Snap Values
పారదర్శకత నివేదిక
1 జనవరి, 2023 - 30 జూన్, 2023

విడుదల చేయబడినది:

అక్టోబర్ 25, 2023

నవీకరించబడినది:

13 డిసెంబర్, 2023

Snap యొక్క భద్రతా ప్రయత్నాలు మరియు మా ప్లాట్‌ఫారమ్‌ పైన నివేదించబడిన కంటెంట్ యొక్క స్వభావం మరియు పరిమాణం గురించి అవగాహన అందించడానికి మేము సంవత్సరానికి రెండుసార్లు పారదర్శకత నివేదికలను ప్రచురిస్తాము. మా కంటెంట్ మోడరేషన్ మరియు చట్ట అమలు పద్ధతులు, అదే విధంగా మా కమ్యూనిటీ యొక్క శ్రేయస్సు గురించి లోతుగా శ్రద్ధ వహించే అనేక మంది హక్కుదారులకు ఈ నివేదికలను మరింత సమగ్రమైనవిగా మరియు సమాచారయుక్తంగా చేయడం కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఈ పారదర్శకత నివేదిక 2023 యొక్క ప్రథమార్ధాన్ని (జనవరి 1 - జూన్ 30) కవర్ చేస్తుంది. మా మునుపటి నివేదికల లాగానే, మేము అందుకున్న మరియు పాలసీ ఉల్లంఘనల యొక్క నిర్దిష్ట విభాగాల వ్యాప్తంగా వాటిపై అమలుపరచిన ఇన్-యాప్ కంటెంట్ మరియు అకౌంట్-స్థాయి నివేదికల యొక్క ప్రపంచ సంఖ్య, చట్ట అమలు యంత్రాంగం మరియు ప్రభుత్వాల నుండి అభ్యర్థనలకు మేమెలా స్పందించామో ఆ డేటాను పంచుకుంటాము; మరియు మా అమలు చర్యలు దేశం వారీగా విడగొట్టబడ్డాయి. 

మా పారదర్శకతా నివేదికలను నిరంతరం మెరుగుపరచడానికై కొనసాగుతున్న మా నిబద్ధతలో భాగంగా, మేము ఈ విడుదలతో కొన్ని కొత్త మూలఅంశాలను ప్రవేశపెడుతున్నాము. మేము మా అడ్వర్టైజింగ్ పద్ధతులు మరియు మోడరేషన్, అదేవిధంగా కంటెంట్ మరియు అకౌంట్ విజ్ఞప్తుల చుట్టూ అదనపు డేటా పాయింట్లను జోడించాము. EU డిజిటల్ సర్వీసెస్ చట్టానికి అనుగుణంగా, మేము EU సభ్య దేశాలలో మా కార్యకలాపాల చుట్టూ ఆ ప్రాంతం లోని కంటెంట్ మోడరేటర్లు మరియు నెలవారీ క్రియాశీలక వాడుకదారుల సంఖ్య (MAUలు) వంటి కొత్త సందర్భోచిత సమాచారాన్ని కూడా జోడించి ఉన్నాము. ఈ సమాచారం యొక్క అత్యధిక భాగాన్ని నివేదిక అంతటా మరియు మా పారదర్శకత కేంద్రం యొక్క ప్రత్యేక యూరోపియన్ యూనియన్ పేజీలోనూ చూడవచ్చు.

అంతిమంగా, మేము మా కమ్యూనిటీ ార్గదర్శకాల వివరణదారులకు లింకులతో మా పదకోశాన్ని అప్‌డేట్ చేశాము, ఇది మా ప్లాట్‌ఫారమ్ విధానం మరియు కార్యాచరణ ప్రయత్నాలపై అదనపు సందర్భాన్ని అందిస్తుంది.

ఆన్‌లైన్ హానులను ఎదుర్కోవడానికై మా పాలసీల గురించి, మరియు మా నివేదనా విధానాల వృద్ధిని కొనసాగించే ప్రణాళికల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఈ పారదర్శకత నివేదిక పై మా ఇటీవలి భద్రతా& ప్రభావం బ్లాగ్‌ను చదవండి.

Snapchat పై భద్రత మరియు గోప్యతకు సంబంధించిన అదనపు వనరులను కనుగొనేందుకు పేజీ కింద ట్యాబ్‌లో ఉన్న మా పారదర్శకత రిపోర్టింగ్ గురించి ను చూడండి.

ఈ పారదర్శకత నివేదిక యొక్క అత్యంత తాజా వెర్షన్ ని en-US స్థానిక భాషలలో కనుగొనవచ్చునని దయచేసి గమనించండి.

