ఆస్ట్రేలియా గోప్యతా నోటీస్
అమల్లోకి వచ్చింది: 10 డిసెంబర్, 2025
ఆస్ట్రేలియాలోని వినియోగదారులు గోప్యతా చట్టం 1988 మరియు ఆన్‌లైన్ భద్రతా చట్టం 2021 యొక్క సోషల్ మీడియా కనీస వయస్సు (“SMMA”) ఆవశ్యకతలతో సహా, ఆస్ట్రేలియన్ చట్టాలను పాటించేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని మేం ఏవిధంగా హ్యాండిల్ చేస్తామనేది వివరించడానికి మేం ప్రత్యేకంగా ఈ నోటీస్‌ను సృష్టించాం.
మా వినియోగదారులందరికి మేం అందించే మా గోప్యతా సూత్రాలు మరియు గోప్యతా నియంత్రణలు ఈ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు, యూజర్లందరూ, తమ డేటాయొక్క ఒక కాపీని అభ్యర్థించవచ్చు, తొలగించమని అభ్యర్థించవచ్చు, మరియు యాప్‌లో వారి గోప్యతా సెట్టింగ్లను నియంత్రించవచ్చు. అన్ని ఇతర హక్కులు మరియు బాధ్యతల కొరకు, మా గోప్యతా విధానాన్ని చూడండి.
యాక్సెస్, డిలీషన్, కరెక్షన్ మరియు పోర్టబిలిటీ యొక్క హక్కులు
గోప్యతా విధానంలోని మీ సమాచార నియంత్రణ విభాగంలో వివరించిన విధంగా, మీరు మీ యాక్సెస్, సరిచేయడం మరియు రద్దు చేసే హక్కులను ఉపయోగించుకోవచ్చు.
అంతర్జాతీయ డేటా బదిలీలు
యునైటెడ్ స్టేట్స్ మరియు మీరు నివసించే ఇతర దేశాల బయటివైపు నుండి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, దానిని బదిలీ చేయవచ్చు మరియు నిల్వ చేయవచ్చు మరియు ప్రక్రియ జరుపవచ్చు. మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి విదేశీ గ్రహీతలు ఆస్ట్రేలియా గోప్యతా చట్టాలను ఉల్లంఘించనట్లుగా చూడటానికి మేం సముచితమైన చర్యలు తీసుకున్నాం. మేము పంచుకొనే తృతీయపక్షాల కేటగిరీలపై మరింత సమాచారాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
SMMAకు అనుగుణంగా వయస్సు ధృవీకరణ
SMMA కింద, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన ఆస్ట్రేలియన్ వినియోగదారులు నిర్ధిష్ట సర్వీస్‌ల కొరకు ఖాతాలను కలిగి ఉండరాదు.
మీ గురించి మా వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారా మరియు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నదా అని మదింపు చేయడానికి మేం చర్యలు తీసుకుంటాం. దీనిలో మీ యొక్క ఈ వివరాలు ఉంటాయి:
పుట్టిన తేదీ
IP చిరునామా
వినియోగ సమాచారం (మీరు Snapchatతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారనే దాని గురించి ప్రవర్తనా సమాచారం)- ఉదాహరణకు, మీరు ఏ లెన్స్‌లను వీక్షిస్తున్నారు మరియు అప్లై చేస్తున్నారు, మీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు, మీరు చూసే స్టోరీలు, మరియు మీరు ఎంత తరచుగా ఇతర Snapచాటర్‌లతో ఇంటరాక్ట్ అవుతారు)
కంటెంట్ సమాచారం (మీరు సృష్టించే లేదా ఇచ్చే కంటెంట్ గురించి సమాచారం, కెమెరా మరియు క్రియేటివ్ టూల్స్‌తో మీ నిమగ్నత, My AIతో మీ ఇంటరాక్షన్‌లు, మరియు మెటాడేటా - ఉదాహరణకు, కంటెంట్‌కు సంబంధించిన సమాచారం అంటే అది పోస్ట్ చేసిన తేదీ మరియు సమయం మరియు దానిని ఎవరు వీక్షించారు)
మీ Snapchat ఫ్రెండ్స్ వయస్సుతో సహా స్నేహితుల సమాచారం
మీరు ఆస్ట్రేలియాలో ఉన్నట్లయితే, Snapchat యాక్సెస్ చేసుకోవడాన్ని కొనసాగించడానికి, మా తృతీయ పక్ష ప్రొవైడర్, k-ID తో అదనపు వయస్సు ధృవీకరణ చర్యలను చేపట్టాలని కూడా మేం కోరవచ్చు. ఈ చర్యలపై మరింత సమాచారం కొరకు, దయచేసి మా సహాయ పేజీని రిఫర్ చేయండి.
వ్యక్తిగత సమాచార సేకరణను తగ్గించడానికి, మీరు 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారా లేదా అనే దానికి బైనరీ ‘‘అవును/లేదు’’ని అందుకుంటాం మరియు ఒకవేళ సముచితం అయితే మీకు Snapchatకు నిరంతర యాక్సెస్‌ను అందించడానికి ఈ ఫలితాన్ని ఉపయోగిస్తుంది. ఒకవేళ ఫలితాలు మీ వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ అని సూచించినట్లయితే, మీ ఖాతా లాక్ చేయబడుతుంది. k-ID ధృవీకరణ ప్రక్రియ సమయంలో మీరు అందించే మీ ముఖ స్కాన్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలు, లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని మేం సేకరించం.
వర్తించే చట్టాలకు మార్పులు ప్రతిబింబించేవిధంగా మేం ఈ నోటీస్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
ఫిర్యాదులు లేదా ప్రశ్నలా?
మీరు ఏదైనా విచారణలను మా గోప్యతా సపోర్ట్ టీమ్ లేదా డేటా సంరక్షణ అధికారికి dpo@snap.com ద్వారా సబ్మిట్ చేయవచ్చునని మీరు తెలుసుకొని ఉండాలని మేం కోరుకుంటున్నాం.
గోప్యతా ఫిర్యాదు చేయడానికి మీరు ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (OAIC)యొక్క ఆఫీసును కూడా సంప్రదించవచ్చు.