మీ గోప్యత, వివరించబడింది

గోప్యతా విధానాలు చాలా పొడవుగా- చాలా గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. అందుకే మేము మా గోప్యతా విధానాన్ని క్లుప్తంగా, స్పష్టంగా మరియు సులభంగా చదవగలిగేలా చేయడానికి మా వంతు కృషి చేసాము!

మీరు మా మొత్తం గోప్యతా విధానాన్ని చదవాలి, కానీ మీకు కొద్ది నిమిషాల సమయం మాత్రమే ఉన్నప్పుడు లేదా తరువాత దేనినైనా గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఈ సారాంశాన్ని పరిశీలించవచ్చు—తద్వారా మీరు కొన్ని ప్రాథమికాలను కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.

Snap లో మేము ఏమి చేస్తాము

Snap లో, తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి ప్రజలకు శక్తినివ్వడం మా లక్ష్యం.

మా సేవలను అందించడానికి మరియు వాటిని మరింత మెరుగు పరచడానికి, మీరు Snapchat, Bitmoji మరియు మా ఇతర సేవలను ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మేము మీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటాము. ఉదాహరణకు, మీ పుట్టిన రోజు అని మాకు తెలిస్తే, జరుపుకోవడంలో సహాయపడటానికి మేము మీకు మరియు మీ ఫ్రెండ్స్ కు ఒక లెన్సెస్ పంపగలము! లేదా, మేం మీరు బీచ్‌లో ఒక రోజు గడుపుతున్నారని చూస్తే, మేం మీ Bitmoji ఈ సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకునేలా చూడవచ్చు. బాగుంది, కదా?

మేము వ్యక్తిగతీకరించిన సేవను అందించే మరొక మార్గము, మేము చూపించే ప్రకటనలు - మేము ఎటువంటి రుసుము లేకుండా ఆహ్లాదకరమైన, సురక్షితమైన మరియు సృజనాత్మక ఆన్లైన్ ప్రదేశాలను అందించగల మార్గాలలో ఇది కూడా ఒకటి. మేం మీకు ఆసక్తి ఉన్న యాడ్లను అందించడానికి -మీకు వాటిపై ఆసక్తి ఉన్నప్పుడు- మీ గురించి మాకు తెలిసిన వాటిలో కొన్నింటిని ఉపయోగిస్తాం. ఉదాహరణకు, మీరు ఫ్యాషన్ గురించి చాలా స్టోరీస్ చూస్తున్నట్లయితే, మేము మీకు లేటెస్ట్ శైలి జీన్స్ కోసం యాడ్స్ ను చూపించవచ్చు. లేదా మీరు వీడియో గేమ్స్ కొరకు కొన్ని ప్రకటనల‌పై క్లిక్ చేసినట్లయితే, మేం ఆ ప్రకటనలు వస్తూ ఉండేలా చేయవచ్చు! మీరు ఇష్టపడని యాడ్‌లను మీకు చూపించకుండా ఉండటానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు, మీరు ఇప్పటికే ఒక సినిమా కోసం టిక్కెట్లు కొనుగోలు చేశారని టికెటింగ్ సైట్ మాకు చెబితే - లేదా మీరు Snapchat ద్వారా వాటిని కొనుగోలు చేస్తే - మేము దాని కోసం యాడ్స్ ను మీకు చూపించడం ఆపవచ్చు. మరింత తెలుసుకోండి.

మీ సమాచారాన్ని మీరు ఎలా నియంత్రిస్తారు

మీ ఖాతా సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని అనుకుంటున్నారా లేదా Snap మ్యాప్‌లో మీ స్టోరీని ఎవరు చూడవచ్చు అనేది మార్చాలని కోరుకుంటున్నారా? యాప్ లోని సెట్టింగ్లు లోకి వెళ్లండి. యాప్ లో లేని మీ సమాచారం గురించి ఆసక్తిగా ఉన్నారా? మీ డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడకు వెళ్లండి. మీరు ఎప్పుడైనా Snapchat ను విడిచిపెట్టి మీ అకౌంట్ ను డిలీట్ చేయాలనుకుంటే, దాని కోసం మా వద్ద టూల్స్ ఉన్నాయి. మరింత తెలుసుకోండి.

మేము సమాచారాన్ని ఎలా సేకరిస్తాము

మొదట, మీరు మాకు ఇవ్వడానికి ఎంచుకున్న సమాచారము ఏదైనా దాని నుండి మేము తెలుసుకుంటాము. ఉదాహరణకు, మీరు Snapchat అకౌంట్ సెటప్ చేసినప్పుడు, మేము మీ పుట్టిన రోజు, ఇమెయిల్ అడ్రస్, మరియు మీరు పెట్టుకోవాలని అనుకునే విశిష్ట పేరు - అనగా మీ యూజర్‌నేమ్ ను తెలుసుకుంటాము.

