డిసెంబర్ 05, 2024
డిసెంబర్ 05, 2024
మేము Snap యొక్క భద్రతా ప్రయత్నాలకు గ్రాహ్యతను అందించడానికై సంవత్సరానికి రెండుసార్లు ఈ పారదర్శకత నివేదిక ను ప్రచురిస్తాము. మేము ఈ ప్రయత్నాలకు కట్టుబడి ఉన్నాము మరియు Snapchat కమ్యూనిటీ యొక్క కంటెంట్ మోడరేషన్, చట్ట అమలు పద్ధతులు, మరియు భద్రతా మరియు శ్రేయస్సు గురించి లోతుగా శ్రద్ధ వహించే పలువురు హక్కుదారుల కోసం ఈ నివేదికలను మరింత సమగ్రపరచి మరియు సమాచారయుతంగా చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాము.
ఈ పారదర్శకత నివేదిక 2024 యొక్క మొదటి అర్ధభాగము (జనవరి 1 - జూన్ 30)ను కవర్ చేస్తుంది. మా మునుపటి నివేదికల లాగానే, మేము మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు అందుకున్న మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల యొక్క నిర్దిష్ట విభాగాల వ్యాప్తంగా అమలుపరచిన ఇన్-యాప్ కంటెంట్ మరియు అకౌంట్-స్థాయి నివేదికల యొక్క గ్లోబల్ వాల్యూమ్ గురించి డేటాను మరియు మేము చట్ట అమలు యంత్రాంగం మరియు ప్రభుత్వాల నుండి అభ్యర్థనలకు మేము ఎలా ప్రతిస్పందించామో; మరియు కాపీరైట్ మరియు ట్రేడ్మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ యొక్క నోటీసులకు మేము ఎలా ప్రతిస్పందించామో దానిని పంచుకుంటాము. మేము ఈ పేజీ దిగువన లింక్ చేయబడిన ఫైళ్ళలో దేశ-నిర్దిష్ట గ్రాహ్యతలను కూడా అందిస్తాము.
మా పారదర్శకత నివేదికలను నిరంతరం మెరుగుపరచడానికై కొనసాగుతున్న మా నిబద్ధతలో భాగంగా, మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల యొక్క విస్తృతమైన శ్రేణిని గుర్తించడానికి మరియు అమలు చేయడానికి మా చురుకైన ప్రయత్నాలను హైలైట్ చేయడం ద్వారా కొత్త డేటాను కూడా ప్రవేశపెడుతున్నాము. మేము ఈ నివేదిక లోపున ప్రపంచ మరియు దేశపు స్థాయిలలో ఈ డేటాను చేర్చాము మరియు ముందుకు వెళ్ళే దిశగా అలాగే చేయడం కొనసాగిస్తాము. మేము మా మునుపటి నివేదికలలో లేబులింగ్ లోపం ను కూడా సరి చేశాము: ఇందులో మేము ఇంతకు ముందు "మొత్తం అమలుపరచిన కంటెంట్” ను రెఫర్ చేసుకున్నాము, ఇప్పుడు మేము సంబంధిత కాలమ్లలో అందించిన డేటా కంటెంట్ స్థాయి మరియు అకౌంట్-స్థాయి అమలులను చేరి ఉందనే వాస్తవాన్ని ప్రతిబింబించడానికి "మొత్తం అమలులు” ను సూచికగా తీసుకుంటాము.
సంభావ్య ఆన్‌లైన్ హానులను ఎదుర్కోవడానికి మరియు మా రిపోర్టింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడం కొనసాగించడానికి ప్రణాళికల గురించి మరింత సమాచారం కోసం దయచేసి పారదర్శకత నివేదిక గురించి మా ఇటీవలి భద్రతా మరియు ప్రభావం బ్లాగ్ ను చదవండి. Snapchat పై భద్రత మరియు గోప్యతకు సంబంధించిన అదనపు వనరులను కనుగొనేందుకు, పేజీ దిగువన మా పారదర్శకత రిపోర్టింగ్ గురించి ట్యాబ్ ను చూడండి.
