Snap Values

Snap తాజా పరిశోధన: ఆన్‍లైన్‍లో లైంగికపరమైన బహిర్గతానికి Gen Z లక్ష్యమవుతోంది, కాని దీనిలో కొంత అభివృద్ధి సంకేతలు కనిపించాయి


అక్టోబర్ 29, 2024

గత మూడు సంవత్సరాలుగా ఆన్‍లైన్ ప్రమాదాన్ని చూసినప్పుడు, "లైంగికపరమైన బహిర్గతం" సూచీ నివ్వెరపోయే విధంగా పైకి వెళ్తుంది - ప్రధానంగా ఇది యుక్తవయస్కులు మరియు యువ వయోజనులతో సన్నిహిత చిత్రాలను పంచుకోవడంతో ప్రారంభించి, సత్వరమే బ్లాక్‍మెయిల్‍లోకి మారుతోంది. పరిశ్రమ-పరంగా జరిపిన నూతన పరిశోధన ప్రమాదాలు కొనసాగడం సూచిస్తుండగా, నేరస్థులను అడ్డుకోవడానికి జరుపుతున్న ప్రయత్నాలు మరియు సంభావ్య లక్ష్యాల గురించి వారికి అవగాహన కల్పించాలనే ప్రయత్నాలు కొనసాగడం ప్రోత్సహిస్తున్నాయి. ( Snap Inc. ఈ పరిశోధనను ప్రస్తుతం రెండవ సంవత్సరంలో జరుపుతుంది, కాని ఇది, Snapchatపై ఏవిధమైన ప్రత్యేక దృష్టిపెట్టకుండా, అన్ని ఆన్‍లైన్ ప్లాట్‌ఫామ్స్ పై జనరేషన్ Z మరియు యువ వయోజనులను కవర్ చేస్తుంది.)

దాదాపు ఒక పావు భాగం (23%) 1ఆరు దేశాలలోని 6,004 మందిలో, 13-నుండి-24 సంవత్సరాల వయస్సులోని వారు 2అన్ని ప్లాట్‌ఫామ్స్ మరియు సేవలలో వారు లైంగికవేధింపుల బాధితులమని చెప్పారు. కాగా, దాదాపు సగంకంటే ఎక్కువ (51%) మంది కొన్ని ఆన్‌లైన్ పరిస్థితులలోకి లాగబడుతున్నారని లేదా లైంగికవేధింపులకు దారితీసే ప్రమాదకర డిజిటల్ ప్రవర్తనలలో నిమగ్నమై ఉన్నారని నివేదించారు. దీనిలో "గ్రూమింగ్ 3”(37%), "వలవేయబడినవారు" (30%), హ్యాక్ చేయబడినవారు (26%), లేదా సన్నిహిత చిత్రాలను ఆన్‌లైన్‌లో పంచుకొన్నవారు (17%) ఉన్నారు. ప్రధానంగా, వివిధ గ్రూపులచే నిరంతరం నిర్వహించబడుతున్న అప్రమత్తత కలిగించే మరియు విద్యా కార్యక్రమాలలో, ఈ పథకాలకు తక్కువ "లక్ష్యంగా ఉన్న" యువకులు బాధితులుగా అవుతున్నారన్న విషయాన్ని ధ్వనిస్తోంది.

ఆన్‍లైన్ వలపన్నడమనేది, నేరస్తులు, వ్యక్తిగత సమాచారం లేదా లైంగికపరమైన చిత్రాలను పంచుకోవడానికి లక్ష్యంగా చేసుకొనేందుకు, వారుకాని వేరొకవారిగా వెల్లడిచేసుకొంటూ ఉండటంద్వారా సంభవిస్తుంది. హ్యాకింగ్ అనేది ఒక నేరస్థుడు, సన్నిహిత ఫోటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు లక్ష్యం యొక్క డివైజులు లేదా అక్కౌంట్లకు అనధికారికంగా యాక్సెస్ పొందడంద్వారా జరుగుతుంది. రెండు సందర్భాలలో చాలావరకు, వీడియోలు, ఫోటోలు లేదా ఇతర ప్రైవేట్ సమాచారాన్ని పొంది అప్పుడు వాటిని, వ్యక్తియొక్క కుటుంబం మరియు మిత్రులకు పంపకుండా ఉండేందుకు మార్పిడిగా నేరస్తుల డిమాండ్లకు తలొగ్గేలా చేసుకొనేందుకు బ్లాక్‍మెయిల్ చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది.

