Snap Values

ప్రభుత్వ అభ్యర్థనలు మరియు మేధా సంపత్తి తొలగింపు అభ్యర్థనలు

ప్రభుత్వ అభ్యర్థనలు మరియు కాపీరైట్ చేయబడిన కంటెంట్ టేక్‌డౌన్ నోటీసులు (DMCA)

1 జూలై, 2023 – డిసెంబర్, 2023

Snapchatను సురక్షితమైనదిగా చేయడం మా పనిలో కీలకమైన భాగం, దర్యాప్తులలో సహాయం కోసం సమాచారం కోసం చెల్లుబాటు అయ్యే అభ్యర్థనలను నెరవేర్చడానికి చట్ట అమలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహకరించడం ద్వారా Snapchatను మరింత సురక్షితంగా చేస్తాము. జీవితం లేదా శారీరక హానికి ఆసన్నమైన బెదిరింపులు ఇమిడి ఉండే ఏదైనా కంటెంటును ముందస్తు చొరవతో తెలియజేయడానికి కూడా మేము కృషి చేస్తాము.

Snapchat పై చాలా కంటెంట్ అప్రమేయంగా తొలగించబడుతున్నప్పటికీ, వర్తించే చట్టం ప్రకారం అకౌంట్ సమాచారాన్ని సంరక్షించడానికి మరియు ప్రభుత్వ ఏజెన్సీలకు అందించడానికి మేము పని చేస్తాము. Snapchat అక్కౌంట్ రికార్డులకు సంబంధించి చట్టపరమైన అభ్యర్థన స్వీకరించబడి మరియు దాని చెల్లుబాటు ధ్రువీకరించబడిన తరువాత - ఒక అనధికార సంస్థ నుండి కాక, చట్టాన్ని అమలుపరిచే ఒక చట్టపరమైన సంస్థ లేదా ప్రభుత్వ ఏజెన్సీ చే చేయబడినదని తనిఖీ చేయడం ముఖ్యమైనందున - మేము వర్తించే చట్టం మరియు గోప్యతా అవసరాలమేరకు ప్రతిస్పందిస్తాము.

సాక్ష్యాలు మరియు సమన్లు, కోర్ట్ ఉత్తర్వులు, సెర్చ్ వారంట్లు, మరియు అత్యవసర వెల్లడి అభ్యర్థనలతో సహా చట్ట అమలు అధికారులు మరియు ప్రభుత్వ ఏజెన్సీలనుండి మేము మద్దతిచ్చే అభ్యర్థనల రకాలను దిగువ ఇవ్వబడిన చార్ట్‌లు వివరిస్తాయి.

అంతే కాకుండా, రిపోర్టింగ్ వ్యవధి లోపున అందుకున్న అభ్యర్థనల ఆధారంగా ప్రచురించబడిన తేదీ నాటికి కొంత డేటా ఉత్పత్తి చేయబడిన అభ్యర్థనల యొక్క శాతం లెక్కించబడింది. ఒక అభ్యర్థన లోపం కలిగి ఉన్నదిగా నిర్ణయించబడిన అరుదైన పరిస్థితులలో — Snap డేటాను అందించకుండా దారి తీసేది — మరియు చట్ట అమలు అధికారులు ఆ తరువాత పారదర్శకత నివేదిక ను ప్రచురించిన తర్వాత సవరణ, చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను సమర్పించి ఉంటే, ఆ తదుపరి డేటా యొక్క ఉత్పత్తి అసలు లేదా తదుపరి రిపోర్టింగ్ వ్యవధులలో ప్రతిఫలించబోదు.

యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ సమాచార అభ్యర్థనలు

యు.ఎస్. ప్రభుత్వ సంస్థల నుండి వినియోగదారుని సమాచారం కొరకు అభ్యర్ధనలు.

అంతర్జాతీయ ప్రభుత్వ సమాచార అభ్యర్ధనలు

యునైటెడ్ స్టేట్స్ బయటి ప్రభుత్వ ప్రతిపత్తి సంస్థల నుండి వినియోగదారు సమాచారం కోసం అభ్యర్థనలు.

