ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, మరియు హింసాత్మక తీవ్రవాదం
కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి
అప్‌డేట్ చేయబడింది: ఫిబ్రవరి 2025
అవలోకనము
ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే ద్వేషపూరిత కంటెంట్ మరియు కార్యకలాపాలకు Snapchat పై ఎటువంటి చోటు లేదు. Snapచాటర్లు భద్రత మరియు శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే మరియు ప్రాధాన్యత ఇచ్చే వాతావరణాన్ని సృష్టించేందుకు, మరియు హింస మరియు వివక్ష నుండి కమ్యూనిటీలను రక్షించేలా సహాయపడేందుకు మా పాలసీలు పనిచేస్తాయి.
ద్వేషపూరిత ప్రసంగం లేదా ద్వేషపూరిత చిహ్నాల వాడకంతో సహా ద్వేషపూరిత ప్రవర్తనలో పాల్గొనడం ఎప్పటికీ ఆమోదించబడదు. ఉగ్రవాదం లేదా హింసాత్మక తీవ్రవాద చర్యల కోసం మద్దతునిచ్చే లేదా సలహా ఇచ్చే కార్యకలాపాలు అదే విధంగా నిషేధించబడ్డాయి మరియు తప్పనిసరి అయితే చట్ట అమలు అధికార యంత్రాంగానికి తెలియజేయబడవచ్చు.
ఈ విధానాలు బాధ్యతాయుతంగా అమలు చేయబడేలా చూసుకునేందుకు సహాయపడటానికి, మా జట్లు పౌర హక్కుల సంస్థలు, మానవ హక్కుల నిపుణులు, చట్టమును అమలుచేయు ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు మరియు భద్రతా న్యాయసలహాదారుల నైపుణ్యం మరియు పనితనాన్ని సంప్రదిస్తారు. మేము మామూలుగా నేర్చుకుంటున్నాము, మరియు Snapచాటర్లను క్షేమంగా ఉంచడానికి మా ఉత్పత్తులు మరియు పాలసీలు పనిచేసేలా చూసుకోవడానికి అవసరమైన చోట మార్పులు (క్యాలిబ్రేట్) చేస్తాము. మాకు సహకరించడానికి, ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదంపై మా పాలసీలను ఉల్లంఘించే ఏదైనా ద్వేషపూరిత కంటెంట్ లేదా కార్యకలాపాలను సకాలంలో నివేదించమని మేము వాడుకదారులను ప్రోత్సహిస్తాము.
నిషేధిత ప్రవర్తన
మేము ఈ క్రిందివాటిని నిషేధిస్తాము:
ఉగ్రవాద సంస్థలు, హింసాత్మక తీవ్రవాదులు లేదా ద్వేష సమూహాల ఉద్దేశ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి Snapchat యొక్క వాడకం.
హింసాత్మక తీవ్రవాదం, తీవ్రవాదం లేదా ద్వేషాన్ని కీర్తించే, ప్రశంసించే, తోడ్పడే లేదా సమర్థించే కంటెంట్.
సైద్ధాంతిక లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళడానికి గాను వ్యక్తులు లేదా సమూహాలు పాల్పడిన ఉగ్రవాదం లేదా ఇతర హింసాత్మక, నేరపూరిత చర్యలను ప్రోత్సహించే కంటెంట్ అంతా. ఈ నియమాలు విదేశీ ఉగ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద ద్వేషపూరిత సమూహాలను ప్రోత్సహించే లేదా మద్దతు ఇచ్చే ఏదైనా కంటెంట్‍ను కూడా నిషేధిస్తాయి––ప్రతిష్టాత్మక, తృతీయ-పక్ష నిపుణులచే నియమించబడినట్లుగా––అదేవిధంగా అటువంటి సంస్థలు లేదా హింసాత్మక తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన నియామకాలను కూడా నిషేధిస్తాయి.
దురుపయోగపరచే, కించపచే, పరువుపోయే, వివక్ష లేదా హింసను ప్రోత్సహించే ద్వేషపూరిత ప్రసంగం లేదా కంటెంట్, జాతి, రంగు, మతం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు లేదా పున:నియమం, వైకల్యం, లేదా మునుపటి అధికారిక స్థితి, వలస స్థితి, వయస్సు లేదా గర్భధారణ స్థితి ఆధారంగా ద్వేషాన్ని ప్రేరేపించేలా చూపించే ద్వేషపూరిత ప్రసంగం లేదా కంటెంట్. ఈ నియమాలు, ఉదాహరణకు, జాతి, జాతీయత, స్త్రీద్వేషపూరిత లేదా స్వలింగ దూషణల వాడకాన్ని నిషేధిస్తాయి. అవి ఒక రక్షిత గ్రూప్ పై అపహాస్యం లేదా వివక్ష పిలుపు మరియు ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తెచ్చే లేదా లింగపరంగా తప్పుగా చెప్పుకునే భావనల్ని కూడా నిషేధిస్తాయి. ద్వేషపూరిత ప్రసంగం అనేది మానవ విషాదాల (నరమేధం, అపరాధ వివక్ష లేదా బానిసత్వం వంటివి) ––నేరస్థులను సమర్థించడం లేదా బాధితులను కించపరచడం––కూడా చేరి ఉంటుంది. నిషేధించబడిన ఇతర ద్వేషపూరిత కంటెంట్ యందు, ద్వేషపూరిత చిహ్నాల వాడకం, అంటే ఇతరుల పట్ల ద్వేషం లేదా వివక్షను తెలియజేసే ఏవైనా చిత్రాలు చేరి ఉంటాయి.