యుక్తవయస్సులోని వారిలో సన్నిహిత చిత్రాలను పంచుకోవడమనేది 21వ శతాబ్దంలో ఎక్కువగా లైంగిక వేధింపుగా పరిగణించబడుతోంది మరియు దానిని అలా చూపేందుకు పరిశోధన దానికి దన్నుగా నిలుస్తోంది. కాని, ఈ విధానం, లైంగిక వేధింపులకు ఒక కీలక ప్రమాదకర అంశంగా మరియు అప్రతినిధిత్వాలకు మరియు తప్పుడు విధానాలనుండి వచ్చే సంభావ్య నష్టాలను కలిగి ఉండటంగా కొనసాగుతోంది. సన్నిహిత చిత్రాలను పంచుకోవడం లేదా పంపిణీ చేసిన వారిలో 17% మంది ప్రతిస్పందకులలో 63% మంది నేరస్తుడు అబద్దం చెప్పారని మరియు 58% మంది ఒకసారి సమాచారం పంపిన తరువాత దానిపై నియంత్రణను కోల్ఫోయామని చెప్పినట్లుగా కనుగొనబడింది. సన్నిహిత చిత్రాలను పంచుకునే 18 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ప్రధానంగా దాడికి అనుగుణంగా ఉంటారు: దుర్వినియోగం చేసేవారు అబద్ధం చెప్పారని 76% మంది చెప్పారు మరియు 66% మంది చిత్రాలపై నియంత్రణను కోల్పోయామని తెలిపారు.

ఒక సమాంతర అధ్యయనం చేపట్టిన, వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయంలోని యంగ్ అండ్ రెజిలియంట్ రీసెర్చ్ సెంటర్ వద్ద సహడైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ అమండా థర్డ్ అభిప్రాయంలో "యుక్తవయస్కుల ఆన్‍లైన్‍లో వారికి రక్షణను మరింత మెరుగుపరచేందుకు, ఒక బలమైన నియంత్రణ మరియు వ్యవస్థలు ఉండాలని కోరుతున్నారు." 4ఈమె టెక్ కోయాలిషన్ నుండి నిధులు సమకూర్చబడిన సేవ్ ది చిల్డ్రన్ భాగస్వామ్యంలో ఈ అధ్యయనం చేశారు. "పిల్లలు మరియు వయోజనులు బాగా తెలుసుకోవాలని వారు కోరుతున్నారు. ప్లాట్‌ఫామ్స్ తరచుగా తలపడే డిజిటల్ ప్రదేశాల చెడ్డవారినుండి, అసంబద్ధ కంటెంట్ రహితంగా ఉంచడంతోపాటు వాటిని భద్రంగా ఉంచుతూ, మరింతగా మెరుగ్గా ఉండేలా చేసేందుకు కృత్రిమ మేధ మరియు ఇతర ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు."

చెడ్డవారిని గుర్తించేందుకు పిల్లలకు మద్దతుగా ఉండే వయో-సంబంధిత డిజైన్, అసంబద్ధ పరస్పర చర్యలకు ఎలా స్పందించాలి అనే దానిపై వాస్తవ-సమయ సూచనలు, మరియు అత్యుత్తమ సమాచారంతో వారిని కనెక్ట్ చేయడం, మరియు విపరీతంగా పెరిగిపోతున్న లైంగిక వేధింపులను సమర్థవంతంగా పోరాడేందుకు సహాయం అందించే మార్గాలు సత్వరమే అవసరమనే ఆలోచనను వారు కలిగివున్నారని" ఆమె పేర్కొన్నారు. ప్రొఫెసర్ థర్డ్ Snap యొక్క భద్రతా సలహా బోర్డ్ సభ్యులు కూడా.

ఇతర కీలక ఫలితాలు

  • Gen Z ప్రతిస్పందకులలో సుమారు సగం (47%) మంది, వారు కొన్ని సందర్భాలలో సన్నిహిత చిత్రాలలో పాల్గొన్నారని చెప్పారు: 35% మందిని లైంగికపరమైన ఫోటోలు లేదా వీడియోలను కోరారని, మరియు 39% మంది ఆరకమైన చిత్రాలను పొందారు.