కంటెంట్ మరియు ఖాతా ఉల్లంఘనల అవలోకనం

1 జనవరి - 30 జూన్, 2023 నుండి, మా విధానాలను ఉల్లంఘించిన ప్రపంచవ్యాప్తంగా 62,16,118 కంటెంట్ భాగాలపై Snap చర్య తీసుకుంది.

ఈ నివేదిక వ్యవధిలో, ఉల్లంఘనాత్మక వీక్షణ రేటు (VVR) 0.02 శాతం ఉన్నట్లుగా మేము గమనించాము, అంటే Snapchat పైన ప్రతి 10,000 Snap మరియు స్టోరీ వీక్షణలలో, 2 మాత్రమే మా పాలసీలను ఉల్లంఘించిన కంటెంటును కలిగి ఉన్నాయి.

*తప్పుడు సమాచారంపై సరిగ్గా మరియు స్థిరంగా ఎన్ఫోర్స్మెంట్ అమలు చేయడం అనేది ఒక డైనమిక్ ప్రక్రియ, దానికి అత్యంత తాజా సందర్భం మరియు తగిన శ్రద్ధ అవసరం. ఈ కేటగరీలో మా ఏజెంట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను నిరంతరం మెరుగుపరచడానికి మేము ప్రయత్నిస్తాము మరియు 2022 ప్రథమార్ధం నుండి, తప్పుడు సమాచార ఎన్‌ఫోర్స్‌మెంట్‌ల గణాంకపరంగా గణనీయమైన భాగం యొక్క కఠినమైన నాణ్యత-హామీ సమీక్ష ఆధారంగా అంచనా వేయబడిన "కంటెంట్ యొక్క అమలు" మరియు "విశిష్ట ఖాతాలపై అమలు చేయబడినవి" కేటగరీలలో గణాంకాలను నివేదించడానికి ఎంచుకున్నాము. ప్రత్యేకించి, ప్రతి దేశవ్యాప్తంగా తప్పుడు సమాచార ఎన్‌ఫోర్స్‌మెంట్‌ల గణాంక గణనీయ భాగాన్ని మేము నమూనా చేస్తాము మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్ణయాల నాణ్యతను పరిశీలిస్తాము. తరువాత మేము, నాణ్యతా-పరిశీలన చేయబడిన ఆ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లను 95% విశ్వాస అంతరం (+/- 5% లోపం యొక్క మార్జిన్)తో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రేట్‌లను గ్రహించడానికై, పారదర్శకత నివేదికలో నివేదించిన తప్పుడు సమాచార ఎన్‌ఫోర్స్‌మెంట్‌లను లెక్కించడానికి ఉపయోగిస్తాము.

కంటెంట్ మరియు ఖాతా ఉల్లంఘనల విశ్లేషణ

మొత్తంమీద మా రిపోర్టింగ్ మరియు అమలు రేట్లు కీలకమైన విభాగాలలో అతి కొద్ది మినహాయింపులతో మునుపటి ఆరు నెలల మాదిరిగా సమానంగానే ఉన్నాయి. ఈ విడతలో మొత్తం కంటెంట్ మరియు అకౌంట్ నివేదికలు మరియు అమలులలో సుమారుగా 3% తగ్గుదలను మేము చూశాము.

అత్యంత గుర్తించదగిన హెచ్చుతగ్గులు ఉన్న విభాగాలుగా వేధింపు మరియు దూషణ, స్పామ్, మారణాయుధాలు మరియు తప్పుడు సమాచారం ఉండినవి. వేధింపు మరియు దూషణ అనేది మొత్తం నివేదికలలో ~56% పెరుగుదలను చూసింది, మరియు తదుపరిగా కంటెంట్ మరియు విశిష్ట అకౌంట్ అమలులు ~39% పెరుగుదలను చూశాయి. చర్య అమలులలో ఈ పెరుగుదలలు తిరిగిరాక సమయములో ~46% తగ్గుదలతో జతచేయబడ్డాయి, ఇది ఈ రకమైన ఉల్లంఘన కంటెంట్‌పై చర్యను అమలు చేయడంలో మా బృందం చేసిన కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా ఎత్తి చూపిస్తుంది. అదేవిధంగా, స్పామ్‌కు సంబంధించిన మొత్తం నివేదికలలో ~65% పెరుగుదలను మేము చూశాము, కంటెంట్ అమలులలో ఇది ~110% పెరుగుదల మరియు చర్య అమలు చేసిన విశిష్ట అకౌంట్‌లలో ~80% పెరుగుదల, కాగా మా బృందాలు కూడా తిరిగిరాక సమయాన్ని ~80% తగ్గించాయి. మా మారణాయుధాల విభాగంలో మొత్తం నివేదికలు ~13% తగ్గుదలను మరియు కంటెంట్ అమలులు ~51% తగ్గుదలను మరియు అమలు చేసిన విశిష్ట అకౌంట్‌లలో ~53% తగ్గుదలను చూశాయి. చివరగా, మా తప్పుడు సమాచార విభాగంలో మొత్తం నివేదికలలో ~14% పెరుగుదలను చూసింది, అయితే కంటెంట్ అమలులు ~78% తగ్గుదలను మరియు చర్య అమలు చేయబడిన విశిష్ట అకౌంట్‌లు ~74% తగ్గుదలను చూశాయి. ఇది నిరంతర నాణ్యత హామీ (QA) ప్రక్రియ మరియు తప్పుడు సమాచార నివేదికలకు మేము వర్తింపజేసే వనరులను అందించడంతోపాటు, మా మోడరేషన్ బృందాలు ప్లాట్‌ఫారమ్‌పై తప్పుడు సమాచారాన్ని కచ్చితంగా గుర్తించి తగిన చర్య తీసుకోవడానికి దోహదపడిందని చెప్పవచ్చు.

