కొత్త పరిశోధన: 2024 లో ఆన్‌లైన్ రిస్క్ బహిర్గతం పెరిగింది, అదే విధంగానే సహాయం కోసం Gen Z అభ్యర్థనలు కూడా
10 ఫిబ్రవరి, 2025
ఆన్‌లైన్ వాతావరణం 2024 లో జనరేషన్ Z కోసం ప్రమాదకరంగా మారింది, 10 మంది టీనేజర్లలో ఎనిమిది మంది మరియు యువత కనీసం ఒక ఆన్‌లైన్ రిస్క్‌కు గురవుతున్నట్లు నివేదించబడింది. ప్రోత్సాహకరంగా, రిస్క్ ఎక్స్‌పోజర్ లొ పెరుగుదల ఉన్నప్పటికీ, ఎక్కువ మంది టీనేజర్లు డిజిటల్ సమస్యను ఎదుర్కొన్న తర్వాత సహాయం కోసం కోరామని తాము చెప్పారు, మరియు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆన్‌లైన్ అనుభవాలను బాగా నావిగేట్ చేయడంలో సహాయపడటానికి గాను తమ టీనేజర్లతో సరి చూసుకుంటున్నట్లుగా నివేదించారు. ఈ కారకాంశాలు కలగలుపుకొని Snap Inc. యొక్క డిజిటల్ శ్రేయస్సు సూచిక (DWBI) ను సంవత్సరం 3లో 63 కి చేరుకునేలా చేశాయి, దీనితో సంవత్సరం 1 మరియు 2 లో ఉన్న 62 నుండి ఒక శాతం పాయింట్ పెరిగినట్లయింది.
ఆరు దేశాల్లోని 13 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వారిలో ఎనభై శాతం మంది 2024 లో తాము ఆన్‌లైన్ రిస్క్ ను అనుభవించామని చెప్పారు, ఇది 2022 లో మొదటి సర్వే నుండి దాదాపు ఐదు శాతం పాయింట్లు ఎక్కువ. Gen Z ప్రతిస్పందకులలో 59% మంది తమ గుర్తింపు గురించి అబద్ధం చెప్పిన మరొకరితో తాము ఆన్‌లైన్‌లో నిమగ్నమయ్యామని పేర్కొనడంతో ఈ రిస్క్ దృశ్యాల్లో మోసం సాధారణమేనని తేలింది. (Snap ఈ పరిశోధనను ఏర్పాటు చేసింది, అయితే ఇది Snapchat పై నిర్దిష్టమైన దృష్టి సారించకుండా, అన్ని ఆన్‌లైన్ ప్లాటుఫామ్లు మరియు సేవలలో Gen Z టీనేజర్లు మరియు యువత అనుభవాలను కవర్ చేస్తుంది.)
"ఎవరైనా మోసం మరియు కుంభకోణాలతో వ్యవహరించాల్సి రావడం విచారకరం మరియు కొన్నిసార్లు విషాదకరం, - అయితే ముఖ్యంగా యువత - " అని ConnectSafely సీఈఓ ల్యారీ మాజిడ్ అన్నారు. "దురదృష్టవశాత్తూ, ఇది చాలా మంది వ్యక్తులకు ఇమెయిల్, వచన సందేశాలు, చాట్, సోషల్ మీడియా మరియు ఇతర ఆన్‌లైన్ అనుభవాల్లోని వాస్తవికతగా ఉంది. ఇది అన్ని వయస్సుల వాడుకదారులను రక్షించడానికి సహాయపడే పెంపొందిత సాంకేతికత మరియు వివేకవంతమైన శాసనంతో పాటుగా మీడియా అక్షరాస్యత మరియు విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను బలోపేతం చేయడానికై చదువు అనే విషయానికి వస్తే హక్కుదారులందరూ తమ తీరును పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది."
