భద్రతా వనరులు మరియు మద్దతు
అవసరమైన Snapchatters కు వనరులు మరియు మద్దతు అందించడానికి మేము పరిశ్రమ నిపుణులు మరియు ప్రభుత్వేతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తాము. మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా మద్దతు అవసరం అయినా లేదా కేవలం చాట్ చేయాలని అనుకున్నా సహాయపడే కొన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి!
మీరు మానసిక ఆరోగ్యం, ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు, వ్యాకులత, వేధింపులు వంటి కొన్ని ప్రత్యేక అంశాలగురించి మీరు శోధించినప్పుడు స్థానికంగా ఉండే నిపుణులనుండి అవసరమైన వనరులను చూపించే ప్రత్యేకమైన సెర్చ్ టూల్ Here For You ను కూడా మీరు అన్వేషించవచ్చు.
కష్టాలలో ఉన్నవారికి మద్దతునివ్వాలనే ఒక ప్రయత్నంలో భాగంగా, లైంగికపరమైన ఇబ్బందులు మరియు తలపెట్టబడే హానులకు ప్రత్యేకంగా ఒక పేజీనికూడా మేము అభివృద్ధి చేశాము. అక్కడ మీరు ప్రపంగావ్యాప్తంగా ఉన్న మద్దతు వనరుల జాబితాను చూడవచ్చు.
MindUP(గ్లోబల్; యుఎస్, యుకె, మరియు కెనడాలలో ప్రధాన కార్యాలయాలు)
MindUP అనేది 3 నుండి 14 సంవత్సరాల వయస్సున్న పిల్లలు సకారాత్మక ధోరణి, తట్టుకోగల సామర్థ్యం, మరియు ఇతరులపట్ల సానుభూతి వంటి లక్షణాలను పెంపొందిస్తూ, వారు ఒత్తిడి మరియు పాఠశాలలో కొత్తవిషయాలపట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన పరికరాలు మరియు పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
ఉత్తర అమెరికా కోసం వనరులు
యునైటెడ్ స్టేట్స్ (US) 🇺🇸
988 ఆత్మహత్య మరియు సంక్షోభం లైఫ్‌లైన్
కాల్ లేదా టెక్స్ట్ 988 లేదా చాట్ చేయండి988lifeline.org
జాతీయ ఆత్మహత్య నివారణ లైఫ్‌లైన్, ఆత్మహత్య సంక్షోభం లేదా భావోద్వేగ ఇబ్బందుల్లో ఉన్న వారికి రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు ఉచిత మరియు గోప్యమైన మద్దతు అందిస్తుంది,
జాతీయ హెల్ప్‌లైన్: 1-800-662-HELP (4357)
SAMHSA యొక్క జాతీయ హెల్ప్‌లైన్ మానసిక మరియు/లేదా మాదకద్రవ్య దుర్వినియోగ సంబంధ రుగ్మతలతో బాధపడేవారికి ఉచిత, గోప్యమైన, 24/7 సమాచారమందించే సేవ మరియు చికిత్స రిఫరల్. ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో లభ్యమవుతుంది
(ప్రస్తుతం యు.ఎస్. సేవలలో చురుగ్గా ఉన్న సభ్యులు, మాజీ సైనికులు మరియు కుటుంబ సభ్యులకు)
1 800 273 8255 లేదా SMS కు కాల్ చేయండి: 838 25
5 వెటరన్స్ క్రైసిస్ లైన్ అనేది పూర్తిగా ఉచిత, మరియు గోప్యమైన వనరు, ఇది మీరు VA లో నమోదు చేసుకోనివారితో సహా ఎవరికైనా లేదా VA ఆరోగ్య సంరక్షణలో నమోదు చేసున్నవారికి అందుబాటులో ఉంటుంది.
నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ ఇల్‌నెస్
కు 1800 950 6264 పై కాల్ చేయండి లేదా SMS: 741741
కు టెక్స్ట్ NAMI అని పంపండి NAMI అనేది మానసిక వ్యాధితో బాధపడేవారికి మరియు కుటుంబాలు ఉత్తమమైన జీవితాలు నిర్మించుకోవడానికి న్యాయపరమైన, విద్యాపరమైన, మద్దతు మరియు ప్రజలలో అప్రమత్తత కలిగించడంలో సహాయమందిస్తుంది.
యాక్టివ్
మైండ్స్ యాక్టివ్ మైండ్స్ అనేది యువ వయోజనులకు మానసిక వ్యాధులపట్త జాగృతి మరియు విద్యకు మద్దతు అందించే జాతీయ స్థాయిలోని ఉత్తమమైన లాభాపేక్షరహిత సంస్థ. కొన్ని సహాయకరమైన పేజీలలో ఈ క్రిందివి చేరి ఉంటాయి,
యాంగ్జైటీ మరియు డిప్రెషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా
240 485 1001 పై కాల్ చేయండి
(ADAA) అనేది, ఆతృత, కుంగుబాటు, OCD, PTSD మరియు తత్సంబంధిత రుగ్మతల నివారణ, చికిత్సలకు విద్య, సాధన, మరియు పరిశోధన ద్వారా సేవలందించేందుకు అంకితమైన ఒక అంతర్జాతీయ లాభాపేక్షరహిత సంస్థ.
నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్
800 931 2237పై కాల్ చేయండి
నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (NEDA) అనేది భుజించటానికి సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతిచ్చేందుకు అంకితమయినది. NEDA భుజించే రుగ్మతలతో బాధించబడ్డ వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు కల్పిస్తుంది, మరియు నివారణ, నయము మరియు నాణ్యమైన సంరక్షణను పొందడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
ట్రాన్స్ లైఫ్‌లైన్
877 565 8860పై కాల్ చేయండి
ట్రాన్స్ లైఫ్‌లైన్ అనేది ట్రాన్స్ వ్యక్తులు, సమాజంతో కలుపుతా, వారు బతికేందుకు, జీవనం కొనసాగించేందుకు అవసరమైన మద్దతు, వనరులను అందించే ట్రాన్స్-నాయకత్వంలో పనిచేసే ఒక సంస్థ.
