Privacy, Safety, and Policy Hub

తీవ్రమైన హాని

కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి

నవీకరించబడినది: ఆగష్టు 2023

Snapచాటర్ల యొక్క భద్రత మా ప్రప్రథమ ప్రాధాన్యత. మా కమ్యూనిటీ యొక్క భద్రతకు విఘాతం కలిగించే ప్రవర్తనను మేము తీవ్రంగా తీసుకుంటాము, ప్రత్యేకించి హాని యొక్క ముప్పు తీవ్రంగా ఉన్నప్పుడు. మేము (1) Snapచాటర్ల యొక్క శారీరక లేదా భావోద్వేగ శ్రేయస్సు కు గణనీయమైన నష్టానికి గురి చేసే హానులు, మరియు (2) మానవ జీవితం, భద్రత మరియు శ్రేయస్సుతో సహా తీవ్రమైన హాని యొక్క ఆసన్న, నమ్మదగిన తీవ్రమైన హాని రెండింటినీ చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తాము. మాకు మేము మరియు మా కమ్యూనిటీకి మరింత మెరుగ్గా అవగాహన కల్పించడానికి మరియు మా ప్లాట్‌ఫామ్‌ పైన ఈ బెదిరింపులు తలెత్తే చోట సముచితమైన చర్యలు తీసుకోవడానికి గాను మేము నిపుణులు, భద్రతా బృందాలు మరియు ఈ అంశాలపై చట్టమును అమలు చేయు వారితో సమన్వయం చేసుకుంటాము. మేము ఈ రకాల హానుల పట్ల ఒక ఉన్నతమైన స్థాయి పరిశీలన చేస్తాము, మరియు అదేవిధంగా ఉల్లంఘనకు పాల్పడేవారి పట్ల వేగమైన, కఠినమైన, మరియు శాశ్వత పర్యవసానాల కోసం పరిగణిస్తాము.


ఈ క్రింది ఏవైనా కార్యకలాపాలలో Snapచాటర్లు నిమగ్నమైనట్లుగా మేము గుర్తించినప్పుడు, మేము వెంటనే వారి ఖాతాలను నిష్క్రియం చేస్తాము, మరియు కొన్ని సందర్భాల్లో, వారి ప్రవర్తనను చట్టమును అమలు చేయువారికి తెలియజేస్తాము:

  • పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగ చిత్రాలు, గ్రూమింగ్, పిల్లల లేదా పెద్దల లైంగిక అక్రమ రవాణా లేదా లైంగిక దోపిడీ (సెక్స్‌టార్షన్) వేధింపులను పంచుకోవడంతో సహా లైంగిక దోపిడీ లేదా లైంగిక దురుపయోగము ఇమిడి ఉండే చర్య

  • ప్రమాదకరమైన మరియు అక్రమ మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకం, మార్పిడి చేయడం లేదా సానుకూలపరచడానికి ప్రయత్నించడం

  • మానవ జీవితం, భద్రత లేదా శ్రేయస్సు పట్ల విశ్వసనీయమైన, ఆసన్న బెదిరింపులు, వాటిలో హింసాత్మక తీవ్రవాదం లేదా ఉగ్రవాద-సంబంధిత కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హింస యొక్క నిర్దిష్ట బెదిరింపులు (ఒక బాంబు బెదిరింపు), లేదా ఇతర తీవ్రమైన నేరస్థుల కార్యకలాపాలు చేరి ఉండవచ్చు.

ఈ ఉల్లంఘనల పట్ల కఠినమైన పర్యవసానాలను అమలు చేయడానికి అదనంగా, మేము బెదిరింపులను ఎలా గుర్తించి మరియు పరిమితి చేయవచ్చు, హానిని ఎలా నివారించవచ్చు, మరియు సంభావ్య హానికరమైన ధోరణుల గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేదాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి మా అంతర్గత జట్లు నిపుణులతో నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ అంశంపై మా పని ఎప్పటికీ పూర్తి కాదు మరియు ఇది మా కమ్యూనిటీ యొక్క అవసరాలతో పాటు అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక భద్రతా సమస్యను రిపోర్ట్ చేయడానికి, మా భద్రతా కేంద్రం సందర్శించడానికి, లేదా హానికరమైన కంటెంట్‌ను పరిష్కరించడానికి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మేము చేస్తున్న ప్రయత్నాల గురించి మరింత తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.