logoSnap Values

మా గోప్యతా విధానాన్ని నవీకరించాము. ఈ నవీకరించిన గోప్యతా విధానం 2026 సెప్టెంబర్ 21 నుండి అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 21, 2026 వరకు వినియోగదారులందరికీ వర్తించే మునుపటి గోప్యతా విధానాన్ని మీరుఇక్కడ చూడవచ్చు.

గోప్యతా విధానం

అమల్లోనికి వచ్చేది: సెప్టెంబర్ 21, 2026

Snap Inc. గోప్యతా విధానానికి స్వాగతం. ఈ విధానం మేము మీ డేటాను ఎలా సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము మరియు మీరు మీ సమాచారాన్ని ఎలా నియంత్రించవచ్చు అనేదానిని వివరిస్తుంది. మా గోప్యతా విధానాలపై ఒక సంక్షిప్త సారాంశం కోసం వెతుకుతున్నారా? ఈ పేజీ లేదా ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట ఉత్పాదన గోప్యతా సమాచారం కోసం వెతుకుతున్నట్లయితే, ఉదాహరణకు, మేము మీ చాట్‌లు మరియు Snaps ఎలా ప్రాసెస్ చేస్తామని, మా ఉత్పాదన ద్వారా గోప్యత పేజీని చూడండి. ఈ డాక్యుమెంట్లకు అదనంగా, మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీకు మరింత సమాచారం అందించే ఇన్-యాప్ నోటీసులను కూడా మేము చుపిస్తాము. మీరు SPECS వినియోగదారు అయితే, మీ డేటాను మేము ఎలా సేకరిస్తాము మరియు ఎలా ఉపయోగిస్తాము అనే విషయాల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోవచ్చు.

పారదర్శకత అనేది Snapలోని ప్రధాన విలువలలో ఒకటి. మేము డేటాను ఎలా సేకరిస్తాము మరియు ఎలా ఉపయోగిస్తాము అనేవాటిగురించి ఏవిధమైన అనూహ్యమైనవి ఉండకూడదని మేము విశ్వసిస్తాము - అందువల్లనే మేము దానిని ఎలా ప్రాసెస్ చేస్తామో మీకు ముందుగానే తెలియజేస్తాము. ఉదాహరణకు, మీ అనుభవానికి అత్యంత సముచితమైన కంటెంట్ మరియు సమాచారాన్ని మీకు చూపించడం మరియు మరింత సముచిత ప్రకటనలను చూపించడంతోసహా, మీకు మరింత పర్సనలైజ్ చేయబడిన అనుభవాన్ని అందించేందుకు మేము మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఉత్పత్తి అనుభవాన్ని అందించేందుకు మాకు సహాయపడుతుంది.

అంతేకాకుండా, పర్సనలైజ్ చేయబడిన అనుభవం, మీ గోప్యతను పణంగాపెట్టడం ద్వారా పొందకూడదని మేము విశ్వసిస్తాము. నిజజీవితంలో మాదిరిగానే, కొన్ని క్షణాలను మీరు మీ సన్నిహిత ఫ్రెండ్స్‌తో పంచుకొంటారు, మరియు మరికొన్నింటిని బహిరంగంగా ఇతరులతో షేర్ చేస్తారు. అందువల్లనే మొదటిరోజునుండి, డీఫాల్ట్‌ గా కంటెంట్‌ను డెలిట్ చేయడం మరియు ఎవరితో షేర్ చేయాలి లేదా ఎప్పుడు సేవ్ చేయాలి వంటి వాటితోసహా వారి కంటెంట్‌తో ఏం జరుగుతోందో నిర్ణయించడానికి అనుమంతించేలా Snap చాటర్లకు తగిన సాధనాలు అందించాలన్నది మా సిధ్ధాంతం.

ఈ విధానం, మా Snapchat యాప్ మరియు మా ఇతర ఉత్పత్తులు, సేవలు మరియు Bitmoji, Specs మరియు మా అడ్వర్టైజింగ్ మరియు వాణిజ్యపరమైన ఆవిష్కరణలవంటి ఫీచర్లను కవర్ చేస్తుంది. మీరు ఈ విధానంలో "సేవలు" అని చదివినప్పుడు, మేము వాటన్నింటి గురించి మాట్లాడతాము. అలాగే, మేము 'నిబంధనలు' అని పేర్కొన్నప్పుడు, మీరు మా సేవలకు నమోదు (Sign Up) చేసుకునే సమయంలో అంగీకరించే సేవా నిబంధనలను (టర్మ్స్ ఆఫ్ సర్వీస్) ఉద్దేశిస్తున్నాము. చివరిగా, ఒకవేళ మీరు Snap చాటర్ అనే పదం చూస్తే, అది మా సేవలను ఉపయోగించే ఏ వినియోగదారుడినైనా సూచించేందుకు మేము ఉపయోగించే ఒక చిన్ని సంకేతమని గమనించండి.

మీ సమాచారంపై మీరు కలిగివున్న నియంత్రణలతో ప్రారంభిద్దాం పదండి:

మీ సమాచారం మీద నియంత్రణ

మీ సమాచారం మరియు సెట్టింగ్‌లపై నియంత్రణ అనేది Snapchat అనుభవంలో ప్రధాన భాగం. మీరు మీ సమాచారాన్ని యాక్సెస్ చేసుకుని, అప్‌డేట్ చేసి మరియు తొలగించవచ్చు, మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చో నిర్ణయించుకోవచ్చు మరియు Snapchat యాప్ నుండి మీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దిగువన, అందుబాటులో ఉన్న సెట్టింగ్లు రకాలపై మేము మీకు మరిన్ని వివరాలను ఇస్తాము, మా డేటా డౌన్‌లోడ్ సాధనానికి లింక్, మరియు మీ డేటా లేదా అకౌంట్ ఎలా తొలగించాలో సూచనలు అందిస్తాము.

మీరు మీ సమాచారాన్ని నియంత్రించాలని మేము కోరుకుంటాము, కాబట్టి మేము మీకు ఈ క్రిందివాటితో సహా ఒక సాధనాల శ్రేణిని అందిస్తాము:

  • మీ సమాచారాన్ని యాక్సెస్ చేసుకొని అప్‌డేట్ చేయండి. మీ పేరు, వినియోగదారు పేరు (యూజర్‌నేమ్), ఇమెయిల్ చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి ఖాతా వివరాలతో (అకౌంట్ డిటైల్స్) సహా, మీ ప్రాథమిక సమాచారంలో ఎక్కువ భాగాన్ని మీరు నేరుగా మా సేవల్లోనే వీక్షించవచ్చు మరియు సవరించవచ్చు. కేవలం మీ సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి మరియు మీకు అందుబాటులో ఉన్న ఎంపికలను మీరు చూస్తారు.

  • మీ సమాచారాన్ని తొలగించండి. ఒకవేళ మీరు మీ అకౌంట్ తొలగించాలనుకుంటే, ఎలాగో ఇక్కడతెలుసుకోండి. మీరు మా సేవల లోపున కూడా కొంత సమాచారాన్ని తొలగించవచ్చు, మీరు మెమొరీస్ కి సేవ్ చేసిన కంటెంట్, My AI తో మీరు పంచుకున్న కంటెంట్, స్పాట్‌లైట్ సమర్పణలు లాగా, మరింకెన్నో.

  • మీ కంటెంటును ఎవరు చూడవచ్చునో నియంత్రించండి. మీరు ఎవరితో మీ కంటెంటును పంచుకుంటారో మీరు ఎంచుకునేలా చేయడానికి మేము అనేక సాధనాలను నిర్మించాము. కొన్ని సందర్భాల్లో మీరు మీ కంటెంట్‌ను మీ స్నేహితులతో మాత్రమే పంచుకోవాలనుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో, అదే కంటెంట్‌ను ప్రజలందరితో పంచుకోవాలనుకోవచ్చు. మరింత తెలుసుకోవడానికి, ఇక్కడికివెళ్ళండి.

  • మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చునో నియంత్రించండి. Snapchat ఆప్తమిత్రులు మరియు కుటుంబానికి ఉద్దేశించబడింది, అందుకనే మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చునో నిర్ణయించుకోవడానికి సహాయపడే నియంత్రణలను మేము నిర్మించాము. ఒకవేళ మీరు అవాంఛిత కమ్యూనికేషన్‌లను అందుకుంటే, మీరు ఎల్లప్పుడూ ఆవ్యక్తిని బ్లాక్ చేయవచ్చు మరియు రిపోర్టు చేయవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళండి.