ఈ పారదర్శకత నివేదిక యొక్క అత్యంత తాజా వెర్షన్ EN-US స్థానిక భాషలలో కనుగొనవచ్చునని దయచేసి గమనించండి.
మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు చేయడానికై మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాల చర్యల యొక్క అవలోకనం
మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు ఈ నివేదిక యొక్క క్రింది విభాగాలలో తదుపరి వివరించబడినట్లుగా ముందస్తు చొరవతో (ఆటోమేటెడ్ టూల్స్ యొక్క వాడకం ద్వారా) మరియు స్పందనాత్మకంగా (నివేదికలకు ప్రతిస్పందనగా) కూడా మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు చేస్తాయి. ఈ రిపోర్టింగ్ సైకిల్‌లో (H1 2024), మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు ఈ క్రింది అమలు చర్యలను తీసుకున్నాయి:
దిగువన, మేము ఉల్లంఘన ను కనిపెట్టిన సమయం (ముందస్తు చొరవతో గానీ లేదా ఒక నివేదికను అందుకున్న మీదట గానీ) మరియు సంబంధిత కంటెంట్ లేదా అకౌంట్ పైన మేము అంతిమ చర్య తీసుకున్న సమయం మధ్య మధ్యస్థంగా పట్టిన సమయంతో సహా సంబంధిత కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల యొక్క ఒక్కో రకం విభజన ఉంది:
ఈ నివేదించబడిన వ్యవధిలో, ఉల్లంఘనాత్మక వీక్షణ రేటు (VVR) 0.01 శాతం ఉన్నట్లుగా మేము గమనించాము, అంటే Snapchat పైన ప్రతి 10,000 Snap మరియు స్టోరీ వీక్షణలలో, 1 మాత్రమే మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కంటెంటును కలిగి ఉన్నాయని దాని అర్థం.
మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలకు నివేదించబడిన కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలు
జనవరి 1 నుండి జూన్ 30, 2024 వరకు, మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల యొక్క ఇన్-యాప్ నివేదికలకు ప్రతిస్పందనగా, Snap యొక్క ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు 3,842,507 విశిష్ట అకౌంట్లపై అమలు చేసిన అంశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 6,223,618 అమలు చర్యలను చేపట్టాయి. ఆ నివేదికలకు ప్రతిస్పందనగా అమలు చేసే చర్య తీసుకోవటానికి మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాల కోసం మధ్యస్థంగా పట్టిన సమయం ~24 నిమిషాలు. రిపోర్టింగ్ కేటగిరీ ప్రకారం బ్రేక్‌డౌన్ ఈ దిగువన ఇవ్వబడింది.
విశ్లేషణ
మా మొత్తం రిపోర్టింగ్ వాల్యూమ్స్ అన్నీ మునుపటి ఆరు నెలల ముందు వాటితో పోలిస్తే, H1 2024 లో సమంజసంగా నిలకడగా ఉన్నాయి. ఈ వలయంలో, మేము మొత్తం అమలు చేయడంలో పెరుగుదలను చూశాము మరియు అమలు చేయబడిన మొత్తం విశిష్ట అకౌంట్లు సుమారు 16% ఉంది.
