Snap Values

4వ వార్షిక శిఖరాగ్ర సదస్సుతో చట్ట అమలు ప్రాధికార యంత్రాంగంతో Snapchat సహకార సమన్వయం కొనసాగుతుంది

18 డిసెంబర్, 2024

డిసెంబర్ 11న, చట్ట అమలు పరిశోధనలకు Snap ఎలా మద్దతునిస్తున్నదో మరియు Snapచాటర్లను సురక్షితంగా ఉంచడానికి ఎలా పని చేస్తున్నదో మరింతగా తెలపడానికిగాను మేము, దేశవ్యాప్తంగా వేలాది మంది స్థానిక, రాష్ట్ర మరియు సమాఖ్య చట్ట అమలు అధికారులను సంఘటితం చేసి తీసుకువచ్చి మా నాలుగవ వార్షిక యు.ఎస్. సదస్సుకు మేము ఆతిథ్యమిచ్చాము. U.S. చట్ట అమలు యంత్రాంగ కమ్యూనిటీకి చెందిన 6,500 మంది సభ్యులకు పైగా ఈవెంట్ కొరకు రిజిస్టర్ చేసుకున్నారు.

మా CEO, ఇవాన్ స్పీజెల్ U.S. చట్ట అమలు యంత్రాంగ కమ్యూనిటీ యొక్క కీలక లక్ష్యాన్ని గుర్తించి, కలిసి పనిచేయాలనే Snap యొక్క నిబద్ధతను వ్యక్తం చేయడం ద్వారా మరియు Snapchat కోసం అతని దార్శనికతను పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.    

రెండు గంటల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, మా కమ్యూనిటీని రక్షించడానికి చట్ట అమలు యంత్రాంగం ఉపయోగించడానికి సహాయపడగల కార్యాచరణ సాధనాలు, వనరులను పంచుకోవడంపై మేము దృష్టి సారించాము. Snap టీము సభ్యులు ఈ అంశాలను చర్చించారు 1) మేము అమలు చేస్తున్న వనరులు మరియు ప్రక్రియలు, 2) Snapchat సురక్షితంగా చేయడానికి 2024 లో మేము చేసిన ఉత్పత్తి మెరుగుదలలు మరియు 3) మా క్రాస్-సెక్టార్ భాగస్వామ్యాలు. 

శిఖరాగ్ర సదస్సు ద్వారా, యుఎస్ చట్ట అమలు యంత్రాంగ కమ్యూనిటీ, కొత్త సంబంధాలను సానుకూలపరచడం, మరియు మా విధానాలు, ప్రక్రియలు, భద్రతా సాధనాల గురించి ఆచరణాత్మక సమాచారం అందించే వివిధ విభాగాలను సాధ్యత గల విస్తృతిలో చేరుకోవాలని మేము కోరుకున్నాము.

మా భద్రతా కార్యకలాపాల బృందాలు 

మా కమ్యూనిటీని రక్షించడంలో సహాయంచేసే కొందరు బృంద సభ్యులను మరియు వనరులను మేము పాల్గొనేవారికి పరిచయం చేసాము. మా భద్రతా ఆపరేషన్స్ బృందంలో, ట్రస్ట్ మరియు భద్రత మరియు చట్ట అమలు కార్యకలాపాలు చేరి ఉన్నాయి, ఈ రెండూ చట్ట అమలు యంత్రాంగముతో సంబంధం కలిగి ఉంటాయి మరియు Snapచాటర్లు మరియు మూడవ పార్టీ నివేదకుల నుండి భద్రతా సమస్యల నివేదికలకు ప్రతిస్పందిస్తాయి.

ట్రస్ట్ మరియు భద్రతా బృందం — ఇందులో చట్ట అమలు యంత్రాంగం యొక్క మాజీ సభ్యులు, ప్రభుత్వం, మరియు తప్పిపోయిన మరియు దోపిడీ చేయబడిన పిల్లల కొరకు జాతీయ కేంద్రము వారు ఉంటారు — ఇది నివేదికలను పరిశోధించడం ద్వారా Snapchat పై చెడుగా ప్రవర్తించే వారిని నివారించడం మరియు తొలగించడం మరియు అక్రమ కంటెంటును ముందస్తు చొరవతో గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడానికి అంకితమై ఉంది.

LEO అని కూడా పిలువబడే చట్ట అమలు కార్యకలాపాల బృందం, చట్ట అమలు యంత్రాంగముతో అత్యంత సన్నిహితంగా సంబంధం కలిగి ఉండే బృందముగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో చట్ట అమలు యంత్రాంగానికి డేటాను వెల్లడిస్తూ, మరియు సాధారణంగా Snapchat పై భద్రత గురించి చట్ట అమలు యంత్రాంగంతో కమ్యూనికేట్ చేస్తూ మరియు వారి నుండి ప్రశ్నలకు జవాబులిస్తూ చట్ట అమలు యంత్రాగం నుండి చట్టపరమైన అభ్యర్థనలకు స్పందించడానికి LEO అంకితమై ఉంది.

