ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, అందువల్ల మీ Snapchat అనుభవాన్ని మీ కోసం ప్రత్యేకంగా రూపొందించడానికి మేం మీ కొంత సమాచారాన్ని ఉపయోగిస్తాం! ఉదాహరణకు, మీరు చూసే స్పాట్‌లైట్ కంటెంట్‌ను మేము వ్యక్తిగతీకృతం చేస్తాము — కాబట్టి ఒకవేళ మీరు క్రీడలలో ఆసక్తి చూపించేటట్లయితే, మీరు మరింత ఎక్కువగా క్రీడలకు సంబంధించిన కంటెంట్‌ను చూడవచ్చు. లేదా, మీరు మీ కుక్కపిల్ల యొక్క Snaps ని క్రమం తప్పకుండా నా స్టోరీకి పోస్టు చేసినట్లయితే, మీకు శునకాలు ఇష్టమని మేము ఊహించుకోగలుగుతాము మరియు మీ ఆసక్తులకు సంబంధించిన కంటెంట్‌ను చూపించడానికి ప్రయత్నిస్తాము!
మీకు ఆసక్తి ఉన్న కంటెంట్ హైలైట్ చేయడానికి మేం సెర్చ్ స్క్రీన్‌ని వ్యక్తిగతీకరించి మరియు మీ మెమోరీస్ వ్యక్తిగతీకరించిన అవలోకనాన్ని కూడా మీకు అందించగలం. మీ పుట్టినరోజు అని మాకు తెలిస్తే, వేడుక చేసుకోవడంలో సాయపడటానికి మేం మీకు మరియు మీ స్నేహితులకు ప్రత్యేక లెన్స్ అందించగలం! మీ Snapchat అనుభవాన్ని ప్రత్యేకం చేయడానికి మేం యాడ్స్, సెర్చ్, ఫిల్టర్‌లు, Snap మ్యాప్, మరియు Lensesను కూడా వ్యక్తిగతీకరించగలం.
మీరు ఎక్కడ ఉన్నారు మరియు మీ చుట్టూ ఏమి జరుగుతుందనే దాని ఆధారంగా మీ Snapsలకు ఒక సందర్భం ఇవ్వడానికి కూడా మేం సమాచారాన్ని ఉపయోగిస్తాం! దీనిలో సమయం, వాతావరణం, లేదా ప్రత్యేక Lenses మరియు మీరు వెళ్లిన ఈవెంట్ కొరకు తయారు చేసిన ఫిల్టర్‌లను చూపించే స్టిక్కర్‌లు సహా ఉంటాయి. అలాగే, అవి ఎప్పుడు, ఎక్కడ క్యాప్చర్ చేయబడ్డాయనే దాని ఆధారంగా వాటిని మీ కోసం వీలుగా మీ మెమోరీస్‌ని క్రమబద్ధీకరించడానికి కూడా మేం ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాం.
మీ అనుభవాన్ని మేము ఎలా వ్యక్తిగతీకృతం చేస్తామో అనే దాని గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఇక్కడచదవండి.