పరిశోధకుల డేటా ప్రాప్యత సూచనలు

మీరు గనక వాణిజ్య-యేతర ప్రయోజనాలతో పరిశోధకుడిగా ఉన్నట్లయితే, మరియు డిజిటల్ సర్వీసెస్ చట్టము (DSA)నకు అనుగుణంగా Snap యొక్క బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటా కు ప్రాప్యతను అభ్యర్ధన చేయాలనుకుంటే, మీరు ఈ క్రింది సమాచారంతో మీ పరిశోధనా అభ్యర్ధన ను DSA-Researcher-Access@snapchat.com వారికి సబ్మిట్ చేయవచ్చు:

  • మీ పేరు మరియు అనుబంధ పరిశోధనా సంస్థ పేరు

  • మీరు ప్రాప్యత చేసుకోవాలనుకుంటున్న డేటా యొక్క వివరణాత్మక వివరణ

  • మీరు డేటా ను దేనికి అభ్యర్థిస్తున్నారో ఆ ఉద్దేశ్యం యొక్క వివరణాత్మక వివరణ

  • ప్రణాళిక చేసుకున్న పరిశోధనా కార్యకలాపాలు మరియు పద్దతి యొక్క వివరణాత్మక వివరణ

  • మీరు నిర్వహిస్తున్న పరిశోధన కొరకు ఫండింగ్ యొక్క వనరుల గురించి వివరాలు

  • మీ పరిశోధన అనేది వాణిజ్య-యేతర ప్రయోజనాల కోసం ఉందనే నిర్ధారణ

  • అభ్యర్థించబడిన డేటా యొక్క సమయ పరిమితిపై వివరాలు

ఒకసారి అందుకోగానే, మేము చట్టాలకు అనుగుణంగా మరియు సమ్మతి కోసం మీ అభ్యర్ధనను సమీక్షించి, తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తాము.