మొత్తంమీద, మేము గత కాలవ్యవధిలో సాధారణంగా ఇదే విధమైన గణాంకాలను చూశాము, సంభావ్య ఉల్లంఘనలు ప్లాట్‌ఫారమ్ పై కనిపించగానే చురుగ్గా మరియు సరిగ్గా నివేదించడానికి మా కమ్యూనిటీ ఉపయోగించే సాధనాలను మెరుగుపరచడం కొనసాగించడం ముఖ్యమని మేము నమ్ముతున్నాము.

పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం

మా కమ్యూనిటీకి చెందిన ఏ సభ్యుడినైనా, ప్రత్యేకించి మైనర్లను లైంగికపరంగా దోచుకోవడమనేది చట్టవిరుద్ధం, జుగుప్సాకరం మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలచే నిషేధించబడినది. మా ప్లాట్‌ఫారంలో పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాన్ని (CSEA) నిరోధించడం, గుర్తించడం మరియు నిర్మూలించడం Snapకు అగ్ర ప్రాధాన్యతగా ఉంది మరియు వీటిని మరియు ఇతర నేరాలను ఎదుర్కోవడానికి మేం మా సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేస్తాం.

మేము లైంగిక దురుపయోగము యొక్క తెలిసిన చట్టబద్ధమైన చిత్రాలు మరియు వీడియోలను వరుసగా గుర్తించడానికి PhotoDNA ఘనమైన హ్యాష్-మ్యాచింగ్ మరియు Google బాలల లైంగిక దురుపయోగపు చిత్రావళి (CSAI) పోలిక వంటి క్రియాత్మకమైన టెక్నాలజీ సాధనాలను ఉపయోగిస్తాము, మరియు చట్టముచే ఆవశ్యకమైనట్లుగా వాటిని తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల కొరకు యు.ఎస్. జాతీయ కేంద్రము (NCMEC)కి నివేదిస్తాము. ఆ తరువాత, NCMEC, అవసరమైన విధంగా దేశీయ లేదా అంతర్జాతీయ చట్టం అమలు సంస్థలతో సమన్వయం చేసుకుంటుంది.

2023 ప్రథమార్ధంలో, మేము ముందస్తు చొరవ తీసుకొని, మొత్తం బాలల లైంగిక దోపిడీ మరియు దురుపయోగపు ఉల్లంఘనలలో 98 శాతం ఘటనలను కనిపెట్టాము మరియు చర్య తీసుకుని ఇక్కడ నివేదించాము — ఇది మునుపటి వ్యవధి నుండి 4 శాతం పెరుగుదలగా ఉంది.

**NCMEC కి సమర్పించే ప్రతి సమర్పణలో బహుళ కంటెంట్ భాగాలు ఉండవచ్చని గమనించండి. NCMEC కి సమర్పించబడిన మొత్తం విడి విడి మీడియా అంశాల మొత్తము మేము అమలు చేసిన మొత్తం కంటెంటుకు సమానంగా ఉంది.

ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్

ఈ నివేదిక కాలం 1 జనవరి 2023- 30 జూన్ 2023 సందర్భంగా, ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను నిషేధించే మా విధానాన్ని ఉల్లంఘించినందుకు మేము 18 అకౌంట్లను తొలగించాము.

Snapలో మేము వివిధ మార్గాలద్వారా నివేదించిన ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను తొలగించాము. మేము మా ఇన్-యాప్ రిపోర్టింగ్ మెనూ ద్వారా ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను నివేదించమని వినియోగదారులను ప్రోత్సహిస్తాము మరియు Snapపై కనిపించే ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను పరిష్కరించడానికి మేము చట్ట అమలు సంస్థలతో దగ్గరగా పని చేస్తాము.