హోప్‌లైన్
1 877 235 4525పై కాల్ చేయండి
హోప్‌లైన్ అనేది, వారి కాలర్స్‌కు సంరక్షణాపరంగా సరిగా అంచనా వేయలేనివారికి సరైన శ్రవణ విధానాలను అందించడంపై దృష్టి సారిస్తుంది. వారు లైన్ లపై సలహా ఇవ్వరు అయితే దానికి బదులుగా ఇతర సంస్థలకు రెఫరల్స్ ని అందజేస్తారు
కెనడా (CA) 🇨🇦
కెనడా ఆత్మహత్య నివారణ సేవలు (CSPS)
1833 456 4566పై
కాల్ చేయండి క్రైసిస్ సర్వీసెస్ కెనడా అనేది కెనడా (CSC) ప్రజలకు ఆత్మహత్య నివారణ మరియు మద్దతు సేవలను అందిస్తుంది.
Youthspace (ఆన్ లైన్ సంక్షోభం మరియు భావోద్వేగ మద్దతు చాట్. చాట్‌లు రహస్యంగా మరియు అనామధేయంగా ఉంటాయి.)
778 783 0177 కు
SMS చేయండి Youthspace.ca అనేది ఆన్ లైన్ సంక్షోభం మరియు భావోద్వేగ మద్దతు చాట్. మేము మీ సమస్యను నిష్పాక్షికంగా వినడంతోపాటు, వాటిని గోప్యంగా మరియు అనామధేయంగా ఉంచుతాము
Suicide Action Montreal 1866 APPELLE (277-3553) పై కాల్ చేయండి
Suicide Action Montreal ఆత్మహత్యలు చేసుకొనేవారికి, వారి కుటుంబాలకు మరియు వారి చుట్టుపక్కల ఉండేవారికి నాణ్యమైన సేవలు అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ఆత్మహత్యలను నివారించడంతోపాటు మరియు దాని ప్రభావాలను ప్రచారం చేయడమనే ప్రధానోద్దేశ్యంతో పనిచేస్తుంది. దీనితోపాటు, SAM సమాజంలోని వ్యక్తులు మరియు సంస్థల అంకితభావం మరియు నైపుణ్య అభివృద్ధిపై విశ్వాసముంచుతుంది.
Hope for Wellness Helpline
1 855 242 3310 పై కాల్ చేయండి
టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు కాల్ చేయండి లేదా ఆన్ లైన్ లో చాట్ చేయండి.
ఫోన్ మరియు చాట్‌లు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో మరియు అభ్యర్థనపై Cree, Ojibway మరియు Inuktitut లలో కూడా లభ్యమవుతాయి.
Amelia Rising
705 476 3355పై
కాల్ చేయండి Amelia Rising Sexual Violence Support Centre, లైంగికపరమైన లేదా లింగవివక్షను ఎదుర్కొంటున్న 12 సంవత్సరాలు,
మరియు ఆపైన వయస్సు వారికి ఉచిత మరియు పూర్తిగా రహస్య మద్దతును అందిస్తుంది. క్రైసిస్ టెక్స్ట్ లైన్ 686868కు HOME అని SMS పంపండి కిడ్స్ హెల్ప్ ఫోన్ మద్దతుతో నిర్వహించబడే క్రైసిస్ టెక్స్ట్ అనే సంస్థ కెనడాలో మొట్టమొదటిసారిగా 24/7 ఉచిత జాతీయస్థాయి టెక్స్టింగ్ సేవ అందిస్తోంది. ఇది కిడ్స్ హెల్ప్ ఫోన్ మరియు సాంకేతిక రంగంలోని ఆద్యులైన క్రైసిస్ టెక్స్ట్ లైన్ల భాగస్వామ్యంలో నడిచే ఒక సేవా సంస్థ.
ఐరోపా కోసం వనరులు
ఆస్ట్రియా (AT) 🇦🇹
Rat auf Draht
147పై కాల్ చేయండి
Rat auf Draht పిల్లలు మరియు యువకులకు ఎప్పుడైనా - అనామధేయంగాా - ఉచితంగా సలహాలు అందిస్తుంది.
TelefonSeelsorge
142పై కాల్ చేయండి
Telefon Seelsorge సంక్షోభ పరిస్థితి సంబంధిత మద్దతు అందిస్తుంది. ఎమర్జెన్సీ నెంబరు 142 క్రింద మీరు మమ్మల్ని రోజులో 24 గంటల పాటు ఉచితంగా చేరుకోవచ్చు.
బెల్జియం (BE) 🇧🇪
Zelfmoord 1813
1813పై కాల్ చేయండి
సెంటర్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనేది, ఆత్మహత్యలను నివారించడానికి అంకితమైన లాభాపేక్షరహిత సంస్థ. ఈ సంస్థ ఆత్మహత్య హాట్‌లైన్‌తో పాటుగా సమగ్ర పరిశోధన సేవలను అందిస్తుంది.
Child Focus 116 000పై కాల్ చేయండి Child Focus
అనేది తప్పిపోయిన పిల్లలు మరియు మైనర్లపై లైంగిక వేధింపులను రిపోర్ట్ చేయడానికి ఒక అనామధేయ 24/7 హాట్‌లైన్‌ను అందిస్తుంది.
క్రొయేషియా (HR) 🇭🇷
HRABRI Telefon
0800 0800 పై కాల్ చేయండి (పెద్దలకు) లేదా 116 111 పై కాల్ చేయండి (యుక్తవయస్సువారికి) పిల్లలు మరియు తల్లిదండ్రుల కొరకు
సహాయం మరియు మద్దతు - ది బ్రేబ్ ఫోన్ ఫర్ చిల్డ్రన్ 116 111; అమ్మలు మరియు నాన్నలకు ఒక సాహసభరితమైన ఫోన్ 0800 0800. చాట్ మరియు ఇ-మెయిల్.
డెన్మార్క్ (DK) 🇩🇰
Livslinien
70 201 201 పై కాల్ చేయండి
Livslinien ఆత్మహత్యా ప్రయత్నాలను తగ్గించే లక్ష్యంతో వృత్తిపరమైన సలహా మరియు సంప్రదింపులు అందించే ఆత్మహత్యా సలహా హాట్‌లైన్.
