Privacy, Safety, and Policy Hub

బ్రెజిల్ గోప్యతా నోటీసు

అమలు లోనికి వచ్చిన తేదీ: 30 సెప్టెంబర్, 2021

మేము బ్రెజిల్‌లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ నోటీసును సృష్టించాము. బ్రెజిల్ చట్టంలో పేర్కొన్న విధంగా బ్రెజిల్‌లోని వినియోగదారులకు నిర్దిష్ట గోప్యతా హక్కులు ఉన్నాయి, వీటిలో Lei Geral de Proteção de Dados Pessoais (LGPD) కూడా ఉంది. మా గోప్యతా సూత్రాలు మరియు వినియోగదారులందరికీ మేము అందించే గోప్యతా నియంత్రణలు ఈ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయి-ఈ నోటీసు మేము బ్రెజిల్-నిర్దిష్ట అవసరాలను కవర్ చేసేలా చూసుకుంటుంది. ఉదాహరణకు, యూజర్లందరూ, తమ డేటాయొక్క ఒక కాపీని అభ్యర్థించవచ్చు, తొలగించమని అభ్యర్థించవచ్చు, మరియు యాప్‌లో వారి గోప్యతా సెట్టింగులను నియంత్రించవచ్చు. పూర్తి పిక్చర్‌కై మా గోప్యతా విధానాన్ని చూడండి.

డేటా కంట్రోలర్

మీరు బ్రెజిల్‌లో వినియోగదారు అయి ఉంటే, Snap Inc. మీ వ్యక్తిగత సమాచారం యొక్క కంట్రోలర్ అని మీరు తెలుసుకోవాలి.

ప్రాప్యత, తొలగింపు, దిద్దుబాటు మరియు పోర్టబిలిటీ హక్కులు

గోప్యతా విధానం యొక్క మీ సమాచార నియంత్రణ విభాగం లో వివరించిన విధంగా మీరు మీ యాక్సెస్, సరిచేయడం మరియు మార్పిడి చేసే హక్కులను ఉపయోగించుకోవచ్చు.

మీ సమాచారాన్ని ఉపయోగించడానికి ఆధారాలు

కొన్ని నిర్ధారిత నియమాలు వర్తించినప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించేందుకు కేవలం మీదేశం మాత్రమే అనుమతిస్తుంది. ఈ షరతులను "చట్టబద్ధమైన ఆధారాలు" అంటారు మరియు Snap వద్ద, మేము ముఖ్యంగా నాలుగింటిలో ఒకదానిపై ఆధారపడతాం:

  • ఒప్పందం. మేము మీ సమాచారాన్నిఉపయోగించడానికి, మీరు మాతో ఒప్పందం కుదుర్చుకొని ఉండటమనేది ఒక కారణం అయివుండవచ్చు. ఉదాహరణకు, మీరు ఆన్-డిమాండ్ జియోఫిల్టర్‌ను కొనుగోలు చేసి, మా అనుకూల క్రియేటివ్ టూల్స్ నిబంధనలను ఆమోదించినప్పుడు, మేము మీ సమాచారాన్ని కొంతవరకు చెల్లింపును సేకరించాలి మరియు సరైన స్థలంలో మరియు సరైన సమయంలో సరైన వ్యక్తులకు మీ జియోఫిల్టర్‌ని చూపించేలా చూసుకోవాలి.

  • చట్టపరమైన ఆసక్తి. మీ సమాచారాన్ని మేం ఉపయోగించుకోవడానికి మరొక కారణము ఏదంటే, మేం—లేదా తృతీయ పక్షం—అలా చేయడంలో చట్టబద్ధమైన ఆసక్తి కలిగియున్నాం. ఉదాహరణకు, మీ ఖాతాను రక్షించడం, మీ Snaps డెలివరీ చేయడం, కస్టమర్ సపోర్ట్ అందించడం, మరియు స్నేహితుల్ని కనుక్కోవడానికి మీకు సహాయపడటం, మరియు మీకు ఇషమైనదని మేము భావించే కంటెంటును అందించడంతో సహా మా సేవలను మెరుగుపరచడానికై మేము మీ సమాచారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మా సేవలలో అనేకం ఉచితం కాబట్టి, మీకు ఆసక్తి కలిగించే యాడ్స్ ప్రయత్నించి చూపించడానికి మేము కూడా మీ గురించిన కొంత సమాచారమును ఉపయోగిస్తాము. చట్టబద్ధమైన ఆసక్తి గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మా ఆసక్తులు మీ గోప్యతకు భంగం కలిగించవు, కాబట్టి, మీ డేటాను మేము ఉపయోగించే పద్ధతి మీ గోప్యతను గణనీయంగా ప్రభావపరచదని మేము అనుకున్నప్పుడు, లేదా మీరు అనుకున్నప్పుడు, లేదా అలా చేయడానికి తప్పనిసరి కారణం ఉన్నప్పుడు మాత్రమే మేము చట్టబద్ధమైన ఆసక్తిపై ఆధారపడతాము. మేము మీ సమాచారమును ఉపయోగించడానికి మా చట్టబద్ధమైన బిజినెస్ కారణాలను మరింత వివరంగా ఇక్కడ వివరిస్తాము.

  • సమ్మతి కొన్ని ఉదంతాలలో నిర్దిష్ట ఆవశ్యకతల కొరకు మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మేం మీ సమ్మతిని అడుగుతాం. ఒకవేళ మేం అలా చేస్తే, మా సర్వీసులు లేదా మీ ఉపకరణ అనుమతుల ద్వారా మీ సమ్మతిని మీరు ఉపసంహరించుకునేలా మేం నిర్ధారిస్తాం. మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మీ సమ్మతిపై మేము ఆధారపడనప్పటికీ, కాంటాక్టులు మరియు లొకేషన్ వంటి డేటాను యాక్సెస్ చేసుకోవడానికి మేం మీ సమ్మతిని కోరవచ్చు.

  • చట్టపరమైన బాధ్యత. సరియైన చట్టప్రక్రియలకు స్పందించడం లేదా మా యూజర్లను రక్షించవలసిన అవసరం ఉండే చట్టానికి అనుగుణంగా పనిచేసేందుకు మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవలసిన అవసరం కలగవచ్చు.

అభ్యంతరం చెప్పడానికి మీకు గల హక్కు

మేము మీ సమాచారాన్ని ఉపయోగించడానికి అభ్యంతరం చెప్పే హక్కు మీకు ఉంటుంది. అనేక రకాల డేటాతో, ఒకవేళ మేం దానిని ఇక ప్రాసెస్ చేయరాదని అనుకుంటే దానిని తొలగించే సామర్థ్యాన్ని మేం మీకు అందిస్తున్నాం. ఇతర రకాల డేటా కొరకు, మొత్తం మీద ఫీచరును నిష్క్రియం చేయడం ద్వారా మీ డేటా వాడకాన్ని ఆపు చేయగల సామర్ధ్యాన్ని మీకు ఇచ్చాం. మీరు ఈ పనులను యాప్‌లో చేయవచ్చు. మేము ప్రాసెస్ చేయడానికి మీరు ఇష్టపడని ఏదైనా ఇతర రకాల సమాచారం ఉంటే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

ఫిర్యాదులు లేదా ప్రశ్నలా?

మీరు ఏవైనా విచారణలను మా గోప్యతా మద్దతు బృందంలేదా డేటా సంరక్షణ అధికారికి dpo@snap.com వద్ద సమర్పించవచ్చునని మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీకు Autoridade Nacional de Proteção de Dados (ANPD) వారికి ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉంది.