డిజిటల్ శ్రేయస్సు కొరకు మొదటి కౌన్సిల్ కోసం Snap 18 మంది టీన్స్ ని ఎంపిక చేస్తుంది
15 మే, 2024
యుఎస్ లోని యువతీ యువకుల కోసం మా 18-నెలల ప్రయోగాత్మక కార్యక్రమం అయిన డిజిటల్ శ్రేయస్సు కోసం Snap యొక్క మొట్టమొదటి కౌన్సిల్ యొక్క సభ్యులను ప్రకటించడం పట్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నాము! ఈ రోజున వారి డిజిటల్ జీవితాల స్థితిపై వారి దృక్కోణాలను వినడానికి, అలాగే ఆన్‌లైన్‌లో మరింత సానుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన అనుభవాల కోసం వారి ఆశలు మరియు ఆదర్శాలను వినడానికి ఈ టీనేజ్ వ్యక్తుల గ్రూప్‌తో కలిసి పని చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.
ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ కార్యక్రమంను మొదట ప్రకటించినప్పటి నుండి మేము 150 కంటే ఎక్కువ దరఖాస్తులను అందుకున్నాము, ఇందులో దరఖాస్తుదారులు వారి ఫోన్లతో సంబంధాలు, వారు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లలో వారు చూడాలనుకుంటున్న మార్పుల ఉదాహరణలు, మరియు మండలిలో పాల్గొనడానికి వారి ఆకాంక్షల గురించిన సమర్పణలు చేరి ఉన్నాయి. చాలా మంది ఆకట్టుకునే అభ్యర్థులు ఉన్నందువల్ల ఈ మొదటి సమిష్టిని ఎంచుకోవడమనేది అంత తేలికైన పని కాదు. ఈ ఎంపిక ప్రక్రియ అనేక అనుభవాలు మరియు ఆలోచనల శ్రేణితో వైవిధ్యమైన గ్రూప్ ఏర్పడటానికి దారితీసింది.
ఈ సంవత్సరం ఎంపిక చేయబడని దరఖాస్తుదారులకు, మీరు మీ దరఖాస్తుల కోసం వెచ్చించిన సమయాన్ని మరియు కృషిని మేము ఎంతగానో అభినందిస్తున్నామని దయచేసి తెలుసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహిస్తూ అందులో నిమగ్నమై నిలిచి ఉంటారని మరియు భవిష్యత్తులో దరఖాస్తు చేయడం లేదా ఇతర సారూప్య కార్యక్రమాలలో పాల్గొనడం గురించి మీరు ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.
ప్రారంభ మండలి 11 యు.ఎస్ రాష్ట్రాల నుండి 13 నుండి 16 సంవత్సరాల వయస్సు గల 18 మందితో రూపొందించబడింది. కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తాము ఏమి పొందాలనుకుంటున్నారో ప్రతిబింబించే విధంగా ఎంపిక చేయబడిన కొందరి సభ్యుల దరఖాస్తుల నుండి సారాంశాలు ఈ దిగువన ఉన్నాయి.
“దీర్ఘకాలంలో నన్ను మంచి న్యాయవాదిగా మార్చే విలువైన గ్రాహ్యతలు, నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని పొందడానికై నేను ఎదురుచూస్తున్నాను. దీని అర్థం నా తోటివారి దృక్కోణాలు మరియు అవసరాల కోసం వాదించడం, వారి స్వరాలను చాటి చెప్పడం మరియు ఆన్‌లైన్ చోటులో వారి భద్రత, గోప్యత మరియు సమగ్ర శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే చొరవ కార్యక్రమాల కోసం త్రోసుకు వెళ్ళడం. - కాలిఫోర్నియా నుండి 15-సంవత్సరాల వయసు గల వ్యక్తి
“నా స్కూల్ మరియు కమ్యూనిటీలో డిజిటల్ శ్రేయస్సు కోసం దూతగా వ్యవహరించే అవకాశం గురించి నేను ఎంతో ఉత్సాహంతో ఉన్నాను… ఈ మండలి నుండి నేను సంపాదించుకున్న పరిజ్ఞానం మరియు అనుభవాలను పంచుకోవడం వల్ల అది ఆన్‌లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ముందుకు నడపడానికి ఇతరులను శక్తివంతం చేస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నిజంగా అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు తోటి సహచరుల నుండి వినవలసిన అవసరం ఉంటుంది." - ఫ్లోరిడా నుండి 15-సంవత్సరాల వయసు గల వ్యక్తి