BørneTelefonen
116 111 పై కాల్ చేయండి
చిల్డ్రన్స్ ఫోన్ అనేది సలహా, సౌకర్యం, లేదా ఆలకించేందుకు సమయం కేటాయించగలిగే యువజనులకు సంబంధించిన ఒక పిల్లల లైన్.
ఎస్తోనియా (EE) 🇪🇪
Eluliin
655 8088 పై కాల్ చేయండి
ఉపశమన కేంద్రంగా ఉన్న లైఫ్ లైన్ అనేది ఎస్టోనియన్-స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సూసైడాలజీ డైరెక్టర్, Airi Värnik నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది. ఒంటరిగా ఉండేవారు, వ్యాకులత మరియు/లేదా ఆత్మహత్య చేసుకునేవారికి భావోద్వేగ మద్దతు అందిస్తుంది.
ఫిన్‌లాండ్ (FI) 🇫🇮
Suomen Mielenterveysry
09 2525 0111 పై కాల్ చేయండి
MIELI ది ఫిన్నిష్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ అనేది ఒక ప్రజారోగ్య మరియు ప్రభుత్వ రంగ సంస్థ, ఈ క్లబ్ ఫిన్లాండ్‌లో మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు నివారణ మానసిక ఆరోగ్య పనిని చేస్తుంది.
ఫ్రాన్స్ (FR) 🇫🇷
E-Enfance
3018 పై కాల్ చేయండి డిజిటల్ హింసకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన ఒక నూతన జాతీయస్థాయి నెంబర్, వారి డిజిటల్ వినియోగానికి సంబంధించి సమస్యలు, ఎదుర్కొంటున్న పిల్లలు మరియు వయోజనులకు 100 శాతం ఉచితంగా మరియు గోప్యంగా సేవ అందిస్తుంది.
Suicide Ecoute 01 45 39 40 00 పై కాల్ చేయండి
తమ జీవితాలను అంతం చేసుకోవడం గురించి ఆలోచిస్తున్న లేదా అలా చేయాలని అనుకొన్న వారికి Suicide Ecoute సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ, పూర్తి అనామధేయతతో, వారి బాధలను వ్యక్తపరచటానికి Suicide Ecoute అనుమతిస్తుంది.
SOS Suicide Phénix
01 40 44 46 45 పై కాల్ చేయండి
The SOS Suicide Phoenix France Federation ఆత్మహత్యలను నివారించడం మరియు మెడికో-సామాజిక రంగంలో పనిచేసే వారికి మద్దతుగా, నివారణ చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జర్మనీ (DE) 🇩🇪
TelefonSeelsorge
0800 111 0 111 లేదా 0800 111 0 222 పై కాల్ చేయండి
TelefonSeelsorge అనేది 8,000 మంది స్వచ్ఛంద ఉద్యోగులతో కూడిన ఫోన్, చాట్, ఇమెయిల్ మరియు వ్యక్తిగతంగా ఎవరికైనా కౌన్సెలింగ్ ద్వారా మానసిక ఆరోగ్యానికి అవసరమయిన సలహాలు అందించడానికి సహాయపడే ఒక స్వచ్ఛంద సంస్థ.
Nummer gegen Kumm
er 116 111 పై కాల్ చేయండి
Nummer gegen Kummer eV (NgK) అనేది జర్మనీ అంతటా పిల్లలు, యువజనులు మరియు తల్లిదండ్రులకు ఉచిత టెలిఫోన్ కౌన్సిలింగ్ సర్వీస్ అందించే సంస్థలన్నింటినీ ఒక గొడుగు క్రిందకు తెచ్చిన ఒక అతిపెద్ద సంస్థ.
గ్రీస్ (GR) 🇬🇷
Hamogelo
1056 పై కాల్ చేయండి
“The Smile of the Child” అనేది, 1995లో 10 సంవత్సరాల వయస్సున్న ఆండ్రియాస్ యాన్నోపౌలోస్‌చే బాలల హక్కులను పరిరక్షించడానికి స్థాపించబడిన నమోదు చేయబడిన ఒక ప్రభుత్వేతర సంస్థ. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారి కోసం.
ఐర్లాండ్ (IE) 🇮🇪
Pieta House
1 800 247 247 పై కాల్ చేయండి లేదా SMS : 51444 కు HELP అని టెక్స్ట్ చేయండి
Pieta ఆత్మహత్యకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో లేదా చేసుకోవడానికి ప్రయత్నించేందుకు స్వీయహాని చేసుకొనేవారికి ఉచిత చికిత్సను అందిస్తుంది.
Belong To
01 670 6223 పై కాల్ చేయండి
BeLonG To ప్రధానంగా LGBTI + యువకులు సమానంగా, సురక్షితంగా మరియు వారి గుర్తింపులు మరియు అనుభవాల వైవిధ్యంతో కూడిన విలువైన ప్రపంచం ఉండాలన్న దార్శనికత కలిగివుంది.
Jigsaw — ది నేషనల్ సెంటర్ ఫర్ యూత్ మెంట
ల్ హెల్త్ 353 1 472 7010 పై కాల్ చేయండి
Jigsaw అనేది మార్గదర్శకత్వం, పరిశోధన, విద్య మరియు శిక్షణ ద్వారా యువజనుల మానసిక ఆరోగ్యానికి మద్దతునిచ్చే స్వఛ్ఛంద సంస్థ,
ReachOut Ireland ReachOut Ireland అనేది ఒక ఆన్‌లైన్ మానసిక ఆరోగ్య సేవ. మానసిక ఆరోగ్య సమస్యలతో ఉన్న యువతకు సమాచారం మరియు ఆచరణీయ సాధనాలను అందిస్తుంది.
ఇటలీ (IT) 🇮🇹
Telefono Amico
199 284 284 పై కాల్ చేయండి
Telefono Amico ఒంటరిగా, వేదన, బాధ, అసౌకర్యం, లేదా కోపం కలిగివున్నవారిని ఆలకించేందుకు అంకితమైన ఒక స్వచ్ఛంద సంస్థ.
Lithuania (LT) 🇱🇹
Lithuanian అసోసియేషన్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ లైన్స్
క్లిష్టమైన సమయంలో ఒక వ్యక్తి యొక్క భావోద్వేగపరమైన బాధను తగ్గించడానికి, కష్టాలను తట్టుకోవడానికి మరియు అధిగమించేలా సహాయపడటానికి, భావోద్వేగ మద్దతును సులభంగా అందించడమే LEPTA యొక్క ధ్యేయంగా ఉంది.
