మూడవ వార్షిక జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవాన్ని గౌరవించడం
మే 7, 2024
Snap వద్ద, మేము నకిలీ మాత్రలతో సహా చట్టవ్యతిరేకమైన మత్తుమందులను పంపిణీ చేయాలని అనుకుంటున్న నేరస్థులచే మా సేవ యొక్క దురుపయోగాన్ని నిరోధించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. ఈరోజు, మేము మూడవ వార్షిక జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవాన్ని స్మరించుకోవడానికి - ప్రజా ఆరోగ్య నిపుణులు, చట్టమును అమలుచేసే అధికార యంత్రాంగము మరియు తల్లిదండ్రులు మరియు కుటుంబ సమూహాలతో పాటు పనిచేయడం పట్ల గౌరవంగా భావిస్తున్నాము.
మేము ఈ రోజు గుర్తుగా, ఈ విధ్వంసకరమైన మరియు అత్యవసర ప్రజా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటానికై సహాయపడేందుకు కొనసాగుతున్న మా పనిపై మా కమ్యూనిటీకి ఒక అప్డేట్ అందించాలనుకుంటున్నాము.
టెక్నాలజీ మరియు ప్లాట్‌ఫామ్ భద్రత
Snapchat అనేది, ముఖా-ముఖీ సంభాషణలు వంటి లేదా టెలిఫోన్ పైన మాట్లాడటం వంటి వాటి ద్వారా ప్రైవేటుగా కమ్యూనికేట్ చేయడం ద్వారా నిజ జీవితంలో ఎక్కువగా వారికి సన్నిహితులైన వ్యక్తులను చెంతకు తీసుకురావడం కొరకు రూపొందించబడిన యాప్. సందేశాలు డీఫాల్ట్ గా తొలగించబడినప్పటికీ సైతమూ, మేము చట్టవిరుద్ధమైన లేదా దుర్వినియోగమైన కంటెంట్‌ను ముందస్తుగా కనిపెట్టిన కారణంగా లేదా అది మాకు రిపోర్టు చేయబడిన కారణంగా దానిపై చర్య తీసుకుంటే, మేము ఆ కంటెంట్‌ను పొడిగించిన వ్యవధి పాటు నిలిపి ఉంచుకుంటాము. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడంతో సహా మా ప్లాట్‌ఫామ్‌ని ఆపరేట్ చేయాలని ప్రయత్నిస్తున్న మత్తుమందు డీలర్లను తొలగించడానికి మేము సంవత్సరాలుగా పనిచేస్తున్నాము.
ప్రోయాక్టివ్ డిటెక్షన్ టూల్స్: మేము డీలర్స్ అకౌంట్‌లను ముందస్తుగా కనుగొని మూసివేసేందుకు సహాయపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నియోగించి మరియు దానిని నిరంతరం మెరుగుపరుస్తాము. మాకు నివేదించబడే ముందుగానే ఈ కంటెంట్ తగ్గింపుకు మాకు వీలు కలిగించేలా, సుమారు 94% అక్రమ మాదకద్రవ్య చర్యలను గుర్తించడంలో అత్యంత అధునాతనమైన మా నమూనాలు ఇప్పుడు సహాయపడుతున్నాయి.
నివేదికలపై శీఘ్ర చర్య: మత్తుమందులకు సంబంధించిన కంటెంట్ గురించి మేము అందుకున్న ఏవైనా నివేదికలకు వీలైనంత త్వరగా ప్రతిస్పందించడానికి మా ట్రస్ట్ మరియు భద్రత బృందం అహర్నిశలూ పనిచేస్తుంది. మా బృందం ఒక గంట లోపుననే మత్తుమందులకు సంబంధించిన నివేదికలకు స్పందిస్తున్నదని మా ఇటీవలి పారదర్శకత నివేదిక చూపుతోంది.
శోధనలను అడ్డుకోవడం: ఫెంటానిల్ యొక్క ప్రమాదాల గురించి నిపుణులనుండి వనరుల కోసం Snapchatters ని మళ్ళించడానికి బదులుగా అనేక రకాల మాదకద్రవ్య-సంబంధిత పదజాల శోధన ఫలితాలను మేము బ్లాక్ చేస్తాము.
