Privacy, Safety, and Policy Hub

లైంగిక కంటెంట్

కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి

అప్‌డేట్ చేయబడినది: జనవరి 2024

  • పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగ చిత్రాలను పంచుకోవడం, గ్రూమింగ్ లేదా లైంగిక బెదిరింపు (sextortion) తో సహా ఒక మైనర్ యొక్క లైంగిక దోపిడీ లేదా దురుపయోగం ఇమిడి ఉండే ఏదైనా చర్యను మేము నిషేధిస్తాము. మేము అటువంటి కార్యకలాపాన్ని వెలికితీసినప్పుడు, అటువంటి ప్రవర్తనలో నిమగ్నం కావడానికి చేసే ప్రయత్నాలతో సహా పిల్లల లైంగిక దోపిడీ యొక్క ఉదంతాలన్నింటినీ మేము అధికారులకు రిపోర్టు చేస్తాము. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఇమిడి ఉన్న నగ్నత్వ లేదా లైంగిక బహిర్గతమైన కంటెంట్‌ను ఎప్పటికీ పోస్ట్ చేయవద్దు, సేవ్ చేయవద్దు, పంపించవద్దు, ఫార్వార్డ్ చేయవద్దు, పంపిణీ చేయవద్దు లేదా అడగవద్దు (ఇందులో అటువంటి మీ స్వంత చిత్రాలను పంపించడం లేదా సేవ్ చేయడం కూడా చేరి ఉంటుంది).

  • అశ్లీలతా కంటెంట్‌ను ప్రోత్సహించడం, పంపిణీ చేయడం లేదా పంచుకోవడాన్ని మేము నిషేధిస్తాము. అశ్లీలత లేదా పరస్పర లైంగిక చర్యలతో (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలను కూడా మేము అనుమతించము. లైంగిక-యేతర సందర్భాలలో స్థన్యపానము మరియు నగ్నత్వం యొక్క ఇతర చిత్రలేఖనాలు సాధారణంగా అనుమతించబడతాయి.



అవలోకనము

హానికరమైన లేదా దురుపయోగపు కంటెంట్‌ను ఎదుర్కొనే Snap చాటర్ లు అందరినీ రక్షించాలని ఆకాంక్షిస్తున్నాము. ఆ దిశగా, వాడుకదారులు సౌకర్యవంతంగా తమకు తాము వ్యక్తం చేయగలిగేలా మరియు Snapchat పై ఆయాచిత లైంగిక కంటెంట్ లేదా దురుపయోగానికి గురి కాకుండా స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసుకోగలిగేలా చూసుకొనే లక్ష్యముతో మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలను అభివృద్ధి చేశాము. ఈ విధానాలు అశ్లీలత, లైంగిక నగ్నత్వంతో సహా, లేదా లైంగిక సేవలను అందజేసే ఒక శ్రేణి కంటెంటును చేరి ఉండే–– లైంగికంగా బహిర్గతమైన కంటెంట్‌ను పంచుకోవడం, ప్రచారం చేయడం లేదా పంపిణీ చేయడాన్ని నిషేధిస్తాయి––మరియు పిల్లలను దోపిడీ చేసే ఏదైనా కంటెంట్‌ను బలమైన పదజాలముతో ఖండిస్తాయి.


మీరు ఏమి ఆశించాలి


అశ్లీలత కంటెంట్ నిషేధించబడింది, ఇందులో ప్రాధమిక ఉద్దేశ్యంగా లైంగిక ప్రేరేపణ లేదా లైంగిక ప్రేరేపణతో చిత్రించిన నగ్నత్వంతో సహా అశ్లీలతా కంటెంటు నిషేధించబడింది. అశ్లీలతా కంటెంటు యొక్క ఉదాహరణలలో ఫోటోలు లేదా వీడియోలు, లేదా అత్యంత వాస్తవికమైన యానిమేషన్, డ్రాయింగ్‌లు లేదా బహిర్గత లైంగిక చర్యల యొక్క ఇతర అందజేతలు కూడా చేరి ఉంటాయి. అయితే ఇది ఏ సందర్భాల్లో వర్తించదు అంటే, ఉదాహరణకు, కళాత్మక వ్యక్తీకరణ యొక్క ఉద్దేశ్యముగా నగ్నత్వం, లేదా స్థన్యపానము, వైద్య విధానాలు, లేదా ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రస్తుత లేదా చారిత్రక సంఘటనల వంటి లైంగిక-యేతర సందర్భాల్లో నగ్నత్వం అగుపించుట.


ఈ విధానాలు ఆఫ్‌లైన్ సేవలు (ఉదాహరణకు, శృంగారపూర్వక మర్దనం వంటివి) మరియు ఆన్‌లైన్ అనుభవాలు (ఉదాహరణకు, లైంగిక చాట్ లేదా వీడియో సేవలను అందించడం వంటివి) రెండింటితో సహా లైంగిక సేవలను కూడా నిషేధిస్తాయి.


