Privacy, Safety, and Policy Hub

డిజిటల్ శ్రేయస్సు కొరకు Snap యొక్క మొదటి కౌన్సిల్ కోసం దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి!

9 జనవరి, 2024

యు.ఎస్ లోని టీనేజర్లకు పిలుపు! ఆన్‌లైన్ భద్రతా సమస్యలు మరియు ఆన్‌లైన్ జీవితం గురించి మీ స్వరాలు వినిపించడానికి ఇక్కడ ఒక విశిష్టమైన అవకాశం ఉంది. ఈ రోజు నుండి అమలు లోనికి వచ్చేలా, యు.ఎస్. లోని 13 మరియు 16 సంవత్సరాల మధ్య వయసు చిన్నపిల్లల కోసం 18-నెలల ప్రయోగాత్మక కార్యక్రమం అయిన ‘డిజిటల్ శ్రేయస్సు కొరకు మా మొదటి కౌన్సిల్’ కోసం Snap దరఖాస్తులను స్వీకరిస్తోంది.

GenZ అనేది డిజిటల్‌గా నిమగ్నమైన, తెలివిగలది మరియు వనరులభరితమైనది, మరియు Snap వద్ద మేము ఆన్‌లైన్‌లో వృద్ధి చెందడానికి మరియు బలమైన డిజిటల్ శ్రేయస్సును ప్రోత్సహించేందుకు వారి వ్యూహాలలో ఆసక్తి కలిగి ఉన్నాము. సృజనాత్మకత కోసం మరియు ఫ్రెండ్స్ తో కనెక్ట్ చేయడానికి గాను Snapchat ని ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత ఆనందించే చోటుగా చేయడం కొనసాగించేందుకై వారి ఆలోచనలను వినడానికి మేము కూడా ఉత్సాహంతో ఉన్నాము. ఆన్‌లైన్‌లో ఉండటం చాలా నిజమైన ముప్పులను కలిగిస్తుందని మేము అంగీకరిస్తాము, మరియు చిన్నపిల్లలు ఆ ముప్పులను అర్థం చేసుకొని, గుర్తించగలిగి మరియు వాటిని నిర్మూలించడానికి సహాయపడే నైపుణ్యాలను కలిగి ఉండాలని మేము కోరుకుంటాము. అందుకనే మేము ప్రయోగాత్మకంగా ఈ కౌన్సిల్‌ను చేస్తున్నాము: ఈ రోజున ఆన్‌లైన్‌ జీవితం యొక్క స్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజర్ల నుండి విభిన్న దృక్పథాలను పొందడం కోసం, అదేవిధంగా మరింత సానుకూలమైన మరియు ప్రోత్సాహదాయకమైన అనుభవాల కోసం వారి ఆశలు మరియు ఆదర్శాలను పొందడం కోసం.

ఈ కార్యక్రమం నెలవారీ కాల్స్, ప్రాజెక్ట్ వర్క్, మరియు మా గ్లోబల్ సేఫ్టీ అడ్వైజరీ బోర్డ్‌తో నిమగ్నతను కలిగి ఉంటుంది. ఈ మొదటి సంవత్సరంలో, ఎంపిక చేయబడిన కౌన్సిల్ సభ్యులు ఒక రెండు-రోజుల శిఖరాగ్ర సదస్సు కోసం, శాంటా మోనికాలోని Snap యొక్క ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించబడతారు, మరియు రెండో సంవత్సరంలో, కౌన్సిల్ సభ్యులతో వారి జ్ఞానం మరియు అభ్యసనాన్ని ప్రదర్శించేందుకు మేము ఒక బహిరంగ ముఖాముఖీ కార్యక్రమం కోసం ప్రణాళికలను కలిగి ఉన్నాము.

డిజిటల్ శ్రేయస్సు కొరకు మా కౌన్సిల్‌లో చేరడానికి దరఖాస్తు చేసుకోండి

యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న 13 మరియు 16 సంవత్సరాల మధ్య వయసులో ఉండి ఆసక్తి గల టీనేజర్లు ఈ ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసి మరియు శుక్రవారం, మార్చి 22న వ్యాపారం ముగిసే సమయానికి (సా.5:00 గం. పసిఫిక్ సమయం) సబ్మిట్ చేయండి.

