Snapchat మోడరేషన్, అమలు కావడం మరియు అప్పీళ్ళు
కమ్యూనిటీ మార్గదర్శకాల వివరణదారు శ్రేణి
నవీకరించబడింది: మార్చి 2026
Snapchat అంతటా, మా కమ్యూనిటీ గోప్యత ప్రయోజనాలను గౌరవిస్తూనే మేము భద్రతను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము. సంభావ్య హానులను ఎదుర్కోవడానికి మేము సమతుల్యమైన, ముప్పు-ఆధారిత విధానాన్ని తీసుకుంటాము - పారదర్శక కంటెంట్ మోడరేషన్ అభ్యాసాలు, స్థిరమైన మరియు సమానత్వ అమలు, మరియు మా విధానాలను సమంజసంగా పాటించడానికై మమ్మల్ని మేము జవాబుదారీగా ఉంచుకోవడానికి స్పష్టమైన కమ్యూనికేషన్ సమ్మేళనం చేస్తూ.
కంటెంట్ మోడరేషన్
మేము భద్రతను మనసులో ఉంచుకొని Snapchat ను రూపొందించాము, మరియు సంభావ్య హానికారక కంటెంట్ యొక్క వ్యాప్తిని నివారించడానికి సహాయపడటంలో ఈ డిజైన్ కీలకం. ఉదాహరణకు, సంభావ్య హానికరమైన లేదా ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేయడానికి సృష్టికర్తలకు అవకాశం ఉన్న చోట, Snapchat ఓపెన్ న్యూస్ ఫీడ్‌ను అందజేయదు మరియు స్నేహితుల జాబితాలు వ్యక్తిగతంగా (ప్రైవేట్‌గా) ఉంటాయి.
ఈ డిజైన్ రక్షణలకు అదనంగా, మా పబ్లిక్ కంటెంట్ స్థలాల్ని (స్పాట్‌లైట్, పబ్లిక్ స్టోరీస్ మరియు మ్యాప్స్ వంటివి) మోడరేట్ చేయడానికి మేము ఆటోమేటెడ్ సాధనాలు మరియు మానవ సమీక్ష సమ్మేళనాన్ని ఉపయోగిస్తాము. ప్రజా స్థలాలపై సిఫార్సు చేయబడిన కంటెంట్ కూడా ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది మరియు విధిగా అదనపు మార్గదర్శకాలనుపాటించాలి. స్పాట్‌లైట్‌పై, ఉదాహరణకు, విస్తృత Snapchat కమ్యూనిటీతో పంచుకోవడానికై సృష్టికర్తలు సృజనాత్మక మరియు వినోదభరితమైన వీడియోలను సమర్పించవచ్చు, ఏదైనా పంపిణీ పొందే ముందుగా కంటెంట్ అంతా మొదట కృత్రిమ మేధస్సు మరియు ఇతర టెక్నాలజీచే ఆటోమేషన్ ద్వారా సమీక్షించబడుతుంది. Snap ని పెద్ద సంఖ్యలో ఆడియన్స్ కు పంపిణీ కోసం సిఫారసు చేయబడే అవకాశం ఇవ్వడానికి ముందు, అది మానవ మోడరేటర్లచే సమీక్షించబడుతుంది. స్పాట్‌లైట్ పై కంటెంట్ మోడరేట్ చేయడానికి ఈ దశలవారీ విధానం, సంభావ్య హానికరమైన కంటెంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మరియు ప్రతి ఒక్కరికీ సరదా మరియు సానుకూల అనుభవాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
అదేవిధంగానే, పబ్లిషర్ స్టోరీస్ లేదా షో లు వంటి మీడియా కంపెనీలచే ఉత్పన్నం చేయబడిన ఎడిటోరియల్ కంటెంట్, భద్రత మరియు సమగ్రత కోసం ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది. అదనంగా, సంభావ్య హానికరమైన కంటెంటును గుర్తించడానికి గాను మేము స్టోరీస్ వంటి - ఇతర పబ్లిక్ లేదా అధిక దృశ్యత గల స్థలాలపై ముందస్తుగా హానిని-కనిపెట్టే టెక్నాలజీని వాడతాము, మరియు శోధన ఫలితాలలో అట్టి కంటెంట్ (ఉదా.అక్రమ మందులు లేదా ఇతర చట్టవిరుద్ధ వస్తువుల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాతాలు) కనిపించకుండా నివారించడానికై మేము కీవర్డ్ ఫిల్టరింగ్‌ను ఉపయోగిస్తాము.