SID యొక్క 21వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ సంవత్సరం జాతీయ కార్యక్రమంలో U.S. లోని Safer Internet Day (SID) యొక్క అధికారిక నిర్వాహక సంస్థ ConnectSafely యందు చేరడం Snap గౌరవంగా భావిస్తోంది, ఇక్కడ మేము మా తాజా పరిశోధన ఫలితాల్లో కొన్నింటిని పంచుకుంటాము. 100 కి పైగా దేశాల్లో జరుపుకునే ఈ SID, సాంకేతికతను బాధ్యతాయుతంగా, గౌరవంగా, విమర్శనాత్మకంగా మరియు సృజనాత్మకంగా ఉపయోగించడానికి గాను యువత మరియు పెద్దలను సాధికారపరచడమే లక్ష్యంగా చేసుకుంది. గడచిన మూడు సంవత్సరాలుగా, మేము డిజిటల్ శ్రేయస్సుపై క్రాస్-ప్లాట్‌ఫారమ్ పరిశోధనను నిర్వహించాము మరియు SID కి Snap యొక్క కొనసాగుతున్న దోహదముగా పూర్తి ఫలితాలను విడుదల చేశాము. ఫలితాలు సమగ్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థను తెలియజేయడానికి సహాయపడతాయి మరియు ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు మరింత సానుకూలమైన డిజిటల్ అనుభవాలను నెలకొల్పడంలో మరియు పెంపొందించడంలో మనందరికీ సహాయపడే స్పష్టమైన నిరూపణ ఆధారానికి జోడిస్తాయి.
కొన్ని ప్రోత్సాహకరమైన ట్రెండ్స్
భరోసాగా, గత సంవత్సరం ఎక్కువ మంది Gen Zలు (మునుపటి సంవత్సరాలతో పోలిస్తే) తాము ఆన్‌లైన్ రిస్క్ అనుభవించిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడినట్లుగా లేదా సహాయం కోరినట్లుగా తాజా ఫలితాలు చూపిస్తున్నాయి. 13 నుండి 24 సంవత్సరాల వయస్సు గల వారిలో ప్రతి 10 మందిలో ఆరుగురు (59%) సహాయం కోరినట్లుగా తెలియజేశారు, ఇది 2023 నుండి తొమ్మిది శాతం పాయింట్లు ఎక్కువ. అదేవిధంగా, 13 నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లల తల్లిదండ్రులలో సగానికి పైగా (51%) మంది తమ టీనేజర్లతో ఆన్‌లైన్ జీవితం గురించి చురుకుగా పరిశీలించినట్లు చెప్పారు, ఇది కూడా సంవత్సరం 2 నుండి తొమ్మిది శాతం పాయింట్లు ఎక్కువ. ఇంతలోనే, కాస్త ఎక్కువ మంది తల్లిదండ్రులు (సంవత్సరం 2 లో 45% వర్సెస్ 43%) తమ టీనేజర్లు ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించారని నమ్ముతున్నారు మరియు వారిని చురుకుగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భావించడం లేదని చెప్పారు.
యువత చుట్టూ ఉన్న "మద్దతు ఆస్తులు" గత సంవత్సరమంతా పెరుగుతూనే ఉన్నట్లు మరొక సానుకూల ఫలితం చూపించింది. మద్దతు ఆస్తులు అనేవి, ఒక యువ వ్యక్తి జీవితంలో ఉన్న వ్యక్తులుగా నిర్వచించబడ్డాయి, అది ఇంట్లో గానీ, స్కూలులో గానీ లేదా కమ్యూనిటీలో గానీ, Gen Zల సమస్యల గురించి మాట్లాడగలిగేవారు, వారిని వినేవారు మరియు వారు విజయవంతమవుతారని నమ్ముతున్న వ్యక్తులు అయినా కావచ్చు. తమకు అందుబాటులో అధిక సంఖ్యలో మద్దతు ఆస్తులు ఉన్న యువత బలమైన డిజిటల్ శ్రేయస్సును ఆనందిస్తున్నట్లు పరిశోధన నిలకడగా చూపిస్తుండటం ఆశ్చర్యం కలిగించని విషయం. అందుకనే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ టీనేజర్లు మరియు యువతకు మద్దతు ఇవ్వడానికి మనమంతా మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
సంవత్సరం 3 నుండి కొన్ని అదనపు ఉన్నత-స్థాయి ఫలితాంశాలు ఈ దిగువన ఉన్నాయి:
ఆరు దేశాల్లో సర్వే చేయబడిన 6,004 GenZల లో 23% మంది తాము లైంగిక వేధింపుల బాధితులమని చెప్పారు. దాదాపు సగంకంటే ఎక్కువ (51%) మంది కొన్ని ఆన్‌లైన్ పరిస్థితులలోకి లాగబడుతున్నామని లేదా లైంగిక వేధింపులకు దారితీసే ప్రమాదకర డిజిటల్ ప్రవర్తనలలో నిమగ్నమై ఉన్నామని నివేదించారు. ఇందులో "ముస్తాబు చేయబడినవారు” (37%), "వలవేయబడినవారు" (30%), హ్యాక్ చేయబడినవారు (26%), లేదా సన్నిహిత చిత్రాలను ఆన్‌లైన్‌లో పంచుకొన్నవారు (17%) ఉన్నారు. (మేము గత అక్టోబరులో ఈ ఫలితాంశాలలో కొన్నింటిని విడుదల చేశాము.)