కొంత ప్రాథమిక సమాచారానికి అదనంగా, సోషల్ మీడియా వాడకం మరియు సాధారణంగా ఆన్‌లైన్ జీవితం గురించిన ప్రశ్నలకు వ్యాసరచన గానీ లేదా వీడియో రూపంలో గానీ ప్రతిస్పందనలను ఈ దరఖాస్తు కోరుతుంది, అదేవిధంగా Snapchat యాప్ యొక్క మరియు ఒక సంస్థగా Snap తో కౌన్సిల్ అనుభవం మరియు సుపరిచితం కోసం ఆకాంక్షలు మరియు అభిప్రాయాలను కోరుతుంది. 

ఒకటవ సంవత్సరంలో రెండు-రోజుల శిఖరాగ్ర సదస్సు

మా ఇన్-హౌస్ కమిటీచే దరఖాస్తు సమీక్షలు మరియు ఎంపికను అనుసరిస్తూ, మేము యు.ఎస్ వ్యాప్తంగా ఉన్న 15 మంది చిన్నపిల్లలను ప్రారంభ కౌన్సిల్‌ యందు చేరడానికి ఆహ్వానిస్తాము, అది మా కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగే కౌన్సిల్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రతి కౌన్సిల్ సభ్యుడు మరియు తల్లి/తండ్రి, సంరక్షకులు లేదా చాపెరోన్ కోసం ఒకటవ సంవత్సరం సందర్భంగా రెండు-రోజుల పర్యటనతో ముగింపుకు చేరుకుంటుంది. విమానయానం, వసతి సౌకర్యం, భోజనాలు, మరియు సంబంధిత ప్రయాణ ఖర్చులు Snap చే చెల్లించబడతాయి. 

ఈ శిఖరాగ్ర సదస్సులో చిన్న-గ్రూపు మరియు పూర్తి కౌన్సిల్ చర్చలు, సంరక్షకులు మరియు చాపెరోన్‌ల కోసం విడిగా ఒక "పేరెంట్ ట్రాక్", అతిథి వక్తలతో ఇంటరాక్టివ్ సెషన్లు, Snap నాయకులతో నిమగ్నతలు మరియు ఆహ్లాదకరమైన కార్యకలాపాలు చేరి ఉంటాయని భావించబడుతోంది. శిఖరాగ్ర సదస్సు తర్వాత, డిజిటల్ శ్రేయస్సు కోసం మరియు తమ పాఠశాలలు, మరియు కమ్యూనిటీలలో Snapchat పై సానుకూల నిమగ్నత కోసం కౌన్సిల్ సభ్యులు మరియు వారి వయోజన ప్రాయోజితులు, దూతలుగా తమ సేవలను అందిస్తారని మేము ఆశిస్తున్నాము. కౌన్సిల్ లేదా ప్లాన్ చేసిన కార్యక్రమాల గురించి ప్రశ్నల కోసం, platform-safety@snapchat.comని సంప్రదించండి.

సాధారణంగా ఆన్‌లైన్ భద్రత, గోప్యత మరియు భద్రతకు Snap యొక్క నిబద్ధత, మరియు పనిచేయడం గురించి మరింత తెలుసుకోవడానికై మా గోప్యత మరియు భద్రతా హబ్సందర్శించండి, మరియు U.S మరియు ఐదు ఇతర దేశాలలో సురక్షితమైన ఇంటర్నెట్ డే 2024, ఫిబ్రవరి 6 న విడుదల కోసం డిజిటల్ శ్రేయస్సు గురించి ఏర్పాటు చేయబడిన అత్యంత తాజా ప్రపంచవ్యాప్త పరిశోధనను తెలుసుకోవడం పట్ల భరోసాతో ఉండండి. ఈ వసంతకాలంలో ఎంపిక చేసిన కౌన్సిల్ సభ్యుల గురించి వార్తలను పంచుకోవాలని మేము ఎదురుచూస్తున్నాము!

- జాక్విలిన్ బ్యూచెర్, ఫ్లాట్‌ఫారం భద్రత యొక్క గ్లోబల్ హెడ్

తిరిగి వార్తలకు