అవలోకనము
మేము Snapచాటర్లను హానికరమైన లేదా దుర్వినియోగపూరిత కంటెంట్ నుండి రక్షిస్తాము.
ఆ దిశగా, వాడుకదారులు సౌకర్యవంతంగా తమకు తాము వ్యక్తం చేయగలిగేలా మరియు Snapchat పై ఆయాచిత లైంగిక కంటెంట్ లేదా దురుపయోగానికి గురి కాకుండా స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుకోగలిగేలా చూసుకొనే లక్ష్యముతో మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అభివృద్ధి చేశాము.. ఈ విధానాలు అశ్లీలత, లైంగిక నగ్నత్వంతో సహా, లేదా లైంగిక సేవలను అందజేసే ఒక స్థాయి కంటెంట్‍ను కలిగివుండే–– లైంగికంగా బహిర్గతమైన కంటెంట్‌ను పంచుకోవడం, ప్రచారం చేయడం లేదా పంపిణీ చేయడాన్ని నిషేధిస్తాయి––మరియు పిల్లలను లైంగికంగా దోపిడీ చేసే ఏదైనా కంటెంట్‌ను బలమైన నిబంధనలు ఖండిస్తాయి.
పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగ చిత్రావళి, పిల్లల గ్రూమింగ్, లేదా లైంగిక దుష్ప్రవర్తన (సెక్స్‌టార్షన్), లేదా పిల్లల లైంగికీకరణతో సహా ఒక మైనరు యొక్క లైంగిక దోపిడీ లేదా దురుపయోగం ఉండే ఎటువంటి చర్యనైనా సరే మేము నిషేధిస్తాము.. అటువంటి బాలల లైంగిక దోపిడీ ప్రవర్తనలో నిమగ్నం కావడానికి చేసే ప్రయత్నాలతో సహా బాలల లైంగిక దోపిడీ గుర్తించబడిన అన్ని సందర్భాలను మేము అధికారులకు రిపోర్టు చేస్తాము.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండేవారి నగ్న లేదా లైంగిక బహిర్గతమైన కంటెంట్‌ను ఎప్పటికీ పోస్ట్ చేయవద్దు, సేవ్ చేయవద్దు లేదా పంపించవద్దు, ఫార్వార్డ్ చేయవద్దు లేదా అడగవద్దు (ఇందులో అటువంటి మీ స్వంత చిత్రాలను పంపించడం లేదా సేవ్ చేయడం వంటివి కూడా ఉంటాయి)..
అశ్లీలత లేదా లైంగికపరమైన పరస్పర చర్యలు, అదేవిధంగా వాణిజ్య కార్యకలాపాలకు (ఆన్‍లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) సంబంధించిన లైంగిక అశ్లీలతా కంటెంటును ప్రోత్సహించడం, పంపిణీ చేయడం లేదా పంచుకోవడం వంటి చర్యలను మేము నిషేధిస్తాము..
తల్లిపాలు ఇవ్వడం మరియు లైంగికేతర సందర్భాలలో నగ్నత్వం యొక్క ఇతర చిత్రణలు సాధారణంగా అనుమతించబడతాయి.