కమ్యూనిటీ మార్గదర్శకాలు
అప్‌డేట్ చేయబడినది: జనవరి 2024

Snapలో, ప్రజలు తమను తాము వ్యక్తీకరించడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించే శక్తి ఇచ్చి మానవ పురోగతికి దోహదం చేస్తాము. Snapచాటర్లుప్రతి రోజూ సురక్షితంగా మా సేవలను ఉపయోగించుకోగలిగేలా నిర్ధారించుకోవడానికి పాటుపడేటప్పుడు స్వీయ-వ్యక్తీకరణ యొక్క విస్తృత శ్రేణి పరిధిని ప్రోత్సహించడం ద్వారా మా మిషన్‌కు మద్దతు ఇవ్వడానికి మేము ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఏర్పరచాము. ఈ మార్గదర్శకాలు, మా కమ్యూనిటీలోని సభ్యులందరికీ స్పష్టంగా ఉండేలా మరియు అర్థమయ్యేలా ఉండాలని మేము కోరుకొంటున్నాము. మా కమ్యూనిటీలో చేరడానికి గాను, మీకు కనీసం 13 సంవత్సరాల వయస్సు ఉండాలని దయచేసి గమనించండి.

ఈ మార్గదర్శకాలు Snapchat పైన కంటెంట్‌ (ఇందులో అన్ని రకాల కమ్యూనికేషన్‌, టెక్స్ట్, చిత్రాలు, జెనరేటివ్ AI, లింకులు లేదా జోడింపులు, ఎమోజీలు, లెన్సెస్ మరియు ఇతర క్రియేటివ్ టూల్స్ వంటివి ఉంటాయి) అంతటికీ మరియు లేదా Snapచాటర్ల అందరి ప్రవర్తనకు వర్తిస్తాయి. Snapచాటర్లకు తీవ్రమైన హాని కలిగించే కంటెంట్ లేదా ప్రవర్తనకు మేము ప్రత్యేకించి సున్నితంగా ఉన్నాము, మరియు అటువంటి ప్రవర్తనలో నిమగ్నమై ఉన్న వాడుకదారులపై తక్షణ మరియు శాశ్వత చర్య తీసుకునే హక్కును కలిగి ఉన్నాము. మేము తీవ్రమైన హాని అని దేనిని పరిగణిస్తామో మరియు దానిపై మేము ఎలా చర్య తీసుకుంటామో, దాని గురించి అదనపు మార్గదర్శనంఇక్కడఅందుబాటులో ఉంది. 

Snap మా సేవల ద్వారా జెనరేటివ్ AI పీచర్లను అందిస్తుంది. జనరేటివ్ AI కంటెంట్ మా కమ్యూనిటీ మార్గదర్శకలాలను అనుగుణంగా ఉండేలా చూస్తూ, మేము మా భద్రతాచర్యలను రూపొందించాము మరియు Snapఛాటర్లు, AIను బాధ్యతాయుతంగా వినియోగిస్తారని మేము ఆశిస్తాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించేలా AIను ఉపయోగించే అకౌంట్లపై, అకౌంట్ నిలిపివేయడంవరకు మరియు దానితో సహా ఉండేలా, తగిన చట్టబద్ధమైన చర్యతీసుకోవడానికి మేము పూర్తిహక్కును కలిగివున్నాము.

డిస్కవర్‌లోని ప్రకటనదారులు మరియు మీడియా భాగస్వాములు వారి కంటెంట్ ఖచ్చితమైనది మరియు సముచితమైన చోట వాస్తవ-తనిఖీతో సహా అదనపు మార్గదర్శకాలకు అంగీకరిస్తారు. డెవలపర్లు కూడా అదనపు నియమాలకు లోబడి ఉంటారు.

