కొత్త పరిశోధన: యుక్తవయస్కులైన పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించడంలో తల్లిదండ్రులు 2023లో ఎదుర్కొన్న ఇబ్బందులు

5 ఫిబ్రవరి, 2024

అదే సమయంలో పెంపకమనేది ఆనందించగలిగే, అలసట, ఒత్తిడితో కూడిన ప్రయాస అని, తరాలుగా ఇది కొనసాగుతోందని, ప్రపంచచ్యాప్తంగా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు చెప్పారు. డిజిటల్ కాలంవచ్చినప్పటికీ, ఆనందాలు, సవాళ్ళు మాత్రమే పెరుగుతాయి. అంతర్జాతీయ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఈ రోజు, మేము 2023లో తల్లిదండ్రులు యుక్తవయస్కులైన తమ పిల్లల ఆన్‌లైన్‌ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని పిల్లలపట్ల తల్లిదండ్రులు కలిగివుండే నమకాన్ని వమ్ము చేయడం వంటి వాటిని వివరించే ఒక కొత్త పరిశోధనను విడుదల చేస్తున్నాము. ఈ పరిశోధన కేవలం Snapchat పై మాత్రమే కాకుడా అన్ని డివైజ్‌లు మరియు ప్లాట్‌ఫామ్స్ పై నిర్వహించబడింది.

మా తాజా పరిశోధన ప్రకారం, ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో యుక్తవయస్కులు తల్లిదండ్రుల విశ్వాసం కోల్పోవడం 2023లో తగ్గిపోయినప్పటికీ, 10 మందిలో కేవలం నలుగురు (43%) మాత్రమే ఈ వ్యాఖ్యను అంగీకస్తున్నారు, "నా బిడ్డ ఆన్‌లైన్‌లో వ్యవహించేటప్పుడు బాధ్యతాయుతంగా ఉంటారని నేను విశ్వసిస్తాను, వారిని నియంత్రించవలసిన అవసరం లేదనుకొంటాను." ఇది 2022లోని ఇటువంటి పరిశోధనలోని 49% కంటే ఆరు శాతం పాయింట్లు తక్కువ. దీనికితోడు, కొద్దిమంది మైనర్-వయస్సున్న యుక్తవయస్కులు (13 నుండి 17 సంవత్సరాలవారు), వారు ఆన్‌లైన్ ప్రమాదాన్ని అనుభవించిన తరువాత తల్లిదండ్రులు లేదా ఎవరైనా నమ్మదగిన పెద్దవారిని సహాయం కోరామని చెప్పారు. ఇది 2022లోని 64%తో పోలిస్తే ఐదు శాతం పాయింట్లు పడిపోయి 59% ఉంది.

తల్లిదండ్రులు యుక్తవయస్కులైన వారి పిల్లలు సన్నిహిత లేదా సూచనాత్మక చిత్రాల ఏమేరకు గురికాబడుతున్నారనేది 11 శాతం పాయింట్లతో తక్కువగా అంచనా వేయబడింది - ఈ ప్రశ్న 2023లో జోడించబడింది. యుక్తవయస్కుల మొత్తమ్మీది ఆన్‌లైన్ రిస్క్ ఎక్స్‌పోజర్, తల్లిదండ్రులు అంచనా వేసే సామర్థ్యం కూడా తగ్గిపోయింది. 2022లో, యుక్తవయస్కుల డిజిటల్ రిస్క్ ఎక్స్‌పోజర్ మరియు దానిని అంచనా వేయడంలో తల్లిదండ్రుల ఖచ్చితత్వాల మధ్య తేడా రెండు శాతం పాయింట్లు ఉంది. గత సంవత్సరం, ఈ వ్యత్యాసం మరింత పెరిగి మూడు శాతం పాయింట్లకు చేరుకుంది.

