Snap భద్రతపై బ్రస్సెల్స్ ఎన్జీఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది

5 మార్చి, 2024

గత వారం, Snapchat పై భద్రత పట్ల మా విశిష్టమైన విధానాన్ని పంచుకోవడానికి మరియు నిరంతర మెరుగుదలకు వారి అభిప్రాయాన్ని వినడానికి గాను బ్రస్సెల్స్ యందు Snap, పిల్లల భద్రత మరియు డిజిటల్ హక్కుల ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీఓలు) నుండి 32 మంది ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.

EU ఇంటర్నెట్ ఫోరమ్ (EUIF), మరియు మా యూరోపియన్ సహోద్యోగులతో సహా ఇటీవలి మినిస్టీరియల్ సమావేశములోమా భాగస్వామ్యానికి అనుగుణంగా, ఈ ప్రతిష్టాత్మక సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడంలో నాకు ఆనందం కలిగింది, మరియు ఇందులో నిమగ్నం కావడానికి మరియు తమ విలువైన అభిప్రాయాలను పంచుకోవడానికి దీనికి హాజరైన వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను.

యువతను, మరియు వాస్తవానికి, మా కమ్యూనిటీ యొక్క సభ్యులందరినీ రక్షించడం Snap వద్ద ప్రాథమ్యంగా ఉంటుంది. సమావేశం సందర్భంగా, మేము మా అతివ్యాప్త భద్రత సిద్ధాంతం,డిజైన్-ద్వారా-భద్రత అనే ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియలకు మా దీర్ఘకాలిక విధేయతను మరియు ప్రపంచవ్యాప్తంగా Snapచాటర్లను రక్షించడానికి సహాయపడే అంశాాలు, కార్యాచరణ, సాధనాలు మరియు వనరులను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను వివరించాము.

మేము మా కొత్త "తక్కువ సోషల్ మీడియా, ఎక్కువ Snapchat" ప్రచారోద్యమం, చూపించాము, అది ప్రారంభం నుండి సాంప్రదాయక సోషల్ మీడియాకు ప్రత్యామ్నాయంగా ఎలా Snapchat రూపకల్పన చేయబడిందో తెలియజేసింది. మేము మా తాజా ఆరు-దేశాల డిజిటల్ శ్రేయస్సు సూచిక మరియు పరిశోధనను పునశ్చరణ చేసుకున్నాము, మరియు నానాటికీ ఎదుగుతున్న మా ఇన్-యాప్ పేరెంట్ మరియు సంరక్షకుల సాధనాల సూట్ అయిన ఫ్యామిలీ సెంటర్లోనికి ప్రవేశించాము. చాలా మంది ఎన్జీఓలు ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగం (CSEA) యొక్క వివిధ కోణాలపై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా, ముందస్తు క్రియాశీలకంగా మరియు ప్రతిస్పందించే ఈ రెండు చర్యల ద్వారా – ప్రతిరోజూ ఈ దురుపయోగ నేరాలకు వ్యతిరేకంగా Snap ఎలా పోరాడిందో కూడా మేము హైలైట్ చేశాము. నిజానికి, ఏకీకృతమైన ప్రయత్నాల ద్వారా, మా ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు గత సంవత్సరం, CSEA కంటెంటును ఉల్లంఘిస్తున్న కొంత 16 లక్షల అంశాలను తొలగించాయి, ఖాతాలను నిష్క్రియం చేశాయి, మరియు ఉల్లంఘనలను U.S. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ మరియు దోపిడీకి గురైన పిల్లల సంస్థ (NCMEC) కు రిపోర్టు చేశాయి. మా Snap బృందం మా మద్దతు అనుభవాన్ని మరింతగా సులభతరం చేయడానికి మరియు మెరుగుపరచడానికి, మరింతగా యువత-స్నేహపూర్వక భాషలో కమ్యూనికేట్ చేయడానికి మరిన్ని ఆలోచనలు మరియు గ్రాహ్యతలను నేర్చుకుంది, మరియు పెద్ద వయసు యువత మరియు చిన్న పిల్లల కోసం కొన్ని ఎంపిక-చేసుకునే ఫీచర్లను పరిగణిస్తోంది.

ఈ చర్చ మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అందరు హక్కుదారులకు కొనసాగుతున్న భద్రతా సవాలును మరింత ముఖ్యాంశంగా ఎత్తిచూపింది: వయస్సు భరోసా మరియు వయస్సు ధృవీకరణ. సంభాషణ కొనసాగించడానికి గాను, బ్రస్సెల్స్ లో ఇలాంటి సమావేశాలు నిర్వహించేందుకు మరియు ఈ అంశాలపై ఒక నిర్దిష్ట ఫాలో-అప్ ప్రణాళిక చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. మేము ఇతర యూరోపియన్ మరియు ప్రధాన అంతర్జాతీయ ముఖ్యపట్టణాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేయాలని కూడా ఆశిస్తున్నాము.

సాంకేతిక సానుకూల వ్యవస్థ వ్యాప్తంగా, మనమందరమూ ఒకరితోఒకరు పంచుకోవడానికి మరియు నేర్చుకోవడానికి ఎంతో ఉంది, మరియు Snapchat పై భద్రత సేవలో అందరమూ మన భాగస్వాముల శ్రేణులను ఎదిగేలా చేయడానికి మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాము.

- జాక్విలిన్ బ్యూచెర్, ఫ్లాట్‌ఫామ్ భద్రత యొక్క గ్లోబల్ హెడ్

తిరిగి వార్తలకు