Snap Values

ప్రభుత్వ అభ్యర్థనలు మరియు కాపీరైట్ చేయబడిన కంటెంట్ టేక్‌డౌన్ నోటీసులు (DMCA)

1, జనవరి, 2022 – 30, జూన్, 2022

Snapchatను సురక్షితమైనదిగా చేయడం మా పనిలో కీలకమైన భాగం, దర్యాప్తులలో సహాయం కోసం సమాచారం కోసం చెల్లుబాటు అయ్యే అభ్యర్థనలను నెరవేర్చడానికి చట్ట అమలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహకరించడం ద్వారా Snapchatను మరింత సురక్షితంగా చేస్తాము. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న ఏదైనా కంటెంట్‌ను ముందస్తుగా పెంచడానికి కూడా మేము పని చేస్తాము.

Snapchat పై చాలా కంటెంట్ అప్రమేయంగా తొలగించబడుతున్నప్పటికీ, వర్తించే చట్టం ప్రకారం అకౌంట్ సమాచారాన్ని సంరక్షించడానికి మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు అందించడానికి మేము పని చేస్తాము. Snapchat అక్కౌంట్ రికార్డులకు సంబంధించి చట్టపరమైన అభ్యర్థన స్వీకరించబడి మరియు దాని చెల్లుబాటు ధ్రువీకరించబడిన తరువాత - ఒక అనధికార సంస్థ నుండి కాక, చట్టాన్ని అమలుపరిచే ఒక చట్టపరమైన సంస్థ లేదా ప్రభుత్వ ఏజెన్సీ చే చేయబడినదని తనిఖీ చేయడం ముఖ్యమైనందున - మేము వర్తించే చట్టం మరియు గోప్యతా అవసరాలమేరకు ప్రతిస్పందిస్తాము.

క్రింద ఇవ్వబడిన చార్ట్, సాక్ష్యాలు మరియు సమన్లు, న్యాయస్థాన ఉత్తర్వులు, సెర్చ్ వారంట్లు, మరియు అత్యవసర బహిర్గత అభ్యర్థనలతో సహా చట్టం అమలుపరచే మరియు ప్రభుత్వ ఏజెన్సీలనుండి మేము మద్దతిచ్చే అభ్యర్థనల రకాలను వివరిస్తుంది.

యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ సమాచార అభ్యర్థనలు

యు.ఎస్. ప్రభుత్వ సంస్థల నుండి వినియోగదారుని సమాచారం కొరకు అభ్యర్ధనలు.

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు

యునైటెడ్ స్టేట్స్ బయటి ప్రభుత్వ ప్రతిపత్తి సంస్థల నుండి వినియోగదారు సమాచారం కోసం అభ్యర్థనలు.

* అకౌంట్ ఐడెంటిఫైయర్‌లు” వాడుకదారు సమాచారాన్ని అభ్యర్థించేటప్పుడు చట్టపరమైన ప్రక్రియలో చట్ట అమలు ద్వారా పేర్కొన్న ఒక సింగిల్ అకౌంట్ కు చెందిన ఐడెంటిఫైయర్ (ఉదా., యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్) ల సంఖ్యను ప్రతిబింబిస్తుంది. చట్టబద్ధ ప్రక్రియలలో కొన్ని ఒకటికంటే ఎక్కువ ఐడెంటిఫయర్లను కలిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో, బహుళ గుర్తింపు ఐడెంటిఫియర్లు ఒకే ఒక్క అకౌంట్‌ను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒకే ఒక ఐడెంటిఫయర్ పేర్కొనబడిన సందర్భాలలో, ప్రతి సందర్భమూ చేర్చబడుతుంది.

యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రత అభ్యర్ధనలు

యు.ఎస్. జాతీయ భద్రతా చట్టపరమైన ప్రక్రియకు సంబంధించి వినియోగదారుని సమాచారానికై అభ్యర్థనలు. క్రిందివాటిలో జాతీయ భద్రతా లేఖలు (NSLలు) మరియు విదేశీ నిఘా పర్యవేక్షణ (FISA) కోర్ట్ ఉత్తర్వులు/ఆదేశాలు ఉంటాయి.

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు

ఏదైనా ప్రభుత్వ అస్థిత్వం సంస్థచే మా సేవా నిబంధనలు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల క్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంట్‌ను తొలగించడానికి డిమాండ్లను ఈ కేటగరీ గుర్తిస్తుంది.

గమనిక: ఒక ప్రభుత్వ సంస్థచే అభ్యర్థన చేయబడినప్పుడు మా పాలసీలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించేటప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవిస్తుందని మేము విశ్వసిస్తాము. ఒక నిర్ధిష్ట దేశంలో చట్టవ్యతిరేకంగా భావించబడిన అయితే ఇతరత్రా మా విధానాలను ఉల్లంఘించని కంటెంట్‌ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసించినప్పుడు, దానిని అంతర్జాతీయంగా తొలగించడానికి బదులుగా సాధ్యమైనప్పుడు దాని యాక్సెస్‌ను భౌగోళికంగా పరిమితం చేయడానికి మేము ప్రయత్నిస్తాము.

కాపీరైట్ చేయబడిన కంటెంట్ తొలగింపు నోటీసులు (DMCA)

డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టము క్రింద మేము అందుకున్న ఏవైనా చెల్లుబాటు అయ్యే ఉపసంహరణ నోటీసులను ఈ విభాగము ప్రతిబింబిస్తుంది.