ఈ ఫలితాలు జనరేషన్ Z యొక్క డిజిటల్ శ్రేయస్సుపట్ల Snap’s చేపడుతున్న పరిశోధనలో భాగం మరియు ఆరు దేశాలు: ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, యుకె, మరియు యు.ఎస్. లలో యుక్తవయస్కులు (13-17 మధ్య) మరియు యువ వయోజనులు (18-24 మధ్య) ఆన్‌లైన్‌లో ఏవిధంగా ఉంటున్నారు అనేదానిని అంచనా వేసే మా వార్షిక డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్ (DWBI) యొక్క రెండవ అధ్యయనాన్ని సూచిస్తుంది. మేము 13 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లల తల్లిదండ్రులను కూడా, కేవలం Snapchat మాత్రమే కాకుండా ఏదైనా ఆన్‌లైన్ వేదికలపై లేదా పరికరాలలో ఉండే రిస్క్‌లతో వారి పిల్లల అనుభవాల గురించి మేము సర్వే నిర్వహించాము. ఈ పోల్ 28 ఏప్రిల్, 2023, మరియు 23 మే, 2023 మధ్య నిర్వహించబడింది మరియు మూడు వయోసమూహాలు మరియు ఆరు భౌగోళిక ప్రాంతాలనుండి దాదాపు 9,010 మంది ప్రతిస్పందించారు.

కొన్ని ఉన్నత స్థాయి అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • Gen Z యుక్తవయస్కులు మరియు యువ వయోజనులలో 78% మంది, 2023 ఆరంభంలో కొంత ఆన్‌లైన్ రిస్క్ అనుభవించామని చెప్పారు, ఇది 2022లో ఉన్న 76% కంటే రెండు శాతం పాయింట్లు ఎక్కువ.

  • Gen Zలోని స్పందించినవారిలో 57% మంది, వారు లేదా వారి ఫ్రెండ్ ఇంతకుముందరి మూడు నెలలలో సన్నిహిత లేదా శృంగారపరమైన సంఘటనలను ఎదుర్కొన్నామని, అలాంటి చిత్రాలను అందుకోవడం (48%), వాటిగురించి వారిని అడగటం (44%) లేదా వేరొకరి ఫోటోలు లెదా వీడియోలను షేర్ చేయడం లేదా పంపిణీ చేయడం (23%) తెలిపారు. అంతేకాకుండా, స్పందించినవారిలో 33% మంది ఈ చిత్రాలు ఉద్దేశించిన గ్రహీతకు మించి వ్యాపించాయని చెప్పారు.

  • సగంమంది (50%) తల్లిదండ్రులు యుక్తవయస్కులైన తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను చురుకుగా పర్యవేక్షించేందుకు సరైన మార్గాలగురించి తమకు తెలియదని చెప్పారు.

రెండవ సంవత్సరపు DWBI

డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్, ఒక భావోద్వేగ నివేదికల శ్రేణికి స్పందించేవారు ఇచ్చే సమాధానాల ఆధారంగా, స్పందించే ప్రతివారికి 0 నుండి 100 మధ్య ఒక స్కోరును ఆపాదిస్తుంది. దేశంవారీ స్కోర్లను మరియు ఆరుదేశాల సగటును పొందేందుకు, వ్యక్తిగతంగా స్పందించేవారి స్కోర్లు సంకలనం చేయబడతాయి. ఆరు భౌగోళిక ప్రాంతాలలో, 2023 DWBI అనేది, 2022 కు ఉన్న సగటు 62లో ఏ మాత్రం మార్పులేదు. ఆరు వేర్వేరు దేశాలకు సంబంధించిన వివరాలలో, వరుసగా రెండవ సంవత్సరం, సంస్కృతిపరంగా తల్లిదండ్రుల మద్దతు బలంగా భారతదేశం అత్యధిక DWBI 67 కలిగివుంది, కాని ఇది 2022లోని 68 తో పోలిస్తే ఒక శాతం పాయింట్‌ తక్కువ. ఆస్ట్రేలియా, జర్మనీ, యు.కె., మరియు యు.ఎస్.లు 2022లో ఉన్న గణాంకాలు వరుసగా 63, 60, 62, మరియు 64లు నమోదు చేశాయి. ఫ్రాన్స్ కూడా 2022లో ఉన్న 60 నుండి 59కి ఒక శాతం పాయింట్ తగ్గింది.