* అకౌంట్ ఐడెంటిఫైయర్‌లు” వాడుకదారు సమాచారాన్ని అభ్యర్థించేటప్పుడు చట్టపరమైన ప్రక్రియలో చట్ట అమలు ద్వారా పేర్కొన్న ఒక సింగిల్ అకౌంట్ కు చెందిన ఐడెంటిఫైయర్ (ఉదా., యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్) ల సంఖ్యను ప్రతిబింబిస్తుంది. చట్టబద్ధ ప్రక్రియలలో కొన్ని ఒకటికంటే ఎక్కువ ఐడెంటిఫయర్లను కలిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో, బహుళ గుర్తింపు ఐడెంటిఫియర్లు ఒకే ఒక్క అకౌంట్‌ను గుర్తించవచ్చు. బహుళ అభ్యర్థనలలో ఒకే ఒక ఐడెంటిఫయర్ పేర్కొనబడిన సందర్భాలలో, ప్రతి సందర్భమూ చేర్చబడుతుంది.

** US-UK డేటా యాక్సెస్ ఒప్పందం (అక్టోబర్ 3, 2022 నుండి అమల్లోకి వచ్చింది) ప్రకారం UK నుండి Snap దర్యాప్తు అధికారాల చట్టం కింద అభ్యర్థనలను స్వీకరించినంత వరకు, ఆ చట్టం యొక్క వర్తించే అవసరాలకు అనుగుణంగా అటువంటి ఏవైనా అభ్యర్థనలపై నివేదించడం ఆలస్యం అవుతుంది. మరింత సమాచారం కోసం, దయచేసి చూడండి: https://www.ipco.org.uk/publications/annual-reports/.

యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రత అభ్యర్ధనలు

యు.ఎస్. జాతీయ భద్రతా చట్టపరమైన ప్రక్రియకు సంబంధించి వినియోగదారుని సమాచారానికై అభ్యర్థనలు. క్రిందివాటిలో జాతీయ భద్రతా లేఖలు (NSLలు) మరియు విదేశీ నిఘా పర్యవేక్షణ (FISA) కోర్ట్ ఉత్తర్వులు/ఆదేశాలు ఉంటాయి.

ప్రభుత్వ కంటెంట్ తొలగింపు అభ్యర్ధనలు

ఏదైనా ప్రభుత్వ అస్థిత్వం సంస్థచే మా సేవా నిబంధనలు లేదా కమ్యూనిటీ మార్గదర్శకాల క్రింద ఇతరత్రా అనుమతించదగిన కంటెంట్‌ను తొలగించడానికి డిమాండ్లను ఈ కేటగరీ గుర్తిస్తుంది.

గమనిక: ఒక ప్రభుత్వ సంస్థచే అభ్యర్థన చేయబడినప్పుడు మా పాలసీలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించేటప్పుడు మేము పద్ధతి ప్రకారం ట్రాక్ చేయనప్పటికీ, అది అత్యంత అరుదుగా సంభవిస్తుందని మేము విశ్వసిస్తాము. ఒక నిర్ధిష్ట దేశంలో చట్టవ్యతిరేకంగా భావించబడిన అయితే ఇతరత్రా మా విధానాలను ఉల్లంఘించని కంటెంట్‌ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని మేము విశ్వసించినప్పుడు, దానిని అంతర్జాతీయంగా తొలగించడానికి బదులుగా సాధ్యమైనప్పుడు దాని యాక్సెస్‌ను భౌగోళికంగా పరిమితం చేయడానికి మేము ప్రయత్నిస్తాము.

ఒక అదనపు గమనీయ అంశముగా, డిజిటల్ సేవల చట్టం క్రింద వెల్లడించాల్సిన సమాచారాన్ని ట్రాక్ చేయడానికై మా ప్రభుత్వ ఉపసంహరణ కార్యకలాపాలను మా బృందాలు మరింత మెరుగుపరచడం ప్రారంభించాయి. భవిష్యత్తు నివేదికలలో, మేము ఈ కేటగరీలో కొత్త డేటా పాయింట్లను ప్రవేశపెడతాము.

కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్మెంట్ నోటీసులు

ఈ వర్గం కాపీరైట్ ను ఉల్లంఘించేదిగా ఆరోపిత కంటెంట్ ని తొలగించడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే అభ్యర్థనను ప్రతిబింబిస్తుంది.