ఆన్‌లైన్‌లో సన్నిహిత చిత్రాలతో Gen Z పాల్గొనడం అనేది తల్లిదండ్రులకు ఒక మాయనిమచ్చగా మిగిలిపోయింది. టీనేజర్ల తల్లిదండ్రులలో కేవలం ఐదుగురిలో 1 (21%) మంది తమ టీనేజర్లు ఆన్‌లైన్‌లో లైంగిక చిత్రాలతో ఎప్పుడూ పాల్గొనలేదని తాము భావించామని చెప్పారు. వాస్తవానికి, టీనేజర్లలో మూడింట ఒక వంతు (36%) కంటే ఎక్కువ మంది అటువంటి ప్రమేయానికి సమ్మతించారు - ఒక 15-శాతం-పాయింట్ గ్యాప్.
Gen Z ప్రతిస్పందకులలో 24% మంది తాము లైంగికపరమైన స్వభావం గల AI-ఉత్పన్నమైన చిత్రాలు లేదా వీడియోలను చూసినట్లుగా చెప్పారు. ఈ రకమైన కంటెంట్ చూసినట్లుగా చెప్పిన వారిలో, 2% మంది ఈ చిత్రాలు మైనర్ కు చెందినవిగా తాము విశ్వసించామని చెప్పారు. (మేము నవంబరులో ఈ డేటాకొంత భాగాన్ని విడుదల చేశాము.)
ఫలితాలు Gen Z యొక్క డిజిటల్ శ్రేయస్సుపై కొనసాగుతున్న Snap పరిశోధనలో భాగం మరియు మా DWBI యొక్క తాజా వ్యవస్థాపనగా గుర్తించబడ్డాయి, ఇది టీనేజర్లు (13-17 సంవత్సరాల వయస్సు) మరియు యువత (18-24 సంవత్సరాల వయస్సు) ఆరు దేశాల్లో ఆన్‌లైన్‌లో ఎలా రాణిస్తున్నారో అనేదాని కొలతగా మేము మా DWBI యొక్క తాజా విడత గా గుర్తించాము. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, యుకె, మరియు యు.ఎస్. మేము వారి టీనేజర్ల ఆన్‌లైన్ రిస్క్ గురించి 13 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులను కూడా సర్వే చేశాము. ఈ పోల్ జూన్ 3 మరియు జూన్ 19, 2024 మధ్య నిర్వహించబడింది, మరియు మూడు వయస్సు జనాభా సమూహాలు మరియు ఆరు భౌగోళిక ప్రాంతాల్లో 9,007 మంది ప్రతిస్పందకులు పోల్ చేశారు.