Snapchat పై నిషేధించబడిన కంటెంట్‌ కొరకు మేము ఇక్కడ మరియు సేవా షరతులు లో నిర్దిష్ట నియమాలను వివరించాము, మరియు ఈ నియమాలు సుస్థిరంగా వర్తింపు చేయబడేలా చూసుకోవడానికి మేము పని చేస్తాము. ఈ నియమాలను వర్తింపజేసేటప్పుడు, ఇది వార్తా సముచితమా, వాస్తవికత ఉందా, మరియు మా కమ్యూనిటీ పట్ల రాజకీయ, సామాజిక, లేదా ఇతర సాధారణ సమస్యకు సంబంధించిన విషయంగా ఉందా అనేదానితో సహా కంటెంట్ యొక్క స్వభావాన్ని మేము లెక్కలోనికి తీసుకుంటాము. మేము కంటెంట్‌ను ఎలా మోడరేట్ చేస్తాము మరియు మా విధానాలను ఎలా అమలు చేస్తామో అనేదాని గురించి అదనపు సందర్భం ఇక్కడఅందుబాటులో ఉంది. ఈ దిగువ విభాగాలలో ప్రతిదాని అంతటా మా కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి మరింత వివరణాత్మక సమాచారానికి మేము లింక్‌లను కూడా అందిస్తాము.

ప్రతి ఒక్కరికీ Snapchat సురక్షితమైన మరియు సానుకూల అనుభవాన్ని ఇచ్చేదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా నియమాల స్ఫూర్తిని ఏ కంటెంట్ లేదా ప్రవర్తన ఉల్లంఘిస్తుందో మా స్వంత విచక్షణను బట్టి నిర్ణయించడానికి మాకు హక్కు కలిగి ఉంటుంది.

లైంగిక కంటెంట్

 • పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగ చిత్రావళి, పిల్లల గ్రూమింగ్, లేదా లైంగిక దుష్ప్రవర్తన (సెక్స్‌టార్షన్), లేదా పిల్లల లైంగికీకరణతో సహా ఒక మైనరు యొక్క లైంగిక దోపిడీ లేదా దురుపయోగము ఇమిడి ఉండే ఎటువంటి చర్యనైనా సరే మేము నిషేధిస్తాము. అటువంటి బాలల లైంగిక దోపిడీ ప్రవర్తనలో నిమగ్నం కావడానికి చేసే ప్రయత్నాలతో సహా బాలల లైంగిక దోపిడీ గుర్తించబడిన అన్ని సందర్భాలను మేము అధికారులకు రిపోర్టు చేస్తాము. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఇమిడి ఉన్న నగ్నత్వ లేదా లైంగిక బహిర్గతమైన కంటెంట్‌ను ఎప్పటికీ పోస్ట్ చేయవద్దు, సేవ్ చేయవద్దు లేదా పంపించవద్దు, ఫార్వార్డ్ చేయవద్దు లేదా అడగవద్దు (ఇందులో అటువంటి మీ స్వంత చిత్రాలను పంపించడం లేదా సేవ్ చేయడం కూడా చేరి ఉంటుంది).

 • అశ్లీలత లేదా లైంగిక పరస్పర చర్యలు, అదేవిధంగా వాణిజ్య కార్యకలాపాలకు (ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) సంబంధించిన లైంగిక అశ్లీలతా కంటెంటును ప్రోత్సహించడం, పంపిణీ చేయడం లేదా పంచుకోవడం వంటి చర్యలను మేము నిషేధిస్తాము.

 • లైంగిక-యేతర సందర్భాలలో స్థన్యపానము మరియు నగ్నత్వం యొక్క ఇతర చిత్రలేఖనాలు సాధారణంగా అనుమతించబడతాయి.

 • లైంగిక ప్రవర్తన మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ పై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది

వేధింపు మరియు బెదిరింపులు

 • మేము ఏ రకమైన బుల్లీయింగ్ లేదా వేధింపులను నిషేధిస్తాము. ఇది అవాంఛిత, లైంగిక, అసభ్యకరమైన, సూచనాత్మక లేదా నగ్న చిత్రాలను ఇతర వినియోగదారులకు పంపడంతో పాటు అన్ని రకాల లైంగిక వేధింపులకు వర్తిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే, మీరు మరో Snapchat అకౌంట్ నుంచి వారిని సంప్రదించలేకపోవచ్చు.