ఈ సూచిక ప్రస్తుతమున్న శ్రేయస్సు సిద్ధాంతం యొక్క ఒక నమూనా అయిన PERNA మోడల్‌ను ఉపయోగిస్తుంది1దీనిలో ఐదు వర్గాల భావోద్వేగ ప్రకటనలు పాజిటివ్, ఎంగేజ్‌మెంట్, రిలేషన్‌షిప్, నెగెటివ్ ఎమోషన్, మరియు ఛీవ్‌మెంట్‌లు ఉన్నాయి. ఇంతకుముందరి మూడు నెలలలో, ఏదైనా పరికరం లేదా యాప్‌పై వారి ఆన్‌లైన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని - కేవలం Snapchat మాత్రమే కాకుండా - స్పందించేవారిని, 20 స్టేట్‌మెంట్లలో ప్రతిదానికి వారి ఒప్పంద స్థాయిని నమోదు చేయాలని కోరబడింది. ఉదాహరణకు, పాజిటివి ఎమోషన్ వర్గంలో, స్టేట్‌మెంట్లలో ఇవి ఉన్నాయి: "తరచుగా గర్వంగా ఉండటం" మరియు "తరచుగా సంతోషంగా ఉండటం" మరియు అఛీవ్‌మెంట్‌ గ్రూపులో "నాకు ముఖ్యమైన వాటిని ఎలా చేయాలో తెలుసుకొన్నాను." (అన్ని 20 DWBI సెంటిమెంట్ స్టేట్‌మెంట్ల జాబితాకై ఈ లింక్‌ను చూడండి.)

ఫలితాలనుండి నేర్చుకోవడం

Snap వద్ద మేము Snapchat ఫ్యామిలీ సెంటర్‌తో సహా మా ఉత్పత్తి మరియు ఫీచర్ డిజైన్ మరియు అభివృద్ధిని తెలియజేసేందుకు మద్దతుగా మేము ఈ మరియు ఇతర పరిశోధనల ఫలితాలను ఉపయోగించుకోవడాన్ని కొనసాగిస్తాము. 2022లో ప్రారంభమైన ఫ్యామిలీ సెంటర్ అనేది తల్లిదండ్రులు మరియు సంరక్షకులు, యుక్తవయస్కులైన తమ పిల్లలు Snapchatపై ఎవరికి సందేశం పంపుతున్నారు అనేదానిపై అవగాహన కల్పించేందుకు, అదేసమయంలో ఈ కమ్యూనికేషన్లలోని వాస్తవ కంటెంట్‌ను బహిర్గతం చేయకుండా యుక్తవయస్కుల గోప్యతను సంరక్షించేందుకు, తల్లిదండ్రులకు మేము అందించే పేరెంటల్ టూల్స్ సూట్.

ఫ్యామిలీ సెంటర్ యొక్క మొదటి వెర్షన్‌లో, మేము తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే ఖాతాలను గోప్యంగా నివేదించే మరియు కంటెంట్ నియంత్రణలను సెట్ చేసే సామర్థ్యాన్ని కూడా మేము అందించాము. గత సంవత్సరం, ఫ్యామిలీ సెంటర్‌కు కొత్తగా వచ్చేవారికోసం, పిల్లల భద్రతకు మద్దతిచ్చేవారి అభిప్రాయాల ప్రకారం చేయబడిన ఒక మార్పు - కంటెంట్ నియంత్రణలు డిఫాల్ట్‌గా "ఆన్" లో ఉంటున్నాయి. మేము ఈ అదనపు ఫ్యామిలీ సెంటర్ ఫీచర్‌లను గత నెలలో ప్రకటించాము మరియు ఇప్పుడు తల్లిదండ్రులు యుక్తవయస్కులైన తమ పిల్లల చాట్ కు స్పందించడం నుండి My AI, Snapchat యొక్క AI ఆధారిత చాట్‌బాట్‌ను డిజేబుల్ చేసే సామర్థ్యాన్ని మేము తల్లిదండ్రులకు అందిస్తున్నాము. ఫ్యామిలీ సెంటర్‌ను సాధారణంగా కనుగొనే సామర్థ్యాన్ని కూడా మేము పెంచాము మరియు తల్లిదండ్రులు యుక్తవయస్కులైన తమ పిల్లల భద్రత మరియు గోప్యత సెట్టింగులను చూసే వీలు కల్పిస్తున్నాము. డిఫాల్ట్‌గా అతి కఠినమైన స్థాయిలకు సెట్ చేయబడిన విధంగా, తల్లిదండ్రులు యుక్తవయస్కులైన తమపిల్లల Snapchat స్టోరీని ఎవరు చూడగలరు, వారు వారిని సంప్రదించగలరు, మరియు వారి పిల్లలు Snap మ్యాప్‌పై ఎవరైనా ఫ్రెండ్స్‌తో తమ లొకేషన్ ని పంచుకోవడానికి ఎంచుకొన్నారా అనేదానికి సంబంధించిన సెట్టింగులను చూడగలరు.

