Snap Values

డిజిటల్ శ్రేయస్సు కార్యక్రమం యొక్క మా ప్రారంభోత్సవ మండలిని ముగించడం

9 అక్టోబర్, 2025

మా తొలి యుఎస్ సమూహంతో నిర్వహించిన మా పైలెట్‌ కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్ బీయింగ్ (CDWB) కార్యక్రమాన్ని Snap ఇటీవల ముగించింది. 2024లో ప్రారంభించిన, ఈ ప్రోత్సాహం నేటి డిజిటల్ లైఫ్‌పై తమ అభిప్రాయాలను పంచుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 18 మంది టీనేజర్‌లను ఒకచోటికి తీసుకొచ్చింది. గడిచిన ఏడాది కాలంలో, ఈ టీనేజర్‌లు- మరియు వారి కుటుంబాలు- అమూల్యమైన అంతర్దృష్టులను అందించారు మరియు మరింత సమర్థవంతమైన ఆన్‌లైన్ భద్రత మరియు శ్రేయస్సుకు రాయబారులుగా ఎదిగారు.

ఈ ఏడాది పొడవునా సాగిన ఈ కార్యక్రమం యొక్క ముగింపుగా, టీనేజర్‌ల ద్వారా డిజైన్ చేయబడ్డ క్యాప్‌స్టోన్ ఈవెంట్‌ను మా వాషింగ్టన్. D.C ఆఫీసులో మేం నిర్వహించాం. కౌన్సిల్ సభ్యులు ఆన్‌లైన్ సేఫ్టీ కమ్యూనిటీలో కీలక భాగస్వాములుగా ఉన్న వారితో నేరుగా వారి అనుభవాలు మరియు అభ్యాసాలను పంచుకోవడానికి అవకాశం లభించింది. హాజరైన వారిలో కొలంబియా డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్, బ్రియాన్ ష్వాల్బ్ ఉన్నారు, ఆయన యువత నిమగ్నత ప్రాముఖ్యతను చర్చించారు, అలానే Technology Coalition, ConnectSafely, మరియు Family Online Safety Institute నుంచి ప్రతినిధులు; మరియు అమెరికా డిపార్ట్‌మెంట్ జస్టిస్ మరియు యు.ఎస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు. అదనంగా, కౌన్సిల్ సభ్యులకు వైట్ హౌస్ యొక్క ఈస్ట్ వింగ్‌ను సందర్శించారు మరియు ఆన్‌లైన్ భద్రత మరియు శ్రేయస్సు ప్రాధాన్యతలకు సంబంధించి అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రథమ మహిళ ఆఫీసుతో మాట్లాడే అవకాశం లభించింది.

Official White House Photo

ఫోటో క్రెడిట్: అధికారిక వైట్ హౌస్ ఫోటో

D.C ఈవెంట్‌లో టీనేజర్‌లు ఆన్‌లైన్ రిపోర్టింగ్ మరియు సెక్స్‌టార్షన్‌కు సంబంధించిన అపోహలతో సహా అనేక రకాల అంశాలపై ప్రజంటేషన్‌లను పంచుకున్నారు. టీనేజర్‌ల నేతృత్వంలో నిర్వహించిన ప్యానెల్స్ మరియు చర్చలు ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడానికి ఏదైనా పనిలో, యువత దృక్పథాలను ఏకీకృతం చేయడంలో గణనీయమైన విలువను ప్రదర్శించారు. ఉదాహరణకు: 

  • ఒక కౌన్సిల్ సభ్యుడు సెక్స్‌టార్షన్, మీద ప్రజంటేషన్ ఇచ్చారు, టార్గెట్ చేయబడ్డ టీనేజర్‌లు తరచుగా ఎలా ఇబ్బంది పడతారు మరియు చిక్కుకుపోతారనేది వివరించారు. తల్లిదండ్రులు అతిగా ప్రతిస్పందించినా, బాధితులను నిందించినా, లేదా ఆన్‌లైన్ ఇంట్రాక్షన్లను తప్పుగా అర్థం చేసుకున్న ఈ భావనలు మరింత తీవ్రం అవుతాయని ఆమె హైలైట్ చేశారు. ఆమె వారి టీనేజర్‌లకు చురుగ్గా మద్దతు ఇవ్వడానికి తల్లిదండ్రులకు స్పష్టమైన వ్యూహాలను అందించారు.

  • ఈ ప్రజంటేషన్ కుటుంబంగా ఆన్‌లైన్ భద్రత గురించి చర్చించేటప్పుడు ఉత్సుకత మరియు దృక్పధాల యొక్క ప్రాముఖ్యత గురించి, టీనేజర్‌ల బృందం మరియు వారి తల్లిదండ్రులతో విస్తృత ప్యానెల్ చర్చను పూర్తి చేసింది. ఇబ్బందికరమైన మరియు కష్టమైన సంభాషణలు చివరికి స్పష్టమైన కమ్యూనికేషన్ మార్గాలను తెరవడానికి ఎలా సహాయపడ్డాయో ఈ బృందం వ్యక్తిగత ఉదాహరణలను పంచుకుంది.