 • ఒక బాత్‌రూమ్, బెడ్‌రూమ్, లాకర్ రూమ్ లేదా వైద్య సదుపాయం వంటి ఒక ప్రైవేట్ స్థలములో వ్యక్తి యొక్క చిత్రాలను – వారికి తెలియకుండా మరియు సమ్మతి లేకుండా పంచుకోవడం నిషేధించబడింది, ఎందుకంటే, వారికి తెలియకుండా మరియు సమ్మతి లేకుండా మరొక వ్యక్తి యొక్క ప్రైవేటు సమాచారమును పంచుకోవడం అనేది వేధింపు యొక్క ఉద్దేశ్యం కోసం (అంటే, “డాక్సింగ్”)అని అర్థమవుతుంది.

 • మీ Snapలో ఎవరైనా ఉండి, దాన్ని తీసివేయమని అడిగితే, దయచేసి తీసేయండి! ఇతరుల యొక్క గోప్యతా హక్కులను గౌరవించండి.

 • అనుమతించదగిన కంటెంటును ఉద్దేశ్యపూర్వకంగా రిపోర్టు చేయడం వంటి మా రిపోర్టింగ్ పద్ధతులను దురుపయోగం చేయడం ద్వారా దయచేసి మరొక Snapచాటర్ ను కూడా వేధించవద్దు.

 • బుల్లీయింగ్ మరియు వేధింపులు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘిస్తాయనే దానిపై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది.

బెదిరింపులు, హింస మరియు హాని

 • హింసాత్మక లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడం లేదా నిమగ్నం కావడం నిషేధించబడింది. ఒక వ్యక్తి, గ్రూప్ లేదా మరొకరి ఆస్తికి హాని కలిగించడానికై ఎప్పుడు కూడా భయపెట్టవద్దు లేదా బెదిరించవద్దు.

 • జంతు హింస తో సహా అనవసరమైన లేదా గ్రాఫిక్ హింస యొక్క Snapలు అనుమతించబడవు.

 • స్వయంగా-గాయం చేసుకోవడం, ఆత్మహత్య లేదా తినే రుగ్మతలను ప్రోత్సహించడంతో సహా స్వీయ-హానిని పెద్దగా చూపించడాన్ని మేము అనుమతించము.

 • మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే బెదిరింపులు, హింస మరియు హానిపై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది.

హానికరమైన తప్పుడు లేదా మోసపూరిత సమాచారం

 • విషాదకరమైన సంఘటనల యొక్క ఉనికిని తిరస్కరించడం, నిరాధారమైన వైద్య క్లెయిములు, పౌర ప్రక్రియల యొక్క సమగ్రతను తక్కువగా అంచనా వేయడం, లేదా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రయోజనాల కోసం కంటెంటును తారుమారు చేయడం వంటి (జెనరేటివ్ AI ద్వారా లేదా మోసపూరిత సవరణ ద్వారా అయినా) హాని కలిగించే లేదా మోసపూరితమైన తప్పుడు సమాచార వ్యాప్తిని మేము నిషేధిస్తాము.

 • మీరు కాని మరొకరు మీరుగా (లేదా మరోదానిగా) చూపించుకోవడం, లేదా మీ గురించి మీరు ఎవరో ప్రజలకు తప్పుగా తెలియచేయడాన్ని మేము నిషేధిస్తాము. ఇందులో హానికరమైన, వ్యంగ్య-యేతర ఉద్దేశ్యాల కోసం ఫ్రెండ్స్, ప్రముఖులు, ప్రజా నాయకులు, బ్రాండ్లు లేదా ఇతర వ్యక్తులు లేదా సంస్థల వలె నటించడం ఇందులో ఉంటుంది.

