ప్రభుత్వ అభ్యర్థనలు మేధా సంపత్తి తీసుకోబడిన నోటీసులు
Snapchatను సురక్షితమైనదిగా చేయడానికి మా పనిలో కీలకమైన భాగం, దర్యాప్తులలో సహాయం కోసం సమాచారం కోసం చెల్లుబాటు అయ్యే అభ్యర్థనలను నెరవేర్చడానికి చట్ట అమలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహకరించడం. మేము జీవితం లేదా శారీరక హానికి ఆసన్నమైన బెదిరింపులు ఇమిడి ఉండే ఏవైనా పరిస్థితులను ముందస్తు చొరవతో పైకి తెలియజేయడానికి కూడా కృషి చేస్తాము.
Snapchat పై చాలా కంటెంట్ అప్రమేయంగా తొలగించబడుతున్నప్పటికీ, వర్తించే చట్టం ప్రకారం డేటాను భద్రపరచడానికి మరియు అకౌంట్ సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు అందించడానికి మేము పని చేస్తాము. Snapchat అక్కౌంట్ రికార్డులకు సంబంధించి చట్టపరమైన అభ్యర్థన స్వీకరించబడి మరియు దాని చెల్లుబాటు ధ్రువీకరించబడిన తరువాత - ఒక చెడ్డ సంస్థ నుండి కాక, చట్టాన్ని అమలుపరిచే ఒక చట్టపరమైన సంస్థ లేదా ప్రభుత్వ ఏజెన్సీ చే చేయబడినదని తనిఖీ చేయడం ముఖ్యమైనందున - మేము వర్తించే చట్టం మరియు గోప్యతా అవసరాలమేరకు ప్రతిస్పందిస్తాము.
సాక్ష్యాలు మరియు సమన్లు, కోర్ట్ ఉత్తర్వులు, సెర్చ్ వారంట్లు, మరియు అత్యవసర వెల్లడి అభ్యర్థనలతో సహా చట్ట అమలు అధికారులు మరియు ప్రభుత్వ ఏజెన్సీలనుండి మేము మద్దతిచ్చే అభ్యర్థనల రకాలను దిగువ ఇవ్వబడిన చార్ట్‌లు వివరిస్తాయి.
రిపోర్టింగ్ వ్యవధి లోపున అందుకున్న అభ్యర్థనల ఆధారంగా ప్రచురించబడిన తేదీ ప్రకారం కొంత డేటా ఉత్పత్తి చేయబడిన అభ్యర్థనల యొక్క శాతం లెక్కించబడింది. ఒక అభ్యర్థన లోపం కలిగి ఉన్నదిగా నిర్ణయించబడిన అరుదైన పరిస్థితులలో — Snap డేటా ను ఉత్పత్తి చేయకుండేలా దారి తీసేది — మరియు చట్ట అమలు అధికారులు ఆ తరువాత పారదర్శకత నివేదిక ను ప్రచురించిన తర్వాత సవరణ, చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను సమర్పించి ఉంటే, ఆ తదుపరి డేటా యొక్క ఉత్పత్తి అసలు లేదా తదుపరి రిపోర్టింగ్ వ్యవధులలో ప్రతిఫలించబోదు.
యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ సమాచార అభ్యర్థనలు
ఈ విభాగం U.S. ప్రభుత్వ సంస్థల నుండి వినియోగదారు సమాచారం కోసం మేము మద్దతు ఇచ్చే అభ్యర్థనల రకాలచే విడగొట్టబడిన అభ్యర్థనలకు సంబంధించినది.
* ఈ రిపోర్టింగ్ వ్యవధిలో మొదలుపెట్టి, మరొక రకమైన చట్టపరమైన ప్రక్రియ లోపున పొందుపరచిన సమయంలో PRTT అభ్యర్థనలు ఎలా లెక్కించబడతాయో Snap నవీకరించింది. PRTT అభ్యర్థన మరియు మరొక రకమైన అభ్యర్థన (ఉదా. ఒక శోధన వారెంట్) రెండూ కలిగి ఉన్న చట్టపరమైన ప్రక్రియ కోసం, మేము ఇప్పుడు ఈ చట్టపరమైన ప్రక్రియను వర్తించే ప్రతి అభ్యర్థన కేటగిరీ దిశగా లెక్కిస్తున్నాము. మునుపటి రిపోర్టింగ్ కాలవ్యవధులతో పోలిస్తే పైన నివేదించబడిన PRTT అభ్యర్థనల సంఖ్యలో వాస్తవిక పెరుగుదల అనేది ఈ కొత్త పద్ధతి యొక్క ప్రతిబింబంగా ఉంది.
అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు
ఈ విభాగం యునైటెడ్ స్టేట్స్ బయటివైపున ప్రభుత్వ సంస్థల నుండి వినియోగదారు సమాచారం కోసం అభ్యర్థనలకు సంబంధించినది.
* "నిర్దిష్టపరచబడిన ఖాతాలు” అనేది వినియోగదారు సమాచారాన్ని అభ్యర్థించేటప్పుడు చట్టపరమైన ప్రక్రియలో చట్ట అమలు ద్వారా పేర్కొన్న ఒక సింగిల్ అకౌంట్ కు చెందిన ఐడెంటిఫైయర్ (ఉదా., యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రస్, మరియు ఫోన్ నంబర్) ల సంఖ్యను ప్రతిబింబిస్తుంది. చట్టబద్ధ ప్రక్రియలలో కొన్ని ఒకటికంటే ఎక్కువ ఐడెంటిఫయర్లను కలిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో, బహుళ గుర్తింపు ఐడెంటిఫియర్లు ఒకే ఒక్క అకౌంట్‌ను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒకే ఒక ఐడెంటిఫయర్ పేర్కొనబడిన సందర్భాలలో, ప్రతి సందర్భమూ చేర్చబడుతుంది.
ద్వైపాక్షిక డేటా ప్రాప్యత ఒప్పందాలకు సంబంధించిన అభ్యర్థనలు
ఈ విభాగం, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ప్రభుత్వ సంస్థల నుండి వినియోగదారు సమాచారం కోసం అభ్యర్థనలకు సంబంధించి ఆ ప్రభుత్వం మరియు యు.ఎస్ ప్రభుత్వానికి మధ్య ద్వైపాక్షిక డేటా ప్రాప్యత ఒప్పందం కి సంబంధించినది.
US-UK డేటా ప్రాప్యత ఒప్పందం కు అనుగుణంగా యునైటెడ్ కింగ్‌డమ్ నుండి దర్యాప్తు సంబంధిత అధికారాల చట్టం క్రింద Snap అభ్యర్థనలను అందుకున్న విస్తృతి మేరకు, అటువంటి ఏవైనా అభ్యర్థనలపై నివేదించడం ఆలస్యం అవుతుంది మరియు ఆ చట్టం యొక్క వర్తించే అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. మరింత సమాచారం కోసం, దయచేసి చూడండి: https://www.ipco.org.uk/publications/annual-reports/.
యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రత అభ్యర్ధనలు
ఈ విభాగం U.S. జాతీయ భద్రతా చట్టపరమైన ప్రక్రియ ప్రకారం వినియోగదారు సమాచారం కోసం అభ్యర్థనలకు సంబంధించినది. క్రిందివాటిలో జాతీయ భద్రతా లేఖలు (NSLలు) మరియు విదేశీ నిఘా పర్యవేక్షణ (FISA) కోర్ట్ ఉత్తర్వులు/ఆదేశాలు ఉంటాయి.
ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు
ఈ విభాగం సేవా నిబంధనలు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాలక్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంట్ మరియు ఖాతాలను తొలగించడానికి ఒక ప్రభుత్వ అస్థిత్వ సంస్థ యొక్క డిమాండ్లకు సంబంధించినది.
గమనిక: ఒక ప్రభుత్వ సంస్థచే అభ్యర్థన చేయబడినప్పుడు మా పాలసీలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించేటప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవిస్తుందని మేము విశ్వసిస్తాము. ఒక నిర్ధిష్ట దేశంలో చట్టవ్యతిరేకంగా భావించబడిన అయితే ఇతరత్రా మా విధానాలను ఉల్లంఘించని కంటెంట్‌ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసించినప్పుడు, దానిని అంతర్జాతీయంగా తొలగించడానికి బదులుగా సాధ్యమైనప్పుడు దాని యాక్సెస్‌ను భౌగోళికంగా పరిమితం చేయడానికి మేము ప్రయత్నిస్తాము.
మేధా సంపత్తి హక్కుల ఇన్ఫ్రింజ్మెంట్ యొక్క నోటీసులు
ఈ వర్గం కాపీరైట్ ను ఉల్లంఘించేదిగా ఆరోపిత కంటెంట్ ని తొలగించడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను ప్రతిబింబిస్తుంది.
ఈ వర్గం ఒక ట్రేడ్ మార్క్ ను ఉల్లంఘించే కంటెంట్ ని తొలగించడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను ప్రతిబింబిస్తుంది.