  • మీ అనుమతులను మార్చండి. అత్యధిక సందర్భాల్లో, మీరు ఎప్పుడైనా మీ అనుమతులను మార్చవచ్చు. ఉదాహరణకు, డిఫాల్ట్ గా మీరు అందించిన మీ ఫోన్ నెంబర్ మరియు/లేదా ఇమెయిల్ అడ్రస్ ద్వారా మీరు ఇతరులకు కనిపించేలా ఉండవచ్చు. మీరు ఇకపై కనిపించగలిగేలా ఉండకూడదని అనుకుంటే, మీరు ఎల్లప్పుడూ మీ సెట్టింగ్లు మార్చుకోవచ్చు. లేదా సులభంగా స్నేహం చేయడానికి గాను మీరు మీ ఫోన్ పరిచయస్థులు లేదా తృతీయ పక్షం ప్లాట్‌ఫామ్ కాంటాక్టులకు ప్రాప్యతను ఇచ్చి ఉంటే, మీరు ఆ తర్వాత మీ యాప్ సెట్టింగ్లు లో దానిని మార్చుకోవచ్చు. వాస్తవానికి, ఒకవేళ మీరు అలా చేస్తే, మీ కాంటాక్ట్ బుక్ లో స్నేహితుల్ని కనుగొనడం వంటి కొన్ని ఫీచర్లు మరియు సేవలు పని చేయవు.

  • ప్రోత్సాహక సందేశాలను నిలిపివేయండి. SMS లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపించబడిన ప్రోత్సాహక ఇమెయిల్స్ మరియు సందేశాలను వదిలివేసేందుకు లేదా అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఎంపిక ఉంటుంది. అలా చేయడానికి, ఒక అన్‌సబ్స్క్రైబ్ లింక్ లేదా అటువంటి ఫంక్షనాలిటీ వంటి సందేశం లోని సూచనలను అనుసరించండి.

  • మీ డేటా డౌన్‌లోడ్ చేయండి. మీ Snapchat సమాచారం యొక్క ఒక కాపీని ఎగుమతి చేయడానికి మీరు మా డౌన్‌లోడ్ మై డేటా సాధనంలో ఒక అభ్యర్థనను చేయవచ్చు.

  • ప్రాసెసింగ్‌కు అభ్యంతరం చెప్పడం. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదాన్నిబట్టి మరియు మేము ప్రాసెస్ చేస్తున్న నిర్దిష్ట డేటాపై ఆధారపడి, ఆ సమాచారం యొక్క మా ప్రాసెసింగ్‌కు అభ్యంతరం చెప్పడానికి మీకు హక్కు ఉండవచ్చు. ఇది కొంత సాంకేతికంగా ఉండవచ్చు, కాబట్టి దానిని మేము మరింత విపులంగా ఇక్కడవివరించాము.

  • అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతలను సెట్ చేయండి. మీ ఆసక్తుల పట్ల సముచితమైనవని మేము భావించే యాడ్స్ మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తాము, అయితే మీకు తక్కువ వ్యక్తిగతీకృత అనుభవం కావాలనుకుంటే, మీరు Snapchat యాప్ లో మీ అడ్వర్టైజింగ్ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.

  • ట్రాకింగ్. మీరు iOS 14.5 లేదా అంతకు మించిన ఒక ఐఫోన్ ఉపయోగిస్తే, కొన్ని నిర్దిష్ట అవసరాలు వర్తించవచ్చు, వాటిని మేము ఇక్కడపేర్కొన్నాము.

మేము సేకరించే సమాచారం

ఈ విభాగం మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము అనే దానిపై మీకు వివరాలను అందిస్తుంది: మీరు మాకు ఏమి అందిస్తారు, మీరు Snapchat ఉపయోగించేటప్పుడు మేము ఏమి సేకరిస్తాము మరియు మీరు Snapchat అకౌంట్ కు కనెక్ట్ చేయబడిన ఇతర కంపెనీలు లేదా యాప్‌ల నుండి మేము అందుకునే సమాచారం. కొన్నిసార్లు, మేము మీ అనుమతితో అదనపు సమాచారాన్ని కూడా సేకరించవచ్చు.

మీరు Snapchat వంటి మా సేవలను ఉపయోగించినప్పుడు, మీరు మాకు అందించే సమాచారాన్ని మేము సేకరిస్తాము, మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు సమాచారాన్ని ఉత్పన్నం చేస్తాము, మరియు కొన్ని సందర్భాల్లో ఇతరుల నుండి డేటా అందుకుంటాము. ఇక వీటిని మరింత వివరంగా విడదీసి చూద్దాం.

మీరు అందించే సమాచారం

మా అనేక సేవలకు ఉపయోగించడానికి మీరు ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేయడానికి, అకౌంట్ వివరాలను మాకు అందించమని మేము మిమ్మల్ని అడుగుతాము. మీరు ప్రొఫైల్ ఏర్పాటు చేసినప్పుడు, మీరు మాకు ప్రొఫైల్ వివరాలు (Bitmoji మరియు ప్రొఫైల్ పిక్చర్ వంటివి) కూడా అందిస్తారు. మీరు మా వాణిజ్య ఉత్పత్తులను ఉపయోగించి ఏదైనా వస్తువును—ఉదాహరణకు, తాజా స్పోర్ట్స్ షూలను—కొనుగోలు చేస్తే, చెల్లింపు మరియు దానికి సంబంధించిన సమాచారాన్ని మేము అడగవచ్చు. ఇందులో మీ భౌతిక చిరునామా (ఉత్పత్తిని మీకు పంపించడానికి, చెల్లింపు వివరాలు, చెల్లింపును ప్రాసెస్ చేయడానికి, అలాగే లావాదేవీల చరిత్ర వంటి సమాచారం ఉండవచ్చు). మీ ప్రాంతం ఆధారంగా, మీరు అందించిన సమాచారాన్ని ఉపయోగించి మీ వయస్సును అంచనా వేయవచ్చు లేదా నిర్ధారించవచ్చు. అవసరమైతే, మీ వయస్సును ధృవీకరించమని కూడా మేము మిమ్మల్ని కోరవచ్చు.

అదనంగా, మీరు మా సేవల ద్వారా పంపే లేదా వాటిలో భద్రపరిచే సమాచారం కూడా మాకు అందుతుంది. ఇందులో మీరు పంపే కంటెంట్, ఆ కంటెంట్‌కు సంబంధించిన సమాచారం, అలాగే మా AI ఫీచర్ల ద్వారా మీరు పంచుకునే లేదా సృష్టించే కంటెంట్ కూడా ఉంటుంది. (ఇన్‌పుట్‌లు లో వచనం (టెక్స్ట్), చిత్రాలు (ఇమేజ్‌లు), వీడియోలు, ఆడియో, ఖచ్చితమైన స్థాన సమాచారం (కచ్చితమైన లొకేషన్), మరియు మీ పరస్పర చర్యలకు (ఎంగేజ్మెంట్) సంబంధించిన సమాచారం—My AIతో మీరు పంచుకునే కంటెంట్ సహా—ఉంటాయి. ఈ ఇన్‌పుట్‌లను ఆధారంగా తీసుకుని కంటెంట్ మరియు ప్రతిస్పందనలు "అవుట్‌పుట్‌లు" రూపొందించబడతాయి). ఈ సమాచారంలో కొంత భాగాన్ని మేము వ్యక్తిగత కంటెంట్ మరియు వ్యక్తిగత కమ్యూనికేషన్‌గా పరిగణిస్తాము ( ఉదాహరణకు, మీ స్నేహితులతో పంచుకున్న Snapలు మరియు చాట్‌లు, వాయిస్ మరియు వీడియో కాల్‌లు, అలాగే My Eyes Onlyలో భద్రపరిచిన కంటెంట్). లేదా మీరు ప్రైవేట్ మరియు ఫ్రెండ్ స్టోరీస్ వంటి ఒక నిర్దిష్ట ఆడియన్స్ తో పంచుకునే కంటెంట్ (ఫ్రెండ్స్, ప్రైవేట్ స్టోరీస్ కు సెట్ చేయబడిన నా స్టోరీ). మరో వైపున, మా సేవల ద్వారా లేదా వాటి లోపున మీరు పంపించే లేదా సేవ్ చేసే కొంత సమాచారం అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ కంటెంట్ అయి ఉండవచ్చు (పబ్లిక్ స్టోరీలు కంటెంట్, ప్రతి ఒక్కరికీ సెట్ చేయబడిన నా స్టోరీ తో సహా, షేర్ చేయబడిన స్టోరీస్, మరియు కమ్యూనిటీ స్టోరీస్, స్పాట్‌లైట్ లేదా Snap మ్యాప్ సమర్పణలు, మరియు పబ్లిక్ ప్రొఫైల్ సమాచారం). మీ Snapలు, చాట్‌లు మరియు ఏదైనా ఇతర కంటెంట్ ని వీక్షించే Snapచాటర్లు ఎల్లప్పుడూ ఆ కంటెంట్ ని స్క్రీన్ షాట్ చేయవచ్చు, సేవ్ చేయవచ్చు, లేదా Snapchat యాప్ బయటకి దానిని కాపీ చేయవచ్చు. కాబట్టి మరొకరు ఎవరైనా సేవ్ చేయకూడదని లేదా షేర్ చేయకూడదని మీరు కోరుకునే సందేశాలను లేదా కంటెంటును దయచేసి మీరు సేవ్ చేయవద్దు లేదా షేర్ చేయవద్దు.

చివరిగా, మీరు మద్దతు బృందంను సంప్రదించినప్పుడు (మద్దతు బృందంతో షేర్ చేయబడిన కంటెంట్ మరియు కమ్యూనికేషన్స్) లేదా మా భద్రతా బృందాన్ని సంప్రదించినప్పుడు, లేదా మా పరిశోధన ప్రయత్నాల ద్వారా సహా ఏ ఇతర విధంగానైనా మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు (సర్వేలకు సమాధానాలు, వినియోగదారు ప్యానల్స్ లేదా ఇతర పరిశోధన ప్రశ్నలకు ప్రతిస్పందించడ వంటివి) మేము మీరు అందించే లేదా మేము మీ ప్రశ్నను పరిష్కరించడానికి అవసరం అయిన ఏ సమాచారమునయినా సేకరిస్తాము.

మీరు మా సేవలను ఉపయోగించునప్పుడు మేము ఉత్పన్నం చేసే సమాచారం

మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు, ఆ సేవలలో వేటిని మీరు ఉపయోగించుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి మేము సమాచారము సేకరిస్తాము. దీని ద్వారా మా వినియోగదారుల సమూహం మా సేవలను ఎలా ఉపయోగిస్తుందో మేము మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతాము. తద్వారా, మా సేవలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన మార్పులు చేయగలుగుతాము.

ఇందులో వినియోగ సమాచారం ఉంటుంది (మీరు మా సేవలతో ఎలా సంభాషించాలో అనే దాని గురించి సమాచారం — ఉదాహరణకు, మీరు ఏ లెన్సెస్ ను చూస్తారు మరియు ఉపయోగిస్తారు, మీ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ , మీరు చూసే స్టోరీస్, మరియు మీరు ఇతర Snapచాటర్లతో ఎంత తరచుగా సంబాషించారో) మరియు కంటెంట్ సమాచారం (మీరు సృష్టించే లేదా అందించే కంటెంట్ గురించి సమాచారం, కెమెరా మరియు క్రియేటివ్ టూల్స్ తో మీ నిమగ్నత, My AI తో మీ పరస్పర చర్యలు, మరియు మెటాడేటా - ఉదాహరణకు, కంటెంట్ గురించి సమాచారం, అది పోస్ట్ చేయబడిన తేదీ మరియు సమయం మరియు దానిని ఎవరు చూశారు వంటిది). కంటెంట్ సమాచారం అంటే చిత్రం, వీడియో లేదా ఆడియోలోని విషయాల ఆధారంగా పొందే సమాచారం. ఉదాహరణకు, మీరు బాస్కెట్‌బాల్ ఆటకు సంబంధించిన Spotlightను పోస్ట్ చేస్తే, Spotlightలో బాస్కెట్‌బాల్‌కు సంబంధించిన మరిన్ని కంటెంట్‌ను మీకు చూపించడానికి ఆ సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అలాగే, మీరు కొన్ని ముఖాల సమూహీకరణ ఫీచర్లను ప్రారంభిస్తే, మీ మెమోరీస్‌లోగుర్తించిన ముఖాలకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి అదే వ్యక్తి ఉన్న Snapsను సులభంగా నిర్వహించడానికి మరియు కనుగొనడానికి మీకు సహాయపడవచ్చు.

ఇందులో పరికర సమాచారం (మీ పరికర హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, డివైస్ మెమరీ, ప్రకటన ఐడెంటిఫైయర్లు, ఇన్‌స్టాల్ చేయబడిన యాప్స్‌, బ్రౌజర్ రకం, మీ పరికరం లేదా దిక్సూచి మరియు మైక్రోఫోన్‌ల కదలికను కొలిచే పరికర సెన్సార్ల నుండి సమాచారం వంటివి, మీ సెట్టింగ్‌లను బట్టి, మీకు హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేయబడ్డాయా, మరియు మీ వైర్లెస్ మరియు మొబైల్ కనెక్షన్‌ల గురించి సమాచారం), IP అడ్రస్ ఆధారిత లొకేషన్ సమాచారం (IP అడ్రస్), కుకీలు మరియు ఇలాంటి టెక్నాలజీల ద్వారా సేకరించిన సమాచారం, (కుకీస్, పిక్సెల్స్ (ఒక వినియోగదారు ఒక వెబ్‌సైట్‌ను సందర్శించారా మరియు ఎంత తరచుగా వంటి వినియోగదారు కార్యాచరణను గుర్తించే చిన్న గ్రాఫిక్ డేటా), వెబ్ స్టోరేజ్, ప్రత్యేకమైన ప్రకటనల ఐడెంటిఫైయర్లు), మరియు లాగ్ సమాచారం (మీరు మా సేవలను ఎలా ఉపయోగించారనే దాని గురించి వివరాలు, యాక్సెస్ సమయాలు, వీక్షించిన పేజీలు, IP అడ్రస్ మరియు కుకీస్ వంటి ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌లు).

మీరు స్పష్టంగా పరికర-స్థాయి అనుమతులను మంజూరు చేసినట్లయితే, పరికర సమాచారంలో మీ డివైస్ ఫోన్‌బుక్ (కాంటాక్ట్స్ మరియు సంబంధిత సమాచారం), మీ డివైస్ కెమెరా, ఫోటోలు మరియు మైక్రోఫోన్ (ఫోటోలు, వీడియోలు తీసే సామర్థ్యం, నిల్వ చేయబడిన ఫోటోలు మరియు వీడియోలను వీక్షించే సామర్థ్యం మరియు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆడియోను రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయడం వంటివి) మరియు ఖచ్చితమైన లొకేషన్ సమాచారం (GPS సిగ్నల్స్ వంటి పద్ధతుల ద్వారా ఖచ్చితమైన స్థానం) కూడా ఉండవచ్చు.

ఇతరుల నుండి మేము అందుకునే డేటా

మేము సేకరించే డేటా యొక్క చివరి కేటగరీ అనేది, మేము ఇతర వినియోగదారులు, మా అనుబంధీకులు, మరియు తృతీయ పక్షాల వంటి ఇతరుల నుండి మేము అందుకునే మీ గురించిన సమాచారం. ఇందులో లింక్ చేయబడిన తృతీయ పక్షం సేవ డేటా చేరి ఉంటుంది (మీరు Snapchat అకౌంట్ ను మరొక సేవ కు లింక్ చేసినప్పుడు మేము పొందే సమాచారం), అడ్వర్టైజర్ల నుండి డేటా (అడ్వర్టైజర్లు, యాప్ డెవలపర్స్, ప్రచురణకర్తలు మరియు ఇతర తృతీయ పక్షాల నుండి యాడ్స్ యొక్క పనితీరును లక్ష్యంగా చేసుకోవడానికి లేదా కొలిచేందుకు సహాయపడేందుకై మేము పొందుతున్న సమాచారం), ఇతర Snapచాటర్లు లేదా తృతీయ పక్షాల నుండి సంప్రదింపు సమాచారం (మీ సమాచారాన్ని కలిగి ఉండే తన సంప్రదింపు జాబితాను మరొక Snapచాటర్లు అప్లోడ్ చేస్తే, మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో బాగా అర్థం చేసుకోవడానికి మేము మీ గురించి కలిగి ఉన్న సమాచారంతో దానిని మిళితం చేయవచ్చు. లేదా, మీరు మాకు మీ సంప్రదింపు సమాచారాన్ని అందిస్తే, మేము SMS, ఇమెయిల్ లేదా ఇతర మెసేజింగ్ సేవల వంటి ఇతర మార్గాల్లో మీతో కమ్యూనికేట్ చేయగలమో లేదో నిర్ధారించడానికి మేము దానిని ఉపయోగించుకోవచ్చు), మరియు మా నిబంధనల యొక్క సంభావ్య ఉల్లంఘనలకు సంబంధించిన డేటా (మేము మా సేవా నిబంధనలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల యొక్క సంభావ్య ఉల్లంఘనల గురించి వెబ్ సైట్ ప్రచురణకర్తలు, సామాజిక నెట్వర్క్ ప్రొవైడర్లు, చట్టం అమలు చేయు అధికారులు మరియు ఇతరులతో సహా, మూడవ పక్షాల నుండి సమాచారాన్ని అందుకోవచ్చు).

మీ అనుమతితో, ఇతర సమాచారము

అదనంగా, మీరు మా సేవలతో పరస్పర చర్య చేసినప్పుడు అదనపు సమాచారాన్ని సేకరించడానికి మేము మీ అనుమతిని కోరే సందర్భాలు ఉండవచ్చు. ఉదాహరణకు, మీ పరికరం యొక్క కెమెరా రోల్ లేదా మీ పరికరం లేదా తృతీయ పక్షం కాంటాక్ట్ బుక్ ను యాక్సెస్ చేసుకోవడానికి ముందు.

మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మేము సేకరించే సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తామో ఈ విభాగం వివరిస్తుంది. ఇతర విషయాలతోపాటు, మేము వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులు మరియు సేవలను వృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికై కష్టించి పనిచేసి మీకు అందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఈ దిగువన, మేము సమాచారాన్ని ఉపయోగించే ప్రతి ఉద్దేశ్యం గుండా వెళుతూ విపులంగా వివరిస్తాము. మేము ఏ ప్రయోజనాల కోసం డేటా సేకరిస్తామో ఆ డేటా మ్యాపింగ్ ను మీరు చూడాలనుకుంటే, మేము ఇక్కడఒక పట్టిక కలిగి ఉన్నాము.

కీప్ థింగ్స్ అప్ మరియు రన్నింగ్ (అంటే, మా సేవలను ఆపరేట్ చేయడం, అందజేయడం మరియు నిర్వహించడం)

మా సేవలను ఆపరేట్ చేయడానికి, అందజేయడానికి మరియు నిర్వహించడానికి గాను, మేము సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక ఫ్రెండ్ కు పంపించాలని మీరు అనుకునే ఒక Snap అందజేయడం, మీరు స్నాప్ మ్యాప్‌లో మీ లొకేషన్‌ను షేర్ చేస్తే, మీ పరిసరాల్లో మీరు ఇష్టపడే స్థలాలు, ఇతరులు మ్యాప్‌లో పోస్ట్ చేసిన కంటెంట్ లేదా, ఒకవేళ మీ స్నేహితులు తమ స్థానాన్ని మీతో షేర్ చేస్తుంటే. మా ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడానికి సహాయపడేందుకు కూడా మేము మీ కొంత సమాచారాన్ని ఉపయోగిస్తాము, ఉదాహరణకు మా సేవలు అత్యంత తాజా ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు పరికరాలతో పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి.

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించండి మరియు సందర్భం అందించండి

మేము Snapచాటర్లకు వ్యక్తిగతీకృతమైన సేవలను అందిస్తాము. మేము దీనిని చేసే మార్గాలలో ఒకటి, మీకు సముచితమైన కంటెంట్ చూపించడం లేదా మీరు మాతో షేర్ చేసుకున్న మీ సమాచారం ఆధారంగా మీరు ఆనందించవచ్చునని మేము భావించేది. అలా చేయడానికై, మీ Snapchat అనుభవానికి సందర్భాన్ని జోడించడానికి గాను సేవల యొక్క వివిధ రంగాల వ్యాప్తంగా మీ గురించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మేము కంటెంట్, మీ లొకేషన్, లేదా రోజు యొక్క సమయం ఆధారంగా లేబుల్స్ తో స్వయంచాలకంగా కంటెంట్ ని ట్యాగ్ చేస్తాము. కాబట్టి ఒకవేళ ఫోటో లో ఒక శునకం ఉంటే, దానిని "శునకం," అనే పదం ద్వారా మెమోరీస్ లో శోధించవచ్చు, మీరు మెమోరీని సృష్టించిన లొకేషన్ వద్ద మ్యాప్ పై చూపించవచ్చు, అదనంగా, మీకు కుక్కలపై ఆసక్తి ఉందని మేము అర్థం చేసుకుని, స్పాట్‌లైట్ వంటి మా ఇతర సేవల్లో మీకు ఆసక్తికరమైన కుక్కల వీడియోలు మరియు కుక్కల ఆహారానికి సంబంధించిన ప్రకటనలను చూపించవచ్చు. మీరు కొన్ని ముఖాల సమూహీకరణ (Face Grouping) ఫీచర్లను ప్రారంభిస్తే, మీ మెమోరీస్ లోని ముఖాలకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి మెమోరీస్ లో శోధన, నిర్వహణ మరియు వ్యక్తిగతీకరణను మెరుగుపరచవచ్చు (ఉదాహరణకు, అదే స్నేహితుడు ఉన్న ఇతర మెమోరీస్ ను మీకు సూచించవచ్చు).

వ్యక్తిగతీకరణ కూడా, ఫ్రెండ్స్ ని సూచించడం లేదా మీరు ఎక్కువగా ఎవరితో Snap చేస్తారో దాని ఆధారంగా Snap పంపించడానికి ఒక కొత్త ఫ్రెండ్ ని సిఫార్సు చేయడానికి సహాయపడగలుగుతుంది. మేం Snap మ్యాప్ లో సిఫార్సు చేయబడిన ప్రదేశాలను చూపించవచ్చు, స్టికర్లు లేదా Snapలు వంటి మా AI ఫీచర్‌లతో కంటెంట్‌ను జనరేట్ చేయవచ్చు, మీ కంటెంట్ లేదా కార్యకలాపాల ఆధారంగా మీ వయస్సు లేదా ఆసక్తులను అంచనా వేయవచ్చు లేదా యాడ్స్‌తో సహా మేము మీకు చూపించే కంటెంట్‌ను అనుకూలీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు స్పాట్‌లైట్ పై బరిస్టా కంటెంట్ చూస్తే, మీ అభిమాన ఎస్ప్రెస్సో మెషిన్ గురించి My AI తో మాట్లాడితే, లేదా మీ మెమొరీస్ లో కాఫీ సంబంధిత Snaps చాలా వాటిని సేవ్ చేస్తే, మీరు ఒక కొత్త నగరాన్ని సందర్శించినప్పుడు లేదా మీకు ఆసక్తికరమైన లేదా సముచితమైన కాఫీ గురించి మీకు కంటెంట్ చూపించినప్పుడు మేము Snap మ్యాప్ పైన కాఫీ షాపులను హైలైట్ చేయవచ్చు. లేదా, మీరు అనేక మ్యూజిక్ వేదికలతో ఇంటరాక్ట్ అయితే, మేము పట్టణంలో రాబోతున్న ప్రదర్శనల కొరకు మీకు యాడ్స్ చూపించడానికి మేము దానిని ఉపయోగించవచ్చు. మీరు ఎవరితో ఎక్కువగా సంభాషిస్తారు మరియు మీ స్నేహితులు ఏమి చేస్తున్నారో దాని ఆధారంగా మీ అనుభవాన్ని రూపొందించడం కూడా వ్యక్తిగతీకరణలో ఇమిడి ఉంటుంది, మీ స్నేహితులు సృష్టించే కంటెంట్‌ను మీకు చూపించడం, స్పాట్‌లైట్ పై లైక్ చేయడం లేదా ఆనందించడం లేదా మీ స్నేహితులతో ప్రాచుర్యం పొందిన సిఫార్సులను చూపించడంతో సహా.

మీకు నిరంతరంగా మరింత సముచితమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం మా లక్ష్యం.

ఉదాహరణకు, ఒకవేళ మీరు ఎంతో ఎక్కువ స్పోర్ట్స్ కంటెంట్ ను వీక్షిస్తూ, ఐతే జుట్టు మరియు మేకప్ చిట్కాలతో కూడిన కంటెంట్ ని వదిలేసినట్లయితే, మా సిఫార్సు అల్గోరిథంలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాయి, కానీ ఆ మేకప్ చిట్కాలకు కాదు. మేము Snapచాటర్ల ప్రాధాన్యతలను ఎలా అర్థం చేసుకుంటామో మరియు కంటెంట్ ని ఎలా ర్యాంక్ చేసి ఆధునీకరిస్తామో దాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

మా Snapచాటర్ల గోప్యత యొక్క ఆకాంక్షలతో వ్యక్తిగతీకరణ యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయడం కూడా కీలకమని మేము నమ్ముతాము. ఉదాహరణకు, మెమొరీస్ లోపల ఉన్న కంటెంట్ ఆధారంగా దానికి మీరు సేవ్ చేసిన Snaps ని మేము స్వయంచాలకంగా ట్యాగ్ చేయవచ్చు (ఉదా.,ఒక డాగ్ కలిగియున్న Snap) మరి ఆ తర్వాత మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులను చేయడానికి, లేదా మీకు యాడ్స్ (డాగ్స్ కలిగియున్న స్పాట్‌లైట్ Snaps మీకు చూపించడం వంటిది) చూపించడానికి ఆ ట్యాగ్ ను ఉపయోగించవచ్చు. మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులు చేయడానికి లేదా మీకు ప్రకటనలను చూపించడానికి మీ స్నేహితులు అయిన వ్యక్తులకు మీరు పంపే ప్రైవేట్ కంటెంట్ మరియు కమ్యూనికేషన్లను మేం ఉపయోగించం.

సంబంధిత యాడ్స్ చూపించడం

మేము వ్యక్తిగతీకృతమైన సేవ అందించే మరొక మార్గం, మేము చూపించే యాడ్స్ ద్వారా ఉంటుంది. యాడ్స్ ను వ్యక్తిగతీకరించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి మరియు కొలిచేందుకు మేము సేకరించిన సమాచారం నుండి మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను మేము ఉపయోగిస్తాము. యాడ్స్ సంబంధితంగా ఉన్నప్పుడు అవి ఉత్తమమైనవని మేము భావిస్తాముు. అందుకనే మేము సరియైన యాడ్స్ ను ఎంపిక చేయడానికి మరియు సరైన సమయంలో మీకు వాటిని చూపించడానికి ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, మీరు వీడియో గేమ్స్ కోసం యాడ్స్ తో సంప్రదించినట్లయితే, మీరు వీడియో గేమ్స్ ఇష్టపడతారని మేము భావిస్తాము, మరియు మీకు అటువంటి యాడ్స్ చూపిస్తాము, కానీ మీరు కేవలం ఈ యాడ్స్ మాత్రమే కాకుండా వేరేవి కూడా చూస్తారు. మా కంటెంట్ వ్యూహముతో పోలిన విధంగా, మీరు వివిధరకాల యాడ్స్ అందుకునేలా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. మీకు బహుశా ఆసక్తి ఉండని యాడ్స్ చూపించకుండా ఉండటానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఇంతకు ముందు ఒక సినిమా కోసం టిక్కెట్లు కొన్నట్లుగా ఒక టికెటింగ్ సైట్ మాకు చెబితే - మేము మీకు దాని కోసం యాడ్స్ చూపించడం ఆపివేయవచ్చు. మీరు ఏ యాడ్స్ అందుకుంటారో దాని గురించి మరియు అడ్వర్టైజింగ్ యొక్క వివిధ రకాలు మరియు మీ ఎంపికల గురించి మీరు ఇక్కడతెలుసుకోవచ్చు.

అడ్వర్టైజింగ్ ప్రయోజనాల కోసం మేము మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము, మరియు షేర్ చేస్తామో అనేదాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

కుకీస్ మరియు ఇతర టెక్నాలజీల ద్వారా సేకరించిన సమాచారంగురించి ఒక గమనిక: మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఒక అడ్వర్టైజర్ యొక్క వెబ్ సైట్ పై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే, మీరు మీ బ్రౌజర్ లేదా పరికరం సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీస్ తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని మనసులో ఉంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీస్ ను ఎలా ఉపయోగిస్తామో అనేదాని గురించి మరింత తెలుసుకొనేందుకు మా కుకీ విధానమును చూడండి.

ఫీచర్లు, అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని అభివృద్ధి చేయడం మరియు మెరుగుపరచడం

మా సేవలను మెరుగుపరచడానికి అనువైన ఫీచర్లు మరియు మార్గాల కోసం మా బృందాలు కొత్త ఆలోచనలతో నిరంతరం ముందుకు వస్తున్నాయి. దీన్ని సాధ్యం చేయడానికి, మా ఫీచర్లు మరియు సేవలు —AI ఫీచర్లతో సహా—సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించే అల్గారిథమ్‌లు మరియు మెషీన్ లెర్నింగ్ మోడళ్లను (అంటే, పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి నమూనాలను గుర్తించడం లేదా అంచనాలు వేయడం కోసం ఉపయోగించే అల్గారిథమ్‌ల రూపం) మేము నిరంతరం అభివృద్ధి చేసి మెరుగుపరుస్తుంటాము. మా AI ఫీచర్లు సాధారణంగాజనరేటివ్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) జనరేటివ్ మోడల్స్ ఉపయోగించి టెక్స్ట్, చిత్రాలు లేదా ఇతర మీడియాను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. జెనరేటివ్ AI నమూనాలు వాటి ఇన్పుట్ శిక్షణ డేటా యొక్క నమూనాలు మరియు నిర్మాణమును నేర్చుకుంటాయి మరి ఆ తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న కొత్త డేటాను ఉత్పన్నం చేస్తాయి). వ్యక్తిగతీకరణ, ప్రకటన, భద్రత మరియు భద్రత, ఆగ్మెంటేడ్ రియాలిటీ మరియు దుర్వినియోగాన్ని లేదా ఇతర నిబంధనలు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను నిరోధించడానికి మేం అల్గారిథంలు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మరియు జనరేటివ్ AIనిఉపయోగిస్తాం. ఉదాహరణకు, My AI నుండి ప్రతిస్పందనలను మెరుగుపరచడానికి Snapచాటర్లు My AI తో జరిపిన సంభాషణలను మా అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లెక్కలోనికి తీసుకుంటాయి.

మేము ఏ రకమైన మెరుగుదలలను తయారు చేయాలి అని నిర్ణయించడానికి మీ సమాచారం మాకు సహాయపడుతుంది, అయితే మేము ఎల్లప్పుడూ గోప్యత పై దృష్టి సారిస్తాము - మరియు మా ఫీచర్లు మరియు మోడల్స్ అభివృద్ధి చేయడానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా వ్యక్తిగత సమాచారమును ఉపయోగించకూడదని మేము కోరుకుంటాము.

విశ్లేషణలు

ఏది నిర్మించాలి లేదా మా సేవలను ఎలా అభివృద్ధి చేయాలి అని అర్థం చేసుకోవడానికి గాను, మేము మా ఫీచర్ల కోసం పోకడలు మరియు డిమాండ్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మేము ఒక గ్రూప్ యొక్క గరిష్ట పరిమాణం వంటి ఫీచర్ యొక్క భాగాలను మార్చాలో లేదో నిర్ణయించడానికి సహాయపడేందుకు మేము గ్రూప్ చాట్ వాడకం గురించి మెటాడేటా మరియు పోకడలను పర్యవేక్షిస్తాము. Snapచాటర్ల నుండి డేటా అధ్యయనం చేయడం వల్ల ప్రజలు సేవలను ఉపయోగించే మార్గాలలో పోకడలను చూడడానికి మాకు సహాయపడగలుగుతుంది. ఇది భారీ స్థాయిలో Snapchat ని మెరుగుపరచడానికి మాకు స్ఫూర్తిని అందిస్తుంది. పోకడలు మరియు వాడకమును గుర్తించడానికి, పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి గాను మేము విశ్లేషణలను నిర్వహిస్తాము. ఈ సమాచారం ఆధారంగా, మేము ఇతర విషయాలతో పాటుగా, డిమాండ్ ను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడటానికై మా వినియోగదారుల గురించి సమాచారాన్ని రూపొందిస్తాము.

పరిశోధన

సాధారణ వినియోగదారు ఆసక్తులు, పోకడలు, మరియు మీచే మరియు మా కమ్యూనిటీలోని ఇతరులచే మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో మరింత బాగా అర్థం చేసుకోవడానికి మేము పరిశోధన నిర్వహిస్తాము. ఈ సమాచారం, విశ్లేషణలతో పాటుగా (మేము పైన వివరించినట్లుగా), మా కమ్యూనిటీ గురించి మరియు మా సేవలు మా కమ్యూనిటీలో ఉన్నవారి జీవితాలకు ఎలా సరిపోతున్నాయో మేము మరింతగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. కొత్త పద్ధతులు మరియు సాంకేతికతలను (ఉదా., కొత్త మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లేదా SPECS వంటి హార్డ్‌వేర్) అభివృద్ధి చేయడానికి మేం పరిశోధన మరియు అభివృద్ధిలో కూడా నిమగ్నమై ఉన్నాం. మా పరిశోధన యొక్క ఫలితాలు కొన్నిసార్లు Snapchat లోని ఫీచర్లలో ఉపయోగించబడతాయి, మరియు మేము కొన్నిసార్లు మొత్తం ప్రవర్తనలు మరియు వినియోగదారుల పోకడలు వంటి విషయాల గురించి పత్రాలను ప్రచురిస్తాము (ఇవి మా వినియోగదారుల బేస్ అంతటా సేకరించిన డేటాను మాత్రమే కలిగి ఉంటాయి మరియు మీ ప్రైవేట్ కంటెంట్ మరియు కమ్యూనికేషన్లు లేదా మీ గురించి ప్రత్యేకంగా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉండవు).

మా సేవల భద్రత మరియు భద్రతను పెంపొందించుట

మా సేవల రక్షణ మరియు భద్రతను మెరుగుపరచడానికి, Snapచాటర్ గుర్తింపు లేదా వయస్సును ధృవీకరించడానికి, మరియు మోసం లేదా ఇతర అనధికార లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడానికి మేం మీ సమాచారాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు, మీ అకౌంట్‌ను సంరక్షించుటలో సహాయపడేందుకు మేము రెండు-అంచెల ప్రామాణీకరణ విధానాన్ని అందిస్తాము మరియు మేము ఏదైనా అనుమానాస్పద చర్యను గమనిస్తే, మీకు ఇమెయిల్ లేదా టెక్స్ట్ సందేశాలు పంపించవచ్చు. ఒక వెబ్‌పేజీ హానికరమైనదా లేదా అని తెలుసుకోవడానికి మేం Snapchat‌లో మీకు పంపబడిన URLలను స్కాన్ చేసి, దాని గురించి మిమ్మల్ని హెచ్చరించగలం.

హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలతో సహా మా నిబంధనలు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల సంభావ్య ఉల్లంఘనలను గుర్తించడానికి మరియు వయస్సుకు తగిన వాడకాన్ని నిర్ధారించడానికి మేం ఆటోమేటెడ్ సాధనాలను ఉపయోగించవచ్చు. ఈ సాధనాలు ఈ పాలసీలో వివరించిన అకౌంట్, డివైస్, వాడుక మరియు కంటెంట్-సంబంధిత సమాచారం వంటి సిగ్నల్‌లను ఉపయోగించవచ్చు.

మిమ్మల్ని సంప్రదించడం

కొత్తవి లేదా ఇప్పటికే ఉన్న ఫీచర్లను ప్రోత్సహించడానికి మేము కొన్నిసార్లు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాము. ఇందులో, అనుమతించబడిన చోట, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా Snapచాటర్లకి కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉంటుంది. ఉదాహరణకు, మా సేవలు మరియు మీరు ఆసక్తి చూపిస్తారని మేము భావించే ప్రోత్సాహక ఆఫర్ల గురించి సమాచారాన్ని షేర్ చేయడానికి మేము Snapchat యాప్, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ను ఉపయోగించవచ్చు.

ఇతర సమయాల్లో, సమాచారం, హెచ్చరికలు, లేదా మా వినియోగదారులు తమ అభ్యర్ధన మేరకు మమ్మల్ని పంపించమని అడిగే సందేశాలను అందించడానికి మేము మీతో కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. ఇందులో, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉండవచ్చు, అనుమతించబడిన చోట అకౌంట్ స్థితి నవీకరణలు, భద్రతా హెచ్చరికలు, మరియు చాట్ లేదా స్నేహపూర్వక రిమైండర్లు అందజేయబడవచ్చు; ఇందులో Snapచాటర్స్ యేతర వ్యక్తులకు ఆహ్వానాలు లేదా Snapchat కంటెంట్ పంపించడానికి మా యూజర్ అభ్యర్ధన ను నెరవేర్చడం కూడా ఇమిడి ఉండవచ్చు.

మద్దతు

మీరు సహాయం కోసం అడిగినప్పుడు, మీరు వీలైనంత త్వరగా మద్దతు పొందాలని మేము కోరుకుంటాము. మా సేవలతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సహాయంతో మీకు, Snapచాటర్ కమ్యూనిటీ మరియు మా వ్యాపార భాగస్వాములకు సహాయం అందించడానికి గాను, మేము ప్రతిస్పందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని తరచుగా ఉపయోగించాల్సి ఉంటుంది.

మా నిబంధనలు మరియు విధానాలను అమలు చేయడం

మా నిబంధనలు, విధానాలు మరియు చట్టాన్ని అమలు చేయడానికి మేము సేకరించే డేటాను ఉపయోగిస్తాము. ఇందులో మా నిబంధనలు, విధానాలు, లేదా చట్టాన్ని ఉల్లంఘించే ప్రవర్తనను అమలు చేయడం, పరిశోధించడం మరియు నివేదించడం, చట్టం అమలు నుండి అభ్యర్థనలకు ప్రతిస్పందించడం, మరియు చట్టపరమైన అవసరాలతో సమ్మతి వహించడం చేరి ఉంటాయి. ఉదాహరణకు, మా సేవలపై చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేయబడినప్పుడు, మేము మా నిబంధనలు మరియు ఇతర విధానాలను అమలు చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చట్ట అమలు సంస్థల అభ్యర్థనలకు సహకరించడానికి, భద్రతకు సంబంధించిన సమస్యలను చట్ట అమలు సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు లేదా ఇతర సంబంధిత పక్షాలకు తెలియజేయడానికి, అలాగే మా చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి—వినియోగదారుల వయస్సును ధృవీకరించడం సహా—మీ సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు లేదా పంచుకోవచ్చు. మరింత తెలుసుకోడానికి మా పారదర్శకత నివేదిక ను చూడండి.

మీ అనుమతితో ఇతర ప్రయోజనాలు

అదనంగా, మీరు మా సేవలతో సంభాషించినప్పుడు మీ సమాచారాన్ని కొత్త, విభిన్నమైన లేదా ఇతరత్రా నిర్దిష్టమైన పద్ధతిలో ఉపయోగించడానికి మేము మీ అనుమతిని కోరే సందర్భాలు సైతమూ ఉండవచ్చు.

మేము సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

ఈ విభాగం, మేము ఎవరితో సమాచారాన్ని షేర్ చేస్తాము, ఆ సమాచారములో ఏమి చేరి ఉండవచ్చు మరియు ఆ సమాచారమును పంచుకోవడానికి కారణాలు, సేకరించిన దేశం నుండి దానిని ఎప్పుడు వెలుపలికి బదిలీ చేయవలసి ఉంటుందనే దానితో సహా విపులంగా వివరిస్తుంది.

స్వీకర్తలు మరియు షేర్ చేయడానికి కారణాలు
  • Snapchat. మీకు మరియు మా వినియోగదారుల సమూహానికి మా సేవలను అందించడానికి, మీ సమాచారంలో కొంత భాగాన్ని Snapchatలోని మీ స్నేహితులతో లేదా ఇతర Snapchat వినియోగదారులతో మేము పంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అనుమతిస్తే, మీరు స్టోరీస్‌లో పోస్ట్ చేసిన కంటెంట్, మీ ప్రస్తుత లేదా ఇటీవలి కార్యాచరణ స్థితి (ఆక్టివిటీ స్టేటస్), అలాగే మీరు ప్రీమియం సభ్యత్వం (ప్రీమియం సబ్‌స్క్రిప్షన్) కలిగి ఉన్నారనే సమాచారం మీ స్నేహితులకు కనిపించవచ్చు. మీ సమాచారం ఎవరు చూస్తున్నారు మరియు ఏమిటి ఇంకా ఎప్పుడు అనే మీ నియంత్రణల కోసం మీ సమాచారంపై నియంత్రణ విభాగాన్ని మరియు మీ సెట్టింగ్‌లను చూడండి.

  • ఫ్యామిలీ సెంటర్‌లో పాల్గొనే వినియోగదారులు మీరు ఫ్యామిలీ సెంటర్ ని ఎనేబుల్ చేసినప్పుడు, అకౌంట్ ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి గ్రాహ్యతను అందించడానికి మేము తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కనెక్ట్ చేయబడిన టీనేజ్ అకౌంట్ గురించిన సమాచారాన్ని పంచుకుంటాము, ఉదాహరణకు, Snapchat పై మీ ఫ్రెండ్స్ ఎవరు లేదా మీరు మీ లొకేషన్ ను ఏ ఫ్రెండ్స్ తో పంచుకుంటున్నారు అనేది. మేము ప్రైవేట్ కంటెంట్ మరియు కమ్యూనికేషన్ల కంటెంట్‌ను పంచుకోము. మరింత తెలుసుకోండి.

  • పబ్లిక్ Snapchatలోని చాలా ఫీచర్లు వ్యక్తిగతమైనవి మరియు మీ స్నేహితులకు మాత్రమే పరిమితం చేయబడతాయి. అయితే, స్పాట్‌లైట్, Snap మ్యాప్ లేదా మీ పబ్లిక్ ప్రొఫైల్ వంటి ఫీచర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులతో మీ ఉత్తమ Snapsను ప్రదర్శించేందుకు మరియు పబ్లిక్‌గా కంటెంట్‌ను సృష్టించి పంచుకునేందుకు కూడా మేము అవకాశం కల్పిస్తాము. మీరు దీనిని చేసినప్పుడు, Snapchat వెలుపల కూడా ఆ Snaps కనుక్కోదగినవిగా ఉంటాయి, ఉదాహరణకు వెబ్ పైన. మీ యూజర్ నేమ్ మరియు Bitmoji వంటి కొంత సమాచారం ప్రజలకు కనిపిస్తుంది. మరింత తెలుసుకోండి.

  • తృతీయ-పక్షం యాప్స్. కొన్నిసార్లు తృతీయ-పక్షం యాప్‌లతో మీరు కనెక్ట్ కావడానికి అనుమతించే ఫీచర్లను మేము అందిస్తాము. మీరు మీ Snapchat ఖాతాను ఏదైనా మూడవ పక్ష (థర్డ్ పార్టీ) యాప్‌తో అనుసంధానించాలని నిర్ణయించుకుంటే, ఆ అనుసంధాన అభ్యర్థనను పూర్తి చేయడానికి మీరు మాకు అనుమతించిన మేరకు, మీ ఖాతాకు సంబంధించిన అదనపు సమాచారాన్ని ఆ యాప్‌తో మేము పంచుకుంటాము.

  • సేవ ప్రొవైడర్‌లు. మా తరపున మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే మా సేవా ప్రదాతలతో ఆ సమాచారాన్ని మేము పంచుకుంటాము. ఉదాహరణకు, చెల్లింపులను సులభతరం చేయడానికి, యాడ్స్ యొక్క పనితీరును కొలవడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి లేదా సేవలను రక్షించడానికి మేము అటువంటి సేవ ప్రొవైడర్‌లపై ఆధారపడతాము. మా సేవా ప్రదాతలు (సర్వీస్ ప్రొవైడర్లు) తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా, మీ వ్యక్తిగత కంటెంట్ మరియు వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను మేము వారితో పంచుకోము. మేము సేవ ప్రొవైడర్‌ల యొక్క కేటగరీల జాబితాను ఇక్కడఉంచాము.

  • బిజినెస్ మరియు ఇంటిగ్రేటెడ్ భాగస్వాములు. సేవలను అందించడానికి గాను మేము మీ సమాచారాన్ని బిజినెస్ మరియు ఇంటిగ్రేటెడ్ భాగస్వాములతో పంచుకుంటాము. ఉదాహరణకు, ఒక టేబుల్‌ను రిజర్వ్ చేయడానికి మీరు Snapchat లోపున OpenTable ను ఉపయోగించవచ్చు. దీనిలో వ్యక్తిగత కంటెంట్ మరియు వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను పంచుకోవడం చేరదు. మేము ఈ భాగస్వాముల జాబితాను ఇక్కడఉంచాము.

  • మోస-వ్యతిరేక భాగస్వాములు. మోసాన్ని నివారించడానికి పనిచేసే పరిశ్రమ భాగస్వాములతో పరికరం మరియు వినియోగ సమాచారం వంటి మీ సమాచారాన్ని మేము పంచుకుంటాము.

  • చట్టపరమైన, భద్రత మరియు రక్షణ భాగస్వాములు. మేము ఈ క్రింది చట్టపరమైన, భద్రత మరియు రక్షణ కారణాల కోసం అవసరమైన విధంగా మీ సమాచారాన్ని పంచుకుంటాము:

    • ఏదైనా చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియ, ప్రభుత్వ అభ్యర్థన లేదా వర్తించే చట్టం, నియమం లేదా నిబంధనతో సమ్మతి వహించటం కోసం.

    • సంభావ్య సేవా షరతులు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయుట, పరిష్కరించుట లేదా అమలు చేయుట.

    • మా యొక్క, మా వినియోగదారుల లేదా ఇతరుల హక్కులు, ఆస్తి లేదా భద్రతను పరిరక్షించుట కోసం.

    • ఏదైనా మోసం లేదా భద్రతా సమస్యలను కనిపెట్టుట మరియు పరిష్కరించుట కోసం.

  • అనుబంధీకులు. Snap Inc. మా స్వంతమైన విభిన్న అనుబంధసంస్థలను కలిగి ఉంటుంది. మీ సూచన మేరకు, ఇతర వినియోగదారుల సూచన మేరకు లేదా మా మరియు మా అనుబంధ సంస్థల (అఫిలియేట్స్) సేవలను అందించడానికి అవసరమైన సందర్భాల్లో, ఆ అంతర్గత అనుబంధ సంస్థల (ఇంటర్నల్ సబ్సిడరీస్) మధ్య మీ సమాచారాన్ని మేము పంచుకోవచ్చు.

  • విలీనం లేదా స్వాధీనత యొక్క ఆవశ్యకతల కొరకు. మా వ్యాపారాన్ని ఒక కొనుగోలుదారునికి లేదా సాధ్యత గల కొనుగోలుదారునికి అమ్మడానికి లేదా అమ్మకపు చర్చలు జరపడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే, ఆ లావాదేవీలో భాగంగా, మేము మీ సమాచారాన్ని ఒక వారసుదారు లేదా అనుబంధీకులకు బదిలీ చేయవచ్చు.

ఇంటిగ్రేటెడ్ భాగస్వాములు

మా సేవల యందు, మా ఇంటిగ్రేటెడ్ భాగస్వాముల ద్వారా అందించబడే కంటెంట్ మరియు ఇంటిగ్రేషన్స్ ఉండవచ్చు. ఉదాహరణకు, లెన్సెస్, కెమెరా ఎడిటింగ్ సాధనాలు, మరియు మ్యాప్ లో అందుబాటులో ఉన్న ఇంటిగ్రేషన్లు, అలాగే మా సేవలతో మూడవ పక్ష డెవలపర్‌లు అనుసంధానించిన ఇంటిగ్రేషన్లు ఇందులో చేరుతాయి. ఈ ఇంటిగ్రేషన్ల ద్వారా మీ సమాచారాన్ని సంబంధిత ఇంటిగ్రేటెడ్ భాగస్వామితో పాటు Snapకూ పంచుకోవచ్చు. ఆ భాగస్వాములు మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో లేదా ఎలా ఉపయోగిస్తాయో అనేదానికి మేము బాధ్యులు కాదు. ఎప్పటి లాగానే, మా సర్వీసుల ద్వారా మీరు ఇంటరాక్ట్ చేసే ఆ తృతీయ పక్షాలతో సహా మీరు సందర్శించే లేదా ఉపయోగించే ప్రతి తృతీయ-పక్షపు సేవ‌ యొక్క గోప్యతా విధానాలను మీరు సమీక్షించాల్సిందిగా మేం ప్రోత్సహిస్తాము. Snapchat లో మా ఇంటిగ్రేషన్స్ గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

లెన్సెస్ యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు మేము iOS పైన Apple యొక్క ట్రూ డెప్త్ కెమెరాను ఉపయోగిస్తాము. అయినప్పటికీ, ఈ సమాచారం వాస్తవ సమయంలో ఉపయోగించబడిందని గమనించండి - మేము మా సర్వర్‌లపై ఈ సమాచారాన్ని స్టోర్ చేయము లేదా తృతీయ పక్షాలతో షేర్ చేయము.

అంతర్జాతీయ డేటా బదిలీలు

మా సేవలు మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ తో అనుసంధానం చేస్తాయి. దానిని సుసాధ్యం చేయడానికి, యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసించే ఇతర దేశాల బయటివైపు నుండి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, దానిని బదిలీ చేయవచ్చు, మరియు నిల్వ చేయవచ్చు మరియు ప్రక్రియ జరుపవచ్చు. మీరు నివసిస్తున్న చోటుకు వెలుపల మేము సమాచారాన్ని షేర్ చేసినప్పుడల్లా, మీరు నివసిస్తున్న చోట చట్టముచే అవసరమైన డేటాను రక్షించడానికి గాను మేము సంరక్షణలను అమలులో ఉంచుతాము. మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మరిన్ని వివరాల కోసం ప్రాంత నిర్దిష్ట సమాచారం విభాగాన్ని చూడండి.

మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

ఈ విభాగంలో మేము మీ సమాచారాన్ని ఎంత కాలం ఉంచుకుంటాము, ఎందుకు మేము మీ సమాచారాన్ని ఉంచుకుంటామనే సమాచారాన్నిమీకు అందజేస్తాము, మరియు చట్టాలు, కోర్టులు మరియు బాధ్యతలతో సమ్మతి వహించడానికి సమాచారాన్ని ఎలా ఉంచుకోవాల్సి ఉంటుందో కూడా మేము హైలైట్ చేస్తాము.

ఒక సాధారణ నియమంగా, మీరు మాకు చెప్పినంత కాలమూ మీ సమాచారాన్ని ఉంచుకుంటాము, మరి లేదంటే మా సేవలను అందించడానికి లేదా చట్టముచే అవసరమైనంత కాలమూ మేము దానిని ఉంచుకుంటాము. ఉదాహరణకు, ఒకవేళ మీరు మెమోరీస్ లో ఏదైనా నిల్వ చేస్తే, మీకు అది అవసరమైనంత కాలమూ మేము దానిని ఉంచుతాము, అయితే మీరు ఒక ఫ్రెండ్ తో చాట్ చేసినప్పుడు, మీరు పంపిన చాట్‌లను మీ ఫ్రెండ్ చదువుకున్న తర్వాత 24 గంటల లోపున తొలగించబడే విధంగా మా సిస్టమ్స్ రూపొందించబడి ఉన్నాయి (మీరు మీ డిఫాల్ట్ సెట్టింగ్లు మార్చి ఉంటే లేదా సేవ్ చేయాలని నిర్ణయించి ఉంటే తప్ప). మేము డేటాను ఉంచుకుంటామో లేదో అనేది, నిర్దిష్ట ఫీచర్, మీ సెట్టింగ్‌లు, మరియు మీరు సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ సమాచారాన్ని ఎంత కాలం ఉంచుకోవాలో మేము నిర్ణయించేటప్పుడు మేము పరిగణించే మరి కొన్ని కారకాంశాలు ఇక్కడ ఉన్నాయి:

  • మా సేవలను ఆపరేట్ చేయడానికి లేదా అందించడానికి మాకు సమాచారం అవసరమైతే. ఉదాహరణకు, మేము మీ అకౌంట్ నిర్వహించడానికి అవసరమైన - మీ పేరు, ఫోన్ నంబర్, మరియు ఇమెయిల్ చిరునామా వంటి మీ ప్రాథమిక అకౌంట్ వివరాలు ను మేము నిల్వ చేస్తాము.

  • మా సేవల నుండి మీరు ఆశించే పనులను చేయడానికి మరియు ఈ గోప్యతా విధానం లోపున మేము వివరించినట్లుగా చేయడానికి. ఉదాహరణకు, మిమ్మల్ని మీరు వ్యక్తపరచడానికి ఫ్రెండ్స్ కీలకం కాబట్టి మీరు తొలగించమని మమ్మల్ని అడిగే వరకూ మేము మీ ఫ్రెండ్స్ జాబితాను నిర్వహిస్తాము. అదేవిధంగా, మా యాప్ సెట్టింగ్లు లో వాటిని తొలగించమని మీరు అడిగే వరకు మేము మీ భాగస్వామ్య కాంటాక్టుల జాబితాను ఉంచుతాము (గమనిక: మీ పరికర అనుమతులను అప్‌డేట్ చేయడం వల్ల మీరు Snapchat తో గతంలో పంచుకున్న కాంటాక్టులను తొలగించకపోవచ్చు). మరింతగా తెలుసుకోండి. దీనికి విరుద్ధంగా, మీరు మీ డీఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చకపోయి ఉంటే లేదా ఏదైనా సేవ్ చేయాలని నిర్ణయించుకొని ఉంటే తప్ప, Snapchat లో పంపించబడిన Snapలు మరియు చాట్‌లను స్వీకర్తలందరూ ఓపెన్ చేశారని మేము గుర్తించిన తర్వాత 24 గంటల లోపున, లేదా వాటి గడువు ముగిసిపోయిన తర్వాత మా సర్వర్ల నుండి అవి డీఫాల్ట్ గా తొలగించబడతాయి, ఆ ఉదంతంలో మీ ఎంపికలను మేము గౌరవిస్తాము.

  • సమాచారమే స్వయంగా. ఉదాహరణకు, మీరు ఇచ్చిన అనుమతులు మరియు మీరు ఉపయోగిస్తున్న సేవలను బట్టి, మేము మీ స్థాన సమాచారాన్ని (IP చిరునామా ఆధారంగా లేదా ఖచ్చితమైన స్థాన సమాచారంగా) వేర్వేరు కాల వ్యవధుల పాటు నిల్వ చేస్తాము. స్థాన సమాచారం ఏదైనా Snap‌తో అనుసంధానించబడి ఉంటే—ఉదాహరణకు, మెమోరీస్ లో సేవ్ చేసినవి లేదా Snap మ్యాప్ లేదా స్పాట్‌లైట్ లో పోస్ట్ చేసినవి—ఆ Snap‌ను మేము నిల్వ ఉంచినంత కాలం, దానికి సంబంధించిన స్థాన సమాచారాన్ని కూడా మేము నిల్వ ఉంచుతాము ఉపయోగకర చిట్కా: మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మీ గురించి మేము నిలుపుకున్న లొకేషన్ డేటాను మీరు చూడొచ్చు.

  • కొన్ని నిర్దిష్ట చట్టపరమైన బాధ్యతలతో సమ్మతి వహించడానికి మేము ఎంతకాలం సమాచారాన్నినిలుపుకోవాల్సి ఉంటుంది.

  • హానిని నివారించడం, మా సేవా నిబంధనలు లేదా ఇతర పాలసీల యొక్క సాధ్యతా ఉల్లంఘనలను పరిశోధించడం, దురుపయోగపు రిపోర్టులను దర్యాప్తు చేయడం, లేదా మమ్మల్ని లేదా ఇతరులను రక్షించుకోవడం వంటి ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాకు అది అవసరమైతే.

  • ఉత్పత్తుల కొరకు నిర్దిష్ట నిలుపుదల వ్యవధులపై వివరాల కోసం మా ఉత్పత్తి చే గోప్యత పేజీ మరియు మద్దతు పేజీ ని చూడండి.

మీ సమాచారములో కొంత భాగం స్వయంచాలకంగా డిలీట్ చేయబడే విధంగా మా సిస్టమ్‌లు రూపొందించబడినప్పటికీ, ఒక నిర్దిష్ట సమయం నాటికి తొలగింపు జరుగుతుందని మేము వాగ్దానం చేయలేము.

కొన్ని సందర్భాల్లో మీ సమాచారాన్ని తొలగించడం నుండి మమ్మల్ని ఆపే చట్టపరమైన ఆవశ్యకతలతో మేము సమ్మతి వహించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీ కంటెంటు యొక్క ఒక కాపీని ఉంచుకోవాలని అడుగుతూ మాకు ఒక కోర్ట్ నుండి ఒక నోటీసు అందినట్లయితే. మేము మీ డేటా యొక్క ఒక కాపీని ఉంచుకోవడానికి ఇతర కారణాలు ఏమిటంటే, మేము దురుపయోగము లేదా ఇతర నిబంధనలు లేదా పాలసీ ఉల్లంఘనలు, లేదా మీ అకౌంట్, మీచే సృష్టించబడిన కంటెంట్ లేదా ఇతర Snapచాటర్లతో సృష్టించబడిన కంటెంట్ ఇతరులచే ఫ్లాగ్ చేయబడినట్లు లేదా దురుపయోగం కొరకు మా సిస్టమ్స్ లేదా ఇతర నిబంధనలు లేదా పాలసీ ఉల్లంఘనల నివేదికలు అందుకోవడం కోసం. అంతిమంగా, మేము కొంత నిర్దిష్ట సమాచారమును పరిమిత కాలవ్యవధి పాటు లేదా చట్టముచే ఆవశ్యకమైనట్లుగా బ్యాకప్‌లో కూడా ఉంచుకోవచ్చు.

విభిన్న రకాల కంటెంట్‌ని మేము ఎంతకాలం స్టోర్ చేస్తాము అనే దాని గురించి తాజా సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్ చూడండి.

ప్రాంత నిర్దిష్ట సమాచారం

మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి, మీకు అదనపు హక్కులు ఉండవచ్చు, ఈ విభాగం ప్రాంత నిర్దిష్ట సమాచారంపై మరిన్ని వివరాలను అందిస్తుంది.

మా విధానాలను సాధ్యమైనంత సులువుగా ఉంచడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము, అయితే మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి మీకు కొన్ని అదనపు హక్కులు ఉండవచ్చు లేదా మీరు తెలుసుకొని తీరవలసిన కొంత నిర్దిష్ట సమాచారం ఉండవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా వర్తిస్తాయేమో చూడడానికి దయచేసి ఈ దిగువ జాబితా చూడండి!

నిర్దిష్ట ప్రయోజనాల కోసం డేటా ప్రాసెసింగ్ చేయడానికై కొన్ని అధికార పరిధులకు మేము మా చట్టపరమైన ఆధారాన్ని పేర్కొనవలసి ఉంటుంది. మీరు ఆ సమాచారాన్ని ఇక్కడకనుగొనవచ్చు.

మా ఆడియన్స్

మా సేవలు 13 సంవత్సరాలు మరియు ఆపై వయసు గల వ్యక్తులకు నిర్దేశించబడ్డాయి.

మా సేవలు 13 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్దేశించబడలేదు, మరియు అకౌంట్ ను సృష్టించడానికి మరియు సేవలను ఉపయోగించడానికి గాను మీరు తప్పనిసరిగా 13 సంవత్సరాలు లేదా ఆపై వయస్సు గలవారని నిర్ధారించాలి. మీరు 13 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నట్లుగా వాస్తవంగా మాకు తెలిసి ఉంటే (లేదా ఒక వ్యక్తి మీ రాష్ట్రము, ప్రావిన్స్ లేదా దేశములో తల్లిదండ్రుల సమ్మతి లేకుండా సేవలను ఉపయోగించుకోగలిగిన కనీస వయస్సు, ఇంకా ఎక్కువ కలిగియుంటే) మేము మీకు సేవలను అందించడం ఆపివేస్తాము మరియు మీ అకౌంట్ మరియు డేటాను తొలగిస్తాము.

అదనంగా, 18 సంవత్సరాల లోపు వయస్సు గల కొందరు Snapచాటర్ల యొక్క కొంత సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం మరియు నిల్వ చేయడాన్ని కూడా మేము పరిమితం చేయవచ్చు. కొన్ని ఉదంతాల్లో, దీని అర్థం ఏమిటంటే, మేము 18 సంవత్సరాల లోపు వ్యక్తులకు నిర్దిష్ట ఫంక్షనాలిటీని అందించలేకపోతాము.

వినియోగదారులు కనీస వయస్సు అర్హతలను నెరవేర్చారా లేదా వారికి వారి వయస్సుకు తగిన రక్షణలు అందించాలా అనే విషయాన్ని నిర్ధారించడంలో సహాయపడేందుకు, స్వయంచాలక సాధనాలు సహా వయస్సు నిర్ధారణ చర్యలను మేము ఉపయోగించవచ్చు.

గోప్యతా విధానానికి ఆధునీకరణలు

మేము సమయానుగుణంగా ఎప్పటికప్పుడు మా గోప్యతా విధానాన్ని ఆధునీకరించవచ్చు, మరియు మీరు తెలుసుకోవాల్సియున్నదని మేము భావించే ఏవైనా మార్పులను మేము చేసినప్పుడు మీకు ఒక హెడ్స్ అప్ ఇస్తాము.

మేము ఈ గోప్యత పాలసీని సమయానుగుణంగా మార్చవచ్చు. అయితే, మేము అలా చేసేటప్పుడు, మేము మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తాము. కొన్నిసార్లు, మా వెబ్‌సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ పై ఉండే గోప్యత పాలసీ యొక్క పైభాగములోని తేదీని సవరించడం ద్వారా మేము మీకు తెలియజేస్తాము. ఇతర సమయాలలో, మేము మీకు అదనపు నోటీసు ఇవ్వవచ్చు (మా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీలకు ఒక స్టేట్‌మెంట్ జోడించడం లేదా మీకు యాప్-లోపలి నోటిఫికేషన్ ఇవ్వడం వంటిది).

మమ్మల్ని సంప్రదించండి

ఇక్కడ ఉన్న సమాచారం గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా లేదా మా డేటా సంరక్షణ అధికారి (DPO) ని సంప్రదించాలనుకుంటున్నారా? మీరు మమ్మల్ని ఇక్కడసంప్రదించవచ్చు.