స్వీయ హాని మరియు ఆత్మహత్య కంటెంట్

Snapచాటర్ల యొక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు పట్ల మాకు లోతైన శ్రద్ధ ఉంది — ఇదే Snapchat‌ను భిన్నంగా నిర్మించే మా నిర్ణయాలకు ప్రేరణగా నిలిచింది, ఇంకా కొనసాగిస్తోంది. నిజమైన స్నేహితుల మధ్య కమ్యూనికేషన్ కొరకు రూపొందించబడిన ఒక వేదికగా, కష్ట కాలములో పరస్పరం సహాయపడేందుకు స్నేహితుల్ని సాధికారపరచుటలో Snapchat ఒక విశిష్టమైన పాత్రను పోషించగలదని మేము నమ్ముతాము.

మా ట్రస్టు మరియు భద్రతా బృందము ఒక Snap చాటర్స్ ఇబ్బందుల్లో ఉన్నట్లుగా గుర్తించినప్పుడు, వాళ్ళు స్వీయ-హాని నివారణ మరియు మద్దతు వనరులను పంపించవచ్చు, మరియు సముచితమైన చోట అత్యవసర స్పందన సిబ్బందికి తెలియజేయవచ్చు. మేము పంచుకొనే వనరులు భద్రతా వనరుల ప్రపంచవ్యాప్త జాబితాలో ఉంటాయి మరియు ఇవి Snapచాటర్లు అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.

విజ్ఞప్తులు

ఈ నివేదిక ప్రకారం, మా విధానాల ఉల్లంఘన కోసం ఖాతాలు లాక్ చేయబడిన వాడుకదారులచే రాబడిన విజ్ఞప్తుల సంఖ్యపై నివేదించడం మేము ప్రారంభిస్తున్నాము. మా మోడరేటర్లు తప్పుగా లాక్ చేసినట్లుగా నిర్ణయించే అకౌంట్లను మాత్రమే మేము పునరుద్ధరిస్తాము. ఈ కాలంలో, మేము మాదకద్రవ్య కంటెంట్‌కు సంబంధించిన విజ్ఞప్తులపై నివేదిస్తున్నాము. మా తదుపరి నివేదికలో, మా విధానాల ఇతర ఉల్లంఘనల నుండి ఉత్పన్నమయ్యే విజ్ఞప్తులకు సంబంధించిన మరింత డేటాను విడుదల చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.

యాడ్స్ నియంత్రణ

అన్ని ప్రకటనలు మా ఫ్లాట్‌ఫారమ్ పాలసీలకు పూర్తిగా పాటించేలా స్థిరంగా ఉండేందుకు Snap కట్టుబడి ఉంది. మా వినియోగదారులందరికీ సురక్షితమైన మరియు ఆస్వాదించదగిన అనుభవాన్ని కలిగిస్తూ, యాడ్స్ పట్ల బాధ్యతాయుతమైన మరియు గౌరవప్రదమైన విధానాన్ని మేము నమ్ముతాము. మేం దిగువన మా ప్రకటనల మోడరేషన్‌పై అవలోకనాన్ని చేర్చాం. Snapchat పై యాడ్స్ Snap యొక్క అడ్వర్టైజింగ్ విధానాలులో వివరించిన విధంగా, మోసపూరిత కంటెంట్, వయోజన కంటెంట్, హింసాత్మక లేదా భంగం కలిగించే కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగము, మరియు మేధా సంపత్తి ఇన్ఫ్రింజ్మెంట్ తో సహా వివిధ కారణాల కోసం తొలగించబడతాయని గమనించండి. అదనంగా, మీరు ఇప్పుడు ఈ పారదర్శకత నివేదిక నావిగేషన్ బార్‌లో Snapchat యాడ్స్ గ్యాలరీ ని కనుగొనవచ్చు.

దేశపు సమీక్ష

ఈ విభాగము, భౌగోళిక ప్రాంతాల యొక్క నమూనాలో మా కమ్యూనిటీ మార్గదర్శకాల అమలు యొక్క ఒక అవలోకనమును అందిస్తుంది. మా మార్గదర్శకాలు Snapchat—మరియు Snap చాటర్స్ అందరికీ—ప్రపంచ వ్యాప్తంగా, స్థానముతో సంబంధం లేకుండా కంటెంట్ అంతటికీ వర్తిస్తాయి.

జత చేయబడ్డ CSV ఫైల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వ్యక్తిగత దేశాల కొరకు సమాచారం లభ్యం అవుతుంది: