యువత తిరిగి స్కూల్ కి వెళ్ళేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో విద్యావేత్తలకు Snapchat కొత్త టూల్స్ మరియు వనరులను ప్రవేశపెడుతోంది.
28 ఆగస్ట్, 2024
U.S. లో రెండు కోట్లకు పైగా యువత Snapchatను ఉపయోగిస్తున్నారు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సహా యువతకు వారి జీవితాలలో డిజిటల్ శ్రేయస్సు అనేది చాలా ముఖ్యమైనది. యువత తిరిగి స్కూల్ కి వెళ్ళేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో,మేము ప్రత్యేకంగా విద్యావేత్తలకు రూపొందించిన కొత్త భద్రతా సాధనాలు మరియు వనరులను ప్రవేశపెడుతున్నాము.
ఈ కొత్త వనరులు విద్యావేత్తలు మరియు పాఠశాల నిర్వాహకులు తమ విద్యార్థులు Snapchatను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకొనేందుకు, విద్యార్థులు మరియు పాఠశాలలకు ముఖ్యమైన రక్షణలు అందుబాటలో ఉండేలా రూపొందించబడినాయి మరియు మేము అందించే వనరులు విద్యార్థులకు సురక్షితమైన మరియు మద్దతునిచ్చే వాతావరణం సృష్టించేందుకు పాఠశాలలకు దోహదం చేస్తాయి.
స్నేహితులకు సందేశం పంపడమనేది ప్రజలను సంతోషంగా ఉంచడమనేది Snapchat యొక్క ప్రధమ ప్రాధాన్యమని మరియు ఆ స్నేహితులు యువతకు ప్రధాన మద్దతు వ్యవస్థ అని మాకు తెలుసు. అర్థవంతమైన ఈ సంబంధాలపై మేము దృష్టిపెట్టడంతోపాటు, యుక్తవయస్కులకు అందించే ఈ టూల్స్ మరియు వనరులను వారు సద్వినియోగం చేసుకొంటారని మేము భావిస్తున్నాము
విద్యావేత్తకు Snapchat యొక్క గైడ్
విద్యార్థులతో మమేకం అయ్యి ఉండటమంటే ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ తో మీరు మంచి అవగాహన కలిగివుండటమని మేము విశ్వసిస్తాము మరియు కేవలం అది చేయడానికే మేము ప్రత్యేకించి విద్యావేత్తలకు మాత్రమే సహాయకారిగా ఉండే ఒక వెబ్‍సైట్ ప్రవేశపెడుతున్నాము.
మా విద్యావేత్త యొక్క Snapchat గైడ్ అనేది ఈ ప్లాట్‍ఫామ్ ఎలా పనిచేస్తుంది, పాఠశాల కమ్యూనిటీలలో Snapchatని సానుకూలంగా ఏవిధంగా ఉపయోగించవచ్చు మరియు మా భద్రతా టూల్స్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి సమాచారం యొక్క అవలోకనం కలిగివుంటుంది. దీనిలో, లైంగికపరమైన వేధింపులు వంటి లైంగికపరమైన ఇబ్బందులు, మానసిక ఆరోగ్య సంబంధ ఆరోగ్య ఆందోళనలతోసహా విద్యార్థులు ఆన్‍లైన్‍లో ఎదుర్కొనే ప్రమాదాలను ఏవిధంగా ఎదుర్కోవాలి అనేదానిపై వారికి మద్దతివ్వడంగురించి సమాచారాన్ని, విద్యావేత్తలు తల్లిదండ్రులు, కౌన్సెలర్లు, మరియు ఇతరులతొ పంచుకొనే డౌన్‍లోడ్ చేసుకోగలిగే వనరులతోపాటు యుక్తవయస్కులు మరియు పాఠశాలల భద్రతాప్రమాణాలపై Snap ఫీచర్లను ప్రముఖంగా చూపే వీడియోలు కూడా ఉంటాయి.
నైపుణ్య భాగస్వాములతో అభివృద్ధి చేయబడిన విద్యావేత్త వనరులు
విద్యావేత్తలకు ఒక సమగ్ర మరియు ఆచరణాత్మక టూల్‍కిట్ అభివృద్ధి చేసేందుకు మేము Safe and Sound Schools తో జతకట్టాము. పాఠశాల వాతావరణాలలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ యొక్క ప్రభావపై ఉపాధ్యాయులు, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు రిసోర్స్ అధికారుల అంతర్‍దృష్టుల ఆధారంగా తయారుచేయబడిన ఈ టూల్‍కిట్, విద్యావేత్తలు, ప్రత్యేకించి Snapchatపై ప్రముఖ్ంగా దృష్టి సారిస్తూ, తమ విద్యార్థుల ఆన్‍లైన్ భద్రత మరియు శ్రేయస్సుకు మద్దతునిచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం అందించేందుకు రూపొందించబడింది.
విద్యావేత్త ఫీడ్‍బ్యాక్ ఫారం
మేము Snapచాటర్ల భద్రతకు సంబంధించిన ఏదైనా విషయాన్ని మాకు నేరుగా రిపోర్ట్ చేయడానికి మరియు అవాంఛనీయ లేదా సరిగాలేని అక్కౌంట్లను బ్లాక్ చేసేందుకు సులభంగా ఉపయోగించేలా ఉండేలా టూల్స్ తో Snapచాటర్లను ఎప్పుడో శక్తిమంతం చేశాము. Snapchat అకౌంట్ లేనివారు ఎవరైనా, తమ తరఫున లేదా ఇతరుల తరఫున రిపోర్ట్ చేయడానికి అనువుగా మేము ఆన్‍లైన్ రిపోర్టింగ్ సాధనాలను కూడా అందిస్తాము. ఈ నివేదికలు సరైన చర్యకోసమైన 24/7 పనిచేసే మా భద్రతా బృందాలకు నేరుగా వెళతాయి.
ప్రస్తుతం మేము, విద్యావేత్తలు మాకు ఫీడ్‍బ్యాక్ నేరుగా ఇచ్చేందుకు ఒక మార్గాన్ని ప్రవేశపెడుతున్నాము. మా కొత్త విద్యావేత్త ఫీడ్‍బ్యాక్ ఫారంతో, తమ పాఠశాల కమ్యూనిటీలలో Snapchat ఏవిధంగా ఉపయోగించబడుతోంది అనేదానిపై విద్యావేత్తలు తమ ఆలోచనలను మరియు దృక్పథాలను పంచుకోవచ్చు.

డిజిటల్ ల్యాండ్‍స్కేప్‍ను నావిగేట్ చేయడమనేది సవాలుతో కూడుకొన్నదని మాకు తెలుసు, అయితే ఈ వనరులు విద్యావేత్తలకు, విద్యార్థులకు భద్రమైన మరియు మద్దతునిచ్చే ఒక డిజిటల్ వాతావరణాన్ని సృష్టించేందుకు అవసరమైన కొన్ని సాధనాలు అందిస్తాయని మేము ఆశిస్తున్నాము.