అవలోకనము
Snapchat వద్ద మా కమ్యూనిటీ యొక్క భద్రత మరియు శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుంది, మరియు మేము బెదిరింపులు, హింస, మరియు హాని యొక్క అన్ని సందర్భాలను తీవ్రంగా తీసుకుంటాము. మేము, స్వీయ-హానిని ఎక్కువచేసి చూపించే లేదా ప్రోత్సహించే హింసాత్మక లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించే, బెదిరించే, లేదా గ్రాఫిక్స్ రూపములో హింసాత్మక లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రదర్శించి చూపే కంటెంట్‌ను అనుమతించము. మానవ ప్రాణాలకు తక్షణ ముప్పులను చట్టమును అమలు చేయు అధికారులకు తెలియజేయవచ్చు.
వాడుకదారులు అందరికీ మా ప్లాట్‌ఫారమ్ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి మా విధానాలు మరియు మోడరేషన్ పద్ధతులు సహాయపడగా, మా కమ్యూనిటీ యొక్క శ్రేయస్సుకు మద్దతుగా సహాయపడేందుకై మేము ఫీచర్లు మరియు వనరులలో కూడా ముందస్తుగా పెట్టుబడి పెడతాము. స్వీయ-హాని లేదా భావోద్వేగ ఇబ్బందులను సూచించే కంటెంట్‌ను నివేదించేందుకు మేము Snapచాటర్‍లను ప్రోత్సహిస్తాము, తద్వారా మా బృందాలు సహాయకరంగా ఉండగల వనరులను పంపించి మరియు వీలయినట్లుగా అత్యవసర ఆరోగ్య సంరక్షకులను అప్రమత్తం చేయగలుగుతారు.
హింసాత్మక లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడం లేదా నిమగ్నం కావడం నిషేధించబడింది. ఒక వ్యక్తి, వ్యక్తుల సమూహం లేదా మరొకరి ఆస్తికి హాని కలిగించడానికై ఎప్పుడు కూడా భయపెట్టవద్దు లేదా బెదిరించవద్దు.
జంతువుల హింసతో సహా, ఆయాచితమైన లేదా గ్రాఫిక్ హింసతో కూడిన
Snaps అనుమతించబడవు.స్వీయ గాయం, ఆత్మహత్య లేదా తినే రుగ్మతలను ప్రోత్సహించడంతోసహా, స్వీయ హానిని పెద్దదిగా చేసి చూపించడాన్ని మేము అనుమతించము.