U.S.లోని యుక్తవయస్కులు: మా కొత్త కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్-బీయింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి 

నిరంతరం కొనసాగే మా పరిశోధనను ముందుకు సాగించడానికి మేము మా కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్-బీయింగ్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాము, U.S. లోని యుక్తవయస్కులకు ఆరంభ కార్యక్రమం. మేము 13 మరియు 16 సంవత్సరాల మధ్య వయస్సులోని ఉన్న సుమారు 15 మంది ఉండే ఒక వైవిధ్యభరితమైన ఒక సమూహాన్ని సృష్టిస్తున్నాము. Snapchat మరియు పూర్తి సాంకేతిక వ్యవస్థను - సృజనాత్మకతకు ఒక భద్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు సన్నిహితులైన స్నేహితుల మధ్య కనెక్షన్లను ఏర్పరచేందుకు, మేము వారిలో ప్రతి ఒక్కరూ చెప్పేదానిని వినడానికి, వారినుండి నేర్చుకోవడానికి సిద్ధమయ్యాము. దరఖాస్తులు మార్చి 22 వరకు స్వీకరించబడతాయి, మరియు ఎంపికైన అభ్యర్థులకు మేము ఈ వసంతకాలంలో కౌన్సిల్‌లో ఒక స్థానం కల్పిస్తాము.

ఈ కార్యక్రమంలో నెలవారీ కాల్స్, ప్రాజెక్ట్ వర్క్, మా గ్లోబల్ సేఫ్టీ అడ్వైజరీ బోర్డుతో కలసి పనిచేయడం, మొదటి సంవత్సరంలో వ్యక్తిగతంగా కలికే ఒక సదస్సు, రెండవ సంవత్సరంలో మరింత బాహ్య ప్రపంచపు కార్యక్రమాలు ఉంటాయి ఇది టీనేజర్ల జ్ఞానం మరియు అభ్యాసాన్ని ప్రదర్శిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం కోసం, ఈ పోస్ట్ చూడండి మరియు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.

ఈ పైలట్ టీన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి మరియు వారితో భద్రమైన ఇంటర్నెట్ దినోత్సవం 2025ను జరుపుకొనేందుకు ఎదురు చూస్తున్నాము! కాగా, SIDలో ఈరోజే నిమగ్నమై, దీనిని 2024 అంతటా కొనసాగించేందుకు మేము ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాము!

- జాక్విలిన్ బ్యూచెర్, ఫ్లాట్‌ఫామ్ భద్రత యొక్క గ్లోబల్ హెడ్

ఆన్‌లైన్ రిస్కులకు గురికావడం, వారి సంబంధాలు మరియు ఇంతకుముందరి నెలలలో వారి ఆన్‌లైన్ కార్యకలాపాలపై వారి స్పందనల ద్వారా Gen Z పై మేము డిజిటల్ వెల్-బీయింగ్ పరిశోధనలో మేము కొన్ని ఫలితాలను సాధించగలిగాము. ఈ పరిశోధనలో మేము కనుగొన్నది, ఒకే బ్లాగ్ పోస్ట్‌లో పంచుకొనేదానికంటే చాలా ఎక్కువ ఉంది. డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్ మరియు పరిశోధనల గురించి మరింత సమాచారం కోసం, మరియు అప్‌డేట్ చేయబడిన ఈ ఎక్స్‌ప్లెయినర్ ఈ, పరిశోధన యొక్క పూర్తి ఫలితాలు మరియు ఆరు దేశాలలోని ఒక్కో దేశపు ఇన్ఫోగ్రాఫిక్స్‌కై: ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, , జర్మనీ, భారత్,ది యునైటెడ్ కింగ్‌డమ్మరియుయునైటెడ్ స్టేట్స్వివరాలకై మా వెబ్‌సైట్ చూడండి.

తిరిగి వార్తలకు
1 ప్రస్తుతమున్న పరిశోధనా సిద్ధాంతం అనేది PERMA మోడల్, అంటే దీనిని విడగొడితే ఇలా ఉంటాయి: పాజిటివ్ ఎమోషన్ (P), ఎంగేజ్‌మెంట్ (E), రిలేషన్‌షిప్స్ (R), మీనింగ్ (M), మరియు ఎకంప్లిష్‌మెంట్ (A).