Jaunimo Linija
800 2888 పై కాల్ చేయండి
Jaunimo Linija అవసరమైన వారికి ఫోన్, లిఖితపూర్వక సమాచారం లేదా చాట్ మద్దతును అందిస్తుంది. మీరు వారికి చెప్పే ప్రతిదీ కూడా మీకు మరియు Youth Line కు మధ్య నిలిచి ఉంటుంది.
లక్సెంబర్గ్ (LU) 🇱🇺
Kanner-Jugendtelefon
116 111 కు కాల్ చేయండి
KJT, పిల్లలు, యువకులు మరియు తల్లిదండ్రులకు సులభంగా యాక్సెస్ చేయగలిగేలా మరియు అడ్డంకులు లేకుండా వినగలగడంద్వారా సహాయం ద్వారా అందించబడిన వనరును చేరువచేసే చర్యలు చేపడుతుంది.
BEE SECUR
E BEE SECURE అనేది లక్సెంబర్గ్ యొక్క ఇంటర్నెట్ సెంటర్. వార్తలు, వాస్తవ పత్రాలు, ఈవెంట్‌లు మరియు ఇంటర్నెట్‌లో సురక్షితంగా ఉండటానికి చిట్కాల ద్వారా వనరులను అందిస్తోంది!
మారిషస్ (MU) 🇲🇺
Befrienders Mauritius 230 800 93 93 పై కాల్ చేయండి
Befrienders ప్రపంచవ్యాప్త కేంద్రాలు కుంగుబాటులో ఉన్నవారు మాట్లాడేందుకు మరియు వారిని వినడానికి అవసరమైన బహిరంగ వేదికను కల్పిస్తాయి. ఇది టెలిఫోన్ హెల్ప్‌లైన్స్, SMS సందేశం, ముఖాముఖి అంతరచర్యలు, చాట్, చేరుకోవడం, మరియు స్థానిక భాగస్వామ్యాలద్వారా ఉంటుంది.
నెదర్లాండ్స్ (NL) 🇳🇱
113 ఆత్మహత్యా నివారణ
0900 0113 పై కాల్ చేయండి Foundation 113
ఆత్మహత్యా నివారణకు ఉద్దేశించబడిన ఒక జాతీయ సంస్థ. ఒంటరిగా మరియు ఆత్మహత్యతో కలవరపడని దేశం కోసం పనిచేయడం అనేది ఈ సంస్థ యొక్క ధ్యేయము.
MiNd Netherlands
088 554 32 22 పై కాల్ చేయండి
MiND అనేది ఇంటర్నెట్‌లో చట్టవిరుద్ధమైన, వివక్షతతో కూడిన ప్రకటనల కోసం ఉన్న నెదర్లాండ్స్ జాతీయ హాట్‌లైన్. ఈ హాట్ లైన్ 2013లో స్థాపించబడింది.
నార్వే (NO) 🇳🇴
Kirkens SOS
22 40 00 40 పై కాల్ చేయండి
Kirkens SOS అనేది 24 గంటల టెలిఫోన్, టెక్ట్స్ మరియు తక్షణ సందేశం మద్దతుతో భావోద్వేగ కల్లోలాలను తొలగించేందుకు మరియు ఆత్మహత్యను నిరోధించేందుకు ప్రయత్నించే ఒక మతపరమైన సంస్థ.
Mental Helse Hjelpetelefonen
116 123 పై కాల్ చేయండి
మెంటల్ హెల్త్ అనేది బహిరంగంగా వెల్లడించడాన్ని ప్రోత్సహించడం, మానసిక ఆరోగ్యం పెంపొందించటం, మానసిక ఆరోగ్య సమస్యల నివారణ మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేస్తుంది. వినియోగదారులు మరియు బంధువులకు మానసిక ఆరోగ్యం గురించి అనుభవం మరియు పరిజ్ఞానం ఉంటుందని మేము ప్రభుత్వ అధికారులు, వృత్తిపరమైన సంఘాలు, సంస్థలు మరియు వ్యక్తులకు తెలియజేయాలనుకుంటున్నాము.
పోలండ్ (PL) 🇵🇱
Telefon Zaufania dla Dzieci |Młodzież
y 116 111 పై కాల్ చేయండి
మేము కష్టతరమైన పరిస్థితులకు అనుగుణంగా సహాయం అందించే ఒక సమూహం. మీరు ఏమి చేస్తున్నారో దాని గురించి మీరు మాకు చెప్పవచ్చు.
పోర్చుగల్ (PT) 🇵🇹
SOS VOZ AMIGA
808 237 327 లేదా 210 027 159 పై కాల్ చేయండి
మేము ఒంటరితనం, అనారోగ్యం, దెబ్బతిన్న కుటుంబ సంబంధాలు, మాదకద్రవ్యాలకు బానిస అవడం, దుర్వినియోగం, మరియు మరెన్నో భావోద్వేగ పరిస్థితులకు సంబంధించిన సమస్యలకు పై ప్రజలనుండి కాల్స్ స్వీకరిస్తూ ఉంటాము. మా మద్దతు లైన్ లో, మేము ఏ రకమైన విలువ తీర్పులు ఇవ్వము. అనామధేయమైన మరియు రహస్య పద్ధతిలో, మేము చెవిని భుజంగా అందిస్తాము. మీకు అవసరం అయితే, మీరు ఏ మాత్రం వెనుకాడవద్దు. మాకు కాల్ చేయండి. మేము శ్రద్ధ తీసుకుంటాము!
రొమేనియా (RO) 🇷🇴
Alianţa Română de Prevenţie a Suicidului
0800 801 200 పై కాల్ చేయండి
The Romanian Suicide Prevention Alliance (ARPS)అనేది ఆత్మహత్యను నిరోధించడం ద్వారా జీవన నాణ్యతను పెంపొదించడం మరియు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇది స్థాపించబడిన లాభాపేక్ష రహిత సంస్థ.
