పాలసీ సెంటర్

అడ్వర్టైజింగ్ విధానాలు

Snapchat అనేది ప్రజలు తమను తాము వ్యక్తపరచడానికి, ఆ క్షణంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలసి ఆనందించే శక్తిని అందించే ఒక సాధికార యాప్. ఇది మీ స్నేహితులతో ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తిస్థాయిలో మానవ భావోద్వేగాలను కమ్యూనికేట్ చేయడానికి అత్యంత సులభమైన మరియు వేగవంతమైన మార్గం.

ఈ సాధికారతా స్ఫూర్తితో, ప్రకటనదారులు తమ ఉత్పత్తులు, సేవలు, మరియు కంటెంట్‌కు సంబంధించి, మా విస్తృత కమ్యూనిటీకి అనుగుణంగా ఉండేలా మరియు Snapచాటర్ల గోప్యతకు సంబంధించి ఏవిధంగా రాజీపడకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాము.

ఈ అడ్వర్టైజింగ్ విధానాలు Snap సేవ అందించే అన్నిరకాలైన ప్రకటనలు (“యాడ్స్”)––ఏవైనా సృజనాత్మక విషయాలు, ల్యాండింగ్ పేజీ లేదా ప్రకటనలలోని ఇతర సంబంధిత భాగాలు––మరియు మీరు ఇచ్చే ప్రకటనలన్నీ వాటికి అనుగుణంగా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మీపై ఉంటుంది.

ప్రకటనదారులు, Snap యొక్క సేవా నిబంధనలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు, మరియు మా సేవల వినియోగాన్ని నియంత్రించే ఇతర అన్ని Snap విధానాలను పాటించవలసి ఉంటుంది. మేము మా నిబంధనలు, విధానాలు మరియు మార్గదర్శకాలను కాలానుగుణంగా అప్‍డేట్ చేస్తుండవచ్చు, అందువల్ల వాటిని నిరంతరం సరిచూసుకొంటూ, సమీక్షించుకోండి.

ప్రకటనలన్నీ మా సమీక్ష మరియు ఆమోదానికి లోబడి ఉంటాయి. మేము తీవ్రంగా పరిగణించే వినియోగదారు ఫీడ్‌బ్యాక్‌కు ప్రతిస్పందనతో సహా, ఏ కారణంచేతనైనా మా విచక్షణ మేరకు ఏదైనా ప్రకటనను పూర్తిగా తిరస్కరించే లేదా తొలగించే హక్కును మేము కలిగివుంటాము. ఏదైనా ప్రకటనలో క్లెయిమ్ చేసినట్లుగా ఉండే వాటికి వాస్తవాల ధ్రువీకరణను కోరవొచ్చు లేదా మీ ప్రకటనకు సంబంధించి‍ మీరు ఏదైనా లైసెన్స్ లేదా ఆథరైజేషన్ కలిగివున్నట్లయితే సాక్ష్యాలుగా అవసరమైతే డాక్యుమెంట్లు దాఖలు పరచవలసిఉంటుంది, మేము ఏదైనా ప్రకటనకు మార్పులు చేయవలసిందిగా కోరడానికి మాకు హక్కు ఉంటుంది.

Snap యొక్క వ్యాపార విధానాలను ఉల్లంఘించే ఏదైనా వ్యాపార సంస్థలు లేదా వ్యక్తులకు సంబంధించిన అకౌంటులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు లేదా పూర్తిగా రద్దుచేయవచ్చు.

Snapచాటర్లు ప్రకటనలను ఇతరులతో పంచుకోవచ్చు లేదా ప్రకటనలను తమ పరికరాలకు సేవ్ చేసుకోవచ్చు. యాడ్లకు క్యాప్షన్‌లు, డ్రాయింగ్‌లు, ఫిల్టర్‌లు, లేదా ఇతర క్రియేటివ్ ఎలిమెంట్‌లను అప్లై చేయడానికి Snapchatలో మేం అందుబాటులో ఉంచిన టూల్స్ మరియు ఫీచర్‌ల్లో ఏదైనా వారు ఉపయోగించవచ్చు, లేదా మీరు ఆడియన్స్ నెట్‌వర్క్‌లో యాడ్స్ రన్ చేస్తున్నట్లయితే, యాడ్ రన్ అయ్యేటప్పుడు అందుబాటులో ఉండే ఏవైనా టూల్స్ లేదా ఫీచర్‌లను వారు ఉపయోగించవచ్చు. వయస్సు-లక్షిత యాడ్లను Snapchat లోపల ఏదైనా వయస్సు కలిగిన Snapచాటర్స్‌తో పంచుకోవచ్చు. ఒకవేళ మీరు యాడ్ షేరింగ్‍ను పరిమితం చేయడం మరియు Snapchatలో మీ యాడ్ లను సేవ్ చేయడం గురించి తెలుసుకోవడానికి, దయచేసి మీ అకౌంట్ ప్రతినిధిని సంప్రదించండి లేదా మా బిజినెస్ హెల్ప్ సెంటర్‌ను సందర్శించండి.

మేము ప్రకటనలకు సంబంధించిన సమాచారం ప్రచురించవచ్చు (సృజనాత్మక, లక్ష్యం, చెల్లింపు జరిపే సంస్థ, సంప్రదింపు సమాచారం, మరియు అట్టి ప్రకటనలకు జరిపిన చెల్లింపులతో సహా) లేదా తృతీయ పక్షాలతో ఆ సమాచారాన్ని పంచుకొంటాము, దీనిలో (a) మీ ప్రకటనలు మీడియా భాగస్వామికి సంబంధించిన కంటెంట్‍లో ఉండేటట్లయితే, అట్టి మీడియా భాగస్వామ్యులు; మరియు (b) ప్రకటనలకు సంబంధించి ఉపయోగించడానికి మీరు ఎంచుకొన్న తృతీయ పక్షాలు లేదా సేవలు.

మేము మా సేవా నిబంధనలలోపేర్కొన్నట్లుగా, మీరు ఒక తృతీయ పక్షంచే ఆపరేట్ చేయబడే ఒక సేవ, ఫీచల్ లేదా ప్రక్రియను ఉపయోగిస్తే మరియు మా సేవలద్వారా అందించినా (మేము తృతీయ పక్షంతోసహా కలసి అందించే సేవలతో సహా), అట్టి పార్టీతో మీ సంబంధమనేది, దానిలోని ప్రతి పార్టీ యొక్క నిబంధనలకు లోబడి ఉంటాయి. Snap మరియు దాని భాగస్వాములు తృతీయపక్ష నిబంధనలు లేదా చర్యలకు బాధ్యత వహించరు.

తరువాత రాబోయేది:

సాధారణ ఆవశ్యకతలు

Read Next