సురక్షత ద్వారా గోప్యత

మీరు భద్రంగా మరియు సురక్షితంగా అనుభూతి చెందకపోతే గోప్యత యొక్క అర్ధాన్ని కలిగి ఉండటం కష్టం. అందువల్లనే, Snapchat మీకు లాగిన్ వెరిఫికేషన్ వంటి ఫీచర్లను అందిస్తుంది (రెండంచెల ప్రామాణీకరణ), ఇది మీ అకౌంట్ సురక్షితంగా ఉంచేందుకు సహాయపడేందుకు దోహదపడుతుంది, మరియు మా స్వంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భద్రంగా ఉంచేందుకు మేము గణనీయమైన ప్రయత్నాలు చేపడతాము. కాని, మీ Snapchat అకౌంట్‌ని ప్రత్యేకంగా భద్రంగా ఉంచడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని అదనపు చర్యలు కూడా ఉన్నాయి:

ఒక సురక్షితమైన పాస్‌వర్డ్ ఉపయోగించండి

మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి మీ పాస్‌వర్డ్‌ను ఊహించడం లేదా సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌‌లు కాకుండా ఒక పెద్దదైన, సంక్లిష్టమైన మరియు భిన్నమైన పాస్‌వర్డ్‌‌ ఎంచుకోండి. మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉండేలా చేయడానికి సహాయపడేందుకు మీలో సృజనాత్మకతను వెలికితీసి, పాస్‌వర్డ్‌‌ను పొడవుగా ఉండేలా “I l0ve gr@ndma’s gingerbread c00kies!” వంటి వాక్యాలుగా ఉంచేందుకు ప్రయత్నించండి (అక్షరాలు, అంకెలు, మరియు ప్రత్యేక చిహ్నాలను ఉపయోగించడం ద్వారా) - మరియు “Password123” అనేది ఎవరినీ తికమకపెట్టదు. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో మీకు సమస్య ఉన్నట్లయితే, మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేని సురక్షిత పాస్‌వర్డ్‌లను రూపొందించడానికి పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించడాన్ని పరిగణించండి! మీ పద్ధతి ఏదైనప్పటికీ, గుర్తుంచుకోండి: మీ పాస్‌వర్డ్‌‌ను ఎవరితో షేర్ చేయకండి.

లాగిన్ వెరిఫికేషన్ ఉపయోగించండి

లాగిన్ వెరిఫికేషన్ ఆన్ చేయండి. ఇది అదనపు భద్రతా లేయర్ చేర్చేందుకు రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగించే ఒక ముఖ్యమైన ఫీచర్. లాగిన్ వెరిఫికేషన్ ఉపయోగించడంద్వారా, మీ పాస్‌వర్డ్ పొందగలిగినా (లేదా ఊహించినా), మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి నివారించడానికి సహాయపడవచ్చు.

మీ ఫోన్ నెంబర్ & ఇమెయిల్ అడ్రస్‌ను ధ్రువీకరించండి

మీరు మీ అకౌంట్‌కు, ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్ చేర్చారని నిర్ధారించుకోండి - దీనివల్ల మేము మిమ్మల్ని చేరుకోవడానికి ఒకటికంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి. ఇది మీరు ఫోన్ నెంబర్ మార్చినా లేదా మీ ఇమెయిల్ అకౌంట్‌కు యాక్సెస్ కోల్పోయినా ఎంతో ముఖ్యమైనది. మీ ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ ధ్రువీకరించడానికి సూచనలకై ఇక్కడకు వెళ్ళండి.

అనధికార తృతీయ పక్ష యాప్‌లను ఉపయోగించకండి

అనధికార తృతీయ పక్ష యాప్‌లను ఉపయోగించకండి. అనధికార తృతీయ పక్ష యాప్స్ మరియు ప్లగిన్లు (లేదా ట్వీక్స్) Snapchatతో సంబంధంలేని సాఫ్ట్‌వేర్ డెవలపర్లచే రూపొందించబడతాయి మరియు ఇవి Snapchatకు అదనపు ఫీచర్లను లేదా కార్యాచరణను చేరుస్తాయని క్లెయిమ్ చేస్తాయి. కాని, ఈ అనధికారతృతీయ పక్ష యాప్స్ మరియు ప్లగిన్లకు Snapchat మద్దతు ఇవ్వదు లేదా అనుమతించదు, ఎందుకంటే అవి కొన్నిసార్లు మీ మరియు ఇతర Snapchatters అకౌంట్‌లను సురక్షతపై రాజీ పడవచ్చు. సురక్షితంగా ఉండడానికి, Snapchat యాప్‌ను లేదా అధీకృత తృతీయ పక్ష యాప్‌లు మరియు ప్లగిన్‌లను మాత్రమే ఉపయోగించండి.

మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచడానికి మరిన్ని చిట్కాలు

చెడుగా వ్యవరించే వారినుండి రక్షణకై మీరే అత్యుత్తమ అడ్డంకి! మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచేందుకు సహాయపడటానికి మరిన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

  • మీ Snapchat అకౌంట్‌కు ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ చేర్చకండి. ఇలా చేయడంవల్ల మీ అకౌంట్‌కు ఇతరులకు యాక్సెస్ ఇచ్చినట్లవుతుంది. ఎవరైనా మీ అకౌంట్‌కు వారి ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ చేర్చమని అడిగినట్లయితే, మాకు తెలియజేయండి.

  • వేరేవారి పరికరంపై Snapchatలోకి లాగిన్ చేయకండి. మీరు అలా చేసినట్లయితే, మీరు వారికి మీ అకౌంట్‌కు యాక్సెస్ ఇచ్చినట్లే. మీదికాని పరికరంపై మీరు లాగిన్ చేస్తే, తరువాత లాగవుట్ చేయడాన్ని గుర్తుంచుకోవాలి!

  • మీ మొబైల్ పరికారానికి ఒక బలమైన పాస్‌కోడ్ లేదా పాస్‌ఫ్రేజ్ చేర్చండి, లేదా మీ పరికరాన్ని తెరిచేందుకు, మీ వ్రేలిముద్రలు లేదా మీ ముఖాన్ని ఉపయోగించే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించండి. మీరు ఈ అదనపు నియంత్రణలు కలిగివుండకపోతే, మీ పరికరం పోయినా, దొంగిలించబడైనా లేదా ఎక్కడైన వదలివేసినా, వేరొకరు మీ Snapchat అకౌంట్ కంటెంట్లను యాక్సెస్ చేయగలుగుతారు.

  • అనుమానాస్పద సందేశాలను చూడండి, ప్రత్యేకించి, మీరు సమాధానమివ్వవలసిన లింకులను క్లిక్ చేసేలా చేస్తాయి - ఇవి హానికారకమైన వెబ్‌సైట్లకు లేదా మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసేలా ప్రేరేపిస్తాయి. క్లిక్ చేయడానికి ముందు ఆలోచించండి!

Snapchat పై సురక్షితంగా ఉండేందుకు మరిన్ని చిట్కాలకై ఇక్కడకు వెళ్ళి, సేఫ్టీ స్నాప్‌షాట్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి.