Privacy, Safety, and Policy Hub

టర్కీ గోప్యతా నోటీస్

అమలులోనికి వచ్చిన తేదీ: 13 జనవరి, 2022

మేము ప్రత్యేకించి టర్కీ లోని వినియోగదారుల కోసం ఈ నోటీసును రూపొందించాము. టర్కీలోని వినియోగదారులకు టర్కీ చట్టాల క్రింద నిర్ధిష్టంగా పేర్కొనబడినట్లుగా నిర్ధిష్ట గోప్యతా హక్కులు ఉంటాయి. మా గోప్యతా సూత్రాలు మరియు వినియోగదారులందరికీ మేము అందించే గోప్యతా నియంత్రణలు ఈచట్టాలకు అనుగుణంగా ఉంటాయి—మేము టర్కీ-నిర్ధిష్ట ఆవశ్యకతలను కవర్ చేస్తున్నట్లుగా ఈ నోటీస్ చూసుకుంటుంది. ఉదాహరణకు, యూజర్లందరూ, తమ డేటాయొక్క ఒక కాపీని అభ్యర్థించవచ్చు, తొలగించమని అభ్యర్థించవచ్చు, మరియు యాప్‌లో వారి గోప్యతా సెట్టింగులను నియంత్రించవచ్చు. పూర్తి పిక్చర్ కోసం, మా గోప్యతా విధానాన్ని చూడండి.

డేటా కంట్రోలర్

మీరు టర్కీలో వినియోగదారు అయి ఉంటే, 3000 31వ వీధి, శాంటా మోనికా, కాలిఫోర్నియా 90405 యందు ఉన్న Snap Inc., మీ వ్యక్తిగత సమాచారం కంట్రోలర్ అని మీరు తెలుసుకోవాలి.

మీ హక్కులు

మీరు మీ సమాచారాన్ని మీరే నియంత్రించాలని మేము కోరుకుంటున్నాం, అందువల్ల మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మేం మీకు అనేక హక్కులను అందిస్తాం. దయచేసి గోప్యతా విధానం యొక్క మీ సమాచారాన్ని నియంత్రించండి విభాగాన్ని చూడండి.

అంతర్జాతీయ డేటా బదిలీలు

మీకు మా సేవలను అందించడానికి, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, యునైటెడ్ స్టేట్స్ మరియు మీరు నివసించే దేశాలకు వెలుపలకు బదిలీ చేయవచ్చు, భద్రపరచవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు. మీరు నివసించే చోటుకు వెలుపల మేము సమాచారాన్ని పంచుకున్నప్పుడల్లా, బదిలీ మీ స్థానిక చట్టానికి అనుగుణంగా ఉండేలా మేము ధృవీకరిస్తాం, తద్వారా మీ వ్యక్తిగత సమాచారం తగినంతగా సంరక్షించబడుతుంది.

  • వ్యక్తిగత సమాచారమును బదిలీ చేసిన దేశము: యునైటెడ్ స్టేట్స్

  • బదిలీ తేదీ మరియు పద్ధతి: భద్రపరచడం మరియు ప్రాసెసింగ్ కొరకు సబ్మిషన్ పై బదిలీ చేయబడింది

  • వ్యక్తిగత సమాచారం బదిలీ చేయబడింది: దయచేసి గోప్యతా విధానంలోని మేము సేకరించే సమాచారం విభాగాన్ని చూడండి

  • వ్యక్తిగత సమాచారాన్ని నిలుపుకోవడం: దయచేసి గోప్యతా విధానంలోని మీ సమాచారాన్ని మేము ఎంతకాలం పాటు ఉంచుకుంటాము అనే విభాగాన్ని చూడండి.

ప్రతినిధి

Snap Inc. తన టర్కీ ప్రతినిధిగా డేటా రిజిస్ట్రార్‌ Danışmanlık Hizmetleri Anonim Şirketiని నియమించింది. మీరు ప్రతినిధిని ఇక్కడ సంప్రదించవచ్చు:

డేటా రిజిస్ట్రార్‌ Danışmanlık Hizmetleri Anonim Şirketi Maslak Mahallesi Eski Büyükdere Caddesi İz Plaza Giz Apt. నం: 9/78 సరియెర్/ఇస్తాంబుల్ 34485 snapchat@data-registrar.com