మేము సేకరించే సమాచారంలో మూడు ప్రాథమిక కేటగరీలు ఉన్నాయి:
మా సేవలను మీరు ఉపయోగించేటప్పుడు మేము పొందే సమాచారం.
తృతీయ పక్షాల నుండి మేము పొందే సమాచారం.
ఈ కేటగిరీల్లో ప్రతిదాని గురించి మరికొంచెం వివరంగా ఇక్కడ ఇవ్వబడింది.
మీరు అందించే సమాచారం
మీరు మా సేవలతో సంభాషించినప్పుడు, మీరు మాకు అందించే సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఉదాహరణకు, మా అనేక సేవలకు మీరు ఒక అకౌంట్ను నిర్మిచెయ్యాల్సి ఉంటుంది, కాబట్టి మీ పేరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వంటి మీ గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను మేము సేకరించాల్సి ఉంటుంది. మా సేవల్లో బహిరంగంగా కనిపించే ఒక ప్రొఫైల్ పిక్చర్ లేదా Bitmoji అవతార్ వంటి కొంత అదనపు సమాచారాన్ని మాకు అందించమని కూడా మేము మిమ్మల్ని అడగవచ్చు. మరియు ఆ తాజా స్నీకర్స్ వంటిదాన్ని మీరు మా వాణిజ్య ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంటే, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబర్ మరియు అనుబంధిత అకౌంట్ వంటి మీ చెల్లింపు సమాచారాన్ని మేము అడగవచ్చు.
Snap లు మరియు చాట్ లు, My AI తో సంభాషణలు, స్పాట్లైట్ సమర్పణలు, పబ్లిక్ ప్రొఫైల్ సమాచారం, మెమోరీస్ మరియు మరెన్నో ఇటువంటి మా సేవల ద్వారా మీరు పంపే సమాచారాన్ని కూడా మీరు మాకు అందిస్తారు. మీ Snap లు, చాట్ లు మరియు ఏదైనా ఇతర కంటెంట్ ను వీక్షించే వినియోగదారులు ఎల్లప్పుడూ ఆ కంటెంట్ ను సేవ్ చేయవచ్చు లేదా యాప్ వెలుపల కాపీ చేయగలరని గుర్తుంచుకోండి. కాబట్టి, ఇంటర్నెట్ కు వర్తించే అదే ఇంగిత జ్ఞనం మా సేవలకు కూడా వర్తిస్తుంది: మీరు కోరుకొనే సందేశాలను లేదా కంటెంట్ ను ఎవరైనా సేవ్ లేదా షేర్ చెయ్యకూడదంటే అలాంటి సందేశాలను లేదా కంటెంట్ ను పంపవద్దండి లేదా షేర్ చెయ్యవద్దండి.
మీరు మద్దతు ని సంప్రదించినప్పుడు లేదా మరేదైనా విధంగా మాతో సంభాషించినప్పుడు, మీరు స్వచ్ఛందంగా ఇచ్చిన లేదా మీ ప్రశ్నను పరిష్కరించడానికి అవసరమైన సమాచారాన్ని మేం సేకరిస్తాం.
మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు మాకు లభించే సమాచారం
మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు, ఆ సేవలలో వేటిని మీరు ఉపయోగించుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి మేము సమాచాముం సేకరిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక నిర్దిష్ట స్టోరీని చూశారని, స్పాట్ లైట్ లో పిల్లి వీడియోలను చూశారని, ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట యాడ్ ను చూశారని, Snap మ్యాప్ ను అన్వేషించారని మరియు కొన్ని Snap లను పంపారని మాకు తెలిసి ఉండవచ్చు. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము సేకరించే సమాచారం యొక్క రకాల పూర్తి వివరణ ఇదిగో:
వినియోగ సమాచారం. మా సేవల ద్వారా మేం మీ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరిస్తాం. ఉదాహరణకు, మేము ఈ అంశాల గురించిన సమాచారమును సేకరించవచ్చు:
మీరు ఏ ఫిల్టర్‌లు లేదా లెన్సెస్ను వీక్షిస్తారు లేదా Snapలకు వర్తింపజేస్తారు, మీరు ఏ స్టోరీస్ ను చూస్తున్నారు, మీరు Spectacles ను ఉపయోగిస్తున్నారా, My AIతో మీ పరస్పర చర్యలు లేదా మీరు సబ్మిట్ చేసిన శోధన ప్రశ్నల వంటి మా సేవలతో మీరు ఎలా పరస్పర చర్య చేస్తారు.
