నవంబర్ 29, 2022
నవంబర్ 29, 2022
Snap’యొక్క భద్రతా ప్రయత్నాలు మరియు మా ప్లాట్‌ఫారమ్ పైన నివేదించబడిన కంటెంట్ యొక్క స్వభావం మరియు వాల్యూము లోనికి గ్రాహ్యతను అందించడానికి మేము సంవత్సరానికి రెండుసార్లు పారదర్శకత నివేదికలను ప్రచురిస్తాము. మా కంటెంట్ మోడరేషన్ మరియు చట్ట అమలు పద్ధతులు, మరియు మా కమ్యూనిటీ యొక్క శ్రేయస్సు గురించి లోతుగా శ్రద్ధ వహించే అనేక హక్కుదారులకు ఈ నివేదికలను మరింత సమగ్రంగా మరియు సమాచారయుక్తంగా చేయడం కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
ఈ నివేదిక 2022 యొక్క మొదటి అర్ధభాగాన్ని (1, జనవరి – 30, జూన్) కవర్ చేస్తుంది. మా మునుపటి నివేదికల మాదిరిగానే, నిర్దిష్ట విభాగాల వ్యాప్తంగా ఉల్లంఘనలపై మేము స్వీకరించిన మరియు అమలు చేసిన ఇన్-యాప్ కంటెంట్ మరియు అకౌంట్-స్థాయి నివేదికల యొక్క ప్రాపంచిక సంఖ్య గురించి; చట్టాన్ని అమలుపరచే సంస్థలు మరియు ప్రభుత్వాలనుండి అభ్యర్థనలకు మేము ఎలా స్పందించాము; మరియు మా అమలు కార్యాచరణలు దేశంచే ఎలా విడగొట్టబడ్డాయో అనే విషయాల గురించి మేము డేటా పంచుకుంటాము. ఇది Snapchat కంటెంట్ యొక్క ఉల్లంఘనాత్మక వీక్షణ రేటు, సంభావ్య ట్రేడ్ మార్క్ ఉల్లంఘనలు, ప్లాట్‌ఫారంపై తప్పుడు సమాచారం యొక్క ఉదంతాలతో సహా ఈ నివేదికకు ఇటీవలి జోడింపులను కూడా గ్రహిస్తుంది.
మా పారదర్శకత నివేదికలను మెరుగుపరచడం పట్ల కొనసాగుతున్న మా నిబద్ధతలో భాగంగా, మేము ఈ నివేదికకు అనేక కొత్త అంశాలను పరిచయం చేస్తున్నాము. ఈ వ్యవస్థాపన మరియు ముందుకు వెళ్ళడం కోసం, నివేదిక అంతటా ఉపయోగించబడిన పదాల యొక్క పదకోశమును మేము జోడిస్తున్నాము. అట్టి పదజాలం పట్ల ప్రతి విభాగముపై దాని క్రింద ఉల్లంఘించే కంటెంటు యొక్క ఏయే రూపాలు చేర్చబడి మరియు అమలు చేయబడుతున్నాయని స్పష్టంగా తెలియజేస్తూ పెంపొందిత పారదర్శకతను అందించడం మా లక్ష్యం. మొట్టమొదటి సారిగా, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారాన్ని నివేదించే మా మునుపటి ఆచరణపై నిర్మించుకొని తప్పుడు సమాచారాన్ని దేశ స్థాయిలో కూడా ఒక స్వతంత్ర విభాగముగా పరిచయం చేస్తున్నాము.
అదనంగా, బాలల లైంగిక దోపిడీ మరియు దురుపయోగపు చిత్రాలను (CSEAI) ఎదుర్కోవడానికి గాను మా ప్రయత్నాల లోనికి పెంపొందిత గ్రాహ్యతను అందజేస్తున్నాము. ముందుకు వెళుతూ, మేము తొలగించడం ద్వారా అమలు చేసిన మొత్తం CSEAI కంటెంటుపై గ్రాహ్యతను, అదే విధంగా తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల కొరకు యు.ఎస్. జాతీయ కేంద్రము (NCMEC)నకు మేము చేసిన CSEAI రిపోర్టుల* (అనగా., “సైబర్ చిట్కాలు”) యొక్క మొత్తం సంఖ్యను పంచుకుంటూ ఉంటాము.
ఆన్‌లైన్ హానులను ఎదుర్కోవడానికి మా పాలసీల గురించి, మా నివేదనా విధానాల గురించి మరింత సమాచారానికై, ఈ పారదర్శకతా నివేదిక పై మా ఇటీవలి భద్రతా & ప్రభావం బ్లాగ్‌ను చదవండి.
Snapchat పై భద్రత మరియు గోప్యతకు సంబంధించిన అదనపు వనరులను కనుగొనేందుకు పేజీ కింద ట్యాబ్‌లో ఉన్న మా పారదర్శకత రిపోర్టింగ్ గురించి ను చూడండి.
కంటెంట్ మరియు ఖాతా ఉల్లంఘనల అవలోకనం
1, జనవరి, 2022 నుండి 30, జూన్, 2022 వరకూ, మా విధానాలను ఉల్లంఘించిన 56,88,970 కంటెంట్ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా మేము నిర్బంధాలను అమలు చేశాము. తీసుకొన్న చర్యలలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించడం లేదా అటువంటి కంటెంట్ కలిగివున్న అక్కౌంట్‌ను తొలగించడంవంటివి ఉన్నాయి.
ఈ నివేదికా కాల వ్యవధిలో, ఉల్లంఘనాత్మక వీక్షణ రేటు (VVR) 0.04 శాతం ఉన్నట్లుగా మేము గమనించాము, అంటే Snapchat పైన ప్రతి 10,000 Snap మరియు స్టోరీ వీక్షణలలో, 4 మాత్రమే మా పాలసీలను ఉల్లంఘించిన కంటెంటును కలిగి ఉన్నాయి.