 • వెల్లడిచేయని చెల్లింపు లేదా స్పాన్సర్ చేయబడిన కంటెంట్, పే-ఫర్-ఫాలోయర్ ప్రోత్సాహకాలు లేదా ఇతర ఫాలోయర్-గ్రోత్ పథకాలు, స్పామ్ అప్లికేషన్స్ లేదా మల్టిలెవల్ మార్కెటింగ్ లేదా పిరమిడ్ పథకాలవంటివాటితోసహా, స్పామ్‌ను మేము నిషేధిస్తాము.

 • మోసపూరిత వస్తువులు లేదా సేవల ప్రమోషన్ లేదా త్వరగా ధనికులయ్యే పథకాలు లేదా Snapchat లేదా Snap Inc.ని అనుకరించడంతో సహా మోసం మరియు ఇతర మోసపూరిత పద్ధతులను మేము నిషేధిస్తాము.

 • మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే హానికరమైన తప్పుడు లేదా మోసపూరిత కంటెంటుపై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది.

చట్టవిరుద్ధమైన లేదా నియంత్రిత కార్యకలాపాలు

 • మీ అధికార పరిధిలో చట్టవిరుద్ధమైన కంటెంట్ పంపడానికి లేదా పోస్ట్ చేయడానికి, లేదా ఏదైనా అక్రమ చర్య కొరకు Snapchat ని ఉపయోగించవద్దు. ఇందులో చట్టవిరుద్ధమైన లేదా నియంత్రించబడిన మాదకద్రవ్యాలు, కాంట్రాబాండ్ (పిల్లల లైంగిక దోపిడీ లేదా దుర్వినియోగ చిత్రావళి వంటివి), మారణాయుధాలు లేదా నకిలీ వస్తువులు లేదా పత్రాల కొనుగోలు, అమ్మకం, మార్పిడి చేయడం లేదా అమ్మకాలను సానుకూలపరచడం వంటి నేరపూరిత చర్యను ప్రోత్సహించడం, సులభతరం చేయడం లేదా పాల్గొనడం వంటివి చేరి ఉంటాయి. ఇందులో లైంగిక అక్రమ రవాణా, కార్మిక అక్రమ రవాణా, లేదా ఇతర మానవ అక్రమ రవాణాతో సహా ఏదైనా రూపంలోని దోపిడీని ప్రోత్సహించడం లేదా సానుకూలపరచడం కూడా చేరి ఉంటుంది.

 • జూదము, పొగాకు లేదా ఆవిరి ఉత్పత్తుల వాడకం మరియు మద్యం యొక్క అనధీకృత ప్రోత్సాహముతో సహా నియంత్రిత వస్తువులు లేదా పరిశ్రమల యొక్క అక్రమమైన ప్రోత్సాహాన్ని మేము నిషేధిస్తాము.

 • మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే నిషేధిత అక్రమ లేదా నియంత్రించబడిన కార్యకలాపాలపై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది.

ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, మరియు హింసాత్మక తీవ్రవాదం

 • మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం నుండి ఉగ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాదులు మరియు ద్వేషపూరిత సమూహాలు నిషేధించబడ్డాయి. ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాదాన్ని సమర్థించే లేదా అభివృద్ధి చేసే కంటెంట్‌ పట్ల మాకు ఎటువంటి సహనం లేదు.

 • జాతి, రంగు, కులం, జాతి నేపధ్యం, జాతీయ మూలం, మతం, లైంగిక ధోరణి, లింగం, లింగ గుర్తింపు, వైకల్యం లేదా ప్రముఖుల స్థితి, వలస స్థితి, సామాజిక-ఆర్థిక స్థితి, వయస్సు, బరువు లేదా గర్భధారణ స్థితి ఆధారంగా విద్వేషపూరిత ప్రసంగం, లేదా వివక్ష చూపే, పరువుకు భంగం కలిగించే, లేదా వివక్ష లేదా హింసను ప్రోత్సహించే కంటెంట్‌ నిషేధించబడింది.

 • మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదంపై అదనపు మార్గదర్శనం ఇక్కడఅందుబాటులో ఉంది.


మీరు మా ఇన్-యాప్ రిపోర్టింగ్ ఫీచర్లను ఉపయోగించి లేదా ఈ ఫారమును పూర్తి చేయడం ద్వారా (మీకు Snapchat అకౌంట్ ఉన్నా లేదా లేకున్నా ఒక ఆందోళనను రిపోర్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది)మీరు ఎల్లప్పుడూ మా ట్రస్ట్ మరియు భద్రతా బృందానికి రిపోర్ట్ చేయవచ్చునని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనలను నిర్ణయించడానికి మేము ఈ నివేదికలను సమీక్షిస్తాము. మీరు ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే, మేము అభ్యంతర కంటెంట్‌ని తొలగించవచ్చు, మీ అకౌంట్ ను రద్దు చేయవచ్చు లేదా కనిపించడాన్ని పరిమితం చేయవచ్చు మరియు/లేదా చట్టాన్ని అమలు చేసే అధికారులకు తెలియజేయవచ్చు. ఏదైనా చర్య మానవ జీవితానికి ముప్పుగా పరిణమించేటప్పుడు మేము చట్టమును అమలు చేయు వారికి కూడా సమాచారాన్ని అందజేస్తాము. ఒకవేళ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మీ అకౌంట్ గనక రద్దు చేయబడితే, మీరు Snapchat ను మళ్ళీ ఉపయోగించుకోవడానికి లేదా ఈ రద్దును ఏ విధంగానైనా తిరిగి మళ్ళించడానికి అనుమతించబడరు.

మా స్వంత విచక్షణ ప్రకారం Snapchat లోన లేదా బయట ఇతరుల పట్ల ప్రమాదాన్ని కలిగిస్తారని మేము నమ్మడానికి కారణం ఉన్న వినియోగదారులకు అకౌంట్ ప్రాప్యతను తొలగించడానికి లేదా పరిమితం చేయడానికి Snap హక్కును కలిగి ఉంటుంది. ఇందులో ద్వేష సమూహాల నాయకులు మరియు ఉగ్రవాద సంస్థలు, హింస ప్రేరేపించడం లేదా ఇతరులపై తీవ్రమైన హానులు కలిగించిన శాశ్వత ఖ్యాతిని కలిగి యున్న వ్యక్తులు, లేదా మానవ జీవితానికి ముప్పును కల్పిస్తుందని మేము విశ్వసించే ప్రవర్తన చేరి ఉంటాయి. అటువంటి ప్రవర్తనను మదింపు చేసేటప్పుడు, అకౌంట్ ప్రాప్యతను తొలగించాలా లేదా ఆంక్షలు విధించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవడంలో మేము విషయ పరిజ్ఞాన నిపుణులు లేదా చట్టమును అమలుచేయు అధికారులు వంటి ఇతర వనరుల నుండి మార్గదర్శనాన్ని పరిగణించవచ్చు.

Snapchat వద్ద భద్రత గురించి మరింత సమాచారం కొరకు దయచేసి మా సేఫ్టీ సెంటర్‌ ని సందర్శించండి. అక్కడ, మీ గోప్యతా సెట్టింగ్లును అప్‌డేట్ చేయడం, మీరు మీ కంటెంట్‌ని ఎవరు చూడవచ్చు, మరియు ఇతర యూజర్‌లను బ్లాక్ చేయడం వంటి చర్యలను చేపట్టడంతో సహా, మీ Snapchat అనుభవాన్ని నిర్వహించడంపై మీరు సవిస్తరమైన సూచనలను చూడవచ్చు.