ఇతర Snapచాటర్లతో మీరు ఎలా సంభాషిస్తారు, వారి పేర్లు, మీ సంభాషనల సమయం మరియు తేదీ, మీ ఫ్రెండ్స్ తో మీరు మార్పిడి చేసే సందేశాల సంఖ్య, మీరు సందేశాలను ఎక్కువగా మార్పిడి చేసే ఫ్రెండ్స్ మరియు సందేశాలతో మీ పరస్పర చర్యలు (మీరు ఒక సందేశాన్ని తెరిచినప్పుడు లేదా మీరు స్క్రీన్ షాట్ ను సంగ్రహించినట్లు మేము గుర్తించడం వంటివి).
కంటెంట్ సమాచారం. మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు, మీరు కెమెరా లేదా క్రియేటివ్ టూల్స్ తో నిమగ్నమై ఉండవచ్చు మరియు స్టోరీస్, Snapలు మరియు మరిన్నింటితో సహా వివిధ రకాల కంటెంట్‌ను సృష్టించవచ్చు మరియు షేర్ చేయవచ్చు. మా సేవల్లో మీరు సృష్టించే లేదా అందించే కంటెంట్ గురించి మరియు కెమెరా మరియు క్రియేటివ్ టూల్స్ తో మీ నిమగ్నత గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. నిర్దిష్ట కంటెంట్ కోసం, ఇది చిత్రం, వీడియో మరియు ఆడియో యొక్క కంటెంట్ ఆధారంగా సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు బాస్కెట్ బాల్ ఆడుతున్నస్పాట్‌లైట్ Snap ను పోస్ట్ చేస్తే, బాస్కెట్ బాల్ గురించి ఇతర స్పాట్‌లైట్ Snap లను మేము మీకు చూపించవచ్చు. మెటాడేటాతో సహా కంటెంట్ గురించి ఇతర సమాచారాన్ని కూడా మేము సేకరించవచ్చు - ఇది పోస్ట్ చేసిన తేదీ మరియు సమయం మరియు ఎవరు చూశారు వంటి కంటెంట్ గురించిన సమాచారం.
పరికరం సమాచారం. మీరు ఉపయోగించే పరకరం నుండి మరియు దాని గురించి మేం సమాచారం సేకరిస్తాం. ఉదాహరణకు, మేము వీటిని సేకరించవచ్చు:
హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, పరికర మెమరీ, అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌లు, యూనిక్ అప్లికేషన్ ఐడెంటిఫైయర్‌లు, ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు, ప్రత్యేక పరికర ఐడెంటిఫైయర్‌లు, పరికర వినియోగ డేటా, బ్రౌజర్ రకం, ఇన్‌స్టాల్ చేయబడిన కీబోర్డ్‌లు, భాష, బ్యాటరీ స్థాయి మరియు టైమ్ జోన్ వంటి మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ గురించిన సమాచారం:
యాక్సిలరోమీటర్లు, గైరోస్కోప్‌లు, దిక్సూచిలు, మైక్రోఫోన్‌లు మరియు మీరు హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేసుకున్నారా వంటి ఉపకరణ సెన్సార్ల నుండి సమాచారము; మరియు
మొబైల్ ఫోన్ నెంబర్, సేవా ప్రదాత, IP చిరునామా మరియు సిగ్నల్ సామర్ధ్యం వంటి మీ వైర్‌లెస్ మరియు మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్‌ల గురించిన సమాచారము.
పరకరం ఫోన్‌బుక్. మా సేవలన్నీ ఫ్రెండ్స్ తో సంభాషణం చేయడానికి సంబంధించినవి కాబట్టి, మేము - మీ అనుమతితో - మీ కాంటాక్టులు మరియు సంబంధిత సమాచారం వంటి మీ పరికరం యొక్క ఫోన్ బుక్ నుండి సమాచారాన్ని సేకరించవచ్చు.
కెమెరా, ఫోటోలు, మరియు ఆడియో. మీ పరికరం యొక్క కెమెరా, ఫోటోలు మరియు మైక్రోఫోన్ నుండి చిత్రాలు మరియు ఇతర సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం మా అనేక సేవలకు ఉంది. ఉదాహరణకు, మేము మీ కెమెరా లేదా ఫోటోలను ప్రాప్యత చేసుకోగలిగితే తప్ప, మీరు Snaps పంపించలేరు లేదా మీ కెమెరా రోల్ నుండి ఫోటోలను అప్‌లోడ్ చేయలేరు.
లొకేషన్ సమాచారము. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము మీ స్థానము గురించిన సమాచారమును సేకరించవచ్చు. మీ అనుమతితో, GPS సంకేతాలు వంటి పద్ధతులను కలిగి ఉన్న మీ ఖచ్చితమైన లొకేషన్ గురించి సమాచారాన్ని కూడా మేం సేకరించవచ్చు.