Snapchatకు నివేదించడం
మా ఉత్పాదనా స్థలాలన్నింటి వ్యాప్తంగా, మా విధానాల సంభావ్య ఉల్లంఘనల కోసం ఖాతాలు మరియు కంటెంట్‌ను వాడుకదారులు నివేదించవచ్చు. రిపోర్టును మదింపు చేయడానికి శిక్షణ పొందిన మా భద్రతా బృందాలకు నేరుగా ఒక రహస్య రిపోర్టును సమర్పించడానికి మేము Snapచాటర్ల కు సులభతరం చేస్తాము; మా విధానాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాము; మరియు ఫలితాలను రిపోర్టు చేసిన పక్షానికి తెలియజేస్తాము – ముఖ్యంగా కొన్ని గంటల వ్యవధిలో. (కొన్ని ఉదంతాలలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక నివేదికపై మేము విశ్వాసంతో అధిక ప్రశస్తత మోడరేషన్ నిర్ణయం తీసుకోగలిగి ఉంటే, మేము అలా చేయవచ్చు.)
మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్‌ను మీరు చూసినచో, దయచేసి దానిని వీలైనంత త్వరగా నివేదించండి. మీరు యాప్‌లో కంటెంట్‌ను నివేదించినప్పుడు, డిఫాల్ట్‌గా అది తొలగించబడినా కూడా, మేము దానిని సమీక్షించి, నిలుపుకోగలుగుతాము. హానికరమైన కంటెంట్ లేదా ప్రవర్తనను నివేదించడం గురించి మరింత సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్ లో ఈ వనరును సందర్శించండి. ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించి మరియు తొలగించడానికి మరియు Snapchat పై భద్రత మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాల గురించి కూడా మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు. మీరు సమర్పించిన ఒక నివేదిక యొక్క ఫలితం గురించి మీకు ప్రశ్న లేదా సమస్య ఉంటే, మీరు మా సపోర్ట్ సైట్ ద్వారా అనుసరించవచ్చు.
మీరు ఒక నివేదికను సమర్పించేటప్పుడు, అది మీ అత్యుత్తమ పరిజ్ఞానం మేరకు సంపూర్ణమైనది మరియు ఖచ్చితమైనదని మీరు ధృవీకరిస్తున్నారు. దయచేసి నకిలీ లేదా ఇతరత్రా "స్పామ్" నివేదికలను పదే పదే పంపించడంతో సహా Snap యొక్క రిపోర్టింగ్ వ్యవస్థలను దురుపయోగం చేయవద్దు. మీరు ఈ ప్రవర్తనలో నిమగ్నమైతే, మీ అభ్యర్థనల సమీక్షకు ప్రాధాన్యతను తగ్గించే హక్కును మేము కలిగి ఉన్నాము.. మీరు ఇతరుల కంటెంట్ లేదా అకౌంట్లపై నిరాధారమైన నివేదికలను తరచుగా సమర్పిస్తే, మేము మీకు ఒక హెచ్చరికను పంపించిన తర్వాత, ఒక సంవత్సరం పాటు మీ నివేదికల సమీక్షను నిలిపివేయవచ్చు మరియు తీవ్రమైన పరిస్థితులలో, మీ అకౌంట్ ను నిలిపివేయవచ్చు
కాలిఫోర్నియా బిజినెస్ మరియు ప్రొఫెషన్స్ కోడ్, డివిజన్ 8, చాప్టర్ 22.2.8 ప్రకారం అవసరమైనట్లుగా కాలిఫోర్నియాలోని K-12 పాఠశాలల ప్రిన్సిపాల్స్ మరియు సారూప్య నిర్వాహకుల కోసం మరియు కాలిఫోర్నియా ఆధారిత మైనర్లకు సేవలను అందించే మానసిక ఆరోగ్య నిపుణుల కోసం మేము అంకితమైన రిపోర్టింగ్ ఛానల్ కలిగి ఉన్నామని దయచేసి గమనించండి. ఈ రిపోర్టింగ్ ప్రక్రియల గురించిన సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు.