Serbia (RS) 🇷🇸
Centar Srce
0800 300 303 పై కాల్ చేయండి
Mission of Center అనేది టెలిఫోన్, ఇ-మెయిల్ మరియు చాట్ ద్వారా సంక్షోభంలో ఉన్న వారికి మరియు ఆత్మహత్యను నివారించేందుకు భావోద్వేగపరమైన మద్దతును అందిస్తుంది. ఒక వ్యక్తి అనుభవిస్తున్న బాధను తొలగించవచ్చునని మరియు ఆత్మహత్యా భావనలను తగ్గించవచ్చునని మనం భావిస్తాం.
స్లోవేకియా (SK) 🇸🇰
Linka Detskej Istoty
116 000 పై కాల్ చేయండి
పిల్లలు మరియు యువతకు అవసరమైన సమయంలో మద్దతుకోసం ఎవరినైనా చేరుకొనేందుకు సహాయపడుతుంది. ఈ లైన్ ఫోన్ రోజులో 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు పనిచేస్తుంది.
స్లొవేనియా (SI) 🇸🇮
Enska Svetovalnica – Krizni Center
031 233 211 పై కాల్ చేయండి
ద ఉమెన్స్ కౌన్సెలింగ్ సొసైటీ అనేది హింసకు గురైన మహిళలకు మానసిక సామాజిక సహాయ రంగాలలో ప్రజాసక్తి మేరకు పనిచేసే ఒక మానవత్వ సంస్థ,
TOM – Telefon Za Otroke in Mladostnike
116 111 పై కాల్ చేయండి
TOM అనేది ఫ్రెండ్స్ ఆఫ్ యూత్ అసోసియేషన్ ఆఫ్ స్లోవేనియా (ZPMS) యొక్క పరిధిలో పనిచేస్తున్న పిల్లల మరియు యువతకు మద్దతునిచ్చే ఒక టెలిఫోన్.
Društvo Zaupni Telefon Samarijan
116 123 పై కాల్ చేయండి
కుంగుబాటులో ఉన్న వ్యక్తితో రోజులో ఏసమయంలోనైనా, వారాంతాలు మరియు సెలవుదినాలతోసహా, సంవత్సరంలోని అన్ని రోజులలో ఒకేసారి రెండు ఫోన్లపై మాట్లాడటానికి అందుబాటులో ఉండాలన్నది ఈ సొసైటీ లక్ష్యం.
స్పెయిన్ (ES) 🇪🇸
Teléfono de la Esperanza
717 003 717 పై కాల్ చేయండి
Teléfono de la Esperanza అనేది స్పానిష్-పోర్చుగీస్ మాట్లాడే వారికి అత్యవసర, స్వేచ్ఛా సంక్షోభ జోక్యంతో సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు భావోద్వేగ పరమైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఒక సామాజిక సంస్థ.
Internet Segura for Kids
017పై కాల్ చేయండి
Safe Internet for Kids (IS4K) అనేది స్పెయిన్‌లోని మైనర్ల కొరకు నిర్దేశించబడిన ఇంటర్నెట్ సేఫ్టీ సెంటర్ మరియు పిల్లలు మరియు యువజనులలో ఇంటర్నెట్ మరియు కొత్త టెక్నాలజీలను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేసే సంస్థ.
స్వీడన్ (SE) 🇸🇪
Mind
90 101 పై కాల్ చేయండి
మానసిక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన వ్యక్తుల మానసిక సమతుల్యత మరియు ఆరోగ్యాన్ని కాపాడటం, ప్రమాదంలో ఉన్నవారి నాడీ మరియు మానసిక సంబంద వ్యాధులను నివారించటం, ఆవిధమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి తగిన సంరక్షణకు అంకితభావాన్ని వ్యక్తీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది,
స్విట్జర్లాండ్ (CH) 🇨🇭
Tel-143 143 పై కాల్ చేయండి
ఒక సహాయ సంభాషణ లేదా మద్దతునిచ్చే ఆన్‌లైన్ కాంటాక్ట్‌ను అందజేయడం.
యునైటెడ్ కింగ్‌డమ్ (UK) 🇬🇧
Samaritans
116 123పై కాల్ చేయండి
Samaritans అనేది, వ్యక్తులు తమ సమస్యలు మరియు భయాల గురించి నిర్భయంగా మాట్లాడితే విని మరియు వారికి సహాయపడాలని కోరుకునే ఒక ధార్మిక సంస్థ.
PAPYRUS Prevention of Young Suicide HOPELineUK
0 800 068 41 41 కి కాల్ చేయండి లేదా: 07860039967కి SMS చేయండి
PAPYRUS అనేది, ఆత్మహత్య ఆలోచనలను అనుభవిస్తున్న పిల్లలు మరియు 35 సంవత్సరాల లోపు వ్యక్తులు మరియు ఒక వయోజన వ్యక్తి ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉండవచ్చునని ఆందోళన చెందుతున్న ఎవరైనా వ్యక్తి కొరకు గోప్యతతో కూడిన మద్దతు మరియు సలహా సేవగా ఉంది.
UK Safer Internet
CentreUK Safer Internet Centre మూడు ప్రముఖ దాతృత్వ సంస్థల భాగస్వామ్యం; చైల్డ్ నెట్, సౌత్ వెస్ట్ గ్రిడ్ ఫర్ లెర్నింగ్ మరియు ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్.
Campaign Against Living Miserably
0 800 58 58 58 పై కాల్ చేయండి
మా హెల్ప్‌లైన్ అనేది న్యూనతలో ఉన్న లేదా ఏ కారణం చేతనైనా కుంగిపోయినట్లున్న, మాట్లాడాలని కోరుకొంటున్న లేదా సమాచారం మరియు మద్దతు పొందగోరే UK పౌరులకు అందుబాటులో ఉన్న ఒక హెల్ప్‌లైన్.
Mind
0 300 123 3393 పై కాల్
చేయండి ఏదైనా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఎదుర్కొంటున్న ఎవరికైనా సలహా అందజేయడంతోపాటు, వారు సాధికారత పొందడంలో మద్దతిస్తాము.