  • Gen Zల వయస్సువారు లైంగికపరమైన చిత్రాలలో పాల్గొనడం పెరిగింది.

    • 13-15 సంవత్సరాలలోనివారిలో దాదాపు ఒక పావువంతుమంది, సన్నిహిత చిత్రాలు పంచుకోమని కోరబడ్డారు (23%) లేదా స్వీకరించారు(26%). కేవలం 13% మాత్రమే వాటిని పంచుకొన్నామని ఒప్పుకొన్నారు.

    • 16- మరియు 17 సంవత్సరాల వయస్సులోని వారిలో ఈ శాతం 31% (అడిగినవారు) మరియు 35% (స్వీకరించినవారు)లకు పెరిగిపోయింది, అయితే కేవలం 13% మంది లైంగిక చిత్రాలను పంచుకొన్నట్లు ఒప్పుకొన్నారు.

    • కాగా 18- మరియు 19 సంవత్సరాల వయస్సులోని వారు మరియు 20- నుండి 24 సంవత్సరాల వయస్సులోని వారిలో ఈ శాతం అత్యధికంగా 43% (అడిగినవారు) మరియు 49% (అందుకున్నవారు) ఉన్నారు. (వివరాల కోసం చార్ట్ చూడండి).

ఈ పరిశోధన Gen Z యొక్క ఆన్‌లైన్ మానసిక ఆరోగ్యానికై చర్యకై డిజిటల్ శ్రేయస్సుపై కొనసాగుతున్న Snap చేపట్టిన అధ్యయనంలో భాగం. Snapchatపై ప్రత్యేక దృష్టిలేకుండా జరిపిన ఈ పరిశోధనను Snap స్పాన్సర్ చేసినప్పటికీ, ఇది అన్ని ప్లాట్‌ఫామ్స్, సేవలు మరియు డివైజ్‍లను పరిశీలిస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, యుకె, మరియు యు.ఎస్.లలో 3 జూన్ నుండి 19 జూన్ వరకు జరిపిన ఈ అధ్యయనంలో, తమ పిల్లల ఆన్‍లైన్ వెల్లడి గురించి అడగబడిన 13- నుండి 19 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు 3,003 మందితోసహా మొత్తం 9,007మంది పాల్గొన్నారు. మేము అంతర్జాతీయ సేఫర్ ఇంటర్నెట్ డే 2025 తో కలిసివచ్చేలా పూర్తి ఫలితాలను ఇప్పటినుండి ఫిబ్రవరి మధ్యలో మేము కనుగొన్న అదనపు విషయాలను పంచుకొంటాము. అదేసమయంలో, మేము Snap యొక్క డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్ యొక్క మూడు సంవత్సరాల రీడింగ్ కూడా ప్రకటిస్తాము.

మేము ఇటీవలి ఈ లైంగిక వేధింపుల తీవ్రఫలితాలను, మైనర్లపై ప్రభావం చూపుతున్న ఆర్థిక లైంగిక వేధింపులపై జరుగుతున్న మల్టి-స్టేక్‍హోల్డర్ ఫోరమ్ యొక్క టెక్నాలజీ కోయిలేషన్‍లో మేము పాల్గొంటున్న సందర్భంలో లభ్యతలోకి తెస్తున్నాము. క్రింద మరింత వివరించినట్లుగా, Snap, లైంగిక వేధింపులను 2022 నుండి పోరాడుతోంది. ఈ క్రాస్-ప్లాట్‍ఫామ్ అధ్యయనాన్ని చేపట్టడానికి, దానిని అర్థం చేసుకోవడాని మరియు దానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడమనేది ఒక ఆలోచన.

"ఈ విధమైన అధ్యయనం, యువత ఆన్‍లైన్‍లో ఎదుర్కొనే ప్రమాదాలపై తీవ్ర దృష్టి పెట్టడమేగాక, ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది పరిశ్రమ, ప్రభుత్వాలు, మరియు పౌర సమాజాల మధ్య ఉండవలసిన సమన్వయం యొక్క శక్తిని ప్రకటిస్తుంది," అని షీన్ లిట్టన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ, టెక్ కోయిలిషన్ చెప్పారు. "టెక్ కోయిలిషన్ యొక్క ఈ గ్లోబల్ మల్టి-స్టేక్‍హోల్డర్ ఫోరమ్ ఆన్ ఫైనాన్షియల్ సెక్స్‌టార్షన్‍లో Snap ఈ పరిశోధనను అందించడం పట్ల మేము గర్విస్తున్నాము. అవగాహనను పెంచడం మరియు సామూహిక చర్యను తీసుకోవడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు మనం భద్రమైన డిజిటల్ స్పేస్‍లను సృష్టించగలుగుతాము."

నేరస్తుల డిమాండ్లు మరియు బాధితుల చర్యలు

లైంగిక వేధింపులు (23%), లైంగికపరమైన ఫోటోలు/వీడియోలకు గురవుతున్న ఈ Generation Zలోని వారు వేధింపుదారులనుండి ప్రధానంగా రెండు డిమాండ్లు ఎదుర్కొంటారు - దాదాపు సగంమంది మరిన్ని లైంగికపరమైన చిత్రాలు, నగదు, లేదా బహుమతి కార్డులు. గత సంవత్సరం కనుగొన్నవాటిలాగానే ఉన్న ఇతర డిమాండ్లలో వ్యక్తిగతంగా కలవడం (39%), లైంగికపరమైన సంబంధాన్ని కోరుకోవడం (39%), వ్యక్తిగత సమాచారాన్ని (36%) లేదా బాధితుల అక్కౌంట్లకు (35%) యాక్సెస్‍కై డిమాండ్ చేయడం మరియు బాధితుల స్నేహితులు మరియు కాంటాక్ట్ జాబితాకు యాక్సెస్‍కై డిమాండ్ చేయడం (25%) వంటివి ఉన్నాయి. మూడవ వంతు సందర్భాలలో, నేరస్తులు, ప్రతిస్పందకుల చిత్రాలను వారి కుటుంబానికి మరియు స్నేహితులకు విడుదల చేస్తామని బెదిరించగా, మరో మూడవ వంతు సందర్భాలలో నేరస్తులు, బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని మరింత విస్తృతంగా వెల్లడిస్తామని బెదిరించారు. అన్ని సందర్భాలలో, Gen Z యుక్తవయస్సువారికంటే, మైనర్-వయస్సులోని యుక్తవయస్కులు పై ఈ డిమాండ్లు అధికంగా ఉన్నాయి. (వివరాల కోసం చార్ట్ చూడండి).

మంచి వార్తలపరంగా చూస్తే, లైంగిక వేధింపులకు ప్రతిస్పందనగా, కొంత చర్యను తీసుకొన్నామని చెప్పిన బాధితుల సంఖ్య 56% నుండి 85%కి పెరిగింది. 5గత సంవత్సరం. విస్తృతస్థాయిలో చర్యలలో తల్లి/తండ్రి, యుక్తవయసువారు, లేదా ఇతర విశ్వసనీయ వయోజనులనుండి సహాయాన్ని కోరడం (70%); సంఘటనను రిపోర్ట్ చేయడం (67%); సాధారణంగా చేపట్టే ఒకే చర్య - నేరస్తుడిని బ్లాక్ చేయడం; అక్కౌంట్లలోని భద్రతా చర్యలను అప్‍డేట్ చేయడం మరియు అక్కౌంట్లను మూసివేయడం వంటివివున్నాయి. అయినప్పటికీ, ఈ సంఘటనను ఎవరికీ చెప్పలేదని 18% మంది, లేదా ఏం చేయలేదని (8%) చెప్పారు,

యుక్తవయస్సులోనివారు, వయోజనులు మరియు సంఘంలోని ఇతర సభ్యులందరూ దీనికి ప్రతిగా నిలవాలని రిపోర్ట్ చే‍ఫ్యడంతోపాటు ప్రోత్సహిస్తూ దీనిని మలుపు తిప్పేందుకు కృషిచేస్తూ, ప్లాట్‍పాం మరియు చట్టం అమలుపరచేవారికి రిపోర్ట్ చేసిన బాధితులకు సంబంధించిన సమాచారంపట్ల మేము అధిక ఆసక్తి కలిగివున్నాము. మా తాజా అధ్యయనం ప్రకారం, Gen Zలో 36% సంబంధిత ప్లాట్‌ఫామ్‌కు నివేదించారని, వీరిలో 30% హాట్‌లైన్ లేదా హెల్ప్లైన్కు మరియు 27% మంది చట్టం అమలుపరచేవారికి నివేదించారని చూపుతోంది. నివేదించిన ఈ శాతాలన్నీ 2023 కంటే పెరిగాయి.

