Privacy, Safety, and Policy Hub

మా కమ్యూనిటీ రక్షణకై కొత్త ఫీచర్లు

25 జూన్, 2024

ఆన్‌లైన్ ప్రమాదాలనుండి మా కమ్యూనిటీకి మరింత రక్షణ కల్పించేందుకై, ఈ రోజు మేము కొత్త ఫీచర్లను ప్రకటిస్తున్నాము. మా నూతన టూల్స్ ‍సూట్‍లో విస్తరించబడిన ఇన్-యాప్ హెచ్చరికలు, ఉన్నతీకరించబడిన ఫ్రెండింగ్ రక్షణలు, సరళీకృతమైన లొకేషన్-షేరింగ్, మరియు బ్లాకింగ్ మెరుగుదలలు ఉన్నాయి. ఇవన్నీ Snapchatను మరింత భిన్నమైనదిగా చేసేందుకు వాస్తవ ఫ్రెండ్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రూపొందించబడినాయి.

విస్తరించబడిన ఈ ఫీచర్లు, Snapchatలో ఉన్నవారితో కొత్తవారు సంప్రదించడాన్ని ఇప్పటికే క్లిష్టంగా ఉన్న మా ప్రక్రియను కొనసాగిస్తుంది. ఉదాహరణకు, ఇంతకుముందే ఫ్రెండ్‌గా చేర్చబడనివారు లేదా వారి ఫోన్ కాంటాక్టులలో లేనివారు సందేశం పంపడానికి మేము అనుమతించము. వేరేమాటల్లో చెప్పాలంటే, Snapచాటర్లు తాము ఎవరితో కమ్యూనికేట్ చేయదలచుకొన్నారో ముందుగానే ఎంచుకోవాల్సి ఉంటుంది.

మా కమ్యూనిటీని సురక్షితంగా ఉంచేందుకు ఈ రోజు మేము దిగువ ఇచ్చిన టూల్స్ ప్రవేశపెడుతున్నాము:

విస్తరించబడిన ఇన్-యాప్ హెచ్చరికలు

పరస్పర ఫ్రెండ్స్ పంచుకోని లేదా వారి కాంటాక్టులలో లేనివారినుండి యుక్తవయస్కులు సందేశం స్వీకరించినట్లయితే ఒక పాపప్ వచ్చేలా హెచ్చరికను మేము గత నవంబర్‌లో ప్రవేశపెట్టాము. ఈ సందేశం, వారితో సంబంధంలో ఉండాలా మరియు వారు విశ్వసించేవారితో మాత్రమే కనెక్ట్ అవాలా అనేదానిని జాగ్రత్తగా పరిగణించేందుకు, తద్వారా సంభావ్య ప్రమాదాల గురించి యుక్తవయస్కులవారికి తెలియజేస్తుంది. ఈ ఫీచర్ ప్రారంభించబడిన నాటినుండి, మిలియన్లమంది Snapచాటర్లు చర్యలు తీసుకోవడానికి సశక్తిమంతం చేయడంతోపాటు, 12 మిలియన్లకు పైగా బ్లాకులు చేయబడినాయి. 1

ఇప్పుడు మేము ఈ ఇన్-యాప్ హెచ్చరికలను, మరిన్ని నూతన మరియు ఆధునిక సిగ్నల్స్ చేర్చడంద్వారా మరింత విస్తరిస్తున్నాము. ఇప్పుడు యుక్తవయస్కులు, బ్లాక్ చేయబడిన వారినుండి లేదా ఇతరులచే నివేదించబడిన వారినుండి లేదా సాధారణంగా వారి నెట్‌వర్క్ లేనిప్రాంతంనుండి ఏదైనా చాట్ పొందినట్లయితే అట్టివ్యక్తి ఒక స్కామర్‌గా గుర్తించేందుకు, ఒక హెచ్చరిక సందేశం పొందుతారు.

మెరుగైన స్నేహితుడిని చేసుకొనే రక్షణలు

ఇంతకుముందు మేము పంచుకొన్నట్టుగా యుక్తవయస్కులు వారు ఇతర వ్యక్తితో బహుళ పరస్పర కనెక్షన్లు లేనప్పుడు క్విక్ యాడ్ లేదా సెర్చ్‌లో మరొకరికి సజెస్ట్ చేయబడరు. ప్రస్తుతం విస్తరించబడిన మా ఇన్-యాప్ హెచ్చరికలతోపాటు ఉండే కొత్త స్నేహపూర్వక రక్షణలను చేరుస్తున్నాము. ఇది కొత్తవ్యక్తులు యుక్తవయస్కులను కనుక్కోవడం మరియు చేర్చడం మరింత క్లిష్టతరం చేస్తుంది.

యుక్తవయస్కులు పరస్పర ఫ్రెండ్స్ కాని ఎవరికైనా ఫ్రెండ్ అభ్యర్థనను పంపినా లేదా స్వీకరించినా మరియు అట్టువ్యక్తి తరచుగా స్కామింగ్ కార్యకలాపంతో సంబంధం కలిగివున్న ప్రదేశాలలో Snapchat యాక్సెస్ చేసిన చరిత్ర కలిగివున్నట్లయితే, అట్టి అభ్యర్థన డెలివరీ పూర్తిగా నిలిపివేయబడుతుంది. ఇది ఒక యుక్తవయస్కుడిచే ఒక అభ్యర్థన పంపబడినా లేదా ఒక సంభావ్య చెడు వ్యక్తి నుండి ఒక యుక్తవయస్సులోని వారికి పంపబడినా అన్నింటికీ వర్తిస్తుంది.

వీటితోకలిపి, ఈ రెండు అప్‌డేట్లు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ కలయికతో సంభావ్య బాధితులతో ఇంటరాక్ట్ చేస్తూ, సాధారణంగా యు.ఎస్. వెలుపల ఉండి, ఆర్థికంగా లాభాలుపొందాలనే ఉద్దేశ్యంతో పనిచేసే చెడు వ్యక్తులు చేసే, ఇటీవలి కాలంలో విశేషంగా పెరిగిపోతున్న లైంగిక దోపిడీ సమస్యను అరికట్టడానికి మేము చేపడుతున్న పనికి మద్దతుగా ఉంటాయి.

ఈ అప్‌డేట్లు లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటంపై నిర్మించబడినాయి: మేము ఎప్పుడూ ఎవరికీ పబ్లిక ఫ్రెండ్ జాబితాలను అందిచము (వీటిని లైంగిక దోపిడీ పథకాలను అమలు చేసేందుకు ఉపయోగించవచ్చు), చెడు ధోరణినికి కలిగివుండే వ్యక్తులు ఇతరులను లక్ష్యం చేసుకొనే అవకాశమివ్వకుండా, సిగ్నల్-ఆధారిత శోధనను ఉపయోగించి గుర్తించడంతోపాటు, వెంటనే తొలగిస్తాము, గ్లోబల్ క్రాస్-ప్లాట్‌ఫామ్‌ పరిశోధనకు మేము విశేషంగా ఖర్చుపెడుతున్నాము మరియు ఈ నేరాన్ని అరికట్టేందుకు మరియు ఇతర సంభావ్య ప్రమాదాలతో పోరు జరిపేందుకు మేము ఇతర ప్లాట్‌ఫాంస్‌తో కలసి పనిచేస్తాము. Snapచాటర్లు, ఫైనాన్షియల్ సెక్స్‌టార్షన్ మరియు లైంగిక దోపిడీపై మా ఇన్-యాప్ సేఫ్టీ స్నాప్‌షాట్ మరియు మా గోప్యతా మరియు భద్రత హబ్ వంటి మా విద్యా సంబంధ వనరుల ద్వారా మరింత తెలుసుకొనేందుకు మేము ప్రోత్సహిస్తాము.

