Snapchat కమ్యూనిటీలో ప్రపంచంలోని అన్ని రకాలైన యూజర్లు ఉంటారు. ఒక స్వాగత వేదికను ప్రోత్సహించేందుకు గాను, మేము భద్రత మరియు చేకూర్పుకు మేము చూపే అంకితభావాన్ని తక్కువగా చూసేలా ఉండే విద్వేషపూరిత, వివక్షాపూరిత లేదా తీవ్రవాద కంటెంట్‌ని నిషేధిస్తాము.
విద్వేషపూరిత ప్రసంగం అనేది జాతి, రంగు, కులం, జాతీయత, జాతీయ మూలం, మతం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వెటరన్ స్థితి, ఇమిగ్రేషన్ స్థితి, సామాజిక-ఆర్థిక స్థితి, వయస్సు, బరువు లేదా గర్భస్థ స్థితి ఆధారంగా తక్కువ చేయడం, కించపరచడం లేదా వివక్ష లేదా హింసను ప్రోత్సహించే కంటెంట్.
పైన పేర్కొనబడిన కేటగిరీలకు సంబంధించిన ఏదైనా మూసగా ఉండే కథనాలను నివారించండి.
మేము Snapchatters అందరినీ కలుపుకొనిపోయే ఒక సమగ్ర కమ్యూనిటీని నిర్మించడానికి ప్రయత్నిస్తాము. సాంస్కృతికంగా-సున్నితంగా ఉండే చిత్రావళి యొక్క అనుచిత వాడుకను నివారించండి.