Revenge Porn Helpline
0345 6000 459 పై కాల్ చేయండి
Revenge Porn Helpline, సాధారణంగా రివెంజ్ పోర్న్ అని పిలవబడే సన్నిహిత చిత్రాల దుర్వినియోగం ఎదుర్కొంటున్న 18+ పైబడినవారికి ఈ కంటెంట్‌ను తొలగించడంలో సలహాలు మరియు మార్గదర్శకత్వం అందించడం ద్వారా మద్దతు ఇస్తుంది. ఇమెయిల్ చేయండి help@revengepornhelpline.org.uk.
యాక్షన్ ఫ్రాడ్
కాల్ చేయండి 0300 123 2040
యాక్షన్ ప్రాడ్ అనేది UK యొక్క జాతీయ మోసం మరియు సైబర్ నేరాలని రిపోర్ట్ చేయవలసిన సంస్థ. దీనిలో మీరు ఇంగ్లాండ్, వేల్స్ మరియు ఉత్తర ఐర్లాండ్‌లలో ఎక్కడైనా మోసానికి కుంభకోణానికి గురైనా, మోసగించబడ్డా, లేదా సైబర్ నేరంబారిన పడినట్లయితే, మీరు ఆ మోసాన్నివెంటనే రిపోర్ట్ చేయగలిగే సంస్థ
లూసీ ఫైత్‌పుల్ ఫౌండేషన్
0808 1000 90
0 పై కాల్ చేయండి లూసీ ఫైత్‌పుల్ ఫౌండేషన్ అనేది UK-ఆధారిత పిల్లల రక్షణ స్వచ్ఛంద సంస్థ, ఇది దాని కార్యక్రమం Stop It Now! ద్వారా పిల్లలు మరియు పిల్లల లైంగిక దోపిడీ మరియు అపరాధులతో పని చేస్తుంది.
లాటిన్ అమెరికా మరియు కరేబియన్ కోసం వనరులు
అర్జెంటీనా (AR) 🇦🇷
Hablemos de Todo
Hablemos de Todo వెబ్‌సైట్ ద్వారా అనామధేయ చాట్‌ను అందిస్తుంది. మీకు ఏమి జరుగుతోందనే దాని గురించి మాట్లాడటానికి, ప్రశ్నలు అడగడానికి మరియు మీ సందేహాలన్నింటినీ స్వేచ్ఛగా తీర్చుకోవడానికి ఇది ఒక చోటు.
బహామాస్ (BS) 🇧🇸
నేషనల్ హాట్‌లైన్ ఫర్ క్రైసిస్ ఇంటర్‌వెన్షన్ 242 322 2763పై కాల్ చేయండి
సాంఘిక సేవల విభాగం, పిల్లల దుర్వినియోగానికి సంబంధించిన ఒక హాట్‌లైన్ అందిస్తోంది. కుంగుబాటు, ప్రస్తుత జీవితంలో ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంటున్నవారికి లేదా అనుభవించేవారికి సలహా సేవలతోపాటు ఇతర సేవలను కూడా అందిస్తోంది.
బ్రెజిల్ (BR) 🇧🇷
O CVV – Centro de Valorização da Vida
188 పై కాల్ చేయండి
Centro de Valorização da Vida (CVV) అనేది వివేకవంతమైన భావోద్వేగ మద్దతుతోపాటు ఆత్మహత్య నివారణ సేవలను ఉచితంగా అందించే లాభాపేక్షరహిత సంస్థ.
చిలీ (CL) 🇨🇱
Todo Mejora
Todo Mejora అనేది లైంగిక ధోరణి, గుర్తింపు మరియు లింగ వ్యక్తీకరణ ఆధారంగా వివక్ష కారణంగా బెదిరింపులకు గురి అయ్యే మరియు ఆత్మహత్య చేసుకోవాలనే భావన కలిగివున్న పిల్లలు మరియు యువజనుల శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు మరియు ఆదివారాలలో Todo Mejora సేఫ్ అవర్‌ను నిర్వహిస్తుంది, అక్కడ మీతో ఆ సమయంలో చాట్ చేయడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు.
గయానా (GY) 🇬🇾
ద కరేబియన్ వాయిస్
ద కరేబియన్ వాయిస్ ఆత్మహత్యలను నిరోధించడం, మానసిక ఆరోగ్యం, గృహ హింస మరియు లైంగిక దాడిని ఎదుర్కొనడం మరియు బాలల రక్షణ వంటి వాటిపై ప్రపంచవ్యాప్త వనరులను అందిస్తుంది.
మెక్సికో (MX) 🇲🇽
SAPTEL 55 5259 8121 పై కాల్ చేయండి
S
APTEL అనేది 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న మానసిక ఆరోగ్య మరియు దూర వైద్య సేవ. SAPTEL అనేది ఎంపిక చేయబడిన, శిక్షణ పొందిన, పర్యవేక్షించబడిన మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్, రెఫరల్, మానసిక మద్దతు, సైకోథెరపాటిక్ కౌన్సిలింగ్ మరియు భావోద్వేగ సంక్షోభ జోక్యం అందించబడే ఒక ప్రొఫెషనల్ కార్యక్రమం. SAPTEL దాని పూర్తిస్థాయిలో మెక్సికన్ రిపబ్లిక్ కు తన సేవలను అందిస్తుంది.
Alianza por la seguridad en internet
Alianza por la seguridad en internet (ASI) Mexico అనేది డిజిటల్ పౌరసత్వం మరియు ఇంటర్నెట్ యొక్క బాధ్యతాయుతమైన వినియోగం గురించి కుటుంబాలకు మరియు యువతకు అవగాహన కల్పించడానికి పనిచేస్తున్న లాభాపేక్ష రహిత సంస్గ.
ఆఫ్రికా కోసం వనరులు
మారిషస్ (MU) 🇲🇺
Befrienders Mauritius 230 800 93 93 పై కాల్ చేయండి
Befrienders ప్రపంచవ్యాప్త కేంద్రాలు కుంగుబాటులో ఉన్నవారు మాట్లాడేందుకు మరియు వారిని వినడానికి అవసరమైన బహిరంగ వేదికను కల్పిస్తాయి. ఇది టెలిఫోన్ హెల్ప్‌లైన్స్, SMS సందేశం, ముఖాముఖి అంతరచర్యలు, చాట్, చేరుకోవడం, మరియు స్థానిక భాగస్వామ్యాలద్వారా ఉంటుంది.