వాడుకదారులను రక్షించడానికి మా కృషి
వాడుకదారులను రక్షించే మా విధానంలో భద్రత మరియు గోప్యతను సమతుల్యం చేయాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము. బహిరంగ స్థలాలపై (స్పాట్‌లైట్, పబ్లిక్ స్టోరీలు మరియు మ్యాప్స్ వంటివి) ద్వేషం, ఉగ్రవాదం, లేదా హింసాత్మక తీవ్రవాదానికి వాడుకదారులు గురికాకుండా నిరోధించడానికి మేము ఆటోమేటెడ్ టూల్స్ మరియు మానవ సమీక్ష కలయికను ఉపయోగిస్తాము.
ఉగ్రవాద లేదా హింసాత్మక తీవ్రవాద సంస్థల ఉద్దేశ్యాలకు మద్దతునిచ్చి, కీర్తించి లేదా ముందుకు నడుపుతుందని మేము నమ్మడానికి కారణం ఉన్న కంటెంట్‌ను గుర్తించడానికి Snap ఆటోమేటెడ్ టూల్స్‌ను ఉపయోగిస్తుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే గ్లోబల్ ఇంటర్నెట్ ఫోరం (GIFCT) లో సభ్యునిగా, తెలిసిన ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను గుర్తించడానికి మరియు తొలగించడానికి మేము GIFCT వనరులను ఉపయోగిస్తాము. అట్టి కంటెంట్‌ను కచ్చితంగా గుర్తించి, చర్య తీసుకోవడానికి గాను వృద్ధి చెందుతున్న పోకడలపై వర్తమానంలో ఉండటానికి మేము తృతీయ పక్ష విక్రేతలు ఇంకా నిపుణులతో కూడా పనిచేస్తాము. హింసాత్మక తీవ్రవాద నెట్వర్క్‌లను గుర్తించి, అంతరాయం కలిగించడానికి మేము సిగ్నల్-ఆధారిత గుర్తింపు పద్ధతులను కూడా ఉపయోగిస్తాము.
ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాదానికి సంబంధించిన కంటెంట్ వ్యాప్తి కాకుండా నిరోధించడానికి మేము చట్ట అమలు సంస్థలతో తగు రీతిలో పనిచేస్తాము. కఠినమైన చట్టబద్ధమైన భద్రతలకు లోబడి సంభావ్యతగా ఆసన్నమయ్యే హానికరమైన పరిస్థితుల పట్ల స్పందించడానికి ప్రత్యేకమైన ఛానల్స్ తో సహా, ప్రపంచవ్యాప్తంగా చట్ట అమలు అధికారులకు సహాయపడే సుస్థిర ప్రోటోకాల్స్ నిర్వహించడం Snap యొక్క విధానం. చట్ట అమలు చర్యల కోసం మరింత సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు.
సారాంశం
Snapchat పై మేము ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాదం, లేదా హింసాత్మక తీవ్రవాదాన్ని సహించము. మా పాలసీలు, అమలు వ్యూహం మరియు ఉత్పత్తి రూపకల్పన ద్వారా, Snapచాటర్ల భద్రతకు తోడ్పడే మరియు ప్రాధాన్యత ఇచ్చే వాతావరణాన్ని నిర్వహించడానికి మేము శ్రద్ధగా పనిచేస్తాము.
మా విధానాలను ఉల్లంఘించే ఏదైనా కంటెంట్‌ను నివేదించడం ద్వారా వాడుకదారులు మా కమ్యూనిటీని రక్షించడానికి మాకు సహాయపడవచ్చు. మేము మా భద్రతా ఉద్దేశ్యాలను బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్ళేలా చూసుకొని సహాయపడేందుకు గాను భద్రతా కమ్యూనిటీ వ్యాప్తంగా వైవిధ్యమైన నాయకులతో కలిసి పనిచేయడానికి కూడా మేము కట్టుబడి ఉన్నాము. మా భద్రతా ప్రయత్నాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి మా భద్రతా కేంద్రమును సందర్శించండి.
అడ్వర్టైజింగ్ విధానాల అవలోకనం