ మార్గదర్శకాలనువర్తింపజేస్తాము. మా అప్పీళ్ళ ప్రక్రియలు ఎలా పని చేస్తాయో అనే సమాచారం కోసం, మేము అకౌంట్ అప్పీల్స్ మరియు కంటెంట్ అప్పీళ్ళ పైన మద్దతు వ్యాసాలను అభివృద్ధి చేశాము. Snapchat ఒక అకౌంట్ లాక్ యొక్క అప్పీలును మంజూరు చేసినప్పుడు, Snapchatter యొక్క అకౌంట్ కు ప్రాప్యత పునరుద్ధరించబడుతుంది. అప్పీల్ విజయవంతం అయినా లేదా కాకపోయినా, విజ్ఞప్తి చేసిన పక్షానికి మేము మా నిర్ణయాన్ని సత్వర తీరులో తెలియజేస్తాము.

మీ అప్పీల్ గురించి పదే పదే అభ్యర్థనలను సమర్పించడం ద్వారా దయచేసి Snap యొక్క అప్పీల్స్ యంత్రాంగాన్ని దురుపయోగం చేయవద్దు. మీరు ఈ ప్రవర్తనలో నిమగ్నమైతే, మీ అభ్యర్థనల సమీక్షకు అప్రాధాన్యత ఇవ్వడానికి మాకు హక్కు ఉంటుంది. మీరు నిరాధారమైన విజ్ఞప్తులను తరచుగా సమర్పిస్తే, మేము మీకు ఒక హెచ్చరిక పంపిన తర్వాత, మీ విజ్ఞప్తుల (సంబంధిత అభ్యర్థనలతో సహా) సమీక్షను ఒక సంవత్సరం పాటు నిలిపివేయవచ్చు.