Privacy, Safety, and Policy Hub

మా CitizenSnap నివేదికను విడుదల చేస్తున్నాం

17, మే, 2021

ఎడిటర్ యొక్క నోట్: Snap CEO, ఇవాన్ స్పీజెల్, మే 17న Snap బృంద సభ్యులందరికీ ఈ క్రింది మెమోను పంపారు.

జట్టు సభ్యులకు,

ఈ రోజు మేము మా రెండవ వార్షిక CitizenSnap నివేదికను విడుదల చేస్తున్నాము. ఈ నివేదిక మన పర్యావరణ, సామాజిక, మరియు పాలన (ESG) ప్రయత్నాలను క్లుప్తంగా తెలుపుతుంది, ఇది మన బృందానికి, మన Snapchat కమ్యూనిటీమ్ మన భాగస్వాములకు, మరియు మనమంతా పంచుకునే విస్తృతమైన ఈ ప్రపంచంలో మన వ్యాపారాన్ని మరింత బాధ్యతాయుతంగా నడపడంపై దృష్టి సారించింది.

మన నివేదిక మన మొదటి వాతావరణ వ్యూహాన్ని కూడా పరిచయం చేస్తూ, అవసరమైన వేగం మరియు స్థాయిలో తీసుకోవలసిన చర్యలలో మన వంతు కృషి చేయాలని సూచిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, మనం గతంలో, ప్రస్తుతంలో మరియు భవిష్యత్తులోకూడా కర్బన తటస్థ సంస్థగా ఉంటాము; మనం శాస్త్రీయపరంగా ఉండే ఉద్గారాల లక్ష్యాలను స్వీకరించాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కార్యాలయాలలో 100% పునరుత్పాదక విద్యుత్తునే కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉన్నాము. రాబోయే కాలంలో, మన ఉత్తమ విధానాలను కొనసాగించేందుకు, మన వాతావరణ సంబంధ కార్యక్రమాలను కొనసాగిస్తాము.

ఈ రోజు మనం మన ESG పనికి మద్దతుగా ఉండే పూర్తిగా మార్చబడిన కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ప్రవేశపెడుతున్నాము. ఈ కొత్త కోడ్ మన జట్టు సభ్యులు, మన వాటాదారులందరికీ సరైనదేదో అన్నదాని గురించి ఆలోచించడంలో సహాయపడేందుకు అవసరమయ్యే నైతికపరమైన నిర్ణయాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.

ఒక ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన సమాజాన్ని సృష్టించే నిమిత్తం పనిచేయడమనేది ఒక నైతికపరమైన ఆవశ్యకత అని మనం విశ్వసిస్తున్నాము మరియు ప్రతిరోజూ మన సేవలను ఉపయోగించుకొనే మిలియన్లకొద్దీ Snapchattersకు ఇది ఎంతో ముఖ్యమైనదని మనకు తెలుసు. వ్యాపారానికి కూడా ఇది ఎంతో మంచిది. మన CitizenSnap నివేదిక ఇలా ఉన్నందున, మనం రెండు ముఖ్యమైన అంశాలలో ప్రగతిని సాధించాము, అయినప్పటికీ ఇంకా చేయవలసి ఉంటుంది మరియు అభివృద్ధి చేయడానికి మార్గాలు ఉన్నాయి.

ఈ ప్రయత్నాలన్నీ సంస్థవ్యాప్తంగా ఉన్న చాలా జట్లు చేసిన కృషి మరియు ప్రత్యేకించి ఎంతో సవాలుతో కూడుకొన్న సంవంత్సరంలో వారు చూపిన అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంతవరకు మనం సాధించిన పురోగతికి నేనెంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తూ, రాబోయే కాలంలో మనం చేయబోయే పనిపట్ల చాలా ఉత్సుకతతో ఉన్నాను.

ఇవాన్

తిరిగి వార్తలకు