గత 12 నెలల వ్యవధి పాటు, వినియోగదారుల కోసం Snap కొత్త రిపోర్టింగ్ యంత్రాంగాలను ప్రవేశపెట్టింది, అవి ఈ రిపోర్టింగ్ వ్యవధి (H1 2024)లోనే మా నివేదించబడిన మరియు అమలు చేయబడిన వాల్యూముల మార్పులకు మరియు తీసుకున్న సమయాల పెరుగుదలకు అకౌంట్ అవుతుంది. ప్రత్యేకించి:
గ్రూప్ చాట్ రిపోర్టింగ్: మేము అక్టోబర్ 13, 2023 న గ్రూప్ చాట్ రిపోర్టింగ్ ను ప్రవేశపెట్టాము, ఇది ఒక బహుళ-వ్యక్తుల చాట్ లో సంభవించే దురుపయోగమును నివేదించడానికి వినియోగదారులకు వీలు కలిగిస్తుంది. ఈ మార్పు రిపోర్టింగ్ కేటగిరీల వ్యాప్తంగా మా మెట్రిక్స్ యొక్క రూపురేఖలను ప్రభావపరచింది (చాట్ సందర్భంలో కొన్ని సంభావ్య హానులు జరిగే మరింత అవకాశం ఉన్నందున) మరియు నివేదిక కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచింది.
అకౌంట్ రిపోర్టింగ్ పెంపుదలలు: చెడు జరిపే ఒక వ్యక్తిచే నడపబడుతున్నట్లుగా అనుమానించబడుతున్న అకౌంట్ ను నివేదించేటప్పుడు వినియోగదారులు చాట్ ఆధారాలను సమర్పించడానికి వీలుగా ఒక ఎంపికను అందించడానికి మేము మా అకౌంట్ రిపోర్టింగ్ ఫీచరును కూడా అభివృద్ధి చేశాము. ఫిబ్రవరి 29, 2024 న ప్రారంభించబడిన ఈ మార్పు, అకౌంట్ నివేదికలను అంచనా వేయడానికి గాను మాకు గొప్ప ఋజువును మరియు సందర్భాన్ని అందిస్తుంది.
చాట్ నివేదికలు, మరియు ప్రత్యేకించి గ్రూప్ చాట్ నివేదికలు, బోర్డు వ్యాప్తంగా సమీక్షకు పట్టే సమయాలను పెంచేలా అత్యంత క్లిష్టమైన మరియు సమయం-తీసుకునేవిగా ఉన్నాయి.
అనుమానిత బాలల లైంగిక దోపిడీ మరియు దురుపయోగం (CSEA), వేధింపు మరియు బెదిరింపు, మరియు విద్వేష ప్రసంగం కోసం నివేదిక ఇవ్వడం అనేది పైన వివరించబడిన రెండు మార్పుల ద్వారా మరియు విశాలమైన పర్యావరణ వ్యవస్థలో మార్పు ద్వారా ప్రత్యేకించి ప్రభావితమైంది. ప్రత్యేకించి:
CSEA: H1 2024 లో CSEA-సంబంధిత నివేదికలు మరియు అమలులలో మేము పెరుగుదలను గమనించాము. ప్రత్యేకించి, మేము వినియోగదారులచే మొత్తం ఇన్-యాప్ నివేదికలలో 64% పెరుగుదలను, మొత్తం అమలులలో 82% పెరుగుదలను మరియు అమలు చేయబడిన విశిష్ట అకౌంట్లలో 108% పెరుగుదలను చూశాము. ఈ పెరుగుదలలు గ్రూప్ చాట్ మరియు అకౌంట్ రిపోర్టింగ్ కార్యాచరణలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రధానంగా నడపబడుతున్నాయి. ఈ మోడరేషన్ క్యూ యొక్క సున్నితమైన స్వభావం కారణంగా, సంభావ్య CSEA-సంబంధిత ఉల్లంఘనల యొక్క నివేదికలను సమీక్షించడానికి అత్యంత శిక్షణ పొందిన ఏజెంట్ల నుండి ఎంపిక చేయబడిన బృందం కేటాయించబడింది. కొత్త శిక్షణలను అలవరచుకున్న మా బృందాలతో కలిపి అదనపు నివేదికల ప్రవాహం వల్లనే పట్టే సమయాలలో పెరుగుదలకు దారి తీసింది. ముందుకు కదులుతూ, తీసుకునే సమయాలను తగ్గించడానికి మరియు సంభావ్య CSEA యొక్క నివేదికలను కచ్చితంగా అమలు చేయడానికి గాను మేము మా గ్లోబల్ విక్రేత బృందాల యొక్క పరిమాణాన్ని గణనీయంగా పెంచాము. మా H2 2024 పారదర్శకత నివేదిక వాస్తవికంగా మెరుగుపడిన పట్టే సమయంతో ఈ ప్రయత్నాల యొక్క ఫలాలను ప్రతిబింబిస్తుందని మేము ఆశిస్తున్నాము.
