రిపబ్లిక్ ఆఫ్ కొరియా గోప్యతా ప్రకటన
అమల్లోనికి వచ్చింది: ఫిబ్రవరి 20, 2025
రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని వినియోగదారుల కోసం మేము ఈ నోటీసును ప్రత్యేకంగా సృష్టించాము. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని వినియోగదారులకు, వ్యక్తిగత సమాచార రక్షణ చట్టంతో సహా రిపబ్లిక్ ఆఫ్ కొరియా చట్టం ప్రకారం పేర్కొన్న నిర్ధారిత కొన్ని గోప్యతా హక్కులు ఉన్నాయి. మా గోప్యతా నియమాలు మరియు వినియోగదారులందరికీ మేము అందించే గోప్యతా నియంత్రణలు ఈ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి - ఈ నోటీసు మేము రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిర్దిష్ట అవసరాలను కవర్ చేస్తామని నిర్ధారిస్తుంది. ఉదాహరణకు, యూజర్లందరూ, తమ డేటా కాపీని అభ్యర్థించవచ్చు, తొలగించమని అభ్యర్థించవచ్చు, మరియు యాప్‌లో వారి గోప్యతా సెట్టింగులు నియంత్రించవచ్చు. పూర్తి అవగాహన కోసం, మా గోప్యతా విధానాన్ని చూడండి.
డేటా కంట్రోలర్
మీరు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని ఒక వినియోగదారుడు అయితే, Snap Inc. మీ వ్యక్తిగత సమాచారం యొక్క నియంత్రకులు అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది.
సేకరించిన వ్యక్తిగత సమాచారం
దయచేసి గోప్యతా విధానంలోని మేము సేకరించే సమాచారం విభాగాన్ని చూడండి.
వ్యక్తిగత సమాచార వినియోగ ఉద్దేశ్యం
దయచేసి గోప్యతా విధానంలోని మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాం విభాగాన్ని చూడండి.
తృతీయపక్షాలకు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడం
ఇక్కడవివరించిన విధంగా నిర్దిష్ట తృతీయ-పక్ష సర్వీస్ ప్రొవైడర్లు మరియు/లేదా Snap Inc. కుటుంబానికి చెందిన Snap అనుబంధ సంస్థలు, Snap తరపున విధులు నిర్వహించవచ్చు మరియు ఆ విధులను నిర్వహించడానికి అవసరమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.
మేము Snapchat లో వినోదభరితమైన కొత్త ఫీచర్‌లను జోడించడానికి మీ గురించిన సమాచారాన్ని భాగస్వాములు మరియు మేము పని చేసే సృష్టికర్తలతో కూడా పంచుకోవచ్చు. మా సర్వీసులపై తృతీయ పక్షాలచే సేకరించిన సమాచారం గురించి మరింత సమాచారం కొరకు, మా సపోర్ట్ సైట్సందర్శించండి. వర్తించే నిలుపుదల కాలాల కోసం దయచేసి ప్రతి భాగస్వామి గోప్యతా విధానాన్ని చూడండి.
దయచేసి గమనించండి, చట్టం ద్వారా అనుమతించబడినంత వరకు మేము మీ సమ్మతి లేకుండా మీ గురించిన వ్యక్తిగత సమాచారాన్ని మూడవ పక్షాలతో పంచుకోము.
వ్యక్తిగత సమాచారాన్ని నాశనం చేసే ప్రక్రియలు మరియు విధానాలు
మీరు సమ్మతించిన సమయం ముగిసినప్పుడు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ప్రయోజనాల కోసం అనవసరమైనప్పుడు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని నాశనం చేస్తాము. మా గోప్యతా విధానంలో వివరించిన విధంగా, మీరు ఎప్పుడైనా Snapchat ఉపయోగించడం నిలిపివేయాలనుకొంటే, మీ అకౌంట్‌ను డిలీట్ చేయమని మీరు మమ్మల్ని కోరవచ్చు. మీరు కొంతకాలం పాటు నిష్క్రియాత్మకంగా ఉండిన తర్వాత, మీ గురించి సేకరించిన చాలా సమాచారాన్ని కూడా మేం తొలగిస్తాం—ఐతే ఆందోళన చెందవద్దు, ముందుగా మిమ్మల్ని సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము! మేము మీ డేటాను నాశనం చేసినప్పుడు, వ్యక్తిగత సమాచారం శాశ్వతంగా నాశనం చేయబడిందని నిర్ధారించుకోవడానికి మేము వాణిజ్యపరంగా సహేతుకమైన మరియు సాంకేతికంగా సాధ్యమయ్యే చర్యలను తీసుకుంటాము.
మీ హక్కులు
మీరు మీ సమాచారాన్ని మీరే నియంత్రించాలని మేము కోరుకుంటున్నాం, అందువల్ల మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మేం మీకు అనేక హక్కులను అందిస్తాం. దయచేసి గోప్యతా విధానం యొక్క మీ సమాచారంపై నియంత్రణ విభాగాన్ని చూడండి.
అంతర్జాతీయ డేటా బదిలీలు
విదేశీ Snap Inc. కంపెనీలు మరియు సర్వీస్ ప్రొవైడర్లు. యునైటెడ్ స్టేట్స్ మరియు మీరు నివసించే వెలుపల ఉన్న ఇతర దేశాలలో, మీకు మా సేవలను అందించడానికి, ఇక్కడవివరించిన విధంగా Snap తరపున విధులను నిర్వహించడానికి మేము Snap Inc. కంపెనీల కుటుంబం మరియు నిర్దిష్ట తృతీయ-పక్ష సర్వీస్ ప్రొవైడర్‌ల నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, బదిలీ చేయవచ్చు మరియు భద్రపరచవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు. మీరు నివసించే చోటుకు వెలుపల మేము సమాచారాన్ని పంచుకున్నప్పుడల్లా, బదిలీ మీ స్థానిక చట్టానికి అనుగుణంగా ఉండేలా మేము ధృవీకరిస్తాం, తద్వారా మీ వ్యక్తిగత సమాచారం తగినంతగా సంరక్షించబడుతుంది
వ్యక్తిగత సమాచారమును బదిలీ చేయబడిన దేశము: యునైటెడ్ స్టేట్స్
బదిలీ తేదీ మరియు పద్ధతి: భద్రపరచడం మరియు ప్రాసెసింగ్ కొరకు సబ్మిషన్ పై బదిలీ చేయబడింది
వ్యక్తిగత సమాచారం బదిలీ చేయబడింది: దయచేసి గోప్యతా విధానంలోని మేము సేకరించే సమాచారం విభాగాన్ని చూడండి
వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుకోవడం:గోప్యతా విధానంలోని మీ సమాచారాన్ని మేము ఎంతకాలం పాటు ఉంచుకుంటాము అనే విభాగాన్ని దయచేసి చూడండి.
విదేశీ భాగస్వాములు. Snapchat లో కొత్త కొత్త ఫీచర్‌లను జోడించడం కోసం రిపబ్లిక్ ఆఫ్ కొరియా వెలుపల ఉన్న భాగస్వాములు మరియు సృష్టికర్తలతో మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. మా భాగస్వాముల గురించి మరింత సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్‌ని సందర్శించండి.
వ్యక్తిగత సమాచారం ఏ దేశానికి బదిలీ చేయబడుతుంది: దయచేసి యాక్సెస్ చేయగల భాగస్వామి యొక్క గోప్యతా విధానాన్ని చూడండి ఇక్కడ సపోర్ట్ సైట్
బదిలీ తేదీ మరియు పద్ధతి: భద్రపరచడం మరియు ప్రాసెసింగ్ కొరకు సబ్మిషన్ పై బదిలీ చేయబడింది
వ్యక్తిగత సమాచారం బదిలీ చేయబడింది: దయచేసి గోప్యతా విధానంలోని మేము సేకరించే సమాచారం విభాగాన్ని చూడండి
వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుకోవడం: దయచేసి యాక్సెస్ చేయగల భాగస్వామి యొక్క గోప్యతా విధానాన్ని చూడండి ఇక్కడ సపోర్ట్ సైట్
వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే మరియు ఫిర్యాదులను నిర్వహించే బాధ్యత కలిగిన విభాగం
Snap యొక్క స్థానిక ఏజెంటు ద్వారా Snap యొక్క గోప్యత అధికారిని సంప్రదించవచ్చు: జనరల్ ఏజెంట్ కో. లిమిటెడ్ (ప్రతినిధి: మిస్. ఇయున్-మి కిమ్)
చిరునామా: ఆర్ఎం. 1216, 28, Saemunan-ro 5ga-gil, Jongno-gu, సియోల్
టెలిఫోన్: 02 735 6118
ఇ-మెయిల్: snap@ generalagent.co.kr,
వ్యక్తిగత రక్షణ చట్టంలోని ఆర్టికల్ 31-2 మరియు సమాచారం మరియు కమ్యూనికేషన్ల నెట్‌వర్క్ వినియోగం మరియు సమాచార రక్షణ ప్రమోషన్ చట్టంలోని ఆర్టికల్ 32-5 ప్రకారం Snap యొక్క స్థానిక ఏజెంట్‍గా అధీకృతం చేయబడ్డారు.
అదనంగా, మీరు క్రింద వివరించిన Snap యొక్క గోప్యతా అధికారిని సంప్రదించవచ్చు
Snap Inc.
Attn: లీగల్ డిపార్ట్‌మెంట్. ( కొరియా సభ్యుని ప్రశ్న)
3000 31వ వీధి
శాంటా మోనికా, CA 90405
USA
టెలిఫోన్: 02 735 6118
ఇ-మెయిల్: koreaprivacy @ snap.com