రెండవది, మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు మేము మీ గురించి తెలుసుకుంటాము. కాబట్టి, మీరు ఒక క్రీడా అభిమాని అని మాకు చెప్పకపోయినప్పటికీ కూడా, మీరు ఎల్లప్పుడూ Spotlight పైన బాస్కెట్‌బాల్ హైలైట్స్ వీక్షిస్తూ ఉంటే మరియు మీ Bitmoji మీ టీమ్ రంగులను ధరించి ఉంటే, అది ఒక సురక్షితమైన ఊహయే అవుతుంది.

మూడోది, మేం కొన్నిసార్లు మీ గురించి ఇతర వ్యక్తులు మరియు సేవల నుండి తెలుసుకుంటాం. ఉదాహరణకు, ఒక స్నేహితుడు తన కాంటాక్ట్ లిస్ట్‌ని అప్‌లోడ్ చేస్తే మేం మీ ఫోన్ నెంబరును చూడవచ్చు. లేదా, వీడియో గేమ్ కోసం మీరు ఒక యాడ్ ని ట్యాప్ చేస్తే, మీరు దాన్ని ఇన్‌స్టాల్ చేసినట్లు అడ్వర్టైజర్ మాకు తెలియజేయవచ్చు. మరింత తెలుసుకోండి.

మేము సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

మేం సమాచారాన్ని పంచుకునేటప్పుడు, అది సాధారణంగా మీరు మమ్మల్ని అలా చేయమని అడిగినప్పుడు మాత్రమే జరుగుతుంది — మీరు స్పాట్‌లైట్ లేదా Snap మ్యాప్‌కి Snap ని జోడించాలనుకున్నప్పుడు లేదా ఫ్రెండ్ కి చాట్ పంపాలనుకున్నప్పుడు. మీ యూజర్ నేమ్ మరియు Snaps‌కోడ్ వంటి కొంత సమాచారం డిఫాల్ట్‌గా పబ్లిక్‌కు కనిపిస్తుంది.

చట్టముచే అవసరమని మేము భావించినప్పుడు, మరియు Snapచాటర్ల యొక్క, మా మరియు ఇతరుల భద్రతను రక్షించడానికి అవసరమని నమ్మినప్పుడు మేము Snap కంపెనీల కుటుంబం లోపున మా సేవలను అందించడానికి మాకు సహాయపడేబిజినెస్ మరియు సమీకృత భాగస్వాముల తో కూడా సమాచారాన్ని పంచుకుంటాము.

ఇక మిగిలిన అత్యధిక భాగానికి, మీరు నియంత్రణలోనే ఉంటారు! మరింత తెలుసుకోండి.

మేము సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

Snapchat అంటే ప్రస్తుతంలో జీవించడం గురించే. అందుకనే మీరు ఒక Snap లేదా చాట్ ను ఒక ఫ్రెండ్ కి పంపించినప్పుడు, అది వీక్షించబడిన తర్వాత లేదా దాని గడువు ముగిసిన తర్వాత (మీ సెట్టింగ్‌లును బట్టి) దానిని డీఫాల్ట్ గా తొలగించడానికి మా సిస్టమ్ రూపొందించబడింది. ఇంకా, మీరు లేదా ఒక స్నేహితుడు మమ్మల్ని అడిగినప్పుడు మేం సందేశాలను ఉంచవచ్చు, మీరు చాట్‌లో సందేశాన్ని లేదా మెమోరీస్‌కు ఒక Snapsని సేవ్ చేసినట్లుగా.

ఇంకా గుర్తుంచుకోండి: Snaps‌చాటర్లు ఎప్పుడైనా స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు!

ఇతర సమాచారాన్ని ఎక్కువ కాలం ఉంచవచ్చు. ఉదాహరణకు, మీ ప్రాథమిక అకౌంట్ సమాచారాన్ని డిలీట్ చేయమని మీరు మమ్మల్ని అడిగే వరకు మేము దానిని స్టోర్ చేస్తాము. మరియు మీరు ఇష్టపడే మరియు ఇష్టపడని విషయాల గురించి మేము నిరంతరం సమాచారాన్ని సేకరిస్తాము మరియు అప్ డేట్ చేస్తాము, తద్వారా మేము మీకు మెరుగైన కంటెంట్ మరియు ప్రకటనలను అందించగలము. మరింత తెలుసుకోండి.

మీరు ఎలా నేర్చుకోవచ్చు

మా పూర్తి గోప్యతా విధానాన్ని చూడండి!

ఉత్పత్తి ద్వారా గోప్యత అనేది నిర్దిష్ట ఫీచర్ల గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది అని, మరియు యాప్ విభిన్న భాగాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము చాలా మద్దతు పేజీలను కూడా సృష్టించాము అని మీకు తెలుసా?

మీరు వెతుకుతున్న దాన్ని ఇంకా కనుగొనలేకపోయారా? చింతించకండి, మమ్మల్ని సంప్రదిస్తే మా స్నేహపూర్వక మద్దతు టీమ్ మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తారు!