సరళీకృత లొకేషన్-షేరింగ్ మరియు అదనపు రిమైండర్లు

మేము Snapచాటర్లు అందరికీ - యుక్తవయస్కులతో సహా - తమ అకౌంట్ భద్రత మరియు గోప్యత సెట్టింగులు సరిచూసుకొమ్మని మరియు వారు తమ స్నేహితులతో మాత్రమే Snapచాటర్లు తమ ప్రదేశాన్ని పంచుకొమ్మని రిమైండర్లు పంపుతాము. ఇప్పుడు మేము, Snapచాటర్లు Snap మ్యాప్‌తో తమ ప్రదేశాన్ని ఏ ఫ్రెండ్స్‌తో పంచుకొంటున్నారు అనేదానిపై ఎల్లప్పుడూ అప్ టు డేట్ ఉండేలా, మరింత తరచుగా రిమైండర్లు పంపడాన్ని ప్రవేశపెడుతున్నాము. ఏ ఫ్రెండ్స్ తమ ప్రదేశాన్ని చూడగలరు అనేదాన్ని కస్టమైజ్ చేసుకొనేందుకు Snapచాటర్లకు మరింత సులభతరం చేసేందుకై మేము సరళీకృత లొకేషన్-షేరింగ్ కూడా ప్రవేశపెడుతున్నాము. ఈ అప్‌డేట్లతో Snapచాటర్లు తమ ప్రదేశాన్ని ఏ ఫ్రెండ్స్‌తో పంచుకొంటున్నారు, ప్రదేశ సెట్టింగులను అప్‌డేట్ చేయడం, వారి ప్రదేశాన్ని మ్యాప్ నుండి తొలగించడంవంటివి చేయడానికి ఒకే ఒక గమ్యస్థానాన్ని కలిగివుంటారు.

ఎప్పటిలాగానే, Snap మ్యాప్‌పై ప్రదేశం పంచుకోవడమనేది డిఫాల్ట్‌గా ఆఫ్ చేయబడి ఉంటుంది, అంటే Snapచాటర్లు తాము ఎక్కడ ఉన్నారు అనేదాన్ని పంచుకోవడాన్ని చురుగ్గా ఆప్ట్ ఇన్ చేసుకోవచ్చు, మరియు Snapచాటర్లు తమ Snapchat ఫ్రెండ్స్‌తో మాత్రమే తాము ఎక్కడున్నాము అనేదానిని పంచుకోగలరు - విస్తృతమైన Snapchat కమ్యూనిటీకి వారి ప్రదేశాన్ని వెల్లడిచేసే ఐఛ్ఛికం లేదు.

బ్లాక్ చేయడంలోని మెరుగుదలలు

మేము Snapచాటర్లు ఎవరినైనా బ్లాక్ చేయదలచినట్లయితే, సులభంగా చేసుకొనేందుకు మేము ఎన్నో టూల్స్ అందించాము. కొన్నిసార్లు చెడు ప్రవర్తనగలవారు, కొత్త అక్కౌంట్లు సృష్టించి, వారిని బ్లాక్ చేసినవారిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. బెదిరింపులు మరియు సంభావ్య వేధింపుల నివారణకు, బ్లాక్ చేసే మా టూల్స్‌కు మెరుగుదలలను ప్రవేశపెడుతున్నాము: ఒక వినియోగదారుడిని నివారించడంవల్ల ఇప్పుడు అదే పరికరంపై సృష్టించబడిన ఇతర అక్కౌంట్లనుండి పంపబడే కొత్త ఫ్రెండ్ అభ్యర్థనలు కూడా బ్లాక్ చేయబడతాయి.

ఈ కొత్త టూల్స్ Snapచాటర్లు తమ సన్నిహిత ఫ్రెండ్స్‌తో, మరింత భద్రత, గోప్యత మరియు శ్రేయస్సులకు ప్రాధాన్యమిచ్చే ఒక ఉత్తమమైన వాతావరణంలో కమ్యూనికేట్ చేసుకోవడానికి వారికి మద్దతివ్వాలని నిరంతరం కొనసాగే మా అంకితభావంపై నిర్మించబడినాయి. మా కమ్యూనిటీకి రక్షణ కల్పించేందుకు మరింత రక్షణలు, టూల్స్ మరియు వనరులు నిరంతరం సృష్టించేందుకు మేము ఎదురుచూస్తున్నాము.

తిరిగి వార్తలకు

1

Snap Inc. అంతర్గత డేటా, 1 నవంబర్, 2023 - 30 జూన్, 2024.

1

Snap Inc. అంతర్గత డేటా, 1 నవంబర్, 2023 - 30 జూన్, 2024.