ఇతర ప్లాట్‌ఫామ్స్ తో సమన్వయం చేసుకోవడం: కమ్యూనికేట్ చేయడానికి ఔషధ డీలర్లు అనేక సేవలను ఉపయోగిస్తారని తెలుసుకుని - మాదకద్రవ్యాల కంటెంట్ మరియు డీలర్స్ అకౌంట్‌లను కనుగొనడానికి మరియు తొలగించడానికి మా ముందస్తు కనుగొనే ప్రయత్నాలను మెరుగుపరచుకోవడానికి మాకు వీలు కలిగిస్తూ మేము మాదకద్రవ్య-సంబంధిత కంటెంట్ మరియు చర్యల తీరుతెన్నులు మరియు సంకేతాలను పంచుకోవడానికై నిపుణులు మరియు ఇతర సాంకేతిక కంపెనీలతో పనిచేస్తున్నాము.
చట్టాన్ని అమలు చేసే అధికార యంత్రాంగముతో సమన్వయ సహకారం
నేరస్థులను న్యాయస్థానానికి తీసుకురావడానికి సహాయపడేందుకై పరిపాలనా యంత్రాంగ విచారణలకు త్వరగా స్పందిస్తూ మా శాసన అమలు వ్యవహార కార్యకలాపాల బృందం అంకితమై ఉంది. మా ప్లాట్‌ఫామ్ పై చట్టవిరుద్ధమైన చర్యలకు సంబంధించి పరిపాలనా యంత్రాంగము వేగమైన మరియు సముచితమైన చర్యలను తీసుకునేలా చూసుకోవడానికి మేము వారితో బలమైన సంబంధాలను నిర్వహిస్తాము. మా ప్రధాన ప్రాధాన్యతలలో ఇవి చేరి ఉంటాయి:
మా బృందాన్ని విస్తరించడం: మా శాసన అమలు వ్యవహార కార్యకలాపాల బృందం గత 5 సంవత్సరాలలో 200% కంటే ఎక్కువ, మరియు 2020 నుండి దాదాపుగా 80% పెరిగింది. మేము ముఖ్యంగా చెల్లుబాటు అయ్యే చట్టపరమైన అభ్యర్థనలకు రెండు నుండి మూడు వారాలలో మరియు డిస్క్లోజర్ అభ్యర్థనలకు 30 నిమిషాలలో సమాధానమిస్తాము.
ముందస్తుగానే ఉన్నతస్థాయికి తెలియజేయడం: జీవితానికి ముప్పు ఆసన్నమయ్యే పరిస్థితి ఉందని మేము నమ్మే సందర్భాల్లో, మేము కేసును ముందస్తుగానే ఉన్నత అధికార యంత్రాంగ స్థాయికి తీసుకువెళతాము. చట్ట అమలు అధికార యంత్రాంగము అనుసరణీయతను కోరిన సందర్భంలో, మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలు యొక్క మాదకద్రవ్య-సంబంధిత ఉల్లంఘనల కోసం అకౌంట్‌లను రద్దు చేసిన తర్వాత మేము ఉల్లంఘన కంటెంటును పొడిగింపు వ్యవధి పాటు కూడా నిలుపుకుంటాము.
శాసనవ్యవస్థకు మద్దతునివ్వడం: అదనంగా, ఫెంటానిల్ ను ఎదుర్కోవటానికై, సామాజిక నెట్వర్కింగ్ కంపెనీలు మరియు చట్ట అమలు యంత్రాంగం మధ్య గొప్ప సహకారానికి బాటలు వేసే బైపార్టిసాన్ శాసన వ్యవస్థపై సెనేట్ యొక్క సభ్యులు, కూపర్ డేవిస్ చట్టముతో పని చేశాము.