Snapలో విధానాల అమలు
మా విధానాల స్థిరమైన మరియు సమంజసమైన అమలును ప్రోత్సహించడం Snapలో మాకు అత్యంత ముఖ్యం. మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనల పట్ల సముచితమైన జరిమానాలను నిర్ణయించడానికి గాను మేము సందర్భం, హాని యొక్క తీవ్రత మరియు అకౌంట్ యొక్క చరిత్రను పరిగణన లోనికి తీసుకుంటాము.
తీవ్రమైన హానిలోనిమగ్నమైందని మేము నిర్ధారించే అకౌంట్లను సత్వరమే నిష్క్రియం చేయడమే మా విధానం. తీవ్రమైన హానుల ఉదాహరణలలో పిల్లల లైంగిక దోపిడీ లేదా దురుపయోగం, అక్రమ మాదకద్రవ్యాల పంపిణీ యొక్క ప్రయత్నం, మరియు హింసాత్మక తీవ్రవాద లేదా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం చేరి ఉన్నాయి.
తక్కువ తీవ్రత హానులకు సైతమూ మా కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనకు ప్రాథమికంగా చేసుకున్న లేదా ఉపయోగించిన అకౌంట్లను నిష్క్రియం చేయడం కూడా మా విధానం. ఉదాహరణకు, దానికి ఉల్లంఘించే యూజర్‌నేమ్ లేదా డిస్‌ప్లే పేరు, లేదా ఉల్లంఘించే కంటెంట్ పలుభాగాలను పోస్ట్ చేసినట్లయితే, వెంటనే నిలిపివేయవచ్చు.
మా కమ్యూనిటీ మార్గదర్శకాల యొక్క ఇతర ఉల్లంఘనల కోసం, Snap సాధారణంగా ఒక మూడు-భాగాల అమలు ప్రక్రియను పాటిస్తుంది:
దశ ఒకటి: ఉల్లంఘించే కంటెంట్ తొలగించబడుట.
దశ రెండు: మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగానూ, వారి కంటెంటు తొలగించబడినట్లుగానూ మరియు ఆ పునరావృత ఉల్లంఘనల వల్ల వారి అకౌంట్ నిలివేయడంతో సహా అదనపు చట్ట అమలు చర్యలు తీసుకోబడేలా చేస్తుందనీ సూచిస్తూ జారీ చేయబడే ఒక నోటిఫికేషన్ ని Snapచాటర్ అందుకుంటారు.
దశ మూడు: మా బృందం Snapచాటర్ యొక్క అకౌంట్ పైన ఒక స్ట్రైక్ ని రికార్డ్ చేస్తుంది.
ఒక స్ట్రైక్ ఒక నిర్దిష్ట Snapచాటర్ చే ఉల్లంఘనల యొక్క రికార్డును ఏర్పరుస్తుంది. స్ట్రైక్ లతో పాటు పాటు Snapచాటర్ కు ఒక నోటీసు కూడా పంపబడుతుంది. ఒక Snapచాటర్ నిర్వచించబడిన ఒక సమయ వ్యవధిలో చాలా ఎక్కువ స్ట్రైక్‌లను కూడగట్టుకుంటే, వారి అకౌంట్ నిష్క్రియం నిలిపివేయబడుతుంది. దీనికి అదనంగా, Snapచాటర్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్ట్రైక్‌లను పొందినట్లయితే, మేం Snapchatపై కొన్ని ఫీచర్‌లకు యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు లేదా వారి కంటెంట్‌ను పబ్లిక్‌గా పంపిణీ చేయడాన్ని పరిమితం చేయవచ్చు. మేము కమ్యూనిటీ మార్గదర్శకాలను సుస్థిరంగా వర్తింపజేసేలా చూసుకోవడానికి, మరియు వాడుకదారులకు ఒక హెచ్చరిక మరియు అవగాహన అందించడానికి ఈ స్ట్రైక్ సిస్టమ్ సహాయపడుతుంది.