దక్షిణాఫ్రికా (ZA) 🇿🇦
SADAG ది సౌత్ ఆఫ్రికన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ గ్రూప్
కు 0800 567 567పై కాల్ చేయండి
ది సౌత్ ఆఫ్రికన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ గ్రూప్ (SADAG) అనేది దేశంలోని రోగులకు మద్దతివ్వడం, పరిజ్ఞానం అందించడం, మానసిక రుగ్మతలకు సంబంధించిన అనవసర అపోహలను తొలగించడంలో ముందు వరసలో ఉంది. దీని నైపుణ్యం దక్షిణాఫ్రికా అంతటా రోగులకు మరియు కాలర్లకు మానసిక ఆరోగ్య ప్రశ్నలతో సహాయం చేయడంలో నిలిచి ఉంది.
Lifeline
0861 322 322 పై కాల్ చేయండి
Ekurhuleni అంతటా భావోద్వేగపరమైన శ్రేయస్సును పొందడానికి వ్యక్తులు మరియు సమూహాలను సమాయత్తం చేసేందుకు దోహదపడుతుంది.
ద Triangle ప్రాజెక్ట్ (LGBTI వ్యక్తులు, భాగస్వాములు మరియు వారి కుటుంబ సభ్యులకు)
021 422 0255 పై కాల్ చేయండి
Triangle ప్రాజెక్ట్ అనేది లెస్బియన్, స్వలింగ, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్లు. ఇంటర్‌సెక్స్ మరియు క్వీర్ (LGBTIQ) వ్యక్తులు, వారి భాగస్వాములు మరియు కుటుంబాలకు సంబంధించిన రాజ్యాంగపరమైన మరియు మానవ హక్కులను,
పొందడానికి పనిచేసే ఒక లాభాపేక్ష-రహిత మానవ హక్కుల సంస్థ. LifeLine Pietermaritzburg, 033 342 4447 పై కాల్
చేయండి
LifeLine మరియు Rape Crisis అనేది, ఈ విధమైన సేవ అవసరమైన వారికెవరికైనా ఏవిధమైన రుసుము తీసుకోకుండా సహజమైన కౌన్సెలింగ్ అందించే ఒక నమోదిత పౌర సంస్థ.
ఆసియా కోసం వనరులు
చైనా (CN) 🇨🇳
బీజింగ్ ఆత్మహత్యా పరిశోధన మరియు నివారణ కేంద్రం
010 8295 1332పై
కాల్ చేయండి బీజింగ్ ఆత్మహత్యా పరిశోధన మరియు నివారణ కేంద్రం కుంగుబాటుతో బాధపడుతున్నవారికి మద్దతునిస్తుంది.
Lifeline Shanghai
400 821 1215కు కాల్ చేయండి
లైఫ్‌లైన్ అనేది ఉచిత, గోప్యమైన మరియు అనామధేయ మద్దతు సేవనందిస్తుంది; భావోద్వేగపరంగా ఒత్తిడి లేదా ఆందోళనకు గురయినప్పుడు, ఆయా వ్యక్తులకు ఒక భద్రమైన ఆధారాన్ని అందించేందుకు సహాయకులు లభ్యంగా ఉంటారు.
హాంగ్ కాంగ్ ప్రాంతం
The Samaritan Befrienders Hong Kong(香港撒瑪利亞防止自殺會)
2389 2222కు కాల్
చేయండి The Samaritan Befrienders Hong Kong సేవను ఒక ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తల బృందం అందిస్తుంది. ఇతరులకు సహాయ౦ చేసే స్ఫూర్తితో, వారు మానసిక ౦గా బాధ, నిరాశ, నిస్సహాయత లేదా ఆత్మహత్యా స౦కల్ప౦తో ఉన్న ప్రజలకు 24 గంటల తక్షణ భావోద్వేగ ఉపశమన సేవల్ని అ౦ది౦చడానికి సహాయపడతారు.
The Samaritans Hong Kong
2896 0000 పై కాల్ చేయండి
(香港撒瑪利亞會) సమస్య ఎంత కలవరపరచేదైనా లేదా సాధారణమైనదైనా, The Samaritans ఆ సమస్యను వినడానికే ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మేము సలహా ఇవ్వము, లేదా ఏమి చేయాలో మీకు చెప్పము. బేషరతుగా భావోద్వేగ మద్దతు ఇవ్వడానికే మేము ఇక్కడ ఉన్నాము.
ఇండియా (IN) 🇮🇳
AASRA 022 2754 6669 పై కాల్ చేయండి
Aasra అనేది ఒంటరిగా, కుంగుబాటులో ఉన్న మరియు ఆత్మహత్య ఆలోచనలు కలిగివున్నవారికి సహాయమందించడంలో కలగజేసు
కొనే సంస్థ. మేము మానసిక అస్వస్థతను నిరోధించడం మరియు నిర్వహించడానికై సహాయపడతాము. ప్రధానంగా మానసిక అస్వస్థతలకు మరియు ఆత్మహత్య చేసుకోవాలన్న కుంగుబాటులో ఉన్నవారికి స్వచ్ఛంద, వృత్తిపరమైన మరియు ముఖ్యంగా గోప్యమైన సంరక్షణ మరియు మద్దతును అందించడమనేది మా ధ్యేయము.
Sneha India
91 44 2464 0050 పై కాల్ చేయండి
Sneha అనేది ఇండియాలోని చెన్నైలో ఉన్న ఆత్మహత్యా నిరోధక సంస్థ. బాధ, క్రుంగుబాటు లేదా ఆత్మహత్య అనుభూతి చెందుతున్న ఎవరికైనా మేము బేషరతుగా భావోద్వేగ మద్దతును అందిస్తున్నాము.
జపాన్ (JP) 🇯🇵
టోక్యో ఆత్మహత్యా నివారణ కేంద్రం(東京自殺防止センター)
03 5286 9090 పై కాల్ చేయండి ట
ోక్యో ఆత్మహత్యా నివారణ కేంద్రం, ఆత్మహత్యకు దారితీసే భావోద్వేగాలతోపాటు కుంగుబాటు మరియు నిరాశకు గురైనవారికి గోప్యమైన మరియు భావోద్వేగ మద్దతును అందిస్తుంది.