3వ సంవత్సరం DWBI
DWBI ప్రతియొక్క ప్రతివాదికి ఒక శ్రేణి మనోభావన ప్రకటనలతో వారి ఒప్పందం సమ్మతి ఆధారంగా 0 మరియు 100 మధ్య స్కోరును కేటాయిస్తుంది. వ్యక్తిగత ప్రతిస్పందన స్కోర్లు తర్వాత నిర్దిష్ట దేశం స్కోర్లను మరియు ఆరు-దేశాల సగటును ఉత్పన్నం చేశాయి. మొత్తంగా ఆరు భౌగోళిక ప్రాంతాలలో సగటుగా చూస్తే, 2023 మరియు 2022 రెండింటిలోనూ 62 నుండి 2024 DWBI ఒక శాతం పాయింట్ పెరిగి 63 కి చేరుకుంది. పరిగణించబడిన అన్ని విషయాలపై, ఇది ఒక సగటు పఠనముగా మిగిలిపోయింది, అయితే టీనేజర్లు మరియు యువత ఉభయులకూ ముప్పు బహిర్గతం పెరుగుదల దృష్ట్యా, నికరంగా సానుకూలంగా ఉంది. నడుస్తూ ఉన్న మూడవ సంవత్సరానికి గాను, ఇండియా అత్యధిక DWBI 67 వద్ద నమోదు చేసుకొంది, ఇది మరోసారి తల్లిదండ్రుల మద్దతు యొక్క బలమైన సంస్కృతిచే నొక్కి చెప్పబడింది, అయితే 2023 నుండి మార్పు లేకుండానే ఉంది. యుకె మరియు యు.ఎస్ ఈ రెండింటిలోనూ రీడింగులు వరుసగా ఒక శాతం పాయింట్ పెరిగి 63 మరియు 65 కి చేరుకున్నాయి, అయితే ఫ్రాన్స్ మరియు జర్మనీ 59 మరియు 60 వద్ద మారకుండా నిలిచాయి. తన DWBI అంగుళాన్ని ఒక శాతం పాయింట్ తగ్గించి 62 కి చూసిన ఏకైక దేశం ఆస్ట్రేలియా మాత్రమే.
ఈ సూచిక స్థిరపడిన శ్రేయస్సు సిద్ధాంతంపై ఒక వైవిధ్యత అయిన PERNA మోడల్‌ను వినియోగిస్తుంది 1, ఐదు వర్గాల వ్యాప్తంగా 20 సెంటిమెంట్ ప్రకటనలను కలిగి ఉంటుంది: సానుకూల భావోద్వేగం, నిమగ్నత, సంబంధబాంధవ్యాలు, ప్రతికూల భావోద్వేగం మరియు సాధన. మునుపటి మూడు నెలల్లో కేవలం Snapchat మాత్రమే కాకుండా - ఏదైనా పరికరం లేదా యాప్‌లో వారి ఆన్‌లైన్ అనుభవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రతివాదులు 20 స్టేట్‌మెంట్‌లలో ప్రతిదానితో వారి ఒప్పందం స్థాయిని రిజిస్టర్ చేయమని అడిగారు. ఉదాహరణకు, "నేను ఆన్‌లైన్‌లో చేసినది విలువైనది మరియు గొప్పది అని సాధారణంగా నాకు అనిపించింది," సానుకూల భావోద్వేగ కేటగిరీలో, మరియు "నేను ఆన్‌లైన్‌లో చెప్పడానికి ఏదైనా ఉన్నప్పుడు నిజంగా నేను చెప్పేది వినే స్నేహితులను కలిగి ఉన్నాను," సంబంధబాంధవ్యాల క్రింద. (ఈ లింక్ చూడండి 20 DWBI స్టేట్‌మెంట్ల కోసం.)