వేధింపు మరియు బెదిరింపు: నివేదికల ఆధారంగా, వేధింపు మరియు బెదిరింపు అనేవి అనుపాత రహితంగా, మరియు ప్రత్యేకించి గ్రూప్ చాట్‌లు లో జరుగుతున్నట్లుగా మేము గమనించాము. గ్రూప్ చాట్ రిపోర్టింగ్ మరియు అకౌంట్ రిపోర్టింగ్ కు మేము ప్రవేశపెట్టిన మెరుగుదలలు ఈ రిపోర్టింగ్ కేటగిరీలో నివేదికలను అంచనా వేసేటప్పుడు మరింత సమగ్రమైన చర్య తీసుకోవడానికి మాకు సహాయపడతాయి. అదనంగా, ఈ వ్యవధి నాటికి, వేధింపు మరియు బెదిరింపు నివేదికను సమర్పించేటప్పుడు వినియోగదారులు ఒక వ్యాఖ్యను జతపరచాలని మేము కోరతాము. ప్రతి నివేదికను సందర్భోచితం చేయడానికి మేము ఈ వ్యాఖ్యను సమీక్షిస్తాము. సంఘటితంగా, ఈ మార్పులు మొత్తం అమలులలో (+91%) వాస్తవికత పెరుగుదల, మొత్తం అమలు చేయబడిన విశిష్ట అకౌంట్లు (+82%), మరియు సంబంధిత నివేదికల కోసం పట్టే సమయం (+245 నిముషాలు) కు దారితీశాయి.
విద్వేష ప్రసంగం: H1 2024 లో, విద్వేష ప్రసంగం కోసం నివేదించబడిన కంటెంట్, మొత్తం అమలు మరియు పట్టే సమయాలలో మేము పెరుగుదలను గమనించాము. ప్రత్యేకించి, మేము ఇన్-యాప్ నివేదికలలో 61% పెరుగుదలను, మొత్తం అమలులలో 127% పెరుగుదలను మరియు అమలు చేయబడిన విశిష్ట అకౌంట్లలో 125% పెరుగుదలను చూశాము. ఇది, పాక్షికంగా, మా చాట్ రిపోర్టింగ్ పద్ధతులలో (గతంలో చర్చించబడిన విధంగా) మెరుగుదలలకు కారణమయింది మరియు భౌగోళిక రాజకీయ వాతావరణంచే, ప్రత్యేకించి ఇజ్రాయెల్-హమాస్ వివాదం యొక్క కొనసాగింపులో మరింత తీవ్రతరం చేయబడింది.
ఈ రిపోర్టింగ్ వ్యవధిలో, మేము మొత్తం అమలులలో ~65% తగ్గింపును మరియు అనుమానిత స్పామ్ మరియు దురుపయోగం యొక్క నివేదికలకు ప్రతిస్పందనగా అమలు చేయబడిన మొత్తం విశిష్ట అకౌంట్లలో ~60% తగ్గింపును చూశాము, ఇది మా ముందస్తు చొరవతో గుర్తింపును మరియు అమలు సాధనాలలో మెరుగుదలలను ప్రతిబింబిస్తూనే ఉంది. స్వీయ హాని మరియు ఆత్మహత్య (~ 80% తగ్గుదలలు) కు సంబంధించిన కంటెంట్ యొక్క నివేదికలకు ప్రతిస్పందనగా మేము మొత్తం అమలు చేయడంలో సారూప్య క్షీణతలను చూశాము, అవి మా నవీకరించబడిన బాధితవ్యక్తి-కేంద్రిత విధానాన్ని ప్రతిబింబిస్తూ, వాటి ప్రకారం మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు, సముచితమైన సందర్భాల్లో, ఆ వినియోగదారులపై అమలు చర్య తీసుకోవడానికి బదులుగా సంబంధిత వినియోగదారులు స్వయం-సహాయ వనరులను పంపడానికి వీలు కలిగిస్తాయి. ఈ విధానం, ఇంటరాక్టివ్ మీడియా మరియు ఇంటర్నెట్ రుగ్మతలలో ప్రత్యేక నైపుణ్యం పొందిన శిశునిపుణులు మరియు వైద్య నిపుణులతో సహా మా భద్రతా సలహా బోర్డు యొక్క సభ్యులచే తెలియజేయబడింది.
మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను ముందస్తు చొరవతో కనిపెట్టి మరియు అమలు చేయడానికి మా ప్రయత్నాలు
మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను ముందస్తు చొరవతో కనిపెట్టి మరియు, కొన్ని సందర్భాల్లో అమలు చేయడం కోసం ఆటోమేటెడ్ సాధనాలను వినియోగిస్తాము. ఈ సాధనాలలో, హ్యాష్-మ్యాచింగ్ సాధనాలు (ఫోటోDNA మరియు Google బాలల లైంగిక దురుపయోగ చిత్రావళి (CSAI) సరిపోలికతో సహా), దూషణ భాషను కనిపెట్టే సాధనాలు (ఇది గుర్తించబడిన మరియు క్రమం తప్పకుండా దూషణ పదజాలం మరియు బొమ్మల ఆధారంగా కనిపెట్టి మరియు అమలు చేసే) జాబితాను గుర్తించి, అమలు చేస్తుంది), మరియు బహుళ మాదరి కృత్రిమ మేధస్సు / యంత్ర అభ్యసన సాంకేతికత ఉంటాయి.
H1 2024 లో, ఆటోమేటెడ్ సాధనాల యొక్క వాడకం ద్వారా, మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను ముందస్తు చొరవతో కనిపెట్టిన తర్వాత మేము ఈ క్రింది అమలు చర్యలను చేపట్టాము:
మా కమ్యూనిటీకి చెందిన ఏ సభ్యులనైనా, ప్రత్యేకించి మైనర్లను లైంగిక దోపిడీ చేయడమనేది చట్టవిరుద్ధం, జుగుప్సాకరం మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలచే నిషేధించబడినది. మా ప్లాట్‌ఫారమ్‌లో పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాన్ని (CSEA) నిరోధించడం, గుర్తించడం మరియు నిర్మూలించడం Snapకి అగ్ర ప్రాధాన్యతగా ఉంది మరియు వీటిని మరియు ఇతర నేరాలను ఎదుర్కోవడానికి మేము మా సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేస్తాము.
మేము, వరుసగా CSEA యొక్క తెలిసిన అక్రమ చిత్రాలు మరియు వీడియోలను గుర్తించడానికి గాను PhotoDNA బలమైన హ్యాష్-మ్యాచింగ్ మరియు Google యొక్క బాలల లైంగిక దురుపయోగ చిత్రావళి (CSAI) మ్యాచ్ వంటి క్రియాశీల సాంకేతిక గుర్తింపు సాధనాలను ఉపయోగిస్తాము. అదనంగా, కొన్ని సందర్భాల్లో, మేము ఇతర సంభావ్య చట్టవిరుద్ధమైన CSEA కార్యాచరణపై చర్యను అమలు చేయడానికి ప్రవర్తనా సంబంధిత సంకేతాలను ఉపయోగిస్తాము. మేము, చట్టముచే ఆవశ్యకమైనట్లుగా, CSEA-సంబంధిత కంటెంటును U.S. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC)కి నివేదిస్తాము. ఆ తరువాత, NCMEC, అవసరమైన విధంగా దేశీయ లేదా అంతర్జాతీయ చట్టం అమలుతో సమన్వయం చేసుకుంటుంది.