కుక్కీలు మరియు ఇతర సాంకేతికలతో సేకరించబడే సమాచారము. అనేక ఆన్‌లైన్ సేవలు మరియు మొబైల్ అప్లికేషన్ల వలెనే, మీ చర్య, బ్రౌజర్, మరియు ఉపకరణము గురించిన సమాచారము సేకరించడానికి మేము కుకీస్ మరియు వెబ్ బీకాన్స్, వెబ్్ స్టోరేజ్, మరియు విశిష్ట అడ్వర్టైజింగ్ ఐడెంటిఫయర్లు వంటి ఇతర టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. అడ్వర్టైజింగ్ మరియు వాణిజ్య అంశాలు వంటి మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించునప్పుడు సమాచారమును సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఇతర వెబ్ సైట్ లపై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు మీ బ్రౌజర్ లేదా ఉపకరణంపై సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీలను తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని గుర్తుంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీలను ఎలా ఉపయోగిస్తామో అనేదాని గురించి మరింత తెలుసుకొనేందుకు మా కుకీ విధానాన్ని చూడండి.
లాగ్ సమాచారం. మీరు మా వెబ్ సైట్ ఉపయోగించినప్పుడు మేము లాగ్ సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, అవి:
మీరు మా సేవలను ఎలా ఉపయోగించుకున్నాారనే దాని గురించిన వివరాలు;
మీ వెబ్ బ్రౌజర్ రకం మరియు భాష వంటి ఉపకరణ సమాచారము;
ప్రాప్యత చేసుకున్న సమయాలు;
మీ ఉపకరణము లేదా బ్రౌజర్‌ను విశిష్టంగా గుర్తించే కుకీలు లేదా ఇతర సాంకేతికతలతో ముడిపడి ఉన్న ఐడెంటిఫైయర్‌లు; మరియు
మా వెబ్‌సైట్‌కు నావిగేట్ చేయడానికి ముందు లేదా తరువాత మీరు సందర్శించిన పేజీలు.
మీ అనుమతితో ఇతర సమాచారం. మీరు మా సేవలతో పరస్పర చర్య చేసినప్పుడు అదనపు సమాచారాన్ని సేకరించడానికి మీ అనుమతిని అడిగే సందర్భాలు ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు నా కోసం తయారు చేయబడిన Panel లో పాల్గొనాలనుకుంటే లేదా నివసించే ప్రాంతం లో నిర్ధిష్ట డేటా సున్నితంగా పరిగణించబడే అధికార పరిధిలో ఉంటే మేము మీ అనుమతిని అడుగుతాము మరియు సున్నితమైన డేటాతో సహా, మేము ఏ డేటాను సేకరిస్తున్నాము అనే దానిపై మీకు heads up ఇస్తాము.
తృతీయ పక్షాల నుండి మేము సేకరించే సమాచారము
మీ గురించి సమాచారాన్ని మేము మా అనుబంధ సంస్థలు, తృతీయ పక్షాలనుండి సమాచారాన్ని సేకరించవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
మీరు మీ Snapchat ఖాతాను మరొక సేవకు (Bitmoji లేదా తృతీయ-పక్ష యాప్ వంటివి)గనక లింక్ చేస్తే, మీరు ఆ సేవను ఎలా ఉపయోగిస్తారు వంటి సమాచారాన్ని మేము ఆ ఇతర సేవ నుండి అందుకోవచ్చు.
మేము అడ్వర్టైజర్లు, యాప్ డెవలపర్లు, ప్రచురణకర్తలు మరియు ఇతర తృతీయ పక్షాల నుండి సమాచారాన్ని పొందవచ్చు. యాడ్ల యొక్క పని తీరును లక్ష్యంగా లేదా లెక్కించడం లొ సహాయ పడటానికి ఇతర మార్గాలతో సహా మేము ఈ సమాచారన్ని ఉపయోగించవచ్చు. మా సపోర్ట్ సైట్ లో ఈ రకమైన తృతీయ పక్ష డేటా యొక్క మా ఉపయోగం గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.
మరొక వినియోగదారు వారి కాంటాక్ట్ జాబితాను అప్ లోడ్ చేస్తే, ఆ వినియోగదారుని కాంటాక్ట్ జాబితా నుండి మీ గురించిన సమాచారాన్ని మేము మీ గురించి సేకరించిన ఇతర సమాచారంతో కలపవచ్చు.
మీరు మీ కాంటాక్ట్ సమాచారాన్ని మాకు అందించినట్లయితే, ఈ సమాచారాన్ని మరియు తృతీయ పక్షాల నుండి పొందిన సమాచారాన్ని ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ పై మేము మీతో సంభాషించడం చేయగలమా లేదా అని తెలుసుకోవడానికి మేము ఉపయోగించవచ్చు.
మా సేవా నిబంధనలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే సంభావ్య ఉల్లంఘనదారుల గురించి వెబ్ సైట్ ప్రచురణకర్తలు, సోషల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు, చట్టాన్ని అమలు చేసేవారి నుండి మరియు ఇతరులతో సహా తృతీయ పక్షాల నుండి మేము సమాచారాన్ని పొందవచ్చు.