ఆస్ట్రేలియా మరియు యూరప్‌లోని టీనేజర్లు: డిజిటల్ శ్రేయస్సు కోసం మా కొత్త కౌన్సిల్‌లకు దరఖాస్తు చేయండి
గత సంవత్సరం, మా తాజా పరిశోధన మరియు ఆన్‌లైన్‌లో టీనేజర్ల పట్ల మా కొనసాగుతున్న నిబద్ధత పట్ల యానిమేట్ చేయడంలో సహాయపడటానికి, మేము 13 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం డిజిటల్ అనుభవాలను వినడం, నేర్చుకోవడం మరియు మెరుగుపరచడంపై దృష్టి సారించి, యు.ఎస్. లోని టీనేజర్ల కోసం ఒక ప్రయోగాత్మక కార్యక్రమం అయిన మా ప్రారంభోత్సవ డిజిటల్ శ్రేయస్సు మండలి (CDWG) ని ప్రారంభించాము. క్లుప్తంగా, ఆ కార్యక్రమం విజ్ఞానదాయకంగా, ఫలవంతమైనదిగా మరియు కేవలం సరదాగా ఉండినది - ఈ సంవత్సరం మేము దానిని ఎంతగానో విస్తరిస్తాము మరియు యూకే తో సహా ఆస్ట్రేలియా మరియు యూరప్‌లో రెండు కొత్త "సోదరి" మండలులను జోడిస్తాము. మేము అతి త్వరలో ఆ భౌగోళిక ప్రాంతాల్లో అప్లికేషన్ ప్రక్రియలను దూకుడుగా ప్రారంభించాలని ఆశిస్తున్నాము.
అదే సమయంలో, SID 2025 తో కూడా కలగలిసి, మా యు.ఎస్. ఆధారిత మండలి సభ్యులలో కొందరు టీనేజర్లు మరియు తల్లిదండ్రుల కోసం కీలక డిజిటల్ భద్రతా అంశాలపై తమ ఆలోచనలను పంచుకోవడానికి ఫ్యామిలీ ఆన్‌లైన్ భద్రత ఇన్‌స్టిట్యూట్ తో సమన్వయం చేసుకున్నారు. సోషల్ మీడియాను సురక్షితంగా నావిగేట్ చేయడంపై మా CDWG సభ్యుల నుండి అభిప్రాయాలను వినడానికి, ప్లాటుఫామ్లు మరియు ఇతరులకు ఆందోళనలను రిపోర్ట్ చేయడం యొక్క ప్రాముఖ్యత, భద్రతా సమస్యల గురించి తల్లిదండ్రులతో మాట్లాడటానికి సూచనలు మరియు మరెన్నో చేయడానికి FOSI వెబ్‌సైట్ పై ఈ బ్లాగును చూడండి. ఈ విశిష్ట అవకాశం కోసం మేము FOSI కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలతో మార్గదర్శనం మరియు సూచికా సందేశాలు ప్రతిధ్వనిస్తాయని ఆశిస్తున్నాము.
మా CDWG కార్యక్రమం విస్తరణతో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని యువతకు అటువంటి అవకాశాలను విస్తరించడం పట్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. అప్పటివరకూ, ఈ రోజు SID పై మరియు 2025 అంతటా డిజిటల్ భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయవలసిందిగా మేము ప్రోత్సహిస్తున్నాము!
మా డిజిటల్ శ్రేయస్సు పరిశోధన, Gen Z ఆన్‌లైన్ ముప్పులకు గురికావడం, వారి సంబంధబాంధవ్యాలు, మరియు గత నెలల్లో వారి కార్యకలాపాల గురించి వారి ప్రతిస్పందనల ఫలితాంశాలను వెల్లడించింది. మేము ఒకే ఒక్క బ్లాగ్ పోస్ట్‌లో పంచుకోగలిగిన దానికంటే పరిశోధన చేయడానికి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. డిజిటల్ శ్రేయస్సు సూచిక మరియు పరిశోధన గురించి మరింతగా తెలుసుకోవడానికి, మా వెబ్‌సైట్అదే విధంగా ఈ అప్‌డేట్ చేయబడినవివరణదారుపూర్తి ఫలితాలను కూడా చూడండి, స్థానిక భౌగోళిక సమాచార వనరులలో ప్రతి దేశం: ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ది యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్, మరియు ఒక కొత్త డాక్యుమెంటు, “డిజిటల్ శ్రేయస్సు కొరకు స్వరాలు,” అది మా భాగస్వాములు మరియు సమన్వయ సంస్థలు కొన్నింటి నుండి ఈ పరిశోధన విలువపై అభిప్రాయాలను సంగ్రహిస్తుంది.
— జాక్వెలిన్ బ్యూచెర్, ప్లాట్‌ఫారమ్ భద్రత యొక్క గ్లోబల్ హెడ్