25 ఏప్రిల్, 2024
25 ఏప్రిల్, 2024
Snap యొక్క భద్రతా ప్రయత్నాలు మరియు మా ప్లాట్‌ఫారమ్ పై నివేదించబడే కంటెంట్ స్వభావం మరియు పరిమాణంపై గ్రాహ్యతను అందించడానికి మేము ఏడాదికి రెండుసార్లు ఈ పారదర్శకత నివేదికను ప్రచురిస్తాము. మా కమ్యూనిటీ యొక్క భద్రత మరియు శ్రేయస్సు మరియు మా కంటెంట్ మోడరేషన్ మరియు చట్ట అమలు పద్ధతుల గురించి లోతుగా శ్రద్ధ వహించే అనేక మంది హక్కుదారుల కోసం ఈ నివేదికలను మరింత సమగ్రమైనవిగా మరియు సమాచారయుక్తంగా చేయడం కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
ఈ పారదర్శకత నివేదిక 2023 ద్వితీయార్ధాన్ని (1 జులై - 31 డిసెంబర్) కవర్ చేస్తుంది. మా మునుపటి నివేదికల లాగానే, మేము అందుకున్న మరియు పాలసీ ఉల్లంఘనల యొక్క నిర్దిష్ట విభాగాల వ్యాప్తంగా అమలుపరచిన ఇన్-యాప్ కంటెంట్ మరియు అకౌంట్-స్థాయి నివేదికల యొక్క ప్రపంచ సంఖ్య, చట్ట అమలు యంత్రాంగం మరియు ప్రభుత్వాల నుండి అభ్యర్థనలకు మేమెలా స్పందించామో ఆ డేటాను పంచుకుంటాము; మరియు మా అమలు చర్యలను దేశాలవారీగా విభజించి చూపించాము.
మా పారదర్శకతా నివేదికలను నిరంతరం మెరుగుపరచడానికై కొనసాగుతున్న మా నిబద్ధతలో భాగంగా, మేము ఈ విడుదలతో కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెడుతున్నాము.
మొదట, ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదం మరియు బాలల లైంగిక దోపిడీ ఇంకా దుర్వినియోగం (CSEA) తో ముడిపడిన కంటెంట్ మరియు ఖాతాలపై నివేదికలు మరియు వాటిపై తీసుకోబడిన చర్యలను చేర్చడానికి మేము మా ప్రధాన పట్టికను విస్తరించాము. మునుపటి నివేదికలలో, ఆ ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా చేసిన అకౌంట్ తొలగింపులను మేము ప్రత్యేక విభాగాలలో హైలైట్ చేశాము. CSEA పై మేము మా చురుకైన మరియు ప్రతిస్పందనాత్మక ప్రయత్నాలను కొనసాగిస్తాము, అలాగే ఒక ప్రత్యేక విభాగంలో NCMEC కి చేసిన మా నివేదికలను వివరిస్తాము.
రెండవదిగా, మేము కమ్యూనిటీ మార్గదర్శకాల అమలుల ద్వారా మొత్తం విజ్ఞప్తులు మరియు పునరుద్ధరణలను వివరిస్తూ అప్పీళ్లపై పొడిగింపు సమాచారాన్ని అందించాము.
చివరగా, Snap యొక్క EU కార్యకలాపాల గురించి మరింత అవగాహన ఇవ్వడానికి, మా యూరోపియన్ యూనియన్ విభాగాన్ని మేము విస్తరించాము. ప్రత్యేకించి, మా CSEA మీడియా స్కానింగ్‌కు సంబంధించి మేము మా అత్యంత ఇటీవలి DSA పారదర్శకత నివేదిక మరియు అదనపు కొలమానాలను ప్రచురిస్తున్నాము.