కంటెంట్ లేదా అకౌంట్లు స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపిస్తూ నివేదికలను మేము అందుకున్నప్పుడు, మేము మొదట కమ్యూనిటీ మార్గదర్శకాలపై కంటెంట్‌ను మదింపు చేస్తాము. ఎటువంటి ఉల్లంఘన కనిపించకుంటే, పోస్ట్ చేసే వాడుకదారు అధికార పరిధికి వర్తించే చట్టాల క్రింద కంటెంట్‌ను మేము మదింపు చేస్తాము. స్థానిక చట్టం క్రింద పోస్ట్ చేసే వాడుకదారు కంటెంట్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లు నిర్ణయించబడిన చోట, మేము కంటెంట్‌ను తొలగిస్తాము లేదా మానవ హక్కులను గౌరవించే Snap నిబద్ధతకు అనుగుణంగా తగిన అమలు చర్యలను తీసుకుంటాము. మేము పైన వివరించిన దాని మాదిరిగానే స్ట్రైక్ సిస్టమ్ ని కూడా నియోగించవచ్చు. పోస్టింగ్ వాడుకదారు అధికార పరిధిలో కంటెంట్ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, చట్టవిరుద్ధంగా లేదా నివేదించే వాడుకదారు అధికార పరిధిలో పరిమితం చేయబడిన సంఘటనలలో, మేము కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా తొలగించనప్పటికీ, ప్రభావిత అధికార పరిధిలో కంటెంట్ లేదా అకౌంట్ యొక్క దృశ్యతను తగ్గించడం వంటి స్థానికీకృత అమలు చర్యలను తీసుకోవచ్చు.
నోటీసు మరియు విజ్ఞప్తుల ప్రక్రియలు
Snapచాటర్లు తమపై ఎందుకు చట్ట అమలు చర్యలు తీసుకున్నారనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి మరియు విజ్ఞప్తి చేయడానికి ఒక అవకాశం కల్పించడానికి, మేము Snapచాటర్ల హక్కులను పరిరక్షిస్తూనే మా కమ్యూనిటీ యొక్క ప్రయోజనాలను రక్షించే లక్ష్యంతో నోటీసు మరియు విజ్ఞప్తుల ప్రక్రియలను ఏర్పాటు చేశాము.
ఒక అకౌంట్ పై జరిమానాలను అమలు చేయాలా అని మేము మదింపు చేయునప్పుడు మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలుమరియు సేవా నిబంధనలు ను వర్తింపజేస్తాము, మరియు ప్రసారం చేయబడిన లేదా సిఫార్సు చేయబడిన కంటెంట్‌ను మోడరేట్ చేయడానికి కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు సేవా నిబంధనలు,సిఫార్సు అర్హత కోసం కంటెంట్ గైడ్‌లైన్స్ మరియు కంటెంట్ మార్గదర్శకాలను వర్తింపజేస్తాము. మా విజ్ఞప్తుల ప్రక్రియలు ఎలా పని చేస్తాయో అనే సమాచారం కోసం, మేము అకౌంట్ విజ్ఞప్తులు మరియు కంటెంట్ విజ్ఞప్తులు పైన మద్దతు వ్యాసాలను అభివృద్ధి చేశాము. కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలకు సంబంధించిన Snapchat విజ్ఞప్తులన్నీ ఒక మానవ సమీక్షకుడిచే నిర్వహించబడతాయని దయచేసి గమనించండి. Snapchat ఒక అకౌంట్ లాక్ యొక్క విజ్ఞప్తులను మంజూరు చేసినప్పుడు, Snapచాటర్ యొక్క అకౌంట్ కు ప్రాప్యత పునరుద్ధరించబడుతుంది. విజ్ఞప్తి విజయవంతం అయినా లేదా కాకపోయినా, విజ్ఞప్తి చేసిన పక్షానికి మేము మా నిర్ణయాన్ని సత్వర తీరులో తెలియజేస్తాము.
మీ విజ్ఞప్తి గురించి పదే పదే అభ్యర్థనలను సమర్పించడం ద్వారా దయచేసి Snap యొక్క విజ్ఞప్తుల యంత్రాంగాన్ని దురుపయోగం చేయవద్దు. మీరు ఈ ప్రవర్తనలో నిమగ్నమైతే, మీ అభ్యర్థనల సమీక్షకు ప్రక్రియకు ప్రాధాన్యతను తగ్గించే హక్కును మేము కలిగి ఉన్నాము. ఒకవేళ మీరు నిరాధారమైన విజ్ఞప్తులను తరచుగా సమర్పిస్తే, మేము మీకు ఒక హెచ్చరికను పంపించిన తర్వాత, మీ విజ్ఞప్తుల (సంబంధిత అభ్యర్థనలతో సహా) సమీక్షను ఒక సంవత్సరం పాటు నిలిపివేయవచ్చు.