2024 ప్రథమార్థంలో, Snapchat పై CSEA ను కనిపెట్టిన మీదట (ముందస్తు చొరవతో గానీ లేదా ఒక నివేదికను స్వీకరించిన మీదట గానీ) మేము ఈ క్రింది చర్యలను చేపట్టాము:
NCMEC కి ప్రతియొక్క సబ్మిషన్, కంటెంటు యొక్క పలు అంశాలను చేరి ఉండవచ్చునని గమనించండి. NCMEC కి సమర్పించబడిన మొత్తం విడి విడి మీడియా అంశాల మొత్తము మేము అమలు చేసిన మొత్తం కంటెంటుకు సమానంగా ఉంది.
అవసరంలో ఉన్న Snapచాటర్లు కి వనరులు మరియు మద్దతును అందించడానికి మా ప్రయత్నాలు
Snapచాటర్ల యొక్క మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి మేము లోతుగా శ్రద్ధ వహిస్తాము, అందులో Snapchat ని విభిన్నంగా నిర్మించడానికి మా నిర్ణయాలను తెలియజేయడం కొనసాగుతూ ఉంటుంది. నిజమైన స్నేహితులు మరియు వారి మధ్య కమ్యూనికేషన్ కొరకు రూపొందించబడిన ఒక వేదికగా, కష్టకాలాలలో పరస్పరం సహాయపడేందుకు స్నేహితుల్ని సాధికారపరచుటలో Snapchat ఒక విశిష్టమైన పాత్రను పోషించగలదని మేము నమ్ముతాము. ఇందుకనే మేము అవసరంలో ఉన్న Snapచాటర్లు కోసం వనరులు మరియు మద్దతును అభివృద్ధి చేశాము.
మా Here For You శోధన సాధనం అనేది మానసిక ఆరోగ్యం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, శోకం మరియు బెదిరింపుకు సంబంధించిన కొన్ని అంశాల కోసం వినియోగదారులు శోధన చేస్తున్నప్పుడు నిపుణులైన స్థానిక భాగస్వాముల నుండి వనరులను చూపిస్తుంది. మేము బాధలో ఉన్న వారికి మద్దతు ఇవ్వవలసిన ప్రయత్నంలో, ఫైనాన్షియల్ సెక్స్‌టార్షన్ మరియు ఇతర లైంగిక ముప్పులు మరియు హానుల పట్ల అంకితం చేయబడిన ఒక పేజీ ని కూడా అభివృద్ధి చేశాము. మా గోప్యత, భద్రతా మరియు పాలసీ హబ్ లో, Snapచాటర్లు అందరికీ భద్రతా వనరుల యొక్క గ్లోబల్ జాబితా బహిరంగంగా అందుబాటులో ఉంది.
మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలకు ఇబ్బందులలో ఉన్న Snapచాటర్ గురించి తెలిసినప్పుడు, వారు స్వీయ హాని నివారణ, సహాయక వనరులను పంపించవచ్చు మరియు సముచితమైనప్పుడు అత్యవసర ప్రతిస్పందన సిబ్బందికి తెలియజేయవచ్చు. మేము పంచుకొనే వనరులు భద్రతా వనరుల ప్రపంచవ్యాప్త జాబితాలో ఉంటాయి మరియు ఇవి Snapచాటర్లు అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.