ఆన్‌లైన్ హానులను ఎదుర్కోవడానికై మా పాలసీల గురించి, మా నివేదిక విధానాలను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి తెలుసుకోడానికి, దయచేసి ఈ పారదర్శకత నివేదిక లో మా ఇటీవలి భద్రతా ప్రభావం బ్లాగ్‌ను చదవండి. Snapchat పై అదనపు భద్రత మరియు గోప్యతా వనరులను కనుగొనడానికై, ఈ పేజీ దిగువన మా పారదర్శకత రిపోర్టింగ్ గురించిన ట్యాబ్ ను చూడండి.
ఈ పారదర్శకత నివేదిక యొక్క అత్యంత తాజా వెర్షన్ ని en-US స్థానిక భాషలో కనుగొనవచ్చునని దయచేసి గమనించండి.
కంటెంట్ మరియు ఖాతా ఉల్లంఘనల అవలోకనం
1 జులై - 31 డిసెంబర్, 2023 నుండి, Snap ప్రపంచవ్యాప్తంగా మాకు నివేదించబడిన మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 53,76,714 కంటెంట్ భాగాలపై చర్యను అమలు చేసింది.
ఈ నివేదన వ్యవధిలో, ఉల్లంఘనాత్మక వీక్షణ రేటు (VVR) 0.01 శాతం ఉన్నట్లుగా మేము చూశాము, అంటే Snapchat పైన ప్రతి 10,000 Snap మరియు స్టోరీ వీక్షణలలో, 1 మాత్రమే మా విధానాలను ఉల్లంఘించిన కంటెంట్ ఉన్నట్లు దాని అర్థం. నివేదించబడిన కంటెంట్‌ను అమలు చేయడానికి మధ్యస్థ టర్న్అరౌండ్ సమయం -10 నిమిషాలు.
కంటెంట్ మరియు ఖాతా ఉల్లంఘనల విశ్లేషణ
మొత్తంమీద మా రిపోర్టింగ్ మరియు అమలుచేయు రేట్లు మునుపటి ఆరు నెలల మాదిరిగా సమానంగా నిలిచి ఉన్నాయి. ఈ విడతలో, మొత్తం కంటెంట్ మరియు అకౌంట్ నివేదికలలో సుమారు 10% పెరుగుదలను మేము చూశాము.
ఇజ్రాయెల్-హమాస్ వివాదం ఈ కాలవ్యవధిలో మొదలైంది, మరి ఆ ఫలితంగా ఉల్లంఘనాత్మక కంటెంట్ పెరుగుదలను మేము చూశాము. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన మొత్తం నివేదికలు ~61% పెరిగాయి, కాగా ద్వేషపూరిత ప్రసంగం యొక్క మొత్తం కంటెంట్ అమలులు ~97% పెరిగాయి మరియు విశిష్ట అకౌంట్ అమలులు ~124% పెరిగాయి. ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాద నివేదికలు మా ప్లాట్‌ఫారమ్ లోని మొత్తం కంటెంట్ అమలులలో <0.1% కలిగి ఉన్నప్పటికీ కూడా, వాటి అమలులు కూడా పెరిగిపోయాయి. Snapchatను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి గాను ప్రపంచవ్యాప్తంగా వివాదాలు తలెత్తడంతో మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు అప్రమత్తంగా కొనసాగుతాయి. మా ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాద విధానం యొక్క ఉల్లంఘనల కోసం అమలు చేయబడిన మొత్తం నివేదికలు, కంటెంట్ మరియు విశిష్ట ఖాతాలకు సంబంధించి ప్రపంచస్థాయి మరియు దేశ స్థాయిలో మరింత సమాచారాన్ని చేర్చడానికి మేము మా పారదర్శకత నివేదికను విస్తరించాము.
పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం
మా కమ్యూనిటీకి చెందిన ఏ సభ్యులనైనా, ప్రత్యేకించి మైనర్లను లైంగిక దోపిడీ చేయడమనేది చట్టవిరుద్ధం, జుగుప్సాకరం మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలచే నిషేధించబడినది. మా ప్లాట్‌ఫారంలో పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాన్ని (CSEA) నిరోధించడం, గుర్తించడం మరియు నిర్మూలించడం Snapకు అగ్ర ప్రాధాన్యతగా ఉంది మరియు వీటిని మరియు ఇతర నేరాలను ఎదుర్కోవడానికి మేం మా సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేస్తాం.