మా కమ్యూనిటీ యొక్క ఎవరైనా సభ్యుల, ముఖ్యంగా మైనర్ల లైంగిక దోపిడీ చట్టవిరుద్ధమైనది, ఆమోదయోగ్యం కానిది మరియు నిషేధించబడింది. దోపిడీలో లైంగిక అక్రమ రవాణా; నగ్నత్వాలను అందించడానికి వినియోగదారులను బలవంతపెట్టే లేదా ప్రలోభపెట్టే ప్రయత్నాలు; అదేవిధంగా మా కమ్యూనిటీ సభ్యులను ఒత్తిడి చేయడానికి లేదా బెదిరించడానికి సన్నిహిత చిత్రాలు లేదా లైంగిక సామాగ్రిని ఉపయోగించే ఏదైనా ప్రవర్తన కూడా చేరి ఉంటాయి. లైంగిక దురుపయోగం లేదా దోపిడీ యొక్క ఉద్దేశంతో ఒక మైనర్‌ను ఒప్పించడానికి లేదా బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఏదైనా కమ్యూనికేషన్ లేదా ప్రవర్తనను, లేదా ఒక మైనర్‌ను నిశ్శబ్దంగా ఉంచటానికి భయాలు లేదా సిగ్గును ఉపయోగించుకునే పరిస్థితిని మేము నిషేధిస్తాము.


మేము ఈ విధానాలను ఎలా అమలు చేస్తాము


మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ తొలగింపునకు లోబడి ఉంటుంది. ఉల్లంఘించే కంటెంట్‌‌ను పంచుకునే, ప్రచారం చేసే లేదా పంపిణీ చేసే వాడుకదారులు ఉల్లంఘన గురించి తెలియజేయబడతారు. మా విధానాల పట్ల తీవ్రమైన లేదా పునరావృత ఉల్లంఘనలు ఒక వాడుకదారు అకౌంట్ ప్రాప్యతను ప్రభావితం చేస్తాయి.


లైంగికంగా బహిర్గతమైనదిగా మీరు నమ్మే ఒక Snap ని మీరు ఎప్పుడైనా అందుకున్నా లేదా చూసినా – మీరు పూర్తిగా అసౌకర్యంగా భావిస్తూ ఉంటే - మా ఇన్-యాప్ రిపోర్టింగ్ మెనూ ఉపయోగించడానికి ఏ మాత్రమూ వెనుకాడవద్దు. నివేదించే వినియోగదారుల గోప్యత మరియు భద్రతను పరిరక్షించడానికి సహాయపడగల మార్గాల్లో ఆ నివేదికలు సమీక్షించబడతాయి. స్వాగతించదగని సందేశాలను మూసివేయడాన్ని పరిగణించాలని కూడా మేము వినియోగదారుల్ని ప్రోత్సహిస్తాము. 

స్పాట్‌లైట్ మరియు కనుగొనండి తో సహా మా అధిక-చేరువ ఉండే ఉపరితలాలు, చెప్పకనే చేసే పర్యవేక్షణ మరియు ఇతర సంరక్షణ చర్యలకు లోబడి ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు అప్పుడప్పుడు లైంగికంగా బహిర్గతం కాదని భావించబడే సూచనాత్మక కంటెంట్‌ను కలిగి ఉండవచ్చు (ఉదాహరణకు, ఈత దుస్తులను వదిలివేయడం); అయినప్పటికీ, మా కమ్యూనిటీ మార్గదర్శకాలతో స్థిరత్వంగా లేనట్లుగా మీరు భావించే ఏదైనా కంటెంట్‌ను నివేదించడానికి వాడుకదారులు గట్టిగా ప్రోత్సహించబడుతున్నారు.

మా ప్లాట్‌ఫామ్ పైన బాలల లైంగిక దోపిడీ మరియు దురుపయోగపు చిత్రావళి (CSEAI)ని నివారించడం, కనుక్కోవడం మరియు నిర్మూలించడం మా తొలి ప్రాధాన్యతగా ఉంటుంది, మరియు ఈ CSEAI మరియు ఇతర రకాల బాలల లైంగిక దోపిడీ కంటెంటును ప్రస్తావించడానికి మేము మా సామర్థ్యాలను నిరంతరాయంగా పెంపొందించుకుంటూ ఉంటాము. మేము ఈ విధానాల పట్ల ఉల్లంఘనలను, చట్టముచే ఆవశ్యకమైనట్లుగా, తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల U.S. జాతీయ కేంద్రము (NCMEC)నకు మేము నివేదిస్తాము. ఆ తరువాత, NCMEC, అవసరమైన విధంగా దేశీయ లేదా అంతర్జాతీయ చట్టం అమలుతో సమన్వయం చేసుకుంటుంది.


నేర్చుకొని వెళ్ళండి



Snap చాటర్ లు తమకు తాము వ్యక్తం చేసుకోగల ఒక సురక్షితమైన కమ్యూనిటీని పెంపొందించడం మా లక్ష్యం, మరియు మేము లైంగికంగా బహిర్గతమైన లేదా దోపిడీతో కూడిన కంటెంట్‌ను సహించము. మీకు ఎప్పుడైనా అసౌకర్యంగా అనిపిస్తే, మీ జీవితంలో ఒక విశ్వసనీయ వ్యక్తికి తెలియజేయడానికి, ఉల్లంఘిస్తున్న కంటెంట్‌ను నివేదించడానికి మరియు ఎవరైనా నేరపూరిత వాడుకదారులను బ్లాక్ చేయడానికి వెనుకాడవద్దు.