విజ్ఞప్తులు
ఈ దిగువన, మేము అకౌంట్ ను లాక్ చేయడానికి మా నిర్ణయం యొక్క సమీక్షను అభ్యర్థించే వినియోగదారుల నుండి మేము అందుకున్న విజ్ఞప్తుల గురించి సమాచారాన్ని అందిస్తాము:
* పై "విశ్లేషణ" విభాగంలో చర్చించబడినట్లుగా, బాలల లైంగిక దోపిడీ కి సంబంధించిన కంటెంట్ లేదా కార్యకలాపాల వ్యాప్తిని ఆపడమనేది అగ్ర ప్రాధాన్యతగా ఉంది. ఈ లక్ష్యం దిశగా Snap గణనీయమైన వనరులను అంకితం చేస్తుంది మరియు అట్టి ప్రవర్తన పట్ల శూన్య సహనాన్ని కలిగి ఉంటుంది. Snapchat కోసం కొత్త విధానాలు మరియు రిపోర్టింగ్ ఫీచర్లను అలవరచుకోవడానికై మేము మా గ్లోబల్ విక్రేత బృందాలను విస్తరించాము. H2 2023 మరియు H1 2024 మధ్య అలా చేయడంలో, మేము CSEA విజ్ఞప్తుల కోసం పట్టే సమయాన్ని 152 రోజుల నుండి 15 రోజుల వరకు తగ్గించాము. విజ్ఞప్తులకు పట్టే సమయాలకు సంబంధించి సహా మా ప్రక్రియలను మెరుగుపరచడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాము.
ప్రాంతీయ మరియు దేశపు అవలోకనం
ఈ విభాగం, భౌగోళిక ప్రాంతాల నమూనాలో, ముందస్తు చొరవతో మరియు ఉల్లంఘనల యొక్క ఇన్-యాప్ నివేదికలకు ప్రతిస్పందనగా కూడా, మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అమలు చేయడానికి మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాల చర్యల యొక్క అవలోకనాన్ని అందిస్తుంది. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు Snapchat పై ఉండే కంటెంట్ అంతటికీ—మరియు Snapచాటర్లు అందరికీ—ప్రదేశంతో సంబంధంలేకుండా, విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి.
EU సభ్యదేశాలన్నింటితో సహా విడి విడి దేశాలకు సమాచారం, జత చేయబడిన CSV ఫైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం కోసం అందుబాటులో ఉంది.
యాడ్స్ ఆధునీకరణ
అన్ని యాడ్స్ మా అడ్వర్టైజింగ్ విధానాలుతో పూర్తిగా కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి Snap కట్టుబడి ఉంది. మా వినియోగదారులందరికీ సురక్షితమైన మరియు ఆస్వాదించదగిన అనుభవాన్ని కలిగిస్తూ, యాడ్స్ పట్ల బాధ్యతాయుతమైన మరియు గౌరవప్రదమైన విధానాన్ని మేము నమ్ముతాము. అన్ని యాడ్స్ మా సమీక్ష మరియు ఆమోదం కు లోబడి ఉంటాయి. అదనంగా, మేము తీవ్రంగా తీసుకునే వినియోగదారు ఫీడ్బాక్ కు ప్రతిస్పందనతో సహా యాడ్స్ ను తొలగించే హక్కును కలిగి ఉన్నాము.
Snapchat పైన వారి ప్రచురణను అనుసరించి మాకు నివేదించబడిన యాడ్స్ కోసం మా మోడరేషన్ లోనికి మేము ఈ దిగువన గ్రాహ్యతను చేర్చి ఉన్నాము. Snapchat పై యాడ్స్ Snap యొక్క అడ్వర్టైజింగ్ విధానాలులో వివరించిన విధంగా, మోసపూరిత కంటెంట్, వయోజన కంటెంట్, హింసాత్మక లేదా భంగం కలిగించే కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగము, మరియు మేధా సంపత్తి ఇన్ఫ్రింజ్మెంట్ తో సహా వివిధ కారణాల కోసం తొలగించబడతాయని గమనించండి. అదనంగా, మీరు ఇప్పుడు ఈ పారదర్శకత నివేదిక యొక్క నావిగేషన్ బార్ లో Snapchat యొక్క యాడ్స్ గ్యాలరీ ని కనుగొనవచ్చు.

























