Snap Values

ప్యారిస్ 2024 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ సందర్భంగా కమ్యూనిటీ భద్రతను నిర్వహించడానికి Snapchat యొక్క విధానము

జూలై 23, 2024

మేము క్రీడలు మరియు ఐక్యత యొక్క స్ఫూర్తిని జరుపుకుంటూ ఉండగా, ఈ వేసవికాలమంతా శక్తితో, స్నేహబంధాలతో మరియు చిరస్మరణీయ క్షణాలతో నిండి ఉండేలా వేసవి వాగ్దానం చేస్తుంది. అభిమానులు క్రీడలను అనుభవించే, జరుపుకునే మరియు వీక్షించే విధానాన్ని Snapchat మార్చివేస్తోంది — వారిని ఆటలకు, వారి జట్లకు మరియు వారి అభిమానమైన క్రీడాకారులు మరియు ఆటగాళ్లకు దగ్గరగా తీసుకువస్తుంది.

Snap యందు, Snapచాటర్లు తమ భావాలను వ్యక్తీకరించడానికి, తమ నిజమైన స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి మరియు నిమగ్నాత్మకమైన కంటెంట్ ద్వారా అంతా కలిసి ఆనందించడానికి గాను ఒక క్షేమకరమైన మరియు సరదాతో కూడిన వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యంగా ఉంది.

ఈ రోజున, మేము పారిస్ 2024 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ సందర్భంగా మా కమ్యూనిటీకి సానుకూల మరియు సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ఎలా కట్టుబడి ఉన్నామో తెలియజేస్తున్నాము.

గోప్యత మరియు భద్రత  

  • డిజైన్ చే గోప్యత మరియు భద్రత. మొదటి రోజు నుండీ, మేము మా కమ్యూనిటీ యొక్క గోప్యత, భద్రత మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ఉత్పత్తులను రూపొందించాము. Snapchat అనేది సాంప్రదాయ సోషల్ మీడియాకు ఒక ప్రత్యామ్నాయం-మీ స్నేహితులు, కుటుంబం మరియు ప్రపంచంతో మీ సంబంధబాంధవ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడేందుకు దృశ్య సందేశాన్నందించే యాప్. అందుకే Snapchat నేరుగా కెమెరాకు తెరవబడుతుంది, కంటెంట్ ఫీడ్ కు కాదు మరియు నిజ జీవితంలో ఇప్పటికే స్నేహితులుగా ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేయడంపై దృష్టి పెడుతుంది. ఫాలోయింగ్ పెంచుకోవడానికి లేదా లైక్స్ కోసం పోటీ పడకుండా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి మరియు స్నేహితులతో సరదాగా గడపడానికి Snapchat మీకు సాధికారతను ఇస్తుంది.

  • మా కమ్యూనిటీ మార్గదర్శకాలు. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు స్వీయ-వ్యక్తీకరణ యొక్క విస్తృత శ్రేణిని ప్రోత్సహించడం ద్వారా మా ధ్యేయానికి మద్దతు ఇస్తాయి, అదే సమయంలో Snapచాటర్లు మా సేవలను ప్రతిరోజూ సురక్షితంగా ఉపయోగించుకోగలిగేలా కృషి చేస్తాయి. ఈ మార్గదర్శకాలు Snapchat పైన కంటెంట్ అంతటికీ మరియు ప్రవర్తనకు — మరియు Snapచాటర్లు అందరికీ వరిస్తాయి.

  • ముందస్తు చొరవతో కూడిన కంటెంట్ మోడరేషన్. Snapchat వ్యాప్తంగా, మేము నియంత్రించబడని కంటెంట్ అధిక సంఖ్యలో ప్రేక్షకులను చేరుకునే సమర్థతను పరిమితం చేస్తాము మరియు అది విస్తృతంగా పంపిణీ చేయబడే ముందుగా అది మా కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు విస్తృతంగా సిఫార్సు చేయబడేందుకై సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్తో సమ్మతి వహిస్తున్నట్లుగా నిర్ధారించుకుంటాము. బహిరంగ పోస్టులలో సంభావ్యతగా అనుచితమైన కంటెంటును సమీక్షించడానికి - మెషిన్ లెర్నింగ్ సాధనాలు మరియు నిజమైన వ్యక్తుల అంకితమైన బృందాలతో సహా బహిరంగ కంటెంట్ కలిగియున్న మా చోటులను (స్పాట్‌లైట్, పబ్లిక్ స్టోరీలు మరియు మ్యాప్స్ వంటివి) మోడరేట్ చేయడానికి మేము ఆటోమేటెడ్ సాధనాలు మరియు మానవ సమీక్షల సమ్మేళనాన్ని ఉపయోగిస్తాము.