చదువు ద్వారా ఫెంటానిల్ సంక్షోభం పట్ల అవగాహనను పెంపొందించడం
మేము ఫెంటానిల్ యొక్క ప్రమాదాల గురించి Snapchatters మరియు సాధారణ ప్రజానీకానికి అవగాహన కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. గడచిన రెండు సంవత్సరాలుగా, మేము నకిలీ మాత్రల అపాయాల గురించి హెచ్చరిస్తూ మరియు Snapchatters ను విశ్వసనీయ నిపుణుల నుండి వనరులకు మళ్ళింపజేస్తూ ఇన్-యాప్ వీడియోలు మరియు వార్తా కంటెంట్ ని పెంపొందించాము. ఇది నిరంతరమూ కొనసాగే కృషి, మరియు ఈ క్రింది వాటిని చేరి ఉంది:
Snapchatters తో అవగాహన పెంచడానికి ఇన్-యాప్ కంటెంట్: PSAలను నడపడానికి గాను మేము ప్రముఖ ఫెంటానిల్ అవగాహన సంస్థ అయిన సాంగ్ ఫర్ ఛార్లీ తో భాగస్వామ్యం వహించాము, మరియు మా ఒరిజినల్ న్యూస్ షో, గుడ్ లక్ అమెరికాతో ప్రత్యేక సిరీస్ చేశాము. ఫెంటానిల్ అవగాహన దినోత్సవం, గౌరవార్థం విడుదల అయిన సాంగ్ ఫర్ చార్లీ యొక్క వ్యవస్థాపకుడు, ఎడ్ టెర్నాన్ తో ఒక కొత్త ఇంటర్వ్యూని మీరు ఇక్కడచూడవచ్చు.
అంకితమైన ఇన్-యాప్ ఎడ్యుకేషన్ పోర్టల్: Snapchatters గనక మాదకద్రవ్య-సంబంధిత కంటెంట్ లేదా ఫెంటానిల్ సంక్షోభానికి సంబంధించిన అనేక పదాల శోధనకు ప్రయత్నిస్తే, వారికి నిపుణుల నుండి విద్యా సంబంధిత కంటెంట్‌ను అందుబాటులో ఉంచే ఇన్-యాప్ టూల్ అయిన హెడ్స్ అప్ ని కూడా మేము ప్రారంభించాము. మా నిపుణులైన భాగస్వాములలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), సబ్‌స్టాన్స్ అబ్యూజ్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (SAMHSA), కమ్యూనిటీ యాంటీ డ్రగ్ కోయలిషన్స్ ఆఫ్ అమెరికా (CADCA), షాటర్‌ప్రూఫ్, ట్రూత్ ఇనిషియేటివ్ మరియు సేఫ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
యాడ్ కౌన్సిల్ తో పని చేయడం: అనేక సంవత్సరాల క్రితం, ఫెంటానిల్ యొక్క అపాయాల గురించి అపూర్వమైన జాతీయ ప్రజా అవగాహన ఉద్యమంని అభివృద్ధి చేయడానికి గాను మేము యాడ్ కౌన్సిల్ తో పని చేయడం ప్రారంభించాము. ఈ ప్రచారోద్యమంలో ఇప్పుడు ఇతర ప్రముఖ టెక్ ప్లాట్‌ఫామ్స్ చేరి ఉన్నాయి మరియు తల్లిదండ్రులు మరియు టీనేజర్లు ఎక్కడ ఉన్నా వారిని చేరుకోవడంపై అది దృష్టి సారించింది.
Snapchat కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడానికి సహాయపడటం మా టాప్ ప్రాధాన్యత. మాకు ఎల్లప్పుడూ చేయడానికి మరింత పని ఉంది, మరియు మా ప్లాట్‌ఫామ్ నుండి మాదకద్రవ్యాల అమ్మకాలను నిర్మూలించడానికి మరియు ఫెంటానిల్ సంక్షోభం యొక్క విధ్వంసకరమైన ప్రభావాల గురించి అవగాహన పెంపొందించడానికి మేము తల్లిదండ్రులు, ప్రభుత్వము, ఇతర ప్లాట్‌ఫామ్స్, మరియు నిపుణులతో పాటుగా పనిచేయడం కొనసాగించడానికై ఎదురుచూస్తున్నాము.