ఐచ్చి ఆత్మహత్యా నివారణ కేంద్రం
ఐచ్చి ఆత్మహత్యా నివారణ కేంద్రం ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారికి ఏ సమయంలోనైనా, ఎక్కడైనా భావోద్వేగ మద్దతునుల అందించడాన్ని లక్ష్యంగా కలిగివున్న ఒక స్వచ్ఛంద సంస్థ.
మలేషియా (MY) 🇲🇾
Befrienders Kuala Lumpur
603 7956 8145 పై కాల్ చేయండి
Befrienders అనేది, ఏవిధమైన చార్జ్ లేకుండా ఒంటరిగా, కుంగుబాటు, నిస్పృహలో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగివున్నవారికి రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు భావోద్వేగపరమైన మద్దతు అందించే లాభాపేక్ష-రహిత సంస్థ.
ఫిలిప్పైన్స్ (PH) 🇵🇭
Natasha Goulbourn Foundation
0917 4673 పై కాల్ చేయండి
Natasha Goulbourn Foundation అనేది ఫిలిప్పినోస్‌కు అందరి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడుతూ, సానుకూల దృక్పథాన్ని మరియు నివారాణాత్మక చర్యలు ప్రోత్సహించడంద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్నినిర్మించడానికి అంకితమైన ఒక లాభాపేక్ష-రహిత సంస్థ,
సింగపూర్ (SG) 🇸🇬
Samaritans of Singapore (新加坡援人協會)
1800 221 4444 పై కాల్ చేయండి
Samaritans of Singapore (SOS) ఒక సంక్షోభానికి గురైన వారికి, ఆత్మహత్య చేసుకోవాలనుకొనేవారికి లేదా దానివల్ల ప్రభావితమయిన వారికి గోప్యమైన భావోద్వేగ మద్దతును అందించడానికి పనిచేస్తుంది.
Silver Ribbon (Singapore)
65 6386 1928 పై కాల్ చేయండి
మానసిక ఆరోగ్య అపోహలను ఎదుర్కోవడానికి, ముందస్తు సహాయాన్ని ప్రోత్సహించడానికి, మరియు మానసిక ఆరోగ్యపరమైన పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే వినూత్న మార్గాల ద్వారా సమాజంలో మానసిక అస్వస్థతతో ఉన్న వ్యక్తులను సంఘటితం చేయడానికి దోహదపడుతుంది.
ఓషినియా కోసం వనరులు
ఆస్ట్రేలియా (AU) 🇦🇺
లైఫ్‌లైన్
13 11 14 పై కాల్ చేయండి
లైఫ్‌లైన్ అనేది వ్యక్తిగత్ంగా అల్లకల్లోలాను ఎదుర్కొనే ఆస్ట్రేలియన్లకు ఆత్మహత్య నివారణ సేవలు, గృహ హింసను ఎదుర్కోవడంలో శిక్షణ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలతో 24 గంటలు అందుబాటులో ఉండే సహకారం అందిస్తుంది. కిడ్స్ హెల్ప్‌లైన్
1 800 55 1800 పై కాల్ చేయండి
కిడ్స్ హెల్ప్‌లైన్ అనేది 5-25 సంవత్సరాల వయస్సున్న యువతకు ఉచిత, గోప్యమైన, విశ్వాసభరితమైన ఫోన్ కౌన్సెలింగ్ అందించే ఏకైక సేవ.
Beyondblue
1300 22 4636 పై కాల్ చేయండి
Beyondblue ఉత్తమమైన మానసిక ఆరోగ్యం, వ్యాకులత, వివక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవడాన్ని ప్రోత్సహించడంతోపాటు, ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్యల గురించి మరింత సమాచారం అందించే లాభాపేక్షరహిత సంస్థ.
న్యూజిలాండ్ (NZ) 🇳🇿
Depression Hotline
0800 111 757 పై కాల్ చేయండి
ఈ వెబ్‌సైట్ న్యూజిలాండ్ ప్రజలు కుంగుబాటు, ఆందోళనలను సత్వరమే గుర్తించడానికి మరియు మరియు మద్దతుకోరడానికి సహాయపడుతుంది.
Lowdown
5626కు Lowdown అని SMS పంపించండి. The Lowdown సత్వర గుర్తింపును ప్రోత్సహిస్తుంది మరియు కుంగుబాటు లేదా ఆందోళనకు మద్దతిస్తుంది. ఈ సైట్‌పై యువత, ఆందోళన, కుంగుబాటు (మరియు స్కూలు విడిచిపెట్టడం లేదా వారి తల్లిదండ్రులతో కలిసి ఉండటం వంటి ఇతర సమస్యలు),12 మంది నిజమైన యువకుల వీడియోలు వారి కథలు చెప్పడం మరియు మరిన్నింటిని కనుగొనవచ్చు.
Youthline
0800 376 633 పై కాల్ చేయండి లేదా 234పై SMS చేయండి Youthline యువత, వారి కుటుంబాలు మరియు మద్దతు ఇచ్చే యువతతో కలిసి పనిచేస్తుంది. మా సంస్థలు స్వచ్ఛందకార్యకర్తలు మరియు చెల్లింపు సిబ్బందిని కలిగివున్నాయి - మరియు మాకు దేశవ్యాప్తంగా కేంద్రాలు ఉన్నాయి. Lifeline 0800 543 354 పై కాల్
చేయండి లేదా SMS: 357 కు HEL
P అనిటెక్స్ట్ ఉచితంగా పంపండి కుంగుబాటును తగ్గించడం ద్వారా భద్రమైన, అందుబాటులో ఉండే ప్రభావవంతమైన, వృత్తిపరమైన మరియు వినూత్న సేవలను అందించడం మా లక్ష్యం. న్యూజిలాండ్ లో ఆత్మహత్యల నివారణపై అవగాహన మరియు అవగాహన పెంపొందించడానికి మరియు సంబంధిత అపోహలను తగ్గించడానికి మరియు ఆరోగ్యం మరియు సామాజిక రంగానికి సానుకూల సహకారం అందించడానికై ఇతరులతో కలిసి పనిచేయడానికి మేము ప్రత్యేకంగా పనిచేస్తున్నాము.