మెక్సికో గోప్యతా నోటీసు

అమలు లోనికి వచ్చిన తేదీ: 30 సెప్టెంబర్, 2021

మెక్సికోలోని వినియోగదారుల కోసం మేము ఈ నోటీసును ప్రత్యేకంగా సృష్టించాము. మెక్సికోలోని వినియోగదారులు మెక్సికన్ చట్టం ప్రకారం పేర్కొన్న విధంగా కొన్ని గోప్యతా హక్కులను కలిగి ఉన్నారు, వీటిలో Ley Federal de Protección de Datos Personales en Posesión de los Particulares. మా గోప్యతా సూత్రాలు మరియు వినియోగదారులందరికీ మేము అందించే గోప్యతా నియంత్రణలు ఈ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయి- ఈ నోటీసు మేము మెక్సికో-నిర్దిష్ట అవసరాలను కవర్ చేసేలా ఉంటుంది. ఉదాహరణకు, యూజర్లందరూ, తమ డేటాయొక్క ఒక కాపీని అభ్యర్థించవచ్చు, తొలగించమని అభ్యర్థించవచ్చు, మరియు యాప్‌లో వారి గోప్యతా సెట్టింగులను నియంత్రించవచ్చు. పూర్తి అవగాహనకై, మా గోప్యతా విధానాన్ని చూడండి.

డేటా కంట్రోలర్

మీరు మెక్సికోలో యూజర్ అయితే, 3000 31వ వీధిలో ఉన్న Snap Inc, శాంటా మోనికా, కాలిఫోర్నియా 90405, మీ వ్యక్తిగత సమాచారం యొక్క కంట్రోలర్ అని మీరు తెలుసుకోవాలి.

ప్రాప్యత, సరిదిద్దడం మరియు రద్దు చేసే హక్కులు

గోప్యతా విధానంలోని మీ సమాచార నియంత్రణ విభాగంలో వివరించిన విధంగా, మీరు మీ యాక్సెస్, సరిచేయడం మరియు రద్దు చేసే హక్కులను ఉపయోగించుకోవచ్చు.

అభ్యంతరం లేదా సవాలు చేసే మీ యొక్క హక్కు

మీ సమాచారాన్ని మేము ఉపయోగించే దానిపై అభ్యతరం తెలిపే లేదా సవాలు చేసే హక్కు మీకు ఉంటుంది. అనేక రకాల డేటాతో, ఒకవేళ మేము దానిని ఇక ప్రాసెస్ చేయరాదని అనుకుంటే దానిని తొలగించే సామర్థ్యాన్ని మేము మీకు అందిస్తున్నాం. ఇతర రకాల డేటా కొరకు, మొత్తం మీద ఫీచరును నిష్క్రియం చేయడం ద్వారా మీ డేటా వాడకాన్ని ఆపు చేయగల సామర్ధ్యాన్ని మీకు ఇచ్చాం. మీరు ఈ పనులను యాప్‌లో చేయవచ్చు. మేము ప్రాసెస్ చేయడానికి మీరు ఇష్టపడని ఏదైనా ఇతర రకాల సమాచారం ఉంటే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

కుకీస్

చాలా ఆన్‌లైన్ సేవలు మరియు మొబైల్ అప్లికేషన్‌ల మాదిరిగానే, మేము మీ యాక్టివిటీ, బ్రౌజర్ మరియు పరికరం గురించి సమాచారాన్ని సేకరించడానికి వెబ్ బీకాన్‌లు, వెబ్ స్టోరేజ్ మరియు ప్రత్యేక అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌ల వంటి కుకీస్ మరియు ఇతర సాంకేతికతలను ఉపయోగించవచ్చు. మా సేవలు మరియు మీ ఎంపికలపై, మేము మరియు మా భాగస్వాములు ఏవిధంగా కుకీస్ ఉపయోగిస్తామో మరింత తెలుసుకొనేందుకు గోప్యతా విధానంలోని కుకీస్‌ మరియు ఇతర సాంకేతికలచే సేకరించే సమాచారం విభాగాన్ని చూడండి.