Snapchat యొక్క భద్రతా కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బృంద సభ్యులతో 24 / 7 పాటు పని చేస్తాయి. గత ఐదు సంవత్సరాలలోనే, మా చట్ట అమలు ఆపరేషన్స్ బృందం మూడు రెట్లు అయింది, మరియు మా కమ్యూనిటీ యొక్క అవసరాలకు మరింత త్వరగా స్పందించడానికి మాకు వీలు కల్పించడానికై మా ట్రస్ట్ మరియు భద్రతా బృందం సుమారు 150% పెరిగింది.

కొత్త భద్రతా అంశాలు 

మేము బలమైన అంతర్నిర్మిత రక్షణలు కలిగి ఉండగా, మా ప్లాట్‌ఫారమ్‌ను ఇంకా సురక్షితంగా ఉంచడానికి కొత్త మార్గాల కొరకు నిరంతరం చూస్తున్నాము. ఇదివరకే, మేము సామాజిక ఒత్తిడిని తగ్గించడానికి స్నేహితుల జాబితాలను ప్రైవేట్ చేశాము. ఇప్పటికే స్నేహితుడిగా జోడించని లేదా వారి ఫోన్ కాంటాక్ట్ లలో లేని ఎవరైనా నేరుగా సందేశం పంపడానికి మేము ఎవరినీ అనుమతించము. మరియు లొకేషన్ షేరింగ్ తో సహా కీలక గోప్యతా సెట్టింగ్లు డిఫాల్ట్ గా అత్యంత కఠినమైన ప్రమాణాలకు సెట్ చేయబడ్డాయి.

ఈ సంవత్సరం, మేము టీనేజర్ల కోసం అదనపు రక్షణలను ప్రారంభించామువీటిని మేము శిఖరాగ్ర సమావేశంలో ప్రముఖంగా చుపించాము. అపరిచితులు టీన్స్ తో సంభాషించడాన్ని అడ్డుకోవడానికి మరియు మరింత కష్టతరం చేయడం కోసం మేము బ్లాకింగ్ టూల్స్ మరియు ఇన్-యాప్ హెచ్చరికలకు మెరుగుదలలు చేసాము. మా ఇన్-యాప్ హెచ్చరికలు ఇప్పుడు కొత్త మరియు అధునాతన సంకేతాలను చేర్చుకున్నాయి. ఉదాహరణకు, ఇతరులచే బ్లాక్ చేయబడిన లేదా నివేదించబడిన వ్యక్తుల నుండి టీన్స్ చాట్ అందుకున్నట్లయితే లేదా టీన్స్ యొక్క నెట్వర్క్ సాధారణంగా లేని ప్రాంతం నుండి అది వచ్చి ఉంటే వారు ఒక హెచ్చరిక సందేశాన్ని చూడవచ్చు.

తల్లిదండ్రులకు సాధనాలు మరియు వనరులను అందించే Snapchat యొక్క ఇన్-యాప్ కేంద్రం అయిన ఫ్యామిలీ సెంటర్ కు మేము కొత్త లొకేషన్ షేరింగ్ ఫీచర్లను కూడా ప్రకటించాము. ఇతర అప్‌డేట్లతో పాటుగా, తల్లిదండ్రులు ఇప్పుడు Snap మ్యాప్‌ పై లొకేషన్ పంచుకొమ్మని తమ టీన్స్ ని అడగవచ్చు.

భాగస్వామ్యాలు

చట్ట అమలు యంత్రాంగముతో పనిచేయడంతో పాటుగా, మేము Snapచాటర్లను సాధ్యమైనంత సురక్షితంగా మరియు సమాచారయుతంగా ఉంచడానికి బహుళ-రంగ, భాగస్వామ్య-ఆధారిత విధానము సమర్థవంతమైన మార్గమని నమ్ముతాము. ఆన్‌లైన్ భద్రత గురించి యువతకు సమాచారమివ్వడంలో సహాయపడేందుకై శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మేము Safe and Sound Schoolsతో ఎడ్యుకేటర్ టూల్ కిట్ అభివృద్ధిపరచడానికి మరియు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ తోదాని “Know2Protect” ప్రచారోద్యమంపై మా భాగస్వామ్యాల గురించి చర్చించాము. మా కమ్యూనిటీకి అవగాహన కల్పించి మరియు రక్షించడానికి క్రాస్-సెక్టార్ భాగస్వాములతో పని చేయడం కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాము.

2025 వైపు ముందుకు చూస్తూ, చేయాల్సిన పని ఇంకా ఎంతగానో ఉందని మాకు తెలుసు. మా కమ్యూనిటీని రక్షించడానికి గాను మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట అమలు అధికారులతో ఉత్పాదక సంబంధ బాంధవ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాము కాబట్టి, శిఖరాగ్ర సదస్సులో చురుకుగా మరియు నిమగ్నమై పాల్గొన్నవారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

- Rachel Hochhauser, భద్రతా కార్యకలాపాల ఔట్రీచ్ యొక్క అధిపతి

తిరిగి వార్తలకు