  • మరో టీనేజ్ ప్యానెల్ యువతరంలో ఆన్‌లైన్ రిపోర్టింగ్‌కు సంబంధించి అపోహలను అన్వేషించింది, తీర్పు లేదా నమ్మకం లేకపోవడం వల్ల అనేకమంది టీనేజర్‌లు ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని నివేదించడానికి సంకోచించారని నొక్కి చెప్పారు. వారు సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందే మరియు ప్రతీకార భయం లేకుండా మాట్లాడటానికి అధికారం కల్పించే సహాయక వాతావరణాన్ని సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను వారు హైలైట్ చేశారు. సహజమైన, సులభంగా కనుగొనే రిపోర్టింగ్ సాధనాల అవసరాన్ని కూడా వారు బలోపేతం చేశారు మరియు Snapchat వంటి ఫ్లాట్‌ఫారాల్లో రిపోర్టింగ్ గోప్యంగా ఉంటుందని మరియు విస్త్రృత సమాజానికి సహాయపడుతుందని టీనేజర్‌లకు అవగాహన కల్పించడానికి, కంపెనీలు, ఎన్‌జివోలు, మరియు భద్రతా సంస్థలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  • ఒక గ్రూపు టీనేజర్‌లను లక్ష్యంగా చేసుకున్న పబ్లిక్ సర్వీస్ ప్రకటనలు (PSAలు) మరియు ఇతర భద్రతా రకాలైన భద్రతా సందేశాలు తరచుగా ప్రతిధ్వనించడంలో విఫలం అవుతాయనేది కూడా పరిశీలించింది. కౌన్సిల్ సభ్యులు టీనేజర్‌ల దృష్టిని వేగంగా ఆకర్షించే ప్రమాణికమైన మరియు టీనేజర్‌ల ఆధారిత కంటెంట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు; నిజజీవిత కథలు మరియు కాంక్రీట్ సలహాలతో టీనేజ్ స్వరాలు పెరుగుతాయి మరియు పెద్దలతో అతిగా ఉత్పత్తి చేయబడినట్లు లేదా స్క్రిప్ట్ చేయబడినట్లుగా కనిపించకుండా ఉంటుంది

  • చివరగా, అనేకమంది కౌన్సిల్ సభ్యులు తాము ప్రారంభించిన ఆన్‌లైన్ భద్రత మరియు శ్రేయస్సు కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఉదాహరణకు, ఒక టీనేజర్ భావోద్వేగ సహనాన్ని పెంపొందించుకోవడంలో, మానసిక ఆరోగ్య సవాళ్లకు ప్రతిస్పందించడానికి సాయపడేందుకు రూపొందించిన AI- ఆధారిత ప్లస్సీ టాయ్‌ను సృష్టించారు. ప్రముఖ లాభాపేక్ష సంస్థకు చెందిన మరో టీనేజర్, ఆన్‌లైన్‌లో లింగ ఆధారిత హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

క్యాప్‌స్టోన్ ఈవెంట్, కార్యక్రమం అంతటా టీనేజర్‌లు చేసిన పనిపై రూపొందించబడింది. ఉదాహరణకు: 

  • అదనంగా, ప్రతి మండలి సభ్యుడు తమకు ప్రాధాన్యమైన అంశంపై ఒక ఆన్‌లైన్ భద్రతా వనరును సృష్టించారు, ఉదాహరణకు, నివేదన యొక్క ప్రాముఖ్యత గురించి క్రింద ఉన్న వీడియో లాంటివి.

పైలెట్‌గా నిర్వహించిన యుఎస్ ప్రోత్సాహం విజయవంతం కావడంతో, Snap యూరోప్ మరియు ఆస్ట్రేలియాల్లో కొత్త CDWB కార్యక్రమాలను ప్రారంభించింది. అన్ని ప్రాంతాల్లోనూ, CDWB సమూహాలు మరింత సానుకూల ఆన్‌లైన్ ఎకోసిస్టమ్‌ను రూపొందించాలని కోరుకునే క్రియేటివ్, దయ కలిగిన, ప్రేరణతో నిండిన టీనేజర్‌లతో రూపొందించబడ్డాయి. ఈ గ్రూపుల నుంచి మరిన్ని విషయాలను పంచుకునేందుకు, 2026లో మా కొత్త యుఎస్ కౌన్సిల్‌ను పరిచయం చేయడానికి మేం ఎదురుచూస్తున్నాం.

- విరాజ్ దోషి, ఫ్లాట్‌పారమ్ సేప్టీ లీడ్

తిరిగి వార్తలకు