  • మా ఇన్-యాప్ రిపోర్టింగ్ సాధనం: మా ఉత్పాదనా స్థానాల అన్నింటి వ్యాప్తంగానూ, Snapచాటర్లు మా కమ్యూనిటీ మార్గదర్శకాల సంభావ్య ఉల్లంఘనల కోసం ఖాతాలు మరియు కంటెంటును నివేదించవచ్చు. రిపోర్టును మదింపు చేయడానికి శిక్షణ పొందిన మా ట్రస్ట్ మరియు భద్రతా బృందానికి నేరుగా ఒక రహస్య రిపోర్టును సమర్పించడానికి మేము Snapచాటర్లకు సులభతరం చేస్తాము; మా విధానాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాము; మరియు ఫలితాలను రిపోర్టు చేసిన పక్షానికి తెలియజేస్తాము – ముఖ్యంగా కొన్ని గంటల లోపుననే. హానికరమైన కంటెంట్ లేదా ప్రవర్తనను నివేదించడం గురించి మరింత సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్ పైనఈ వనరును సందర్శించండి. హానికరమైన కంటెంటును గుర్తించి మరియు తీసివేయడానికి, మరియు Snapchat పై శ్రేయస్సును మరియు భద్రతను ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాల గురించి మీరు ఇక్కడమరింతగా తెలుసుకోవచ్చు.

  • చట్టమును అమలుచేయుటలో సహకారం: Snapచాటర్ల యొక్క గోప్యత మరియు హక్కులను గౌరవిస్తూనే చట్టమును అమలుచేయుటలో సహకరించడానికి Snap కట్టుబడి ఉంది. మేము Snapchat అకౌంట్ రికార్డుల కోసం చెల్లుబాటు అయ్యే చట్టపరమైన అభ్యర్థనను స్వీకరించగానే, వర్తించే చట్టము మరియు గోప్యతా అవసరాలతో సమ్మతి వహిస్తూ మేము ప్రతిస్పందిస్తాము. మరింత సమాచారం కోసం మీరు మా గోప్యత మరియు భద్రతా హబ్ ని సందర్శించవచ్చు.

  • పరిశ్రమ నిపుణులు మరియు ప్రభుత్వేతర సంస్థలతో భాగస్వామ్యము: మేము పరిశ్రమ నిపుణులు మరియు ప్రభుత్వేతర సంస్థలతో కలిసి అవసరములో ఉన్న Snapచాటర్లకి మద్దతునిస్తాము మరియు Snapchat పైన నిషేధించబడిన సైబర్ వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగం లేదా ఇతర హానికరమైన పరిస్థితులకు సంబంధించిన ఏవైనా నివేదికలకు సకాలంలో ప్రతిస్పందిస్తాము. అదనపు వనరుల కోసం, దయచేసి మా ఇన్-యాప్ పోర్టల్ Here For Youని సందర్శించండి లేదా ఈ దిగువ అదనపు వనరులను చూడండి.

  • అథ్లెట్ అవగాహన మరియు మద్దతు: మేము ఆన్‌లైన్ భద్రత గురించి అథ్లెట్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యక్ష ఛానెళ్ళలను నెలకొల్పాము మరియు అథ్లెట్లు లేదా వారి తరపున నివేదించబడిన ఏదైనా హానికరమైన ప్రవర్తనను వేగంగా పరిష్కరిస్తాము.

అదనపు బాహ్య ఉపయోగకరమైన వనరులు

భద్రతను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న మా ప్రయత్నాల్లో, ఫ్రాన్స్‌లో ఈ క్రింది విలువైన వనరులను ఉపయోగించుకోవలసిందిగా మేము మా కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నాము:

  • Thésée: ఆన్‌లైన్ మోసాలకు వ్యతిరేకంగా మద్దతు అందిస్తోంది.

  • 3018/E-Enfance: మైనర్లకు ఆన్‌లైన్ రక్షణ కల్పించడంపై అంకితమై ఉంది.

  • Ma Sécurité: పోలీస్ మరియు జెండర్మెరీ మీకు మీ విచారణల పట్ల సహాయపడగలుగుతుంది.

  • Pharos: అక్రమ కంటెంటును రిపోర్టు చేయడానికి.

  • Call 15: ప్రమాదం ఆసన్నమయ్యే సమయాల్లో అత్యవసర సహాయత.

ప్యారిస్ 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడల్ని ప్రజలు సురక్షితంగా జరుపుకోవడానికి మరియు పాల్గొనడానికి Snapchat అనువైన చోటు అని నిర్ధారించడానికై మా వంతు పాత్రను పోషించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా భద్రతా విధానంపై అదనపు సమాచారం కోసం, దయచేసి మా గోప్యత, భద్రత మరియు పాలసీ హబ్ని సందర్శించండి.

తిరిగి వార్తలకు