Privacy, Safety, and Policy Hub
సిఫార్సుకు అర్హత

లైంగిక కంటెంట్

సిఫార్సుకు అర్హత లేదు

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు లో నిషేధించబడిన ఏదైనా లైంగిక కంటెంట్ Snapchat పైన ఎక్కడైనా సరే నిషేధించబడుతుంది. విస్తృతమైన ఆడియన్స్ కి సిఫార్సు చేయడానికి కంటెంట్ అర్హత కలిగి ఉండటానికి గాను, అందులో ఇది ఉండకూడదు:

నగ్నత్వం, సెక్స్ చర్యలు, మరియు లైంగిక సేవలు

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు వాడుకదారు యొక్క ప్రైవేట్ స్టోరీలులో పరిమితమైన అశ్లీలత-లేని నగ్నత్వాన్ని (ఉదాహరణకు, తల్లిపాలు ఇచ్చే లేదా వైద్య ప్రక్రియల సందర్భంలో) అనుమతిస్తాయి. అయితే కంటెంట్ మార్గదర్శకాలు మాత్రం ఫోటోగ్రాఫిక్ లేదా వాస్తవికమైనది కాకపోయినా (ఉదాహరణకు, పెయింటింగ్‌లు లేదా AI- ఉత్పన్నమైన చిత్రాలు) ఏ సందర్భంలోనైనా సరే అన్ని విధాల నగ్నత్వాన్ని నిషేధిస్తాయి. కమ్యూనిటీ మార్గదర్శకాలు లైంగిక చర్యల యొక్క స్పష్టమైన అందజేతలను నిషేధిస్తాయి; ఒక సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా దుస్తులు ధరించి ఉన్నప్పటికీ మరియు ఆ సైగ ఒక హాస్యోక్తి లేదా దృశ్యమానమైన అనుకరణగా ఉద్దేశించబడినప్పటికీ మా కంటెంట్ మార్గదర్శకాలు ఒక లైంగిక చర్యను చిత్రీకరించడాన్ని లేదా అనుకరించడాన్ని నిషేధిస్తాయి. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు ఏ రకమైన లైంగిక అభ్యర్థననైనా సరే నిషేధిస్తాయి; ఈ కంటెంట్ మార్గదర్శకాలు అతిగా-అమలు చేయడం వైపున తప్పును చూపుతాయి (ఉదాహరణకు, లైంగిక అభ్యర్థనయే ఉద్దేశ్యమని మేము నిర్ధారించలేకపోయినప్పటికీ Snapచాటర్లని ప్రత్యేక అకౌంట్, ప్లాట్‌ఫారమ్ లేదా సైట్‌కి మళ్లించేలా మధ్యస్తంగా సూచించే Snap వ్యాప్తి చెందడాన్ని మేము తిరస్కరిస్తాము).

లైంగిక వేధింపులు మరియు అనుమతి లేని లైంగిక కంటెంట్

ఇవి మా కమ్యూనిటీ మార్గదర్శకాలు లో ప్లాట్‌ఫారమ్-వ్యాప్తంగా నిషేధించబడ్డాయి. కంటెంట్ మార్గదర్శకాలు లైంగిక ఆక్షేపణీయతను మరియు వారి సమ్మతి లేకుండా ఒకరిని లైంగికంగా అనువుగా మలచుకునే మాధ్యమం (ఉదాహరణకు, నిర్దిష్ట లైంగిక శరీర భాగాలను అతిశయోక్తిగా వర్ణించడానికి ఒక సెలబ్రిటీ రూపాన్ని సవరించడం) వంటి సున్నితమైన లేదా సంభావ్యంగా కించపరిచే లైంగిక కంటెంట్‌ను నిషేధించడానికి మరింత అతీతంగా వెళతాయి. మేము ఒక వ్యక్తి లింగం లేదా లైంగికత గురించిన అనుమానాలను కూడా నిషేధిస్తాము (ఉదాహరణకు,“Is ___ in the closet?”) మరియు అస్పష్టమైన, సంచలనాత్మక రీతిలో లైంగిక నేరాలు లేదా లైంగిక నిషిద్ధాల కవరేజీ (ఉదాహరణకు, "తమ విద్యార్థులను వివాహం చేసుకున్న 10 మంది ఉపాధ్యాయులు").