“కమ్యూనిటీ ప్రాజెక్టులు, విధానపరమైన సిఫార్సులు లేదా అవగాహన ప్రచారోద్యమాల ద్వారా మరియు కౌన్సిల్ యొక్క సమిష్టి కృషిని ప్రతిబింబించే సానుకూల గుర్తును చూపడం ద్వారా స్పష్టమైన సమర్థతను చూపే అవకాశం గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అంతిమంగా, ఈ అనుభవం నుండి మరింత జ్ఞానం పొందిన మరియు సహానుభూతి గల వ్యక్తిగా మాత్రమే కాకుండా భవిష్యత్ సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న సాధికారత కలిగిన మార్పు-తీసుకురాదగిన వ్యక్తిగా కూడా ఉద్భవించాలనేది నా ఆకాంక్షగా ఉంది." - వెర్మోంట్ నుండి 16-సంవత్సరాల వయసు గల వ్యక్తి
అతిత్వరలో, ఈ వేసవి అనంతరం శాంటా మోనికాలోని Snap ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశానికి కలిసి వచ్చే ముందుగా మేము మా వర్చువల్ కిక్-ఆఫ్ కి ఆతిథ్యమిస్తాము. ఈ శిఖరాగ్ర సదస్సులో, మేము వివిధ ఆన్‌లైన్ భద్రత మరియు శ్రేయస్సు అంశాలపై చిన్న-గ్రూప్ మరియు పూర్తి-కౌన్సిల్ చర్చలు జరుపుతాము, సంరక్షకులు మరియు చాపెరోన్‌ల కోసం విడిగా “తల్లిదండ్రుల ట్రాక్”, అతిథి వక్తలతో సంభాషణాత్మక సదస్సులు, అదేవిధంగా ఆహ్లాదకరమైన కొన్ని సరదా కార్యక్రమాలను నిర్వహిస్తాము. ఆన్‌లైన్ భద్రత మరియు డిజిటల్ పౌరసత్వ సమస్యలపై టీనేజ్ పిల్లలు తమ పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకోవడానికి, వారి నాయకత్వ మరియు న్యాయసలహా నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి, బృంద సారధులుగా మరియు సహచర హితబోధకులుగా ఎదగడానికి మరియు గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలో సాధ్యపడే కెరీర్ మార్గాల గురించి గ్రాహ్యతను పొందడానికి గాను మేము వారికి అవకాశాలను అందించాలని ఆశిస్తున్నాము.
ఇంటర్నెట్ అనేది, కౌన్సిల్ సభ్యులు చెప్పినట్లుగా, “అన్వేషించబడేందుకు వేచి ఉన్న నిధినిక్షేపాలతో నిండిన విస్తారమైన గ్రంధాలయం,” మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు “ఎప్పుడూ నిస్తేజంగా ఉండరు” ఎందుకంటే “కమ్యూనికేషన్, సృజనాత్మకత మరియు నేర్చుకోవడానికి అక్కడ హద్దులు లేని అవకాశం ఉంది.” ఈరోజున ఆన్‌లైన్ లో టీన్స్ కి నిజమైన ముప్పులు ఉన్నాయని కూడా మాకు తెలుసు. యువత ఆన్‌లైన్ చోటులను ఎలా చేరుకోవచ్చు, భద్రత మరియు బలమైన డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహించే వ్యూహాలను ఎలా ఉపయోగించవచ్చుననే అంశాల గురించి మేము కౌన్సిల్ యొక్క పరిజ్ఞానం మరియు గ్రాహ్యతలను క్రమం తప్పకుండా పంచుకుంటాము. మరొక సభ్యుడు చెప్పినట్లుగా, “ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో "ఇంత గొప్ప సౌందర్యం ఉందని నేను ధృఢంగా నమ్ముతున్నాను"... "మనం కేవలం దానిని నిర్వహించడం నేర్చుకోవాలి అంతే."
ఎంపిక చేయబడిన మా సభ్యులకు అభినందనలు, మరియు దరఖాస్తును సమర్పించిన ప్రతి ఒక్కరికీ మళ్ళీ ధన్యవాదాలు. ఇది విజయవంతమయ్యే మరియు ఉత్పాదక కార్యక్రమం కోసం!
సాధారణంగా ఆన్‌లైన్ భద్రతకు Snap యొక్క నిబద్ధత మరియు పని గురించి మరింతగా తెలుసుకోవడానికి, మా గోప్యత మరియు భద్రత హబ్ను సందర్శించండి, అక్కడ మేము ఇటీవల యు.ఎస్ మరియు ఇతర దేశాలలో డిజిటల్ శ్రేయస్సుపై మా తాజా పరిశోధన ను విడుదల చేశాము.