Snap యొక్క కొనసాగుతున్న నిబద్ధత

దాదాపు రెండు సంవత్సరాలుగా మా ప్లాట్‌ఫామ్‍పై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా Snap పోరాడుతోంది. నిరోధించే మరియు రిపోర్టింగ్ టూల్స్ ఎల్లప్పుడూ లభ్యమయ్యేలా మేము చూశాము. గత సంవత్సరం, మేము ఒక ప్రత్యేక లైంగిక వేధింపు రిపోర్టింగ్ రీజన్ మరియు అవగాహన పెంచడం, మరియు విద్యావనరులను అందించే ఒక ఇన్-యాప్ అందించాము. ఈ సంవత్సరం, అనుమానాస్పద ఫ్రెండ్ అభ్యర్థనల గురించి యుక్తవస్కులు మరియు యువతను హెచ్చరించేందుకు మేము పైదానికి కొనసాగింపుగా అప్‍డేట్ చేయబడినఇన్-యాప్ హెచ్చరికలను కూడా చేర్చాము. యుక్తవయస్కులు, తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు ఇతర విశ్వసనీయ వయోజనుల మధ్య, Snapchatపై మరియు ఆన్‍లైన్‍లో భద్రంగా ఉండటానికి సంబంధించిన సంభాషణలను నెలకొల్పేందుకు ఉద్దేశ్యించిన, మా తల్లిదండ్రుల పర్యవేక్షణా స్యూట్ ఆఫ్ టూల్స్, ఫామిలీ సెంటర్ కు మేము నిరంతరం కొత్త కార్యాచరణను జోడిస్తుంటాము.

లైంగిక వేధింపుల ప్రమాదం గురించి యువత మరింత అవగాహన పెంచుకొంటోందని మరియు మా ఇన్-యాప్ హెచ్చరికలు ఉపయుక్తంగా ఉన్నాయని మేము స్వీకరిస్తున్న ఫీడ్‍బ్యాక్ సూచిస్తోంది. ఒక యుక్తవయస్కుడిని కోట్ చేస్తూ, ఒక యూరోపియన్ NGO నాయకుడు ఇలా చెప్పారు "ఒక్క క్షణం ఆలోచించడమనేది మీజీవితంలో నిజంగా ఒక పెద్ద భేదాన్ని తీసుకొని రాగలదు."

లైంగిక వేధింపు జరగడానికి ముందే నివారించడమనేది మా ప్రాథమిక లక్ష్యం కాని, ఇవి విస్తృత స్థాయిలోని వాటాదారులు మరియు సెక్టార్-టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ మరియు సేవలు, చట్టం అమలుపరచే సంస్థలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, విద్యావేత్తలతోపాటు యువతకూడా దీనిలో చురుగ్గా పాల్గొనవలసిన పూర్తి సమాజానికి సంబంధించిన సమస్యలు. మేము, టెక్ కోయిలిషన్ మరియు దాని సభ్యులు, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ మరియు ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్, థోర్న్, మా సేఫ్టీ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు మరియు ఇతరుల మధ్య కొనసాగుతున్న సమన్వయం మరియు నిమగ్నతను అభినందిస్తూ, ఈ ఇటీవలి క్రాస్-ప్లాట్‍ఫాం పరిశోధన అధ్యయనం, చాలామందికి సరిక్రొత్త ఆలోచనలను అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. లైంగిక వేధింపులు మరియు ఇతర సంభావ్య ఆన్‍లైన్ ప్రమాదాలనుండి ప్రజలను రక్షించాలనే మా ప్రయత్నంలో భాగంగా మేము మరింత పరిశోధన, అభ్యసనం, మరియు పెట్టుబడికి అదనపు అవకాశాలను అందిస్తారని మేము ఆశిస్తున్నాము.

తిరిగి వార్తలకు

1
2
3
4
5
1
2
3
4
5