మేము లైంగిక దురుపయోగము యొక్క తెలిసిన చట్టబద్ధమైన చిత్రాలు మరియు వీడియోలను వరుసగా గుర్తించడానికి PhotoDNA ఘనమైన హ్యాష్-మ్యాచింగ్ మరియు Google బాలల లైంగిక దురుపయోగపు చిత్రావళి (CSAI) పోలిక వంటి క్రియాత్మకమైన టెక్నాలజీ సాధనాలను ఉపయోగిస్తాము, మరియు చట్టముచే ఆవశ్యకమైనట్లుగా వాటిని తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల కొరకు యు.ఎస్. జాతీయ కేంద్రము (NCMEC)కి నివేదిస్తాము. ఆ తరువాత, NCMEC, అవసరమైన విధంగా దేశీయ లేదా అంతర్జాతీయ చట్టం అమలు సంస్థలతో సమన్వయం చేసుకుంటుంది.
2023 ద్వితీయార్ధంలో, నివేదించిన మొత్తం పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగ ఉల్లంఘనల్లో మేము 59%ని ముందుగానే గుర్తించి మరియు చర్య తీసుకున్నాము. ఇది Snapచాటర్లకు నివేదించడానికి ఉన్న ఎంపికల యొక్క పెంపుదల కారణంగా Snapchat పై పంపించబడిన సంభావ్య CSEA యొక్క మా దృశ్యమానతను పెంచుతూ మునుపటి కాలవ్యవధి నుండి 39% మొత్తం తగ్గుదలను ప్రతిబింబిస్తుంది.
NCMEC కి ప్రతియొక్క సబ్మిషన్, కంటెంటు యొక్క పలు అంశాలను చేరి ఉండవచ్చునని గమనించండి. NCMECకు సబ్మిట్ చేసిన మొత్తం విడి వీడియో అంశాల మొత్తం, మేం అమలు చేసిన మొత్తం కంటెంట్‌కు సమానంగా ఉంది. మేము ఈ నంబర్ నుండి NCMEC కు వెనక్కి తీసుకోబడిన సమర్పణలను కూడా మినహాయించాము.
స్వీయ హాని మరియు ఆత్మహత్య కంటెంట్
Snapచాటర్ల యొక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి మేము లోతుగా శ్రద్ధ వహిస్తాము, అందులో Snapchat ని విభిన్నంగా నిర్మించడానికి మా నిర్ణయాలను తెలియజేయడం కొనసాగుతూ ఉంటుంది. నిజమైన స్నేహితులు మరియు వారి మధ్య కమ్యూనికేషన్ కొరకు రూపొందించబడిన ఒక వేదికగా, కష్టకాలాలలో పరస్పరం సహాయపడేందుకై స్నేహితుల్ని సాధికారపరచుటలో Snapchat ఒక విశిష్టమైన పాత్రను పోషించగలదని మేము నమ్ముతాము.
మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలకు ఇబ్బందులలో ఉన్న Snapచాటర్ల గురించి తెలిసినప్పుడు, వారు స్వీయ హాని నివారణ, సహాయక వనరులను పంపించవచ్చు మరియు సముచితమైనప్పుడు అత్యవసర ప్రతిస్పందన సిబ్బందికి తెలియజేయవచ్చు. మేము పంచుకొనే వనరులు భద్రతా వనరుల ప్రపంచవ్యాప్త జాబితాలో ఉంటాయి మరియు ఇవి Snapచాటర్లు అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.
విజ్ఞప్తులు
మా మునుపటి నివేదికలో, మేము అప్పీళ్ళపై కొలమానాలను ప్రవేశపెట్టాము, అక్కడ వాడుకదారులు తమ ఖాతాపై మా ప్రాథమిక మోడరేషన్ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించమని మమ్మల్ని కోరిన సంఖ్యను మేము ఎత్తి చూపాము. ఈ నివేదికలో, ఖాతా-స్థాయి ఉల్లంఘనల కొరకు, మా పాలసీ కేటగిరీల యొక్క పూర్తి శ్రేణిని గ్రహించడానికి మేము మా విజ్ఞప్తులను విస్తరించాము.
* బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ లేదా చర్య వ్యాప్తిని ఆపడం టాప్ ప్రాధాన్యతగా ఉంది. ఈ లక్ష్యం దిశగా Snap గణనీయమైన వనరులను కేటాయిస్తుంది మరియు అట్టి ప్రవర్తన పట్ల సహనాన్ని కలిగి ఉండదు. CSE విజ్ఞప్తులను సమీక్షించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం అవుతుంది, మరియు ఈ అంశం యొక్క గ్రాఫిక్ స్వభావం కారణంగా ఈ సమీక్షలను నిర్వహించగల ఏజెంట్ల బృందం పరిమితంగా ఉంది. 2023 ఆఖరిలో Snap కొన్నిCSE అమలు చర్యల సుస్థిరత్వాన్ని ప్రభావితం చేసే విధాన మార్పులను అమలు చేసింది; మరియు ఏజెంట్ల పునఃశిక్షణ మరియు కఠినమైన నాణ్యతా భరోసా ద్వారా ఈ అస్థిరతలను మేము పరిష్కరించాము. CSE విజ్ఞప్తుల కోసం ప్రతిస్పందన సమయాలను మెరుగుపరచడంలో మరియు తొలి అమలు చర్యల యొక్క ప్రశస్తతను మెరుగుపరచే దిశగా పురోగతిని Snap పారదర్శకత నివేదిక వెల్లడి చేస్తుందని మేము ఆశిస్తున్నాము.
యాడ్స్ నియంత్రణ
అన్ని యాడ్స్ మా అడ్వర్టైజింగ్ విధానాలుతో పూర్తిగా కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి Snap కట్టుబడి ఉంది. మా వినియోగదారులందరికీ సురక్షితమైన మరియు ఆస్వాదించదగిన అనుభవాన్ని కలిగిస్తూ, యాడ్స్ పట్ల బాధ్యతాయుతమైన మరియు గౌరవప్రదమైన విధానాన్ని మేము నమ్ముతాము. దిగువన మేము Snapchat పై చెల్లింపు ప్రకటనల కోసం మా మోడరేషన్ యొక్క గ్రాహ్యతను చేర్చాము. Snapchat పై యాడ్స్ Snap యొక్క అడ్వర్టైజింగ్ విధానాలులో వివరించిన విధంగా, మోసపూరిత కంటెంట్, వయోజన కంటెంట్, హింసాత్మక లేదా భంగం కలిగించే కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగము, మరియు మేధా సంపత్తి ఇన్ఫ్రింజ్మెంట్ తో సహా వివిధ కారణాల కోసం తొలగించబడతాయని గమనించండి. అదనంగా, మీరు ఇప్పుడు ఈ పారదర్శకత నివేదిక యొక్క నావిగేషన్ బార్ లో Snapchat యొక్క యాడ్స్ గ్యాలరీ ని కనుగొనవచ్చు.
ప్రాంతీయ మరియు దేశపు అవలోకనం
ఈ విభాగము, భౌగోళిక ప్రాంతాల యొక్క నమూనాలో మా కమ్యూనిటీ మార్గదర్శకాల అమలు యొక్క ఒక అవలోకనమును అందిస్తుంది. మా మార్గదర్శకాలు Snapchat—మరియు Snap చాటర్స్ అందరికీ—ప్రపంచ వ్యాప్తంగా, స్థానముతో సంబంధం లేకుండా కంటెంట్ అంతటికీ వర్తిస్తాయి.
EU సభ్యదేశాలన్నింటితో సహా విడి విడి దేశాలకు సమాచారం, జత చేయబడిన CSV ఫైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కోసం అందుబాటులో ఉంది.

