లైంగికంగా స్పష్టంగా ఉండే భాష

Snapచాటర్లు ప్రైవేటుగా లేదా తమ కథనాలపై పెద్దల శృంగార విషయాలను చర్చించకుండా మా కమ్యూనిటీ మార్గదర్శకాలు నిరోధించనప్పటికీ, ఈ కంటెంట్ మార్గదర్శకాలు లైంగిక చర్యలు, జననేంద్రియాలు, సెక్స్ బొమ్మలు, రతి కార్యం లేదా లైంగిక నిషిద్ధాలను (ఉదాహరణకు, అక్రమ సంబంధం/ ఇన్సెస్ట్ లేదా మృగయావినోదం/ బెస్టియాలిటీ ) వివరించే బహిరంగ భాషను నిషేధిస్తాయి. ఇందులో స్పష్టంగా లైంగికంగా సంబంధిత సందర్భాలలో ఉండే ఎమోజిలు చేరి ఉంటాయి. ఇది నిర్దిష్టమైన లైంగిక చర్యలు లేదా శరీర భాగాలను సూచించేటంత స్పష్టమైన పదజాలం కూడా కలిగి ఉంటుంది.

అత్యంత విశేషమైన సూచనాత్మక చిత్రాలు

బహిరంగత-లేని, ప్రమాదకర చిత్రావళిని పంచుకోవడం నుండి మా కమ్యూనిటీ మార్గదర్శకాలు Snapచాటర్లను నిరోధించనప్పటికీ, ఈ కంటెంట్ మార్గదర్శకాలు కెమెరా, వస్త్రధారణ, భంగిమ లేదా ఇతర అంశాల ద్వారా లైంగికంగా రెచ్చగొట్టే మార్గంలో తరచుగా-లైంగికమని భావించబడే శరీర భాగాలను (ఉదాహరణకు, రొమ్ములు, వెనుక భాగం, పంగ) నొక్కి చూపే చిత్రావళిని నిషేధిస్తాయి. వ్యక్తి నగ్నంగా లేనప్పటికీ, లేదా ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కానప్పటికీ సైతమూ (యానిమేషన్లు లేదా డ్రాయింగ్‌లు), ఇది వర్తిస్తుంది. ఇందులో లైంగికమైన శరీర భాగాల యొక్క వస్త్రరహితమైన సమీప వీక్షణలు చేరి ఉంటాయి. ఇందులో, లైంగిక భంగిమలను ప్రేరేపించడం, లైంగికపరమైన చర్యలను అనుకరించడం, లైంగికపరమైన బొమ్మలు ప్రదర్శించడం, లేదా లైంగిక ప్రేరేపణ పద్ధతిలో వస్తువులతో వ్యవహరించడం వంటి అనుకరణాత్మక లైంగిక చర్య కూడా ఉంటుంది.

లైంగికమైన పరిస్థితులలో మైనర్లు.

మా కమ్యూనిటీ మార్గదర్శకాలు పిల్లల లైంగిక దోపిడీ యొక్క అన్ని రూపాలను ఖచ్చితంగా నిషేధిస్తాయి. ఈ కంటెంట్ మార్గదర్శకాలు అదనంగా పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగ మెటీరియల్ యొక్క చట్టపరమైన నిర్వచనం కంటే తక్కువగా ఉండే చివరి-స్థాయి కంటెంట్‌ను నిషేధిస్తాయి.. దీని అర్థం ఏమిటంటే, నిర్దిష్ట సంఘటన ప్రముఖమైన సమస్యలు, వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన కారణంగా వార్తలకు విలువైనది అయి ఉంటే తప్ప, పెద్దలు మరియు మైనర్ల మధ్య శృంగార లేదా లైంగిక సంబంధాల గురించి ఏదైనా వాస్తవమైన లేదా కల్పితమైన కంటెంటును వ్యాప్తి చేయడాన్ని మేము నిరాకరిస్తాము.. వార్తా సముచితమైన విశేష సందర్భాల్లో కూడా, లైంగిక పరిస్థితులలో మైనర్ల కవరేజీ సంచలనాత్మకంగా, సూచనాత్మకంగా లేదా దోపిడీ చేయదగినదిగా ఉండకూడదు.. దీనిలో మైనర్ల మధ్య లైంగిక కార్యకలాపం గురించి వాస్తవమైన లేదా కల్పితమైన కంటెంట్‌ని కూడా ఉంటుంది.. మేము దీనిని అనుమతిస్తాము:

  • కంటెంట్ సూచనాత్మకంగా లేదా స్పష్టంగా బహిరంగంగా లేనంత వరకూ టీనేజర్ల లైంగిక లేదా లింగ గుర్తింపుల గురించి మరియు వారి వయస్సుకు-తగిన శృంగార సంబంధాల గురించిన కంటెంట్

  • కవరేజీ గనక వార్తలకు విలువైనదిగా ఉన్నంత వరకూ - లైంగిక నేరాలు లేదా లైంగిక వేధింపుల కవరేజీ, అంటే, ఇది ఇప్పటికే ప్రముఖమైన సమస్యకు, వ్యక్తికి లేదా సంస్థకు సంబంధించినది అయి ఉంటే.

సున్నితమైనది:

ఈ క్రిందిది సిఫార్సు చేయబడేందుకు అర్హత కలిగి ఉంది, అయితే మేము కొంతమంది నిర్దిష్ట Snapచాటర్ల యొక్క వయస్సు, ప్రదేశం, ప్రాధాన్యతలు లేదా ఇతర ప్రాతిపదికల ఆధారంగా వారు దానిని చూడటాన్ని పరిమితం చేయడాన్ని ఎంచుకోవచ్చు

నగ్నంగా లేని శరీర చిత్రాలను ప్రదర్శించడం

అంటే ఇది యాదృచ్చికంగా తరచుగా-లైంగికపరమైన శరీర భాగాలపై దృష్టిని ఆకర్షించగలిగిన చిత్రాలు అయివుండవచ్చు, అయితే అక్కడ బహిరంగ లైంగిక సూచన చేయాలనే ఉద్దేశం కానట్లయితే (ఉదాహరణకు, స్విమ్ వేర్, ఫిట్‌నెస్ వస్త్రధారణ, రెడ్ కార్పెట్ ఈవెంట్‌లు, రన్‌వే ఫ్యాషన్ వంటి కార్యక్రమానికి సముచితమైన సందర్భంలో కురచ లేదా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం).

మధ్యస్థస్థాయిలో ఉండే సూచనాత్మక భాష

ఇందులో నిర్దిష్ట లైంగిక చర్యలు లేదా నిర్దిష్ట శరీర భాగాలను చూపకుండా అస్పష్టమైన లైంగిక ఆసక్తిని సూచించే సూక్ష్మ బహిరంగత ఉంటుంది.

లైంగిక ఆరోగ్య కంటెంట్

విద్యాపరమైన ఈ కంటెంట్, భద్రతపై దృష్టి సారిస్తూ, ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రోత్సహించకుండా మరియు 13 సంవత్సరాల వంటి చిన్న వయసు Snapచాటర్లకు సరిపోయేవిధంగా లైంగిక ఆరోగ్యవంతంగా ఉంటుంది.

సూచించబడని లైంగికపరమైన కంటెంట్

వార్తలు, ప్రజా ప్రయోజన వ్యాఖ్యానం, లేదా అభ్యాసం సందర్భంలో లైంగికపరమైన కంటెంట్ (ఉదాహరణకు, కళల చరిత్ర).

అడల్ట్ వినోదం

పెద్దల వినోదము/ అడల్ట్ ఎంటర్టైన్మెంట్పనిలో ప్రాథమికంగా సుప్రసిధ్ధి చెందిన ప్రముఖ వ్యక్తులను కలిగి ఉన్న కంటెంట్.

తరువాత రాబోయేది:

వేధింపులు మరియు బెదిరింపులు

Read Next