అడ్వర్టైజింగ్ విధానాలు

సాధారణ ఆవశ్యకతలు

లక్ష్యం చేసుకోవడం మరియు అనుసరణ

ప్రకటనలన్నీ ఆ ప్రకటనలు వెలువడే ప్రతి భౌగోళిక ప్రాంతంలోని ఎంపిక చేయబడిన ఆడియన్స్ కొరకు ఖచ్చితంగా అనువైనవిగా ఉండాలి. Snapchat అనేది ఒక 13+ యాప్, అందువల్ల 13 సంవత్సరాలకంటే తక్కువ వయస్సున్న వారిని ఉద్దేశించే లేదా వారికి విన్నవించేవిగా ఉండే ప్రకటనలను మేము తిరస్కరిస్తాము.

ప్రకటనలు, అవి ప్రకటించబడే ప్రతి భౌగోళిక ప్రాంతానికి సంబంధించి వర్తించే అన్నిచట్టాలు, శాసనాలు, ఆర్డినెన్స్‌లు, నియమాలు, మరియు సాంస్కృతిక సున్నితత్వానికి అనుగుణంగా ఉండాలి. దయచేసి గమనించండి:

  • కొన్ని ఉత్పత్తులు లేదా సేవల యాడ్స్ లింగం, వయస్సు, లేదా స్థానం ఆధారంగా లక్షితం కాకపోవచ్చు.

  • కొన్ని ప్రదేశాలకు భాషా అవసరాలు ఉంటాయి.

  • ఒక యుఎస్-ఆధారిత సంస్థగా ఉన్న Snap, యు.ఎస్. వాణిజ్య ఆంక్షలు లేదా యు.ఎస్. ఎగుమతి నియంత్రణా చట్టాలకు లోబడి ఉండే దేశాలలోని ప్రదేశాలను లక్ష్యం చేసుకొన్నా లేదా వాటికి చెల్లించబడిన అట్టి ప్రకటనలను అంగీకరించదు.

డిస్క్లోజర్

ప్రకటనలలో ఉన్న అన్ని డిస్క్లోజర్లు, డిస్క్లైమర్లు, మరియు హెచ్చరికలు స్పష్టంగా మరియు ప్రస్ఫుటంగా ఉండాలి (మరింత వివరాల కొరకు ప్రకటన వివరణము మరియు మార్గదర్శకాలను చూడండి) మరియు ప్రకటనదారులను ప్రకటనలో ఖచ్చితంగా మరియు స్పష్టంగా గుర్తించబడాలి.

గోప్యత: డేటా సేకరణ మరియు వినియోగం

ఈ క్రింది వాటి ఆధారంగా లేదా వాటితో సహా ప్రకటనలు సున్నితమైన సమాచారమును లేదా ప్రత్యేక కేటగరీ డేటాను సేకరించకపోవచ్చు: (i) ఒక ఆరోపిత లేదా వాస్తవ నేరానికి పాల్పడి ఉండటం (ii) ఆరోగ్య సమాచారము; లేదా (iii) వాడుకదారుల ఆర్థిక స్థితి, జాతి లేదా జాతి మూలం, మతపరమైన నమ్మకాలు లేదా ప్రాధాన్యతలు, లైంగిక జీవితం లేదా లైంగిక ప్రాధాన్యతలు, రాజకీయ అభిప్రాయాలు, లేదా ట్రేడ్ యూనియన్ సభ్యత్వం గురించిన సమాచారం. మేము గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు లేదా ప్రజా ఆరోగ్య సంస్థల నుండి మాత్రమే ఆరోగ్య-సంబంధిత సర్వేలను అనుమతిస్తాము.

ఏదైనా వ్యక్తిగత సమాచారం సేకరించబడే చోట ప్రకటనదారు యొక్క గోప్యతా విధానం తక్షణమే అందుబాటులో ఉండాలి.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా సేకరించి, ప్రాసెస్ చేయాలి. తప్పుడు సాకులతో వ్యక్తిగత సమాచారాన్ని అందించమని వినియోగదారులను మోసం చేసే ప్రకటనలు నిషేధించబడ్డాయి.

యాడ్స్ వినియోగదారుడి వ్యక్తిగత డేటా, సున్నితమైన సమాచారం, ఆన్‌లైన్ కార్యాచరణ లేదా ఖచ్చితమైన ఆచూకీ గురించి పేర్కొనకూడదు లేదా తెలపకూడదు.

మేధో సంపత్తి

ఉల్లంఘించే కంటెంట్

ప్రకటనలు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ మేధోసంపత్తి, గోప్యత, ప్రచారం లేదా ఇతర చట్టపరమైన హక్కులను ఉల్లంఘించరాదు. ప్రకటనదారులు వారి ప్రకటనల యొక్క అన్ని అంశాలకు అవసరమైన అన్ని హక్కులు మరియు అనుమతులను కలిగి ఉండాలి. ప్రకటనలలో పేరు, పోలిక (చూడటానికి ఒకేవిధంగా ఉండటంతో సహా), స్వరం (పలకడం ఒకేవిధంగా ఉండటంతోసహా), లేదా వ్యక్తుల సమ్మతి లేకుండా ఎవరైనా వ్యక్తిని గుర్తించే ఇతర లక్షణాలు ఉండరాదు.

దిగువ పేర్కొన్నవి నిషేధించబడ్డాయి:

  • ఇతరుల మేధోసంపత్తి హక్కులకు భంగం కలిగించడానికి ప్రధానంగా ఉపయోగించబడే ఉత్పత్తులు లేదా సేవల ప్రకటనలు, కాపీరైట్ రక్షణ యంత్రాంగాన్ని దాటవేయడం (ఉదాహరణకు సాఫ్ట్‌వేర్ లేదే కేబుల్ సిగ్నల్ డిస్క్రాంబ్లర్లు) వంటివాటిని చూపేలా రూపొందించడం.

  • డిజైనర్ లేదా అధికారికంగా లైసెన్స్ పొందిన ఉత్పత్తుల అనుకరణలు వంటి నకిలీ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రధానంగా అంకితమైన ఉత్పత్తులు లేదా సేవల యొక్క యాడ్స్.

  • తప్పుడు ప్రముఖుల వాంగ్మూలాలు లేదా వాడకం గల ఉత్పత్తులు లేదా సేవల కోసం ప్రకటనలు.


Snapchatపై అందించిన ప్రకటన ద్వారా మీ కాపీరైట్, ట్రేడ్‌మార్క్ లేదా ప్రచార హక్కులు ఉల్లంఘించబడ్డాయని మీరు విశ్వసిస్తే, అడ్వర్టైజర్ని నేరుగా సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హక్కు కలిగివున్నవారు మరియు వారి ప్రతినిధులు, మేధో సంపత్తి హక్కులు హరించబడినాయని Snapకు ఇక్కడనివేదించవచ్చు. మేము అటువంటి నివేదికలను తీవ్రంగా పరిగణిస్తాం.

Snap కు రిఫరెన్స్ లు

యాడ్స్, ఏదైనా Snap లేదా దాని ఉత్పత్తులతో అనుబంధాన్ని లేదా ఆమోదాన్ని సూచించరాదు. దీనికి Snapchat కలిగివుండే ఏవిధమైన ట్రేడ్‌మార్క్ లేదా కాపీరైట్, బిట్‌మోజీ ఆర్ట్‌వర్క్ లేదా Snapchat యూజర్ ఇంటర్‌ఫేస్‌ను, Snapchat బ్రాండ్ మార్గదర్శకాలు లేదా Bitmoji బ్రాండ్ మార్గదర్శకాలు అనుమతించబడినట్లు మినహాయించి ఉపయోగించరాదని అర్థం. అలానే యాడ్స్ లో Snap-స్వంత ట్రేడ్‌మార్క్‌ల మార్చబడ్డ లేదా తికమకపెట్టే అదేవిధమైన వేరియేషన్‌లను కలిగి ఉండరాదు.

సృజనాత్మక నాణ్యత మరియు ల్యాండింగ్ పేజి

అన్ని ప్రకటనలు ఖచ్చితంగా అధిక నాణ్యత మరియు ఎడిటోరియల్ ప్రమాణాలను కలిగి ఉండాలి. మా ప్రతి ప్రకటనా ఉత్పత్తులకై నిర్ధారించిన సాంకేతిక మరియు సృజనాత్మక స్పెసిఫికేషన్లకై దయచేసి మా బిజినెస్ హెల్ప్ సెంటర్ యొక్క, స్పెక్స్ మరియు క్రియేటివ్ మార్గదర్శకాల విభాగాన్ని సందర్శించండి. ఈ మార్గదర్శకాలను అనుసరించని ప్రకటనా సృజనాత్మకతలు తిరస్కరించబడతాయి.

ప్రకటనలను మేము సమీక్షించే సమయంలో, ఆ ప్రకటన యొక్క సృజనాత్మకత అనేది ("టాప్ Snap", ఫిల్టర్ లేదా స్పాన్సర్డ్ లెన్స్) వంటివాటికి సంబంధించిన పాలసీలే కాక, ప్రకటనల ల్యాండింగ్ పేజీ లేదా సంబంధిత అంశాలను కూడా వర్తింపజేస్తాము. ల్యాండింగ్ పేజీలతో ఉండే మేము తిరస్కరించే ప్రకటనలలో క్రిందివి ఉంటాయి:

  • తక్కువ నాణ్యత (ఉదా., పనిచేయని లింక్‌లు, క్రియాశీలకంగా లేని లేదా మొబైల్ ఫోన్లకు అనుగుణంగా ఫార్మట్ చేయబడని పేజీలు)

  • అంతరాయం కలిగించేవి (ఉదా., అనుకోని యూజర్ అనుభవాలు, ఒక్కసారే వచ్చే పెద్దవైన ధ్వనులు, తీవ్రమైన ఫ్లాషింగ్)

  • అసంబద్ధ (ఉదా., ప్రకటించే ఉత్పత్తి లేదా సేవకు సరిపోలని పేజీలు, లేదా యూజర్‌ను మరిన్ని ప్రకటనలు చూడవలసిన అవసరం కలిగించేలా అనవసర కొనుగోలు ప్రక్రియవైపు మళ్ళించే విధంగా పేజీలు)

  • సురక్షితం కానివి (ఉదా., ఆటోమేటిక్‌గా ఫైళ్ళను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించడం లేదా యూజర్ సమాచారానికై ఫిష్ చేసేందుకు ప్రయత్నాలు)

ప్రమోషన్లు

Snapchatలో ప్రమోషన్ లు Snap యొక్క ప్రమోషన్ నియమాలకు లోబడి ఉంటాయి.

తరువాత రాబోయేది:

ప్రకటనలు క్యాటగిరీ అవసరాలు

Read Next